31.05.2012 గురువారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయి.బా.ని.స. డైరీ - 1997 (07)
28.04.1997
శ్రీసాయి నిన్నరాత్రి నా చిన్ననాటి స్కూల్ టీచర్ గా దర్శనము ఇచ్చి అన్నమాటలు.
"భగవంతుడు మానవుని మనుగడకోసము చక్కటి ప్రకృతిని సృష్ఠించినాడు. మా నవుడు తనను సృష్ఠించిన ఆ భగవంతుని మర్చిపోయి తన జీవన విధానాన్ని ఓసమరముగా మార్చుకొన్నాడు. తాను సృష్ఠికి ప్రతి సృష్ఠిని గావించగలను అనే అహంకారముతో అంధకారములో ప్రయాణము చేస్తున్నాడు."
03.05.1997
శ్రీసాయి నిన్నరాత్రి ఒక అజ్ఞాత వ్యక్త్రి రూపంలో దర్శనము ఇచ్చి అన్నమాటలు.
1) జీవిత ప్రయాణములో నీవు నీకుటుంబ సభ్యులతో కలసి ప్రయాణము సాగించుతున్నాను అని తలచటము నీలోని భ్రమ. ఒక సైకిల్ మీద నలుగురు కలసి చేసే ప్రయాణాన్ని పోలీసు (భగవంతుడు) అంగీకరించడు అనే ఆలోచనే నీలో ఆధ్యాత్మిక ప్రయాణానికి ఆరంభము అని గ్రహించు.
2) భగవంతుని గొప్పతనాన్ని తెలుసుకోవడానికి సంగీత కచేరీలకు, కవ్వాలి పాటలు వినడానికి వెళ్ళనవసరము లేదు. నీవు భగవంతుని నామము అనుక్షణము స్మరణము చేసిన ఆభగవంతుడు సదా నీహృదయములోనే నివసించుతాడు.
06.05.1997
నిన్నరాత్రి శ్రీసాయి అడవిలోని ఓగిరిజనుడు రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు.
1) నీతల్లి గర్భమునుండి బయటకువచ్చి ఈప్రకృతిలో ప్రయాణము కొనసాగించుతున్నావు.
ఆఖరికి నీవు ఈప్రకృతి ఒడిలో కన్నుమూసి తిరిగి యింకొక మాతృమూర్తి గర్భములో చేరుతున్నావు.
2) నీమేలు కోరేవారు బీదవారు అయినపుడు వారు ధనములేక నీయింటికి రాలేరు అని గ్రహించు. అదే ధనవంతులు నీయింటికి రాలేకపోయినవారు నీమేలు కోరి నీయింటికి రాలేదు అని గ్రహించు.
3) ఎవరో నీయింట పూలమొక్కలనుండి పూలు కోసుకొని వెళ్ళుతున్నారని నీవు నీయింట ఉన్న పూలమొక్కను ఎందుకు కొట్టివేస్తావు.
ఆపూల మొక్కకు ఏమితెలుసు తననుండి పూలు కోస్తున్నవారు నీకు శత్ర్తువులా లేక మిత్రులా!
16.05.1997
నిన్నరాత్రి శ్రీసాయి ఒక అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు.
1) నేటి సమాజములో అర్హత లేనివారు అందరు గొప్పవారి సిఫార్సులతో అందలము ఎక్కి సుఖప్రదమైన జీవితము కొనసాగించుతున్నారు అని బాధపడవద్దు. నీకు రావలసిన ఫలము నీకు యోగము ఉన్న ఏదో విధముగా నీకు భగవంతుడు అందచేస్తాడు అని నమ్ము. అలాగే ఎందరో తప్పుడు పనులు చేస్తు పెద్దమనుషులుగా చలామణి అగుతున్నారు అని బాధపడవద్దు. వారు ఏనాటికి ప్రశాంతముగా జీవించలేరు. నీవు మంచిపనులు చేస్తు జీవించు. నీలోని ప్రశాంతతను ఎవరు దొంగిలించలేరు.
2) నీజీవితములో ఏడు అంతస్థుల మేడను నిర్మించుకొని మొదటి ఆరు అంతస్తులను (అరిషడ్ వర్గాలను) ఖాళీగా యుంచి ఏడు తలుపులుగల (నీశిరస్సు) ఏడవ అంతస్తులో జీవించుతు జీవిత ఆఖరి దశలో భగవంతుని చేరుకో.
(ఇంకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు
0 comments:
Post a Comment