28.07.2020 మంగళవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు శ్రీసాయి సత్ చరిత్రలోని 11 వ.అద్యాయం గురించిన వివరణతో పాటు శ్రీమతి మాధురి అంబేలా దాంగారి అనుభవాన్ని ప్రచురిస్తున్నాను.  
రుద్రాధ్యాయం యొక్క ప్రభావమ్ – 
శ్రీ సాయి సత్ చరిత్ర 11వ.అధ్యాయమ్
శ్రీమతిమాధురి అంబేలాల్ దాంగ్ గారి అనుభవమ్ (అంధేరీ వెస్ట్, ముంబాయి) 
సాయిలీల
ద్వైమాసపత్రిక
మార్చ్ – ఏప్రిల్ 2019 సంచికలో ప్రచురింపబడింది. 
శ్రీ సాయి సత్ చరిత్రలోని 11వ.అధ్యాయానికి, అనుభవానికి సంగ్రహంగా వివరణ మరాఠీ లో వ్రాసినవారు శ్రీమతి ప్రియంవద ప్రకాష్ కరాండే. వడలా వెస్ట్, ముంబాయి
ఆంగ్లానువాదమ్ --- శ్రీమతి మీనల్ తుషార్ దేశ్ పాండే
తెలుగు అనువాదమ్ : 
ఆత్రేయపురపు
త్యాగరాజు,
నిజాంపేట, హైదరాబాద్
ఫోన్. 
9440375411  &  8143626744
మైల్ ఐ.డి. 
tyagaraju.a@gmail.com
శ్రీ గోవింద్ (అన్నాసాహెబ్) రఘునాధ్ ధబోల్కర్ అనబడే హేమాడ్ పంత్ చే  వ్రాయబడిన
పవిత్ర గ్రంధం శ్రీ సాయి సత్ చరిత్ర సాయిభక్తులందరికి లభించిన ఒక గొప్ప వరం. 
ఈ
గ్రంధం భక్తులందరికి ఒక మార్గదర్శిగానే కాకుండా బాబా తమ చెంతనే ఉన్నారనే భావాన్ని కలుగచేస్తుంది. 
ఈ
గ్రంధములో రుద్రాధ్యాయమని కూడా పిలువబడే 11వ.అధ్యాయంలో గురువుయొక్క ఆవశ్యకతను గురించి తెలపడమే కాక, సాయిబాబాలో ఉన్నటువంటి అపారమయిన శక్తులను గురించి వివరిస్తుంది.  
ప్రతిరోజు ఈ అధ్యాయాన్ని క్రమం తప్పకుండా చదివిన భక్తులకు వారివారి కోరికలు తీరడం, అంతేకాకుండా ఏమయినా సమస్యలు గాని, జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు గాని తొలగిపోవడం వారందరికి అనుభవమే. సంక్షిప్తంగా చెప్పాలంటే దురదృష్టం నిష్క్రమించి అదృష్టం ఉదయిస్తుంది. ఈ అధ్యాయంలో సాయిబాబాకు పంచభూతాలపై (భూమి, అగ్ని, నీరు, వాయువు, ఆకాశం) ఆధిపత్యం ఎంత ఉన్నదో వివరంగా మనకు తెలుస్తుంది. ఈ అధ్యాయాన్ని చదువుతున్న సమయంలో సాయిబాబా యదార్ధంగానే సర్వశక్తిమంతుడయిన భగవంతుడు అని మనం గ్రహించుకోగలం. శ్రీకృష్ణపరమాత్మ, సత్పురుషులు తన ఆత్మ అని భగవద్గీతలో చెప్పాడు. ఏకనాధభాగవతంలో కూడా యోగులు కనిపించే దైవం అని, అగోచరం కాని భగవంతుని ప్రతిరూపాలని చెప్పబడింది.
ప్రతిరోజు ఈ అధ్యాయాన్ని క్రమం తప్పకుండా చదివిన భక్తులకు వారివారి కోరికలు తీరడం, అంతేకాకుండా ఏమయినా సమస్యలు గాని, జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు గాని తొలగిపోవడం వారందరికి అనుభవమే. సంక్షిప్తంగా చెప్పాలంటే దురదృష్టం నిష్క్రమించి అదృష్టం ఉదయిస్తుంది. ఈ అధ్యాయంలో సాయిబాబాకు పంచభూతాలపై (భూమి, అగ్ని, నీరు, వాయువు, ఆకాశం) ఆధిపత్యం ఎంత ఉన్నదో వివరంగా మనకు తెలుస్తుంది. ఈ అధ్యాయాన్ని చదువుతున్న సమయంలో సాయిబాబా యదార్ధంగానే సర్వశక్తిమంతుడయిన భగవంతుడు అని మనం గ్రహించుకోగలం. శ్రీకృష్ణపరమాత్మ, సత్పురుషులు తన ఆత్మ అని భగవద్గీతలో చెప్పాడు. ఏకనాధభాగవతంలో కూడా యోగులు కనిపించే దైవం అని, అగోచరం కాని భగవంతుని ప్రతిరూపాలని చెప్పబడింది.
సాయిబాబా భగవంతుడన్న విషయం చాలా స్పష్టం. 
భక్తుడికి
ప్రత్యక్షంగా
కనిపించే గురువుయొక్క ఆవశ్యకత ఎంతయినా ఉంది. 
మనకు
గురువు ప్రత్యక్షంగా కనిపించాల్సిన అవసరమేమిటి? 
