02.06.2022 గురువారమ్
ఓమ్
సాయి శ్రీ సాయి జయజయ సాయి
శ్రీ మాత్రే నమః
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ
సాయి దయా సాగరమ్ 10 వ, భాగమ్
అధ్యాయమ్
–5
ఏప్రెల్ 11వ.తారీకు తరవాత మరలా బ్లాగులో శ్రీ సాయి దయాసాగరం తరువాయి భాగాన్ని ప్రచురిస్తున్నాను. మే నెలలో నా రెండు కళ్ళకి కాటరాక్ట్ సర్జరీ అయినందువల్ల కళ్ళకి కాస్త విశ్రాంతినివ్వడం జరిగింది. ముందుగా నా కళ్ళ ఆపరేషన్ కి బాబా కలిగించిన అనుభూతిని వివరిస్తాను.
నా కుడికింటికి కాటరాక్ట్ వల్ల చూపు పూర్తిగా మసకబారింది. మా ఇంటి ప్రక్కనే ఉన్న కళ్ళ జోళ్ల షాపుకి జోడు మార్పిద్దామనే
ఉద్దేశ్యంతో వెళ్ళినప్పుడు ఈ విషయం బయటపడింది. కరోనా కాలంలో బయటకు రెండు సంవత్సరాలు వెళ్లకపోవడం వల్ల కళ్లకి పరీక్ష చేయించుకోలేదు. అంతవరకు నాకుడి కంటికి ఈ సమస్య ఉన్నదనే విషయమే నేను గ్రహించుకోలేదు. వారు నన్ను మా ఇంటికి కిలోమీటరు దూరంలోనే ఉన్న కండ్ల
ఆసుపత్రి CENTRE FOR SIGHT కి వెళ్ళమని సూచించారు. అక్కడికి వెళ్ళిన తరువాత కాటరాక్ట్ ఆపరేషన్ తప్పని
సరి అని వైద్యురాలు చెప్పింది. ఎప్పుడు చేయించుకునేది
నిర్ణయించుకుని రమ్మన్నారు. ఇక నాకు సందేహం
కలిగింది. ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని. హైదరాబాదులో చాలా ఆస్పత్రులు ఉన్నాయి. మా బావగారు ఇంటినుంచి ఆటోలో వెళ్ళి వచ్చే దూరంలో
ఉంటే మంచిదని సలహా ఇచ్చారు. ఆపరేషన్ పైన చెప్పిన
ఆస్పత్రిలోనే చేయించుకోవడానికి నిశ్చయించుకున్నాను.
ఆపరేషన్ కి కొన్ని రోజుల ముందు బాబాని అడిగాను.
నన్ను ఏ ఆస్పత్రిలో ఆపరేషన్ చేయించుకోమంటావు, ఏ ఆపత్రిలో చేయించుకున్నా నువ్వే
చెయ్యాలి అని అడిగాను. ఆయన స్వప్నంలో ఈ విధంగా
చూపించారు.
“నాకు
వచ్చిన స్వప్న దృశ్యం… నేను చైనా దేశంలో ఉన్నాను. అక్కడ రైలులో వెడుతున్నాను. తరువాత ఒక స్టేషన్ లో దిగాను. నేను ఎక్కడ దిగాలో తెలియదు భాష రాదు. అక్కడ స్టేషన్ కౌటర్ లో అడిగితే వారి భాష నాకు తెలియదు. నేను మా బంధువులలొ ఒకరికి ఫోన్ చేస్తే స్టేషన్ పేరు చెప్పగా, కౌంటర్ లోని ఉద్యోగి నేను దిగవలసిన
స్టేషన్ దాటి వచ్చేసినట్లుగా చెప్పారు. అప్పుడు
స్టేషన్ ఉద్యోగి సాయంత్రం వచ్చే రైలులో వెనక్కి వెళ్లమని చెప్పారు. స్టేషన్ లో ఒకాయన శ్రీ సాయి సత్ చరిత్ర మరాఠీ లో
చదువుతున్నారు. ఇంకొకాయన మెడలో బంగారు గొలుసులు
వేసుకుని ఉన్నారు.” ఇంతే కల.
దీనిని బట్టి నేను గ్రహించుకున్నది “చైనా” అంటే చైనా అనే అక్షరాలతో ఉన్న ఆస్పత్రి అని బాబా సూచించారా అని ఆలోచించాను.
నేను
ఆపరేషన్ చేయించుకుందామనుకున్న ఆస్పత్రి పేరు CENTRE FOR SIGHT వీటిలో ఆంగ్ల అక్షరాలలో C, H, I, N మాత్రమే ఉన్నాయి. A అక్షరం లేదు. ఇంక అలాగే తృప్తి చెందాను. మరలా ఒక రోజు ఆస్పత్రి వారు ఇచ్చిన కన్సల్టేషన్
ఫైల్ మీద ఉన్న పేరు మరలా చూసాను. CENTRE FOR SIGHT , EVERY EYE DESERVES THE BEST , A MAHINDRA COLLABORATION.
A MAHINDRA COLLABORATION అక్షరాలలో C, H, I, N, A (చైనా) ఉన్నాయి. అంటే బాబా ఆ ఆస్పత్రిని నిర్ధారించారని అర్ధం చేసుకున్నాను. ఆ ఆస్పత్రిలో మా బంధువులొకావిడ, వారికి తెలుసున్న నలుగురు ఆపరేషన్ చేయించుకున్నారని తెలిసింది. మరి ఎక్కడ చేయించుకున్నా బాబా నువ్వే చెయ్యాలి అన్నాను. కాని సాయి అనే పేరుతో ఉన్నవారిని మనం వెతకలేము కదా! నాకు ఆపరేషన్ చేసిన వైద్యురాలి పేరు Dr. NILUFER SULTANA. ఆవిడ పేరులో SULTANA లో S, A, … NILUFER లో I అక్షరాలు తీసుకుంటే SAI. అంటే ఆమె పేరులో SAI ఉన్నట్లే కదా! ఆమెలో సాయి ఉన్నట్లే. నాకు ఆపరేషన్ చేసినది సాయి అని ఆనందించాను. మే రెండవ తారీకున కుడి కంటికి, 20 వ. తారీకున ఎడమ కంటికి ఆపరేషన్ జరిగింది.
ఓం
సాయిరాం
ఇక
సాయి దయాసాగరం లోని అయిదవ అధ్యాయం
ముంబాయిలో
కుండపోత వానలు
ముంబాయిలో
ఎవ్వరూ మర్చిపోలేనంత కుండపోత వాన కురిసింది.
అది ఒక భయంకరమయిన అనుభవమనే చెప్పచ్ఛు.
ఆ రోజు రాత్రి క్రింది అంతస్థులో ఉన్న మా సాయి మందిరంలో దొంగతనం జరిగింది. దొంగలు సాయిబాబా వారి వెండిపాదుకలను అపహరించారు. మేము ఎంతగానో బాధపడ్డాము. దొంగలు ప్రధాన ద్వారం తాళాన్ని బద్దలుకొట్టి మందిరంలోకి వ్రవేశించారు. వికాస్, వినాయక్ బార్వే ఇద్దరు
పూజారులూ మాకుటుంబ సభ్యులము అందరం కలిసి ఎలాగయినా సరే అదేవారం గురువారానికి ముందుగానే
మరలా సాయి పాదుకలను చేయించాలనే నిర్ణయానికి వచ్చాము ఆసంఘటన వల్ల మా సాయి మందిరాన్ని పునర్నిర్మించే
సమయం ఆసన్నమయిందని గ్రహించుకున్నాము.
మా
ఇంటిక్రింది భాగంలో సివిల్ కాట్రాక్టర్ కార్యాలయం ఉంది. అందులో భాగస్వాములయిన కేతన్ జైన్, సునీల్ పర్మార్
ఇద్దరూ కూడా సాయి భక్తులే. ఇద్దరూ ప్రతిరోజు
బాబా దర్శనానికి మందిరానికి వస్తూ ఉంటారు.
విపరీతంగా కురుస్తున్న వర్షాలకి సాయిమందిరం రోజురోజుకి శిధిలావస్థకు చేరుకుంటోందని
గ్రహించి, మందిరాన్ని తిరిగి పునరిధ్ధరిద్దామని నిశ్చయించారు. వారిద్దరూ మా అబ్బాయితోను, కుమార్తెతోను చర్చించి
ఖర్చు గురించి ఏమీ బెంగ పెట్టుకోవద్దని అన్నారు.
ఇద్దరూ పని ప్రారంభించారు. మందిరాన్ని
తిరిగి ఎలా నిర్మించాలనే విషయం మీద వారిద్దరూ వసైలోని చర్చిలో బెంచీ మీద కూర్చొని చర్చించుకుంటూ
ఉండేవాళ్ళు. కేతన్ మరియు చేతన్ ఇద్దరూ మందిరాన్ని
సాంప్రదాయబధ్ధంగా ఉండేలాగా ఏర్పాటు చేయసాగారు.
కాకాసాహెబ్ దీక్షిత్ మనుమడు అనిల్ దీక్షిత్ కూడా మా సాయిమందిరంలో జరిగే ఉత్సవాలన్నిటిలోను
పాల్గొంటు ఉండేవాడు. మందిర పునర్నిర్మాణం దాదాపు
సంవత్సరంపాటు కొనసాగింది. సాయిబాబాకు తన భక్తుల
చేత ఈ నిర్మాణకార్యక్రమాన్ని పూర్తి చేయించారు.
ఈ కార్యక్రమం పూర్తయినందుకు మేమెంతగానో సంతోషించాము.
ములంద్
చర్చ్, అంధేరీలో తూర్పు,, సైంట్ బ్లాసై చర్చ్, వసై మరియు బాంద్రా చర్చి, మా సాయిమందిరం
వీటన్నిటి పునర్నిర్మాణం పర్మార్ అండ్ జైన్ కుటుంబాలే చేసాయి. ఇద్దరి కుటుంబీకులకి శ్రీ సాయిబాబావారి అనుగ్రహం
దయ లభించాయి.
ఉజ్జ్వలా
బోర్కర్
(సర్వం
శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment