26.11.2012 సోమవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ విష్ణుసహస్రనామం 8 వ.శ్లోకం, తాత్పర్యము:
శ్లోకం: ఈ శానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠః శ్రేష్ఠః ప్రజాపతిః
హిరణ్య గర్భో భూగర్భో మాధవో మధుసూదనః ||
తాత్పర్యము: పరమాత్మను, మిక్కిలి గొప్పవానిగను, ప్రాణము నిచ్చువానిగను, మరియు ప్రాణముగను, అందరికన్న్నా పెద్దవానిగను, ఉత్తమమైన వానిగను, పుట్టుకకు కారణమైన వాడుగను, బంగారపు గ్రుడ్డ్జుగను భూమికి కేంద్రము మరియు గర్భము అయిన వానిగను, లక్ష్మీదేవికి భర్తగను, మధువు అను రాక్షసుని సం హరించిన వానిగను, ధ్యానము చేయవలయును.
కార్తిక పౌర్ణమి - సాయి నామ సాధన
ఈ నెల 28వ.తారీకు బుధవారము కార్తిక పౌర్ణమి. ఈ రోజున మీరు చేసే ధ్యానం విశిష్టమైన ఫలితాలనిస్తుంది.ఆరోగ్యం , సంతానం , ఉద్యోగం, వివాహం కోసం బాబావారిని ప్రార్ధించుకొని ధ్యానం చేయండి. సత్ఫలితాలను, ఆయన అనుగ్రహాన్ని పొందండి.
బాబా పటం, విఘ్నేశ్వరుని పటం ఎదురుగా పెట్టుకోండి. దీపం వెలిగించి అగరువత్తులు కూడా వెలిగించండి. ఆసనం మీద పద్మాసనంలో అలా కూర్చోలేనివారు సుఖాసనంలో కాని కూర్చొని, జప సాధనలో విఘ్నములు కలగకుండా ముందుగా విఘ్నేశ్వరునికి ఈవిధంగా జపం చేయండి.
మీరు: హిందువులయితే: ఓం పతి, శ్రీపతి, జయ జయ గణపతి
మహమ్మదీయులైతే: అల్లాహూ అక్బర్ లా యిహా ఇల్లాల్లా
మీరు క్రైస్తవులయితే: హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా
తరువాత ప్రార్ధన సంకల్పం ఇట్లు చెప్పుకోండి. మీకోసం మీరు చేసుకొంటే కనక మీ పేరు చెప్పుకొనండి. యితరుల కోసం చేస్తూ ఉంటే కనక వారి పేరు చెప్పి వారి సమస్య ఏమిటో చెప్పి బాబాని ప్రార్ధన చేయండి.
ప్రార్ధన సంకల్పం:
ఓ భగవంతుడా ! పరమాత్మ! సద్గురు సాయిబాబా ఈ జన్మలో నీవే తల్ల్లి, తండ్రి. నేను తెలిసో, తెలియకో తప్పులు, పొరపాట్లు మరియు ఇతరులకు హాని కలిగించినాను. ఈ హాని కలిగించడానికి నేను/వారు మాయ చూపించిన మార్గములో యిప్పటివరకు నడచి మాయ వలన శిక్షింపబడినాను. (ఇలా సంకల్పం చెప్పి)
ఆరోగ్యం కోసం ఇలా చేయండి.
ఆ శిక్షయే మాకు ఈ జన్మలో .........(ఇక్కడ పేరు .........గలవారికి వ్యాధితో బాధపడుచున్నారు. నేను/వారు గత జన్మలో ఈ జన్మలో చేసిన పాపకార్యములకు ఈ జన్మలో ...........వ్యాధి అనే శిక్ష రూపములో కష్టాలు అనుభవిస్తున్నాము. వీటినుండి విముక్తి పొందడానికి మీ నామ సాధన యధా శక్తి చేసి శరణు వేడుచున్నాము. గత జన్మలో చేసిన పాప కార్యములన్నింటినీ క్షయము చేసి నాకు/వారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించండి. సర్వ దోష నివారణ చేయండి. ఇదే నాప్రార్ధన బాబా అని చెప్పి శ్రీసాయి పాదములను తాకండి. ఇక నీవే దిక్కు. నీదే భారం.
ఓం సాయిబాబా - జై గురుదత్త హరిఓం బాబా - జై గురుదత్తా షిర్డి బాబా - జై గురుదత్తా
శ్రీసాయిబాబా - జై గురుదత్తా శ్రీ ఓం బాబా - జై గురుదత్తా రక్ష రక్ష సాయిబాబా
జై సాయిబాబా జై జై సాయిబాబా
(కుడి అరచేతిలో యంత్రం ధరించి 11 సార్లు జపించండి)
మరలా ప్రార్ధన మొదలు పెట్టి షిర్డీ ధుని ఊదీని నీటిలో సేవించి ప్రార్ధన నామం ఇలా 11 సార్లు సాధన చేయాలి. కార్తిక పౌర్ణమి రోజున ఇలా సాధన చేస్తే శ్రీ సాయి అనుగ్రహం కృపాకటాక్షములు మీపై ప్రసరిస్తే ఎలాంటి వ్యాధి అయినా నయం అవుతుంది.
వివాహం నిమిత్తం:
బాబా నాకు - నా కుటుంబ సభ్యులైన చి. ..........వారికి సర్వ గ్రహ, నాగ దోష నివారణ చేసి తక్షణం మంచి సంబంధం ఏర్పరచి వివాహం కుదర్చండి అని చెప్పి శ్రీసాయి షిర్డీ ధుని ఊదీని సేవించాలి.
ఓం సాయిబాబా - జై గురుదత్తా
శ్రీ సాయిబాబా - జై గురుదత్తా
సంతానం కోసం:
నా కుటుంబ సభ్యులైన శ్రీ/శ్రీమతి ............వారికి సంతానం నిమిత్తం యధా శక్తి మీ నామ జపము చేయుచున్నాను. సర్వ దోష నివారణ చేసి సంతానం ప్రసాదించండి. అని చెప్పి ఎవరికైతే సంతానం కావలెనో వారు ప్రతీరోజు 4 పూటలా షిర్డీ ఊదీని సేవించాలి. ఈ కార్తిక పౌర్ణమి రోజున ఊదీ సేవించాలి.
ఓం సాయిబాబా - జై గురుదత్తా
శ్రీ సాయి బాబా - జై గురుదత్తా
కుడి అరచేతిలో యంత్రం ధరించి సాధన చేయాలి.
ఉద్యోగం/వ్యాపారం/విదేశాలకు వెళ్ళడం/ప్రమోషన్/
బాబా నాకు/నా కుటుంబ సభ్యులైన శ్రీ/శ్రీమతి..........వారికి తక్షణం ఉద్యోగం.......లో ఇవ్వండి. వారికి సర్వ గ్రహ దోష నివారణ చేసి ఉద్యోగంలో స్థిరత్వం ఇవ్వండి. మీదే భారం. షిర్దీ ఊదీని తిలకంగా ధరించి ఆనీటిని సేవించాలి.
ఓం సాయి పరమాత్మనే నమః
షిర్డీ బాబా - సాయిబాబా (11 సార్లు)
పైన చెప్పబడిన వాటిని 11 సార్లు సాధన చేసి శ్రీసాయి బాబా వారికి పటిక బెల్లం, లేక, పాలు పంచదార, నివేదించి, టెంకాయను కూడా నివేదించండి. కర్పూర హారతి ఇవ్వండి.
చివరిగా ఇలా మనస్సులో స్మరించండి. 2/- లేక 11/- దక్షిణ షిరిడీకి పంపించండి. ఇప్పటి వరకూ చేసిన సాధన మీకు సమర్పించినాను. మమ్మల్ని నడిపే భారం మీదే. అని చెప్పి ఒక 10 నిమిషములు కళ్ళు మూసుకొని మౌనముగా బాబావారి ఫొటొవద్ద సాధన చేసి విరమించండి.
--------
మరొక సాధన:
ఉదయం ధ్యానం చేయవలసిన పధ్ధతి:
సాయి ఫొటో (ఇందులో ఇస్తున్నాను) బాబా వారి ఫొటో కుడి ఎడమల వైపున నాలుగేసి అగరువత్తులు వెలిగించి ఉంచండి. బాబా ఫొటొ వద్ద ఉన్న యంత్రాన్ని (యంత్రం ఫొటో కూడా ఇస్తున్నాను) మీ గుప్పెటలో ధరించండి.
శ్రీ సాయికి కర్ఫుర హారతి ఇవ్వాలి.
కళ్ళు మూసుకొని శ్రీ సాయి కుడి పాదాన్ని ( వీ. ఆకారం పాదముపై) మనస్సులో స్మరిస్తూ రెండు కను బొమ్మల మధ్యన సాయి రాం లేదా ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి లేదా సాయిబాబా బాబా అని మనస్సులో స్మరిస్తూ దృష్టినంతా రెండు కనుబొమ్మల మధ్య కేంద్రీకరించి పది నిమిషములు సాధన చేయండి.
రెండు అరచేతులు బంధన వేసుకొని 20 నిమిషములు మౌనంగా ఉండి వెన్నెముకను నిటారుగా ఉంచి ధ్యానం చేయాలి. ఇలా ప్రతీరోజు ధ్యానం చేయండి. మీకు వీలయితే క్రమేపీ ధ్యాన సమయాన్ని పెంచుకుంటూ ఉండండి.
మౌనమునిండి నెమ్మదిగా బయటకు వస్తూ నెమ్మదిగా కళ్ళు తెరవండి.
శ్రీసాయిని సర్వస్య శరణాగతి అని అంటూ పాదాలను తాకుతూ వేడుకోండి.
శ్రీ సాయి నామ జపం స్నానంతరం సాయంకాలం కూడా చేయండి.
జపానికి ముందు సంకల్పం చెప్పుకోండి.
ఉదయం: 3.00 గంటలనుండి 6.00 గంటల మధ్యలో మొదలుపెట్టాలి నిద్ర లేచిన వెంటనే.
సాయంకాలం: భోజనానికి ముందు లేదా భోజనం తరువాత 3 గంటల వ్యవధిలో సాధన చేయవలెను)
సాయిబాబా నామం లేదా యితర మీ ఇష్ట దైవ నామం 5 నిమిషాలు చేయండి.
బాబా వారికి పుష్పములు సమర్పించి కర్పూర హారతినివ్వాలి.
ప్రసాదంగా పంచదార, లేదా బెల్లం, పటిక బెల్లం లేక అటుకులు ఏదయినా సరే నివేదించి హారతినివ్వాలి.
నిరంతరం మనసులో సాయి సాయి లేక సాయిరాం సాయిరాం అని సాయి నామ జపం చేసుకుంటూనే ఉండండి.
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment