07.11.2022 సోమవారమ్
ఓమ్
సాయి శ్రీ సాయి జయజయ సాయి
శ్రీ
మాత్రే నమః
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
కార్తిక పౌర్ణమి శుభాకాంక్షలు
శ్రీ
సాయి దయా సాగరమ్ 45వ, భాగమ్
అధ్యాయమ్
– 43
మరాఠీ
మూలగ్రంధ రచయిత్రి --- శ్రీమతి ఉజ్వలా బోర్కర్, విలేపార్లే - ముంబాయి
ఆంగ్లానువాదమ్
--- శ్రీ ఉదయ్ అంబాదాస్ బక్షి
తెలుగు
అనువాదమ్ --- ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట,
హైదరాబాద్
9440375411 & 81436267
శ్రీ
సాయి సత్ చరిత్ర 15 వ.అధ్యాయమ్
నేను
ప్రతిరోజు శ్రీ సాయి సత్ చరిత్రలోని 15 వ. అధ్యాయాన్ని పారాయణ చేస్తూ ఉంటాను. ఈ అధ్యాయంలో ఒక వాస్తవ గాధ వివరింపబడింది. అందులో ఔరంగాబాద్ నుండి ఒక బల్లి తన సోదరిని కలుసుకోవడానికి
షిరిడికి వచ్చిన సంఘటన ప్రస్తావింపబడింది. ఈ సంఘటన చదివిన ప్రతిసారీ నేను బాబాను ఇలా
ప్రార్ధించుకుంటూ ఉండేదానిని. “బాబా మేము ఏడుగురం
అక్కచెల్లెళ్ళం. మా కందరికీ వివాహాలు అయిన
తరువాత ఎక్కడెక్కడో దూరప్రాంతాలలో ఉంటున్నాము.
మేమందరం కలుసుకుందామనుకున్నా తరచుగా కలుసుకోలేకపోతున్నాము” అని బాధపడుతూ ఉండేదానిని.
ఆ సంవత్సరం
మా మరిదికి అంటే మా చిన్న చెల్లెలు నీతా భర్తకి ఔరంగాబాదునుండి బొంబాయి హైకోర్టుకి
బదిలీ అయింది. మా చిన్న చెల్లెలు నీతా కూడా
ముంబాయి వచ్చి మా బంగళాలోనే నాతోపాటు మూడు సంవత్సరాలు ఉంది. నాతో కలిసి ఉండటానికి ఇక్కడ సాయిసేవ కూడా చేయవచ్చని
నీతా ఎంతో సంతోషపడింది. తనకి మొదటి కుమార్తె
జన్మించిన వారంలోపే పాప మలేరియాతో చనిపోయింది.
మా చెల్లెలు బాగా బెంగపెట్టుకుని నైరాశ్యంలో ఉండటంతో ఆమె ఆరోగ్యం గురించి నాకు
చాలా ఆందోళనగా ఉండేది.
ఆ సమయంలో
తనకి ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో సాయిబాబా
తనని డ్యూలేగావ్ రాజకి తీసుకువెళ్ళారు. అక్కడ
మా తాతముత్తాతల కాలంనాటి పెద్ద ఇల్లు ఉంది.
ఇంటి వెనుక పారిజాతం చెట్టు ఉంది. ఆ
చెట్టు క్రింద మా తాతముత్తాతలలో ఒకరి సమాధి ఉంది.
అక్కడ సాయిబాబా కూర్చుని ఉన్నారు. ఆయన
ఒక చిన్న తటాకంలో ఉన్న ఉయ్యాలని చూపించారు.
అందులో ఒక చిన్నపాప నిద్రపోతూ ఉంది.
సాయి ఆ పాపను చూపించి నీ చిన్న పాప క్షేమంగా ఉంది. బాధపడకు” అన్నారు.
1994
వ.సం.లో మా చెల్లెలికి కుమార్తె జన్మించింది.
పాపకి నేత్ర అని పేరు పెట్టారు. మా చెల్లెలు నీతాకు, మరణించిన తన కూతురిని సాయి తిరిగి తీసుకువచ్చారని మేము ప్రగాఢంగా విశ్వసించాము.
ఉజ్వలా
బోర్కర్
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment