14.04.2016
గురువారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీరామనవమి
శుభాకాంక్షలు
సాయి
రామాయణం 
రేపు
శ్రీరామనవమి సందర్భంగా సాయిబానిస గారు రచించిన “రామాయణంలో సాయి” ని కాస్త తగ్గించి
(ఎడిట్) చేసి సాయి భక్తుల కోసం మరలా ప్రచురిస్తున్నాను.  పూర్తిగా చదవడానికి సాయి దర్బార్ తెలుగు (www.teluguvarisaidarbar.blogspot.in ) చూడండి. మన బ్లాగు, తెలుగువారి సాయి  దర్బార్ రెండు బ్లాగులలోను 2012 వ. సంవత్సరంలో ప్రచురించాను.  ఇంతకు ముందు ఎప్పుడో మీరు చదివి ఉండవచ్చు.  కాని శ్రీరామనవమి సందర్భంగా మరొక్క సారి  మననం చేసుకుందాము.
రామాయణంలో
సాయి
సాయిబానిస
శ్రీ రావాడ గోపాలరావు
(సంకలనం
; ఆత్రేయపురపు త్యాగరాజు – 9440375411)
శ్రీ
సాయి సత్ చరిత్ర 6 వ.
అధ్యాయములో హేమాద్రిపంతు చాలా మధురంగా చెప్పిన
మాటలు : " నేను రామాయణాన్ని చదువుతున్నపుడల్లా,
ప్రతీ చోట సాయే రాముడు
అన్న భావన కలిగింది". 
నేను భాగవతం చదువుతున్నపుడల్లా "సాయియే శ్రీకృష్ణుడనే భావన కలిగింది". ఈ
రెండు వివరణల అధారంగా,రామాయణం చదివి ఆయన చెప్పిన
మాటలు సత్యమేనా అని ఇందులోని వాస్తవాలను
అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించాను.  ఇప్పుడు
నేను చెప్పబోయే విషయం 
"శ్రీరామునిగా సాయి"
నేను
ముఖ్యంగా "రామాయణంలో రాముడికి" "శ్రీ సాయి సత్చరిత్రలో
సాయికి" ఈ రెండిటికి ఉన్న
పోలికలను వివరిస్తాను. 1838 సంవత్సరమునకు ముందే షిరిడీలో మారుతి
దేవాలయము ఉంది.
మనకందరకూ
1858 తరవాతనుంచే సాయి గురించి తెలుసు.
అంటే దాని అర్ధం 1858 కి
ముందు ఆయన లేరా? మహా
భాగవతంలో "శేష సాయి" గురించి,
"వటపత్ర సాయి" గురించి విన్నాము. 
శేష సాయి అనగా
శ్రీమహావిష్ణువు.  వటపత్ర
సాయి అనగా శ్రీకృష్ణుడు. అంచేత
సాయి అన్న పవిత్రమైన నామం
మనకి ఇతిహాసాలలోను,పురాణాలలోను కనపడుతుంది.  మహల్సాపతి
బాబాని  పిలవకముందు నుంచే  సాయి
అన్న పదం మన సనాతన  ధర్మం
నుంచే పుట్టింది.
1838 కి ముందునుంచే
షిరిడీలో మారుతి దేవాలయం ఉన్నదన్న విషయం మనకందరకు తెలుసు.
మారుతి ఉన్నాడంటే అక్కడకు రాములవారు వస్తారన్నదానికి సూచనని మనకందరకు తెలుసు. భవిష్యత్తులో తన స్వామి రాములవారు
షిరిడీని పవిత్రం చేయనున్నారనే విషయం మారుతికి బాగా
తెలుసు. ఆవిధంగా తన స్వామిని షిరిడీలో
పూజించుకోవడానికి అనుకూలంగా ముందే ఏర్పాట్లు చేసుకొన్నాడు
మారుతి. మనమెప్పుడు సాయిని పూజిస్తున్నా, మంత్రాలలో "శివ,రామ,మారుత్యాది
రూపాయనమహ" అని పూజిస్తూ ఉంటాము.
ధులియా
కోర్టులో బాబా వారు చెప్పిన
మాటలను మనమొకసారి గుర్తుకు తెచ్చుకుందాము. "నావయసు లక్షల సంవత్సరాలు. అందరూ
నన్ను సాయి అని పిలుస్తారు.
నా తండ్రిపేరు కూడా సాయే. నాది
భగవంతుని కులం. నాది కబీర్
మతం."
రామాయణంలో
మారుతి  -   రాముడు ఇద్దరి శరీరాలు వేరైనా ఆత్మ ఒక్కటే. మారుతి
తన గుండెలను చీల్చి చూపించినప్పుడు శ్రీరామచంద్రమూర్తి దర్శనమిచ్చారు. 
15వ.
అధ్యాయంలో మన సాయిరాముడు కూడా
ఇదే విషయాన్ని చెప్పారు.  "నా
భక్తులందరి హృదయాలలోను నేను ఉన్నాను.”
ఈ
నాడు సాయి భక్తులు కూడా
సాయిరాం సాయిరాం అని ఆయన నామస్మరణ
చేయడం వల్ల ఎంతో ప్రశాంతతను
పొంది కష్టాలనుండి విముక్తిని పొందుతున్నారు.
త్రేతాయుగంలో
ప్రజలు కూడా శ్రీరామచంద్రుని సామాన్య
మానవునిగానే భావించారు. కాలక్రమేణా ఆయన భగవంతుని అవరారమని,
భగవంతుడే శ్రీరామునిగా అవతరించారని ప్రజలుగ్రహించారు. ఇదే విధంగా షిరిడీలో
ప్రజలందరూ సాయిని ఒక పిచ్చి ఫకీరుగా
భావించారు. బాబా మహాసమాధి చెందినతరువాత
ప్రజలందరికి ఆయన గొప్పతనం తెలిసింది.
ఈనాడు కొన్ని లక్షల మంది ఆయన
భక్తులు ఆయనను భగవంతునిగా ఆరాధిస్తున్నారు.
షిరిడీలోని ఆయన సమాధి మందిరాన్ని
దర్శించి ఆయన  అనుగ్రహానికి
పాత్రులవుతున్నారు.
దశరధ
మహారాజు తనకు పుత్రసంతానం లేదని
ఎప్పుడూ విచారిస్తూ ఉండేవారు.  ఇటువంటి
సంఘటనే   మనకు
శ్రీ సాయి సత్  చరిత్ర  14వ.
అధ్యాయములో కనపడుతుంది. రత్నాజీ షాపూర్ జీ  వాడియా
నాందేడ్ నివాసి. ఆయనకెంతో సిరిసంపదలు, మంచి ఆరోగ్యం ఉన్నాకూడా
పుత్ర సంతానం కలగలేదు . 
రామాయణంలో
ఋష్యశృంగ మహర్షి దశరధుని చేత పుత్రకామేష్టి యాగం
చేయించినారు.  ఆ
యాగ ఫలితం వల్ల దశరధ
మహారాజుకు నలుగురు కుమారులు జన్మించారు.  శ్రీసాయి
సత్ చరిత్రలో బాబా రత్నాజీ షాపూర్
జీవాడియాకు పుత్ర సంతానాన్ని ప్రసాదించారు.
బాల
కాండలో గురువు ఆజ్ఞను గురించి  అత్యంత
ప్రాధాన్యాన్నివ్వవలసిన దాని గురించి ప్రముఖంగా
చెప్పబడింది. యాగ సంరక్షనార్ధం రామ
లక్ష్మణులు అడవిలో విశ్వామిత్ర మహామునిని అనుసరించి, వెడుతున్న సమయంలో విశ్వామిత్ర మునికి తమకెదురుగా ఒక స్త్రీ  రావడం కనపడింది. విశ్వామిత్రులవారు
రామునితో ఆమెను ఒక్క బాణంతో
చంపమని ఆజ్ఞాపించారు. తమకు అపకారం చేయని
ఒక స్త్రీని చంపడం పాపమని రాముడు
మొదట సందేహించాడు. ఒక్క క్షణమాగి, తరువాత
గురువు ఆజ్ఞను పాలించడమే ముఖ్య కర్తవ్యమని తలంచి,
బాణాన్నెక్కుపెట్టి ఒక్క బాణంతొ ఆస్త్రీని
వధించాడు. తరువాత ఆ స్త్రీ తాటకి
అనే రాక్షసి అని తెలుసుకున్నాడు. 
శ్రీరాముడు మరేమీ ప్రశ్నించకుండా తన
గురువు యొక్క ఆజ్ఞను పాలించాడు.
సరిగా
ఇటువంటి సంఘటనే మనకు శ్రీసాయి సత్
చరిత్ర 23వ. అధ్యాయంలో కనపడుతుంది.
ద్వారకామాయిలోకి ఒక మేకను తీసుకుని
వచ్చారు. బాబా కాకాసాహెబ్ దీక్షిత్
ని పిలిచి, అతనికి ఒక కసాయి కత్తినిచ్చి
ఆ మేకను ఒకే వేటుతో చంపమన్నారు.  తనకు
అపకారం చేయని ఆ మేకను ఎట్లా
చంపడమా అని మొదట సందేహించాడు
కాకా సాహెబ్. కొంత సేపు ఆగిన తరువాత గురువు
యొక్క ఆజ్ఞే వేద వాక్యమని
తలచి మేకను చంపడానికి కత్తిని
పైకి ఎత్తినాడు. ఈలోగా సాయినాధులవారు అతనిని
వారించారు. అప్పుడు కాకాసాహెబ్ "మేకను చంపడం తప్పా
ఒప్పా అన్నది నాకనవసరం. గురువు చెప్పిన వాక్యాలే వేదాలకన్నా శక్తివంతమైనవని నాకు తెలుసు. నాకు
గురువు ఆజ్ఞను పాలించడమొక్కటే తెలుసు." అన్నారు.  ఆవిధంగా
నేను రామాయణంలోను, శ్రీ సాయి సత్చిరిత్రలోను
ఉన్న పోలికలను గమనించాను.     
శ్రీరాముడు
సంతోషంగా తన సింహాసనాన్ని
భరతునికి ఇచ్చిన సంఘటన రామాయణంలో వివరంగా
చెప్పబడింది.   ఇటువంటి
సంఘటన మనము  శ్రీ
సాయి సత్చరిత్ర 10వ. అధ్యాయములో చూడగలము.     
ద్వారకామాయిలో
బాబా వద్ద భక్తులంతా చేరి
ఆయన కూర్చోవడానికి మంచి ఆసనం తయారు
చేసి అందులో మెత్తటి  దిండ్లు
అమర్చారు.  ఆయనకు
దండ వేసి ఆ సుందర
మనోహర దృశ్యాన్ని చూసి అందరూ ఆనందించేవారు. నానావలి అనే భక్తుడు వచ్చి
బాబాని ఆ ఆసనం తనదని
చెప్పి బాబా ని లేవమని
చెప్పినపుడు,  శ్రీరాముడు
తన సింహాసనాన్ని
భరతునికి త్యాగం చేసిన విధంగానే బాబా
తన ఆసనాన్ని సంతోషంగా నానావలికి ఇచ్చారు.   
మనము
ఇక్కడ మరొక విషయాన్ని 
తెలుసుకుందాము.  అయోధ్యకాండలో
దానం గురించి ప్రముఖంగా చెప్పబడింది. అరణ్యానికి పయనమవుతున్నపుడు దారిపొడవునా ఉన్న ప్రజలకు శ్రీరాములవారు
తన నగలనన్నిటిని స్వచ్చందంగా దానం చేశారు.  
ఆ సమయములో
ఒక బ్రాహ్మణుడు ముందుకు వచ్చి రాముడితో తనకు
గోవులను దానం చేయమని అడిగాడు.
నీకెన్ని గోవులు కావాలి అని శ్రీరాములవారు అడిగినపుడు
ఆ బ్రాహ్మణుడు   "నేను
నా చేతిలో ఉన్న కఱ్ఱను ఇక్కడినుంచి
విసురుతాను. ఆ కఱ్ఱ ఎంత
దూరమయితే వెళ్ళి పడుతుందో అంత దూరమువరకు వరసలో
నిలబడిన గోవులు కావలెను అన్నాడు" 
శ్రీరాములవారు
ఆ సమయంలో  అయోధ్య
పొలిమేరలు దాటలేదు కనక మంత్రి సుమంతుడిని
పిలిచి యువరాజుగా తన ఆజ్ఞ ప్రకారము
ఆ బ్రాహ్మణుడికి గోవులను దానం చేయమని చెప్పారు.   
1909 - 1918 సంవత్సరాల మధ్య కాలంలో బాబా
తన భక్తుల వద్దనుండి ప్రతీరోజు సుమారు 500 రూపాయలను దక్షిణగా తీసుకొంటు ఉండేవారు.  మరలా
వచ్చిన ఆ డబ్బునంతా తన
భక్తులందరకూ పంచిపెడుతూ ఉండేవారు.  ఈ
రోజుల్లో మనకంతటి  ఉదార
స్వభావం ఎక్కడ ఉంది?  సాయంత్రమయేటప్పటికి ఆయన వద్ద ఏమీ
మిగిలి ఉండేది కాదు.  మరలా
మరునాడు ఉదయాన్నే భిక్షా పాత్ర పట్టుకొని భిక్షకు
బయలుదేరేవారు. మన సాయిరాముడు కూడా
రామాయణంలోని శ్రీరాముడు అరణ్యానికి వెళ్ళేటప్పుడు తన దగ్గిర ఉన్నదంతా
దానం చేసినట్లుగానే బాబా తన భక్తులకు
దానం చేసేవారు. 
జటాయువు, రావణాసురుడు సీతాదేవిని ఎత్తుకువెళ్ళిన విషయాన్ని వివరించి,  రావణుని
ఎదిరించి పోరాడినా సీతాదేవిని రక్షించలేకపోయానని విచారిస్తూ చెప్పాడు. పైగా రావణాసురుడు తనను
గాయపరచడం వల్ల లేవలేక పడి
ఉన్నానని చెప్పాడు.  రావణుడిని
వధించి సీతాదేవిని కాపాడమని జటాయువు శ్రీరాములవారిని కోరాడు. ఇలా చెపుతూ జటాయువు
ఆఖరి శ్వాస తీసుకొన్నాడు.
జటాయువు
చేసిన సేవకు గుర్తుగా శ్రీరాములవారు
అడవినుంచి ఎండుకట్టెలను  తీసుకునివచ్చి
జటాయువుయొక్క అంత్యక్రియలు నిర్వహించారు. శ్రీరాములవారు తనతండ్రికి అంత్యక్రియలు నిర్వహించలేకపోయినా, తన తండ్రికి ప్రాణస్నేహితుడైన
జటాయువుకు నిర్వహించారు.
ఇటువంటి
సంఘటనే మనకు శ్రీ సాయి
సత్చరిత్ర 31వ. అధ్యాయములో కనపడుతుంది.
మేఘుడు బాబాకు అంకిత భక్తుడు. 35 సంవత్సరాల
చిన్నవయసులోనే మరణించాడు.  బాబా
మేఘుని వద్ద కూర్చొని చిన్న
పిల్లవానిలా రోదించారు. అంత్యక్రియలకు శ్మశాన వాటిక వరకు నడిచి
వెళ్ళారు.  తన
స్వంత ఖర్చుతో ఆఖరి రోజున బ్రాహ్మణులకు,
బీదవారికి అన్నదానం చేశారు. ఈ సంఘటన నాకు
జటాయువు మరణ సమయమలో రామాయణంలోని
శ్రీరాముని పాత్రను గుర్తుకు తెచ్చింది.
రామాయణంలోని
పంపా నది ఒడ్డుకు వెళ్ళి
శబరి కధ గురించి గుర్తుకు
తెచ్చుకొందాము. శబరి శ్రీరాములవారికి పండ్లను
సమర్పించేముందు, తాను ముందుగా కొంచెం
కొరికి వాటి రుచి చూసి
మరీ అర్పించింది. ఈ సంఘటన మనకు
భగవంతుని దృష్టిలో అందరూ సమానమే అని
భగవంతుడు భక్తికి కట్టుబడి ఉంటాడనే  విషయాన్ని
ఋజువు చేస్తుంది.  
శ్రీ
సాయిసత్ చరిత్రలో కూడా మనకి ఇటువంటి
దృష్టాంతమే కనపడుతుంది. శ్రీరామనవమి నాడు భక్తులంతా బాబా
దర్శనానికి వరుసలో నిలబడి ఉన్నారు. మధ్యాహ్నము ఒక ముసలి స్త్రీ
బాబా కు సమర్పిoచడానికి
మూడు చపాతీలను తీసుకొని ద్వారకామాయికి వచ్చింది.  ఆమెనెవరూ
పట్టించుకోలేదు.  తను
బాబాని కలుసుకోగలనా లేదా అని సందేహం
వచ్చింది ఆమెకు.  బాబాకు
సమర్పించడానికి తెచ్చిన మూడు చపాతీలలో ఒక
చపాతీ ఆకలి వేసి ఆమె
ఆరగించింది.
