Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Wednesday, September 12, 2012

నిష్కామ భక్తి -2 (ఆఖరి భాగం)

Posted by tyagaraju on 7:34 AM



12.09.2012  బుధవారము

ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి 


సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు


నిష్కామ భక్తి -2 (ఆఖరి భాగం)

సాయిబాబా తో నా నాల్గవ అనుభవం.(నా ఎం.ఫార్మ్ అడ్మిషన్ కి బాబా సహాయం చేసిన లీల)

  
రోజు బాబా గుడికి వెళ్ళడం, ఆయన లీలలు చదవడంబాబా నామ స్మరణ చేయడం లో నాకు చాల సంతోషంగా వుండేది.  నా బి.ఫార్మ్ సీ ఆఖరి సంవత్సరం పూర్తి కాబోతుండగ తర్వాత భవిష్యత్తు లో ఏమి చదవాలో అర్థం గాక చాల గందరగోళంగా వుండేది. మనసంతా చికాకుగా ఉండి ఏనిర్ణయం తీసుకోలేకపోయాను. పెద్ద చదువులకోసం   ఒకసారి అమెరికా వెడదాం  అనిపిస్తుండేది లేదా ఇండియ లోనే వుందాం అనిపిస్తుండేది. ఒక్కోసారి యం.బి.ఎ  చేద్దామనుకునేవాడిని .ఇలా ఏదీ ఒక నిర్ణయానికి రాలేకపోయేవాడిని. నా స్నేహితులుఅందరు ఏదో ఒక లక్ష్యంతో దానికి తగ్గ నిర్ణయాలు తీసుకున్నారు. కాని నేను  ఒక ద్యేయం అంటూ లేక సతమతమవడం చూసి నా స్నేహితులు నన్ను చూసి నవ్వేవారు. నాకు తోచిన పరీక్షలన్నిటినీ రాసాను.  జి.ర్.ఇ ,టో.ఫె.ల్యం హెచ్.సెట్(మహారాష్ట్ర కామన్ ఎంట్రెన్స్ ఎగ్జాం),గేట్ (ఎం.ఫార్మ్ కోసం) ఇలా అన్ని రాసాను. నాకు యేమి అర్థం కాక దారి చూపమని బాబాని అర్థించాను. అన్ని పరీక్షలకు చదివేసరికి అలసిపొయి ఏ ఒక్క పరీక్ష సరిగ వ్రాయలేకపొయాను. అందువలన ఒక్క పరీక్షలొ కూడా సరైన మార్కులు తెచ్చుకోలేకపొయాను. దానికి తోడు  నా బీ.ఫార్మ్ సి  ఫైనల్ ఇయర్ పరీక్షలు కూడా అప్పుడే జరుగుతుండడం వలన వాటికి చదవాల్సివచ్చింది. జి.ఆర్.ఇ లో కుడా తక్కువ మార్కులు  రావడం వలన  యు.యస్.ఎ లో నేను 6 , 7 యూనివర్సిటీల కు అప్లికేషన్  పెట్టుకు న్నాను.  అన్నిటినీ తిరస్కరించారు. నేను చాలా బాధ పడ్డాను. అప్పుడు నాస్నేహితుడు  వచ్చి ఎన్.మాట్ (నార్సి మాంజి మేనేజ్మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్-ఎం.ఫార్మ్ చేయడం  కొసం) పరీక్షల గురించి చెప్పి ఆపరీక్షల కి అప్లై చేస్తావా అని అడిగాడు. ఎందుకంటే పరీక్షలకి అప్లికేషన్ ఫారం తీసుకోవడానికి ఆ రొజే ఆఖరి రోజు.  నేను దానికి సరేనని చెప్పాను. ఆ పరీక్షలకి నేను ఏమీ తయారు కాలేదు. అయినా ఆ పరీక్ష వ్రాసాను. ఆ పరీక్షలకి 800 మంది  వ్రాస్తే నాకు 51వ ర్యాంక్ వచ్చింది ఆశ్చర్యంగ . ఫలితాలు చూసి నేను చాలా ఆశ్చర్యపడ్డాను  బాబాకి కృతజ్ఞతలు తెలుపుకున్నాను.  కాని ఇక్కడ ఊహించని సంఘటన ఒకటి జరిగింది. అది ఏమిటంటే  ఎం.ఫార్మ్ అడ్మిషన్ కి కౌన్సిలింగ్ డేట్  అనుకున్న డేట్ కన్న ముందుకు మార్చారు.  కాని అది నాకు తెలియలేదు. అందువలన నేను కౌన్సిలింగ్ కి వెళ్ళలేక పోయాను. దాని వలన ఎం.ఫార్మ్ సీట్స్ అన్నీ  ఫుల్ అయ్యాయి. నాకు అడ్మిషన్ దొరకలేదు. తర్వాత అప్లై చేసుకుంటే నా అడ్మిషన్ వెయిటింగ్ లిస్ట్ లో ఎక్కడో వుంది. నాకు అప్పుడు ఎంచెయ్యాలో దిక్కు తోచలేదు. చాల దిగులుగా వుండేవాడిని.  ప్రతిరోజు రాత్రి బాబా పటం ముందు ఏడ్చేవాడిని. ఎవరైనా వాళ్ళ అడ్మిషన్ క్యాన్సల్ చేసుకుంటే నా వెయిటింగ్ నంబర్ ముందుకు పోతుంది. నాకు అప్పుడు అడ్మిషన్ దొరుకుతుంది. అందుకు రోజూ యూనివర్సిటి కి ఫోన్ చేసి ఎవరైన అడ్మిషన్ క్యాన్సల్ చేసుకున్నారా అని అడిగేవాడిని. దాదాపు 15రోజుల తర్వాత 16వ రోజున యూనివర్సిటి వాళ్ళు ఫోన్ చేసి ఒక సీట్ వుంది, కాకపొతే స్పెషలైజేషన్ కెమిస్ట్రీ కి సంబందించింది అని చెప్పారునాకు అస్సలు ఇష్టం లేని సబ్జెక్ట్ కెమిస్ట్రీ అయినప్పటికి యూనివర్సిటి అడ్మిన్ వాళ్ళ కి నా అంగీకారం తెలిపి మర్నాడు వచ్చి ఫీజ్ కడతానని చెప్పాను. నేను అప్పుడు ఇదంతా  బాబా చేయించారు, ఈ కెమిస్ట్రీ సబెక్ట్ నా భవిష్యత్తు కు , కెరీర్ కి దోహదం కావచ్చు ,కాబట్టి బాబాయే ఇదంతా చేసారు, ష్టపడి చదవాలని అనుకున్నాను. కాని నాకు మనసుకు నచ్చిన సబ్జెక్ట్ వేరే వుంది. అది ఫార్మాషూటికల్స్  సబ్జెక్ట్.అది ట్యాబ్లెట్స్,క్యాప్సుల్స్ తయారీ విధానం గురించి తెలిపే సబ్జెక్ట్. నేను మరుసటి రోజు బాబా ఫోటో తీసుకొని అక్కడికి ప్రొద్దున 11గంటలకు ముంబాయికి చేరుకున్నాను. అక్క్డ అడ్మిషన్స్ చూసే దానికి సంబింధిచిన వ్యక్తిని కలిశాను.  నేను కెమిస్ట్రి సబ్జెక్ట్ లో అడ్మిషన్ కోసం వచ్చినా కూడా ఒక ప్రక్కన ఎం.ఫార్మ్ కి 2 సంవత్సరాలు కెమిస్ట్రి చదవాలంటే నాకింకా అయిష్టంగానే ఉంది. నేను ఫీజ్ కడుతుండగ అంతలో ఒకతను వచ్చి తను ఫార్మాష్యూటికల్స్ లో ఎం.ఫార్మ్ అడ్మిషన్ క్యాన్సల్ చేసుకుంటు న్నానని అందువలన తను అడ్మిషన్ ఫీజ్ వెనక్కి తీసుకోవడానికి వచ్చినట్లు ఆఫీసుకు వచ్చి చెప్పాడు.  అతను బి.ఫార్మ్ లో ఆఖరి సంవత్సరం పరీక్షల్లో తప్పాడు. (బి.ఫార్మ్ ఫైనల్ ఎగ్జాంస్ జరగకముందే ఎం.ఫార్మ్ సీట్ కోసం ఎన్.మాట్ ఎగ్జాంస్, రిజల్ట్స్ ముందే వచ్చాయి.). ఒక వేళ బి.ఫార్మ్ లో ఎవరైన ఫెయిల్ అయితే ఎం.ఫార్మ్ కి అర్హుడు కాలేడు అని ఒక కండీషన్ పెట్టారు.  అతడికి  ఎన్.మాట్ ఎగ్జాం లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిందిఅందువలన కౌన్సిలింగ్ లో అతడు ఫార్మాషూటికల్స్ సబ్జెక్ట్ తీసుకున్నాడు. కాని బి.ఫార్మ్ ఫైనల్ ఎగ్జాంస్ లో అతడు ఫెయిల్ అవడం వలన ఎం.ఫార్మ్ కి అనుమతి ఇవ్వలేదు. నేను ఇదంతా నమ్మలేకపోయాను.అడ్మిన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నమ్మలేకపోయారు. నన్ను ఫార్మాషూటికల్స్ సబ్జెక్ట్ తీసుకుంటావా  అని అడిగారు. ఏమి అద్భుతం .నా సంతోషానికి అవధులు లేవు. నేను ఆ సబ్జెక్ట్ తీసుకోవడం ఇష్టమే అని చెప్పాను. నేను చెప్పలేనంత ఆనందం లో మునిగిపోయాను. వెంటనే నా దగ్గర వున్న సాయిబాబా ఫోటో తీసుకొని ముద్దులు పెట్టాను. ఆ ఆనందం లో కళ్ళ నుండి ఆనందభాష్పాలు వచ్చాయి.అంతా బాబా నడిపించాడు.ఎప్పుడు యేమి చెయ్యాలో బాబా కి మాత్రమే తెలుసు. లేకపోతే అదే సమయానికి ఆ అబ్బాయి అడ్మిషన్ క్యాన్సల్ చేసుకోవడం, నేను అది తీసుకోవడం అంతా బాబా చేసిన అద్భుతం కాక మరేమిటి.  బాబా దగ్గరుండి అంతా నడిపించాడు. నేను ఎం.ఫార్మ్ లో జాయిన్ అయ్యాను. తర్వాత యూనివర్సిటి  మొత్తానికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నాకు. దీని కంతటికి కారణం కేవలం సాయి బాబాసాయిబాబాసాయిబాబా. నేను ఎప్పుడు ఒకటే అనుకుంటాను. నేను బాబా చేతిలో గాలిపటం అని. మనము అంతా కూడా బాబా చేతిలో గాలిపటాలం. బాబా దారంతో మనల్ని ఎక్కడికి లాగుతాడో అక్కడికి వెళుతూ వుంటాము. మనం చేయవలసింది ఒక్కటే . బాబా పై భారం వేసి నిరంతరం బాబా స్మరణ, బాబా భజనలు చేస్తూ ఆయనపై భక్తి, ప్రేమలతో తన్మయత్వం పొందాలి. ఇదే మనం చేయవలసిన "నిష్కామ భక్తి". ఇది మన జీవితం లో చాలా ముఖ్యము. సాయిబాబా మన తల్లి ,తండ్రి,గురువు. ఆయనే మనకు అన్నీ. బాబా మనలోనే వున్నారు. మనము ఏమి చేసిన ,ఏమి ఆలోచించినా , మన యొక్క ప్రతి కదలిక ఆయనకి తెలుసు. ఇది గుర్తు పెట్టుకొని బాబాకి సంపూర్ణ శరణాగతి చేయాలి. ఎటువంటి పరిస్థితిలోనైన బాబా పై శ్రద్ధ ,నమ్మకం వుండాలి. ఇదే బాబా కోరుకునేది. ఆయన సర్వాంతర్యామి.బాబా మనము పీల్చే గాలి లో వున్నారు.మన ఉచ్చ్వాశ నిశ్వాసల లో వున్నారు. మనం చేయవలసింది ఒకటే. అంతటా వున్న బాబాని తెలుసుకోవాలి. బాబా ఉనికిని తెలుసుకున్న క్షణాన కలిగే మనశ్శాంతి, పరమానందం, సంతోషం మాటల్లో చెప్పలేము.ఎప్పుడైతే మనం బాబా ఆధ్యాత్మిక ప్రపంచంలోకి అడుగుపెడతామో బయటి ప్రపంచం గురుంచి భయపడనక్కర్లేదు. మనకు బాబా వుండగ భయమేల. మనం బాబా ఆధ్యాత్మిక ప్రపంచంలోకి అడుగుపెట్టగానే మన జీవిత గమ్యం ఏమిటో తెలుస్తుంది."నేను ఎవరు" అని ప్రశ్నిoచుకున్న రోజున ఆధ్యాత్మిక జీవులు భౌతిక ప్రపంచపు అనుభూతిని పొందుతున్నారని, ఐహిక జీవులు ఆధ్యాత్మిక అనుభూతిని పొందడం లేదని మనకు అవగతం అవుతుంది.సాయిబాబా మన హృదయంలో తిష్ట వేసుకొని కూర్చొని "నేనుండగ నీకు భయమేల" ,”నిష్ట మరియు ఓరిమిలతో నన్ను పూజించు"అని చెపుతున్నారు. అది తెలుసుకున్న క్షణం ,మన హృదయంలో ఉన్న బాబా ఉనికిని తెలుసుకున్న సమయాన మన జీవిత గమ్యం నెరవేరుతుంది.అదియే "ఆత్మ సాక్షాత్కారం".


అయిపొయింది 

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)


Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List