20.03.2021 
శనివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయిబాబా – పరిశోధనా వ్యాస గ్రంధము – 56 వ.భాగమ్
(రచయిత… శ్రీ ఆంటోనియో రిగోపౌలస్ – ఇటలీ)
తెలుగు అనువాదమ్ :  ఆత్రేయపురపు
త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
ఫొన్ : 9440375411 & 8143626744
మైల్ ఐ.డి. tyagaraju.a@gmail.com
షిరిడీ – ఉద్దవరావు
మాధవరావు దేశ్ పాండే గారి ఇంటిలో ఉ. గం. 11-30 కి
మాధవరావు దేశ్
పాండే (శ్యామా) గారి ముమారుడు 79 సం.వయస్సు గల ఉద్దవరావు మాధవరావు దేశ్ పాండే గారితో
రెండవసారి జరిపిన సంభాషణ.  శ్యామా సాయిబాబాకు అత్యంత సన్నిహిత భక్తుడే కాక ఆయనకు మధ్యవర్తిగా కూడా ఉండేవారు.
ఉధ్ధవరావు
చెబుతున్న విషయాలు …
బాబా వంట ప్రారంభించడానికి ముందుగా పాత్రలన్నిటినీ మసీదులోకి తీసుకువచ్చేవారు. మసీదులో ధుని మండుతూ ఉంటుందన్న విషయం మీకు తెలిసే ఉంటుంది. మాధవ్ ఫన్స్ లే అనే అతను గిన్నెలలో నీళ్ళుపోసి బాబాకు సహాయం చేసేవాడు. అపుడు బాబా వంట ప్రారంభించేవారు. కూరలను కడిగి వాటిని తరగడంలో మాధవ్, బాబాకు సహాయం చేసేవాడు.
తరిగిన
కూరగాయలని బాబా పాత్రలలో వేసేవారు. 
ఆ కూరలను
బియ్యంలోనే కలిపేసేవారు. 
తరిగిన
కూరలు, బియ్యం రెండు కలిపి వండేవారు. పాత్రలలో
పంచదార క్యాండీలను వేసేవారు బాబా.  
పాత్రలలోని
పదార్ధాలను బాబా స్వయంగా తన చేతితో కలియత్రిప్పేవారు.
ప్రశ్న   ---   ఆవిధంగా అన్నం ఉడుకుతున్న పాత్రలో చేయిపెట్టి తిప్పినపుడు ఆయన చేయి కాలేది కాదా?
జవాబు   ---   బాబా అన్నాన్ని పైకి క్రిందకి కలియబెట్టేవారు. 
బాబా
తన చేతితో స్వయంగా కలిపేవారు తప్ప ఎటువంటి గరిటెలను ఉపయోగించేవారు కాదు.
ప్రశ్న   ---   ఆయనకు చేయి కాలేది కాదా?
జవాబు   ---   లేదు, లేదు. 
ఆయనకు
ఏమీ అయేది కాదు. 
ఆయన
చేయి మునుపు ఎలా ఉండేదో అలాగే ఉండేది. 
అన్నం
ఉడుకుతున్న పాత్రలలో చేయిపెట్టి ఏకధాటిగా రెండు మూడు నిమిషాలపాటు కలుపుతూ ఉండేవారు. 
ఆయన
చేతికి ఎటువంటి గాయాలు అయేవి కావు.
ప్రశ్న   ---   ఇంకా మీరు చెప్పవలసిన సంఘటన ఏదయినా గుర్తుకు తెచ్చుకుని చెప్పగలరా?
జవాబు   ---   ఆరోజుల్లో మహమ్మదీయ ఫకీరు ఒకతను ఉండేవాడు. 
అతను
మాలేగావ్ నుండి వచ్చి బాబాతో షిరిడీలోనే ఉండేపోయాడు. 
బాబా
రోజూ అతనికి 15 రూపాయలు ఇచ్చేవారు. తాత్యాకోతే పాటిల్ కి 30 రూపాయలనుండి 50 రూపాయలదాకా ఇచ్చేవారు. 
ఒక్కొక్కసారి
30,35,40, ఆవిధంగా
ఇచ్చేవారు.  చాలామందికి
ఆయన పది, అయిదు, రెండు, పదిహేను రూపాయలు ఈ విధంగా ఇచ్చేవారు. 
భక్తులందరికీ
బాబానుంచి ఆవిధంగా డబ్బులు ముడుతూ ఉండేవి.
ప్రశ్న   ---   బాబా డబ్బులు పంచడానికి ఏదయినా ప్రత్యేకమయిన సమయం ఉండేదా? 
ఉదాహరణకి
ఆయన సాయంత్రం పూట పంచేవారా లేక రోజులో ఏసమయంలోనయినా పంచేవారా?
జవాబు   ---   ఆయన సాయంత్రంపూట మాత్రమే డబ్బులు పంచేవారు.
ప్రశ్న   ---   అయితే ఉదయం దక్షిణ అడిగి సాయంత్రమయేటప్పటికి వచ్చినదంతా పంచేస్తూ ఉండేవారా?
జవాబు   ---  అవును. 
దక్షిణగా
ఎంతవస్తే అంతా సాయంత్రం పంచిపెట్టేస్తూ ఉండేవారు. 
బాబా
ఉదయం 8 గంటలవేళ భిక్షకు వెడుతూ ఉండేవారు. 
ఆయన
 కొన్ని ఇండ్లకు మాత్రమే భిక్షకు వెళ్ళేవారు. 
బాబా
భిక్షకు వెళ్ళినపుడు “మా భాక్రియాన్” అని గట్టిగా ఇంటిముందు నిలబడి పిలిచేవారు. 
అనగా
దాని అర్ధం “అమ్మా రొట్టె ముక్క పెట్టు”.
ప్రశ్న   ---   ఆమాటలు మరలా ఒక్కసారి చెబుతారా?
జవాబు   ---   ఆయన ఈ విధంగా అనేవారు “ మా, భాక్రియాన్”, లేక “మా రోటియాన్” అనగా “అమ్మా కాస్త ఆహారం పెట్టు – రొట్టెముక్క పెట్టు” --- బాబా భిక్షకు వెళ్ళే సమయంలో ఆయనతో కూడా బూటి సాహెబ్, నానా సాహెబ్ నిమోన్ కర్ ఇద్దరూ వెడుతూ ఉండేవారు.
ప్రశ్న   ---   వారప్పుడు ఏమి చేసేవారు?
జవాబు   ---   వారిద్దరూ బాబాకు ఆసరాగా ఉండి నడవటానికి సహాయం చేసేవారు.  బాబా
కొద్ది ఇండ్లకు మాత్రమే భిక్షకు వెళ్ళేవారు. 
ఆయనకు
సహాయం చేయడానికి కూడా వారిద్దరు వెడుతూ ఉండేవారు.
ప్రశ్న   ---   వారిద్దరూ ఆవిధంగా వెళ్ళడం మీరు స్వయంగా చూసారా?
జవాబు   ---   అవును. 
నాకళ్ళతో
నేను స్వయంగా చూసాను.
ప్రశ్న   ---   మీనాన్నగారయిన శ్యామా గారికి సాయిబాబాతో ఒక ప్రత్యేకమయిన అనుబంధం ఉందన్న విషయం నేను పుస్తకాలలో చదివాను. 
నాకు
తెలుసు.  భక్తుడు
బాబాతో మాట్లాడదలచుకున్నపుడు, అతను 
మాట్లాడే
అవకాశాన్ని తరచుగా శ్యామాయే ఏర్పాటు చేస్తూ ఉండేవారు. 
ఆవిధంగా
ఆయన బాబాతో సన్నిహితంగా బహుశ అత్యంత సన్నిహితంగా ఉండేవారు. 
ఈ
అనుబంధం గురించి మీకేమయినా గుర్తుందా? అది నిజమేనా?
జవాబు   ---   ఒకసారి హైదరాబాదునుండి బాబాను దర్శించుకోవడానికి ఒక కుటుంబం వచ్చింది. 
వారికి
సంతానం లేదు. 
సంతానం
కోసం బాబావారి దీవెనలు తీసుకుందామనే ఉద్దేశ్యంతో వచ్చారు. 
మొదటిసారి
వారు బాబాను దర్శించుకున్నపుడు బాబా వారిని ఆశీర్వదించడానికి నిరాకరించారు. 
బాబా,
“అది మీనమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. 
నేను
మిమ్మల్ని అనుగ్రహించలేను” అన్నారు. 
ఆ
దంపతులిద్దరూ
మసీదు బయటకు వచ్చిన తరువాత మానాన్నగారయిన శ్యామాను కలుసుకోవడానికి నిశ్చయించుకున్నారు. 
ఇద్దరూ
కళ్ళనీళ్ళు పెట్టుకుని ఏడుస్తూ తమ బాధను శ్యామాకు చెప్పుకున్నారు. 
వారు
ఆయనతో “మాకు సంతానం ప్రసాదించమని బాబాతో మీరు చెప్పండి” అని వేడుకొన్నారు. 
అపుడు
శ్యామా, బాబా దగ్గరకు వెళ్ళి, “ఎలాగయినా సరే మీరు ఆదంపతులకు సంతానాన్ని ప్రసాదించవలసిందే” అని పట్టుపట్టి మరీ అడిగారు. 
రెండు
రోజుల తరువాత చివరికి బాబా అంగీకరించి, ఆ దంపతులిద్దరికీ కొబ్బరికాయను ఇచ్చి దానిని తినమని చెప్పారు.
ప్రశ్న   ---   పిల్లలు పుట్టడానికి అది సంకేతమా?
జవాబు   ---   అవును, పిల్లలు పుట్టడానికి.
ప్రశ్న   ---   మీనాన్నగారు ఆదంపతులిద్దరి తరఫున మధ్యవర్తిత్వం జరిపినందుకు ఇది జరిగిందన్నమాట?
జవాబు   ---   అవును. 
ఆవిధంగా
ఆయన వారికి సహాయం చేసారు. 
బాబా
వారికి పూర్తి కొబ్బరికాయను ఇచ్చారు. 
పన్నెండు
నెలల తరువాత వారికి సంతానం కలిగింది. 
తరువాత
వారు మరలా షిరిడీకి వచ్చి బాబాను దర్శించుకున్నారు.
ప్రశ్న   ---   శ్యామా,  బాబాతో
అంత సన్నిహితంగా ఉండటానికి గల కారణం ప్రత్యేకించి ఏదయినా ఉందా?
జవాబు   ---   లేదు. 
బాబా
ఆయనకు ఏమీ ఇవ్వలేదు.
ప్రశ్న   ---   గణపతి విగ్రహం గురించిన విషయం ఏమిటి?
జవాబు   ---   అవును. బాబా ఆయనకి గణపతి విగ్రహాన్ని మాత్రమే ఇచ్చారు.
ప్రశ్న   ---   అది మాత్రమేనా?
జవాబు   ---   అవును. అదే.
ప్రశ్న   ---   బాబా శ్యామాగారికి కానుకగా ఎప్పుడయినా డబ్బు ఇచ్చారా?
తుకారామ్   ---   ఆరోజుల్లో శ్యామా మంచి స్థితిపరుడు. 
ఆయన
భూస్వామి అని నేను అనుకుంటున్నాను.
జవాబు   ---   భూస్వామా?
తుకారామ్ --- అవును. అందువల్లనే బాబా ఆయనకు ఎప్పుడూ డబ్బు గాని మరింకేమయినవి గాని ఇవ్వలేదు. ఈ గణేష విగ్రహం తప్పించి మరింకేమీ ఇవ్వలేదు.
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు) 











0 comments:
Post a Comment