దీనికి
సమాధానంగా హేమాడ్ పంత్ అభిప్రాయం….
“విశ్వమంతటా సమానంగా నిండి ఉన్న నిర్గుణ తత్త్వము, కళ్ళతో చూడగలిగే సాకార రూపంలో ఉంటే, వారిపాదాలపై శిరసుంచటానికి, వారితో ప్రేమగా మాట్లాడటానికి, వారిని గంధాక్షతలతో పూజించటానికి, ధ్యానించటానికి వీలుంటుంది. 
అందువలన
ఒక అకారమవసరం. 
నిర్గుణంలో
కంటే సగుణంలో పరమాత్మను తెలుసుకోవడం సులభం. 
సగుణమూర్తిపై
ప్రేమ ధృడమయితేనే నిర్గుణ తత్త్వ జ్ఞానం కలుగుతుంది” (శ్రీ సాయి సత్ చరిత్ర అ.11 ఓ.వి. 15 – 16).
వాస్తవానికి సగుణాకారము, నిర్గుణాకారము రెండూ ఒకటేనని మనం అర్ధం చేసుకుంటాము. 
సగుణాకారుడయిన గురువుని
మనం ప్రత్యక్షంగా మనకళ్లతో చూడగలం. 
కాని
మన మనోదృష్టితో మన గురువుని దర్శించగలము. 
ఆయన
ఉనికిని తెలుసుకోగలం. 
ఇక్కడ
హేమాడ్ పంత్ ఒక పోలిక చెప్పారు. నెయ్యి పేరుకొని గట్టిగా ఉన్నా, కరిగి ద్రవరూపంలో ఉన్నా నెయ్యి అనే అంటాము.   ఏమయినప్పటికి
భక్తులు తమ కళ్ళెదుట కనిపించే గురువుయొక్క సగుణరూపాన్నే అర్ధం చేసుకొని పూజించడమే చాలా సులభమని, దాని వల్ల గురువును బాగా అర్ధం చేసుకోవచ్చని భావిస్తారు. 
గురుత్వం
గల గురువుయొక్క రూపాన్ని దర్శించగానే భక్తుల మదిలో పవిత్రమయిన ఆలోచనలు ఉద్భవిస్తాయి. 
భక్తుల మనసులో తమకి సద్గురువుతో బంధం ఏర్పడిందనే భావం కలుగుతుంది. 
సద్గురువుకు
కూడా తన శిష్యులను కలుసుకోవాలనే ఆత్రుత, వారిని చూడాలనే ఆకాంక్ష కలుగుతాయి. 
ఈ
సందర్భంగా సాయిబాబా అగోచరమయినటువంటి తన నిర్గుణస్వరూపాన్ని పూజించమని తన భక్తులెందరికో చెప్పారు. 
ప్రతి
భక్తునియొక్క
పరిస్థితులకనుగుణంగాను,
వారివారి సామర్ధ్యాలను బట్టి బాబా వారికి ఆవిధంగా ఏర్పాట్లు గావించేవారు. 
భక్తులను
బహుకాలం బలవంతంగా తన దర్శనానికి దూరంగా ఎక్కడో కూర్చోబెట్టేవారు. 
ఒకరిని
దేశాంతరం పంపేవారు. ఒకరిని షిరిడీలోనే ఏకాంతంగా కూర్చోబెట్టేవారు. 
మరొకరిని
వాడాలో గ్రంధపారాయణకు నియమించేవారు. 
దీనికి
కారణమేమిటంటే
సంవత్సరాల తరబడి ఈవిధంగా అభ్యాసం చేస్తే నిర్గుణధ్యాస పెరుగుతుది.
దేనిని ఆశించి ఈపధ్ధతిని అనుసరించాలి? 
ఇదంతా
భక్తులలో జ్ఞానాన్ని పెంపొందించి భక్తిద్వారా వారిని ఆధ్యాత్మిక స్థాయిక తీసుకొనివెళ్ళేందుకు సహాయపడటానికే. 
ఆవిధంగా
వారు నిర్గుణస్వరూపాన్ని ఆరాధించగలుగుతారు. 
వారికి
ఆత్మజ్ఞానం కలిగి భగవంతుడికి, భక్తునికి భేదం లేదనే విషయం గ్రహింపుకొస్తుంది. 
ద్వైతభావం
నశించి అద్వైత భావం కలుగుతుంది. 
భక్తుడు
భగవంతునితో సమానుడనే జ్ఞానం ఉదయిస్తుంది.
దానిఫలితంగా జననమరణ చక్రాలు తొలగిపోయి మోక్షాన్ని పొందడానికి కూడా దోహదపడుతుంది. 
అతిదుర్లభమయిన మానవజన్మను
సార్ధకం చేసుకోవడం కూడా సాధ్యపడుతుంది. 
ఈవిధంగా
దయార్ద్రహృదయుడయిన
మన సాయిబాబా భక్తులకు మార్గంచూపి వారి జీవితాలను ఉన్నతస్థితిలోకి తీసుకొనిరావడమే కాక వారిలో భక్తిని మరింత ముందుకు తీసుకొనివెడతారు.
ఇది
యదార్ధమయినప్పటికి భక్తులకి కొన్ని కొన్ని సందర్బాలలో సందేహాలు కలుగుతూ ఉండేవి.
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)









0 comments:
Post a Comment