04.12.2012 మంగళవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయితో మధుర క్షణాలు తరువాయి భాగం
ముందుగా శ్రీవిష్ణుసహస్రనామం 13వ. శ్లోకం, తాత్పర్యము
శ్లోకం: రుద్రో బహుశిరా బభ్రుర్విశ్వయోనిః శుచిశవాః
అమృతః శాశ్వతస్థాణుర్వరారోహో మహాతపాః ||
పరమాత్మను చందస్సుల కధిదేవతగా, అనేక శిరములు కలిగినవానిగా, సృష్టియందలి వర్ణములన్నియు తన రూపమైనవానిగా, విశ్వమునకు పుట్టుకయైనవానిగా మరియు విశ్వమునందు పుట్టుచున్నవానిగ, మృత్యువు లేనివానిగ, శాశ్వతునిగ, చైతన్యము లేనివానిగ, ఉత్తమమైన పుట్టుక కలవానిగ, గొప్ప తపస్సు చేయువానిగ మరియు తపస్సే తానైనవానిగ ధ్యానము చేయుము.
శ్రీసాయితో మధుర క్షణాలు - 10
పేరు చెప్పడానికిష్టపడని ఒక బాబా భక్తుడు చెప్పిన అనుభవాలలో 5 వ. లీల.
బాబాకు, అక్బర్ కు సంబంధించి, మహదీ బువా వివరించిన మరొక చిన్న కధ.
ఒకరోజు కొంతమంది బాలురు, మహదీ బువా, బాబాతో ఉన్నప్పుడు, బాలురు అక్బర్ చక్రవర్తి గురించి మాట్లాడుకుంటున్నారు.
బాబా "మీరు అక్బర్ గురించి మాట్లాడుకుంటున్నారా, అతను నా పాదాలవద్ద ఉన్నాడు" అన్నారు. మీరప్పుడు ఏమి చేస్తున్నారు బాబా" అన్నారు ఆబాలురు. నేనప్పుడు అమర్ కోట వద్ద ఫకీరును" అన్నారు బాబా. అప్పుడది షేర్షా ఢిల్లీకి చక్రవర్తిగా ఉన్న కాలం. హుమయూన్ రాజ్య భ్రష్టుడై సిం హాసనాన్ని కోల్పోయి దేశ బహిష్కృతుడై ఒక ప్రదేశాన్నించి నుంచి మరొక ప్రదేశానికి తిరుగుతూ ఉన్నారు.
ఆ చక్రవర్తి నావద్దకు వచ్చినపుడు కూడా అతని భార్య ఉన్నది. ఆమె నాపాదాల వద్ద పడి నా ఆశీర్వాదములు కోరింది. ఆమె అప్పుడు గర్భిణీ. నేనామెతో "ప్రక్కనున్న అమర్ కోట గ్రామంలో నీకు మగపిల్లవాడు జన్మిస్తాడు. నేనా బాలునికి నామకరణం చేస్తాను" అని చెప్పాను. కొంతకాలం తరువాత ఆమె ఒక మగ పిల్లవానికి జన్మనిచ్చింది.
నామకరణ సమయానికి నేనక్కడకు వెళ్ళాను. నేనా బాలునికి అక్బర్ అని నామకరణం చేశాను. ఆబాలుడు నాపాదాల వద్ద ఆడుకొన్నాడు.
బొంబాయిలో నేను మహదీబువాను కలుసుకొని ఆయనవద్ద నుంచి చాలా సమాచారాన్ని సేకరించాను. ఆయన బొంబాయిలో చివర ఎక్కడో , గౌరవనీయుడైన ఒక మహమ్మదీయుని యింటిలో ఉంటున్నారు. హిందువులు, ముసల్మానులు, పార్శీలు మొదలైన వారంతా ఆయనంటే ఎంతో గౌరవంగా ఉండేవారు. యింటి యజమాని కూడా అద్దె గురించి ఎప్పుడు రొక్కించి అడగలేదు. పుట్టుకతో ఆయన హిందువు. కాని, ఆయన కుల మత భేదాలకు అతీతంగా అందరూ సమానమే అనే విధంగా అందరితోను కలిసి జీవించారు. బాబా మహాసమాధికి ముందు తాను బాబాతో కొన్ని సంవత్సరాలు గడిపినట్లు చెప్పారు.
శ్రీ బీ.వీ.నరసిం హస్వామీజీ గారి వివరణ:
బొంబాయిలో నివసిస్తున్న ఈ నిజమైన భక్తుడిని నేను చూశాను. ఆయన చెప్పినది విన్నాను. ఆయన చెప్పినదంతా నిజమని నమ్ముతున్నాను.
సాయిసుధ
మార్చ్, 1950
సాయిసుధ
ఏప్రిల్, 1950
(ఇంకా ఉన్నాయి మధురక్షణాలు)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు
0 comments:
Post a Comment