23.11.2022 బుధవారమ్
ఓమ్
సాయి శ్రీ సాయి జయజయ సాయి
శ్రీ మాత్రే నమః
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ
సాయి దయా సాగరమ్ 46 వ, భాగమ్
అధ్యాయమ్
– 44
మరాఠీ
మూలగ్రంధ రచయిత్రి --- శ్రీమతి ఉజ్వలా బోర్కర్, విలేపార్లే - ముంబాయి
ఆంగ్లానువాదమ్
--- శ్రీ ఉదయ్ అంబాదాస్ బక్షి
తెలుగు
అనువాదమ్ --- ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట,
హైదరాబాద్
9440375411 & 81436267
శ్రీ
సాయి సత్ చరిత్ర 15 వ.అధ్యాయమ్
ప్రాణాన్ని
నిలబెట్టిన సాయి
నా
చిన్న తమ్ముడు గిరీష్ బక్షి పూనాలో సింహఘడ్ రోడ్ లో ఉంటున్నాడు. 1999 వ. సంవత్సరంలో అతని భార్య మంజు గర్భం దాల్చింది. ఈ శుభ వార్త వినగానే మా కుటుంబమంతా ఎంతో సంతోషించింది. మంజుకి 8 వ నెలరాగనే నెప్పులు ప్రారంభమయ్యాయి. వైద్యుడు సోనోగ్రఫీ చేసినపుడు అందులో శిశువు యొక్క
తల పూర్తిగా ఎదగలేదని చెప్పాడు. శిశువు యొక్క
స్థితి ఏవిధంగా ఉంటుందనే దానికి తాము ఎటువంటి హామీ ఇవ్వలేమని అన్నారు.
మేమింకా
రెండు మూడు చోట్ల సోనోగ్రఫీ చేయించాము. అక్కడ
కూడా రిపోర్టులు ఒక్కలాగే వచ్చాయి. సోనోగ్రఫీలో
శిశువు మెదడులో నీరు ఉన్నట్లుగా కనిపించింది.
అది చూసి వైద్యులు శిశువు చాలా అసాధారణంగా ఉండే స్థితి అని అన్నారు. అంగవైకల్యంతో
పుట్టవచ్చు అన్నారు. అందువల్ల వైద్యులు గర్భస్రావం
చేస్తేనే మంచిదని సలహా ఇచ్చారు.
ఆ మాటవిని
మేమంతా చాలా ఆందోళన పడ్డాము. ఎటువంటి నిర్ణయం
తీసుకోలేని పరిస్థితిలో ఉండిపోయాము. అటువంటి
క్లిష్ట పరిస్థితులలో నా తమ్ముడిని అనుగ్రహించమని బాబాను ప్రార్ధించసాగాను. అపుడు ఒకరోజు రాత్రి నాకొక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో నేను మా అమ్మగారి తాలూకు పూర్వీకులు
ఉన్న ప్రదేశంలో ఉన్నాను. నేను అక్కడ ఒక శిశువుయొక్క
తలను పట్టుకుని ఆడుకుంటున్నాను. ఈ కల ద్వారా
బాబా నాకు ఒక మంచి సందేశాన్నే ఇస్తున్నారనీ, ఆయన ఇచ్చే సూచనలు ఎప్పుడూ అసత్యాలు కావనే
భావం నామదిలో కలిగింది. సాయిబాబా ఆశీర్వాదం
వల్ల అంతా మంచే జరుగుతుందనీ, అందుచేత 9 వ. నెల వచ్చేవరకు ఆగుదామని మా తమ్ముడికి ధైర్వం
చెప్పాను.
9 వ.
నెల పూర్తయిన తరువాత 12.11.1999 న మా తమ్ముడి భార్యని ఆస్పత్రిలో చేర్పించాము. 13.11.1999 న ఆడశిశువు జన్మించింది. పాప తక్కువ
బరువుతో పుట్టినా గాని మంచి చలాకీగా ఉంది.
పాప చక్కగా ఆరోగ్యంగా ఎటువంటి అసాధారణ స్థితి లేకుండా జన్మించింది. నేను బాబా ఊదీని పాప నుదుటి మీద రాసాను.
ఇపుడు
పాపకి యుక్తవయస్సు వచ్చి 12వ. తరగతి చదువుతూ ఉంది.
ఇదంతా
సాయిబాబా వారి కరుణామృతపు జల్లు వల్లనే సాధ్యమయింది.
ఉజ్వలా
బోర్కర్
(సర్వం
శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment