Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Friday, September 14, 2012

బాబా నా పెళ్ళికి సర్వం సమకూర్చారు

Posted by tyagaraju on 7:34 AM

                                 

14.09.2012  శుక్రవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఈ రోజు శ్రీమతి ప్రియాంకా రౌతేలాగారి బాల్గులోని ప్రచురణని మీకందిస్తున్నాను.  ఇది 26.06.2012 న ప్రచురింపబడింది. 


బాబా నా పెళ్ళికి సర్వం సమకూర్చారు.ఇంకా చెప్పాలంటే బాబా నే
 నా కన్యాదానం చేస్తున్నారు.  సాయి భక్తురాలు.

సాయిరాం సాయి భక్తులారా:

ఆత్మకులేక  మనకు స్వతసిధ్ధంగా స్వస్థత పరిచే శక్తి ఉందనినేను ప్రగాఢంగా నమ్ముతాను. . మనము కూడా సంపూర్ణంగా ఆ  దైవానికి సంబంధించినవారమే. సముద్రపు నీటిలోని నీటి బొట్టు సముద్రపు నీటినుండి వేరు కాదు.  అది కూడా సముద్రపు నీటికి సంబంధించినదే.  అందులోని భాగమే.


అలాగే మనము కూడా ఆ దైవాన్నించి వచ్చినవారమే కనక మనము కూడా దైవానికి సంబంధించినవారమే.  కాని మనలో ఉన్న లోటుపాట్లవలన, (చెడులక్షణాలు కానివ్వండి, మరేదయినా కానివ్వండి) ఈ జ్ఞానం మనలో మరుగునపడిపోయింది.  ఈ అజ్ఞానం వలననే మనం మనలో ఉన్న అంతర్గత శక్తిని తెలుసుకోలేకుండా వున్నాము. మనందరిలోను దైవిక శక్తి అంతర్గతoగా  ఇమిడిఉంది. దానిని తెలుసుకొని వినియోగించుకొనేవాడే అసలయిన జ్ఞాని. మనమందరం  కూడా పూర్తిగా ఆ దైవము నుండి వెలువడిన అంశాలము. కాని మాయ చేత,  మనమందరం ఈ శరీరం రోగాలు, బాధలకు నిలయమైందని అనుకుంటుంటాము. కాని మనలో దాగి వున్న అసలు జ్ఞానం ఈ మాయ చేత చెదరకుండ , మాయని అంటకుండ వుంటుంది. ఎప్పుడైతే మనము ఆత్మను చూడగలమో అప్పుడు దైవ తేజస్సు శరీమంతా వ్యాపిస్తుంది. అప్పుడు తిరిగి మనము మంచి ఆరోగ్యం తో కూడిన  నూతన జీవితాన్ని ,పరిపూర్ణ జీవితాన్ని ప్రారంబించగలము. మనము ఆత్మ సాక్షాత్కారం సంపాదించాలంటే మనకు గల ఒకే ఒక సులభ పద్దతి సేవ. సేవ చేయడం ద్వార మనము ఆత్మ సాక్షాత్కారం పొందగలము.
           ఈ ప్రపంచములో గొప్ప ప్రార్థన అంటే ఒక్క సేవే  అని బాబా చెప్పారు. సేవ చేయడం అంటే భగవంతుడికి చాల ఇష్టము . మన చుట్టూ ఉన్న మనుషుల్ని ప్రేమించడమే గొప్ప భక్తి. మహోన్నతవ్యక్తిత్వం అంటే ప్రతి జీవి పై దయ గలిగివుండడం.

             ఈ రోజు నేను ఒక సాయి సోదరి అనుభవాన్ని పోస్ట్  చేస్తున్నాను. మనము ఎప్పుడైతే ఆధ్యాత్మికత  వైపు ఎంత ఎక్కువ మొగ్గు చూపుతామో ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయని చెప్పడానికి ఈ అనుభవం ఒక ఉదాహరణ. ఇంత మంచి అనుభవాన్ని సాయి భక్తులతో పంచుకున్నందుకు ధన్యవాదాలు సోదరి. నా పై మీ గౌరవమునకు , అభిమానానికి ధన్యవాదాలు. మీరు మీ జీవితంలో సంతోషమైన దాంపత్య జీవితాన్ని గడపాలని మేము ఆశిస్తున్నాము.


సాయిరాం ప్రియాంక గారు,

  మీరు ఈ బ్లాగ్ ను నడుపుతున్నందుకు, ఈ బ్లాగ్ ద్వార భక్తుల అనుభవాలను పంచుకోవడానికి ఎంతో ఉపకరించి, ఈ అనుభవాలను చదవడంతో ఎంతో మంది ఊరట పొంది బాబా పైన నమ్మకం, ఆశతో  జీవితం గడిపేల సహాయపడుతున్నందుకు  మీకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. బాబా ఆశీస్సులు  మీ కుటుంబంపై సదా ఉండాలని బాబాని ప్రార్థిస్తున్నాను. నా జీవితంలో జరిగిన బాబాలీలలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. సవరింపులు వుంటే వాటిని సరి చేసి ఈ లీలలను బ్లాగులో దయ చేసి పోస్ట్ చేయండి. దయచేసి నా పేరు,మెయిల్ ఐడి వెల్లడి చేయవద్దు. బాబాకి ధన్యవాదాలు . ఎందుకంటే కేవలం ఆయన దయ వలనే నేను నాకు జరిగిన అనుభవాన్ని వ్రాయగలుగుతున్నాను. ఏమైన తప్పులుంటే దేవా క్షమించండి.
    
    బాబా  క్లిష్టదశ లో నా జీవితంలోకి ప్రవేశించారు. ఏడు నెలల క్రితం మా ప్రేమబంధం ఎంతోకల్లోలంతో ఉండి చివరికి పూర్తిగ చెడిపోయింది. నేను ప్రేమిస్తున్న నా బాయ్ ఫ్రెండ్  నన్ను పెళ్ళిచేసుకొవడానికి నిరాకరించాడు. అతడు మా ఇద్దరి అభిప్రాయాలు, అలవాట్లు పూర్తిగ వేరని తలచి , ఒకవేళ పెళ్ళి చేసుకుంటే తర్వాత సంతోషంగ ఉండలేమని మా పెళ్ళి కి నిరాకరించాడు. మా ఇద్దరి మధ్య తరుచుగా గొడవలు జరుగుతూ ఉండేవి. నేను తన చెడ్డ అలవాట్లు  మానుకోమని ఎప్పుడు విసిగించేదాన్ని . నా తప్పును తర్వాత తెలుసుకున్నాను. నాకు తెలిసి మా ఇద్దరి మధ్య వచ్చిన గొడవలు చాల చిన్న కారణాల  వల్ల జరిగినవి. నేను ఆ గొడవలను కొన్ని రోజుల వరకు లాగేదాన్ని.

                నేను ఒకటి ఒప్పుకుంటున్నాను. మేము ఆనందంగా వుండే రోజుల్లో ఒకరినొకరం ఎంతో గాడంగ   ప్రేమించుకున్నాము. నా బాయ్ ఫ్రెండ్  తన పెద్దలను పెళ్ళికి ఒప్పించడానికి ఎంతగానో  కష్టపడ్డాడు. నేను ఇక మళ్ళి ఎప్పుడు గొడవ పడను అని తనకి ఎంతగానో చెప్పి ప్రయత్నించాను. కాని లాభం లేకపోగా మా ఇద్దరి మధ్య ఎటువంటి మాటలు లేవు. నేను ఇక మా బంధం పూర్తిగా తెగిపోయింది అనుకున్నాను. నేను అతనికి అర్థమయ్యేల  ఎంతగానో చెప్పి చూశాను. ఇందులో ఇద్దరి తప్పులు ఉన్నాయని, అది తను అర్థం చేసుకోవాలని చెప్పాను. కాని ఎటువంటి ఫలితము కనబడలేదు.

                         ఈ సమయంలోనే బాబా నన్ను తన ఒడికి చేర్చుకొని హత్తుకున్నారు. నాకు సాయి గురించి క్రితం సంవత్సరం నుండే తెలిసిన , ఆయన మహిమలు, లీలలు గురుంచి అంతగా చదవలేదు. ఒక రోజు ఇంటర్నెట్ లో బాబా గురించి తెలుసుకుందామని వెదుకుతుంటే  ఈ వెబ్ సైట్ ను చూసాను. ఇక రోజు భక్తుల అనుభవాలను చదవడం నాకు అలవాటైంది.

అలా చదవడంతో నా ఓర్పునమ్మకం పెరిగి ధైర్యంగా ఉండేల చేసింది అనుభవాలు 
నా నమ్మకాన్ని బలపరిచిందిమరియు బాబా పైనమ్మకం పెరిగిందినా బాయ్ ఫ్రెండ్ను 
తిరిగి నా జీవితంలోకి వచ్చేల చేయమని  బాబా ని ఎప్పుడు వేడుకుంటూ  ఉండేదాన్ని.
బాబా ప్రశ్నలు,జవాబులు  పుస్తకంలో బాబా కి శరణాగతి చేయమని జవాబు వచ్చింది
కాని నేను చేయలేకపోయానుమరియు  నేను సాయిని అర్థించేదాన్ని నా బాయ్ ఫ్రెండ్ తోనే
 నా పెళ్ళి జరగాలని.

              నిస్సహాయ పరిస్థితులలో  ప్రియాంక గారు నాకు చాలసహాయకారిగా  గా వున్నారు
ఆవిడ ఎప్పుడు తన మాటలతో నా బాధనుపోగొట్టేందుకు  ప్రయత్నించేవారు. మాటలతో నాలో
 ధైర్యం , నమ్మకం ,ఓర్పు  చాల పెరిగింది సందర్భంగ ప్రియాంక గారికి నా ధన్యవాదాలు
తెలుపుకుంటున్నానుక్లిష్ట సమయంలో నాకు తోడుగ ఉన్నందుకు ప్రియాంక గారి ఋణం 
ఎప్పుడు తీర్చుకోలేనుకాలం గడిచిపోతుందినాజీవితంలో కిమళ్ళీ నా బాయ్ ఫ్రెండ్ వచ్చే 
దాఖలాలు ఏమి కనపడలేదుకాని ఇక్కడ మీకు ఒకటి చెప్పాలిఅది ఏమిటంటే  
ఈమధ్యకాలంలో వాతావరణం కొంచెం అనుకూలంగా మారినట్లు సూచనలు కనిపించాయి. 
ఒక గురువారం నాడు   మాత్రమే తను ఫోన్  చేస్తాడులేదా మెసేజ్ పెడతాడులేదా కలుస్తాడు
మొత్తం 5,6 నెలల గ్యాప్ లో 3,4 సార్లు మాత్రమే ఇలాజరిగిందిఅది కూడా నా గురుంచి మాత్రమే 
ఆలోచించి వచ్చేవాడు సమయంలో ఏమి మాట్లాడక ఊరికే కూర్చునేవాడుమళ్ళి నాజీవితం
లోకి రావాలనే ఉద్దేశ్యం అతనికి ఏమి లేదుదాని గురించి   ఏమి మాట్లాడేవాడు కాడుఒక సారి 
బెంగుళూరు ,బిటియం  లో ఉన్నబాబా గుడికి వెళ్ళినపుడు  అక్కడ పూజారి బాబా పాదుకలను 
అలంకరించమని అడిగారుఅది బాబా  ఆశీర్వాదం  లాగ అనిపించింది.  బాబానా ప్రార్థనలు 
వింటున్నాడని దానికి జవాబుగా నాకు అనుకూలమైన సూచనలు కనబడేవినా ప్రార్థనలకు
 జవాబుగా  బాబా పోటోలు నాకు దొరకడం,ప్రసాదంపువ్వులు  ,ఆధ్యాత్మిక పుస్తకాలు బాబా 
గుడిలో సాయి భక్తులు నాకు ఇవ్వడం,  బాబా మెసేజ్ లు,నాకు ఇష్టమైన భజనలు గుడిలో 
వినిపించడం  , బాబా నాకు స్వప్న దర్శనం ఇవ్వడం ఇలా జరిగేది.

   మా అమ్మ కూడ సాయి నవ గురువారవ్రతం మొదలు పెట్టిందినా పెళ్ళి గురించి చాలా వ్యాకుల
 పడుతూ ఉండేది.. నా జీవితానికి అర్థమేలేదు అనిఅనుకున్నప్పుడెల్లా పైన చెప్పిన  అనుకూల
 సంకేతాల వల్ల  ఎక్కడ లేని ధైర్యం వచ్చి తిరిగి జీవితం పై ఆశ కలిగేదినా బాయ్ ఫ్రెండ్ నుండి 
నాకుఒక మంచి కబురు కూడావచ్చేదికాదుమా అమ్మ చాలా తపిస్తూ ఉండేది.  నేను నా బాయ్
ఫ్రెండ్ ను పెళ్ళి చేసుకుంటానా లేదా అని బాబాముందర చీట్లు వేసి అడిగిందిదానికి "లేదుఅని 
జవాబు వచ్చిందిఇక నాకు పూర్తిగా మనసు విరిగిపోయిందిచాలా ఏడ్చానుబాబా నుండి
వచ్చిన   ప్రతికూలజవాబు తర్వాత నేను బాబాకు మనఃస్పూర్తిగా శరణాగతి చేశానునా భారం 
అంతా ఆయన పాదాలకే వదిలేసిబాబా నీవునాకు ఎవరు సరైన వ్యక్తి అనుకుంటే వారితో పెళ్ళి 
జరిపించమని బాబా ని వేడాను.
                   తర్వాత బాబాని మనఃస్పూర్తిగా  కోరిక లేకుండ ప్రార్థించేదాన్నిమా అమ్మ నాకోసం 
సంబందాలు చూడడం మొదలు పెట్టింది.నా మనసు చాలా ప్రశాంతంగ ఉండేదినేను బాబా "ప్రశ్నలు 
జవాబులు "వెబ్ సైట్ లో బాబా ని ఎప్పుడు ప్రశ్నలు అడిగిన సమాధానాలుఅనుకూలంగానేవచ్చేవి. . 
బెంగుళూరు  బిటియం లో వున్న బాబా గుడిలో "సాయికోటి స్తూపoఉంది. 48 రోజులు రోజుకు 11 
సార్లు ఆస్థూపమునకు  ప్రదక్షినము చేస్తే మన కోరిన కోరికలు తీరుతాయిసాయి కోటి పుస్తకాలు
 భక్తుల చేత వ్రాయించి స్థూపం లోపల ఉంచి వాటిపైన స్థూపం ను ప్రతిష్ట చేసారుస్థూపం అనేది మట్టితో  
లేదా వేరే లోహముతో తయారు చేయబడిన స్మారక చిహ్నముఅది పవిత్రమైనస్థలముని సూచిస్తుంది.
 నాకు దాని గురించి తర్వాత తెలిసిందినేను స్థూపమునకు భక్తితో 11 సార్లు తిరగడం మొదలు పెట్టాను
నాకు తగినఅబ్బాయితో పెళ్ళి జరిపించమని బాబా ను భక్తితో  వేడానుబాబా నన్ను షిరిడికి పిలిచారు.
 దర్శనం  ఎంతో బాగా జరిగింది.
        
              2012 జనవరిలో క్రొత్త సంవత్సరం ప్రారంభంలో , ఆశ్చర్యంగా నా బాయ్  ఫ్రెండ్ నాకు ఫోన్  
చేసి క్షమాపణ అడిగాడుతరుచుగా  ఫోన్ చేయసాగాడుతన తప్పులను ఒప్పుకున్నాడుబాబా
 దయ వలన  మా ఇద్దరి మద్య జరిగిన గొడవలకు మా ఇద్దరిది భాద్యత అనితెలుసుకున్నాడు
వాటిని అర్థం చేసుకొని  సర్దుకొని మా ప్రేమను  గౌరవించాల్సింది పోయి తను మా ప్రేమ  బంధాన్ని 
తెంచేసాడు 
              తను చేసిన దానికి  పశ్చాత్తాప పడుతున్నట్టు చెప్పినా ఇష్టాన్ని ఇక మీదట 
గౌరవిస్తానన్నాడు అబ్బాయి నాజీవితంలోకి మళ్ళి రావాలో వద్దో కూడా నన్నే 
నిర్ణయించుకోమన్నాడునేను అయోమయంలో పడ్డానుబాబాను సహాయం కోసం 
సలహాకోసం  నా మనసులో వేడానుతను చేసిన తప్పును తెలుసుకున్నందుకు నేను చాలా 
సంతోష పడ్డానుబాబా కి కృతజ్ఞతలు తెలిపాను.  నాబాయ్ ఫ్రెండ్ నన్ను కలవాలని కోరాడుచాలా 
కాలం తర్వాత బాబా గుడిలో  మొదటి సారి కలుసుకున్నాముబాబాయే కనుక మా బంధాన్ని
ఒప్పుకునేటట్టు అయితే అనుకూలంగా ఒక సూచన  చూపించమని బాబా ని వేడాను.
       
            మేము చాలా సేపు మట్లాడుకున్నామునా బాధలన్ని తను విని ఓదార్చాడుతన 
గొంతులో నా మీద తనకు ఉన్న  ముందటిప్రేమను చూడగలిగానుమా ఇద్దరి మద్య సాగిన
చాలా కాలపు గొడవలు , నేను తనని విసిగించే తీరును చూసి ముందు తను భయపడ్డాడనిచెప్పాడు
నేను ఇంక ఒక నిర్ణయానికి రాలేక పోయానుఇంకా భయంగానే ఉంది. మరుసటి రోజు  బ్లాగులో 
నా షిరిడి దర్శనం అనుభవాన్ని  చూసి చాలా సంతోషంవేసింది(అందులో బాబాని నాకు 
తగిన అబ్బాయితో పెళ్ళి జరగడానికి సహాయం చేయమని వేడాను).  అనుభవాన్ని  మేము 
ఆరు నెలలతర్వాత మొదటి సారి కలుసుకున్నపుడు బ్లాగ్ లో పోస్ట్ చేసారుబాబా ని నాకు
 అనుకూలంగా సూచన చేయమని  ప్రార్థించానుఅది ఇలా జరిగింది.నాఅనుభవము ను 
మరియు ప్రార్థనను నేను ఆరు నెలల తర్వాత  నా బాయ్ ఫ్రెండ్ ని 
కలుసుకున్న రోజే బ్లాగ్ లో పోస్ట్ చేశారునేను ఇది బాబాఆశీర్వాదంగా తలచాను.
         ఇప్పుడు పరిస్థితి చాలా మెరుగయిందిఇది అంతా బాబా దయ వలనే . సమస్య వల్ల మేము 
మరింత దగ్గరయ్యాముతను చాలమారిపోయాడుఓర్పు లోనునన్ను బాగా చూసుకోవడంలోను 
ఇంతకు మునుపు కన్న ఇప్పుడు చాలా మారాడు. నేను కూడా నాతప్పులను తెలుసుకొని అతనిని 
విసిగించడం మానేశాను.


... నాకెప్పుడయినా సంస్యలెదురైనప్పుడునా బాయ్ ఫ్రెండ్ లో మార్పులు రావాలనుకున్నప్పుడు
 బాబాని మౌనంగా ప్రార్ధించేదానిని. బాబాని ప్రార్ధించడంవల్ల నా బాయ్ ఫ్రెండ్లో ఏమయిన సంస్యలు 
ఉంటే అవి తొలగిపోయేవంటే నమ్మండి. బాబా నన్ను జీవితమలో సరైన నిర్ణయం తీసుకునేలా చేశారు. మాజీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా మమ్మలిని కాపాడుతూ ఉండమని ఆయన 
పాదాల మీద శరణాగతి చేసి ప్రార్ధిస్తాను.

మేము తిరిగి కలుసుకోవడం అంతా బాబా ఆశీర్వాదమే. బాబా చేసిన ఈ అధ్బుతమైన లీలకు ఎప్పటికీ  ఆయనకు కృతజ్ఞురాలిని. మా జీవితాల్లో ఇటువంటి సమస్యే కనక రాకుండా ఉంటే నాకు బాబా గురించి తెలిసేదేకాదు. బాబా మనలనందరినీ ఎలా ఉండమని భావించారో అలా మంచిమనిషిగా ఉండాలని ప్రయత్నిస్తున్నాను. మా ఇరువురి కుటుంబాల మాధ్య వివాహానికి మాటలు మొదలయాయి. 
అంతా సవ్యంగా జరిగి మా వైవాహిక జీవితం ఆనందంగా  జరగాలని ఆశీర్వదించమని బాబాని 
ప్రార్ధిస్తున్నాను.

బాబా చరణ కమలాలకు నేను వినమ్రంగా నమస్కరిస్తున్నాను. బాబా నీకు అసాధ్యమన్నది లేదు. నీబిడ్డలకు ఎప్పుడేది ఇవ్వాలో నీకు మాత్రమే తెలుసు. మీరే నా తండ్రి.  మామాలని ఎప్పుడు కాపాడుతూ ఉంటావని నాకు తెలుసు.

మాకందరికీ నీ ఆశిర్వాదములు లభించి మా జీవితాలు సుఖమయంగా ఉండుగాక.

అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ

శ్రీ సచ్చిదానంద సమర్ధ సద్గురు సాయినాధ్ మహరాజ్ కీ జై

సర్వం శ్రీసాయినాధార్పణమస్తు



Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List