మిగిలిన
చపాతీలను తినడానికి ముందే, ఆమె గురించి చెప్పి
తన వద్దకు తీసుకుని రమ్మనమని శ్యామాను పంపించారు బాబా. శ్యామా ఆమె
వద్దకు వెళ్ళి స్వయంగా బాబా వద్దకు తీసుకొని
వెళ్ళాడు.  బాబా
ఆమెను తనకు చపాతీలను పెట్టమని
అడిగారు. తాను అప్పటికె సగం
తినేసానని చెప్పింది. మిగిలినవాటిని ఇమ్మని చెప్పి వాటిని ఆనందంగా ఆరగించారు బాబా. ఈ సంఘటన
నాకు రామాయణంలోని శబరి తాను రుచి
చూసిన పండ్లను శ్రీరాములవారికి అర్పించిన సన్నివేశాన్ని గుర్తుకు తెచ్చింది. 
సమాజ
శ్రేయస్సు కోరి శ్రీరామ చంద్రులవారు ఒక చిన్న అసత్యమును
పలికినారు.
శ్రీరామ
చంద్రులవారు సీతాదేవితో అడవులకు బయలుదేరినప్పుడు దశరధ మహారాజు తన
మంత్రి సుమంతుడుని పిలిచి "రాముడు సామాన్య మానవునిగా అడవులకు వెడుతున్నాడు. అతనిని వెంటనే వెనుకకు తిరిగి రమ్మని, ఇది రాజాజ్ఞగా చెప్పు"
అన్నారు. పుతృడిమీద ఉన్న ప్రేమ దశరధుణ్ణి
గుడ్డివానిని చేసింది.  రాజుగా
తాను ఇచ్చిన ఆజ్ఞను రాముడు పాలిస్తాడనుకున్నారు. సుమంతుడు రాములవారికి దశరధ మహారాజువారి ఉత్తర్వులను
తెలియచేశాడు. శ్రీరామ చంద్రులవారు సంధిగ్ధంలో పడ్డారు. అయన ఆజ్ఞ ప్రకారం
వెనుకకు మరలితే ప్రజలందరూ, దశరధ మహారాజు పుత్ర
వాత్సల్యం చేత కైకేయికిచ్చిన మాట
తప్పినాడని విమర్శిస్తారు.  
శ్రీరామ
చంద్రులవారు సుమంతుడితో "నువ్వు చెప్పినమాటలు నాకు వినపడినవి. కాని,
రధం చాలా వేగంగా వెడుతున్నందువల్ల
నువ్వు చెప్పిన మాటలు నాకు వినపడలేదని,
విషయం పూర్తిగా వినేలోగానే రధం అయోధ్య పొలిమేరలు
దాటి వెళ్ళిపోయిందని మహారాజుకు చెప్పు. సమాజ క్షేమం  కోసం ఈ ఒక్క
అబధ్ధం చెప్పు." అంటు శ్రీరామ చంద్రులవారు
ముందుకు సాగిపోయారు. రావణుడిని అంతమొందించడానికి భగవంతుడే శ్రీరామునిగా అవనిపై అవతరించారు. ఒక్కడుగు వెనుకకు వేస్తే తన అవతార కార్యానికి
భంగం కలుగుతుంది. తగిన కారణం ఉండటం
వల్లే శ్రీరామ చంద్రులవారు తమ జీవితంలో  ఒకే ఒక్కసారి అసత్యము
పలికారు. 
తగిన
కారణంతో శ్రీసాయి అసత్యం పలకడం  మనకు
శ్రీ సాయి సత్ చరిత్రలోని
7వ.అధ్యాయంలో కనపడుతుంది. రామదాసి అనే భక్తుడు రోజుకు
నాలుగు సార్లు విష్ణుసహస్ర నామాన్ని చదువుతూ ఉండేవాడు. అప్పటికే అతనికి విష్ణుసహస్ర నామం  కంఠతా
వచ్చేసింది. బాబా తనకు కడుపునొప్పిగా
ఉన్నదని అసత్యమాడి, రామదాసిని సోనాముఖి ఆకులను తెమ్మని బజారుకు పంపి, రామదాసి చదువుతున్న
విష్ణుసహస్రనామం పుస్తకాన్ని శ్యామాకు బహుకరించారు
శ్రీరామచంద్రులవారు
రాజ్యాన్ని త్యజించి అడవులకు వెళ్ళారు. ప్రీతిపాత్రుడయిన రాముని యొక్క వియోగాన్ని భరించలేక
దశరధ మహారాజు స్వర్గస్తులయారు .
తాను
లేని సమయంలో తల్లి మూర్ఖత్వం వల్ల
ఇటువంటి విపరీత పరిణామాలన్ని జరిగడంతో భరతుడు చాలా దుఖించాడు. అరణ్యానికి
వెళ్ళి రాములవారిని ఒప్పించి తిరిగి రాజ్యానికి తీసుకుని వచ్చి పరిపాలనా బాధ్యతలను
రామునికి అప్పగిద్దామనుకున్నాడు. శ్రీరామచంద్రులవారు తనకు బదులుగా తన
పాదుకలను అయోధ్యకు తీసుకొనివెళ్ళి సిం హాసనం మీద
పెట్టి పరిపాలనా బాధ్యతలను నిర్వహించమని భరతుడిని ఒప్పించారు.  దీనివల్ల
రామాయణంలో పాదుకలకు ఇవ్వబడిన ప్రాముఖ్యత మనకు అర్ధమవుతుంది. భరతుడు
తన శిరస్సుపై పాదుకలను పెట్టుకొని అయోధ్యకు తీసుకొని వచ్చారు. అయోధ్యకు చేరిన తరువాత, పాదుకలను
సింహాసనం మీద పెట్టి భరతుడు
శ్రీరాములవారి తరఫున పరిపాలనా బాధ్యతలను
చేపట్టారు.
శ్రీ
సాయి సత్ చరిత్ర 5వ.
అధ్యాయములో మనకు ఇటువంటివే కనపడతాయి.  
బాబా
షిరిడీలో ప్రవేశించిన దానికి అనుగుణంగా బాయి కృష్ణజీ, దీక్షిత్
లు బాబా పాదుకలను షిరిడీకి
తీసుకొనివచ్చి వేప చెట్టుక్రింద ప్రతిష్టించారు.
పాలరాతి
పాదుకలను వారు ఉపాసనీ మహారాజుగారి
చేత ప్రతిష్టించ దలచి ఆయనను ఆహ్వానించారు.  ఉపాసనీ
మహరాజు పాదుకలను 1912 వ సంవత్సరములో 
శ్రావణ పూర్ణిమ రోజున వేపచెట్టు క్రింద ప్రతిష్టించి
దానికి "గురుస్థాన్" అని పేరు పెట్టారు.
బాబా
అక్కడకు వచ్చి "ఇవి భగవంతుని పాదుకలు"
అన్నారు.  
బాబా
ఎప్పుడూ వాటిని  తన
పాదుకలు అని చెప్పుకోలేదు. 
"ఈ భగవంతుని పాదుకలను పూజించండి. గురు శుక్రవారములలో ఈ
పాదుకలకు అగరుబత్తీలను, సాంబ్రాణి ధూపం వేసినచో భగవంతుని
అనుగ్రహమును పొందగలరు" అని బాబా చెప్పారు.
దీనిని బట్టి  పాదుకలకు
మనము ఎంతటి ప్రాముఖ్యాన్నివ్వాలో అటు రామాయణం
ద్వారా, ఇటు సాయి సత్చరిత్ర
ద్వారా గ్రహించగలము.    
సాధు
సత్పురుషులు తమ ఆఖరి క్షణాలలో
మహా సమాధి అయేముందు రామవిజయాన్ని
వింటారు. శ్రీరామచంద్రులవారి అవతార పరిసమాప్తి అయేముందే
రామవిజయం యొక్క ప్రస్తావన వస్తుంది.
శ్రీరాములవారికి మరణం లేదు. బాబా
మహా సమాధి అయే సమయములో
తన భక్తుడయిన వాఝే చేత రామ
విజయాన్ని చదివించుకోవడానికి బహుశా ఇదే కారణమయి
ఉంటుంది.
(సర్వం
శ్రీ సాయినాధార్పణమస్తు)









0 comments:
Post a Comment