21.06.2012 గురువారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయి.బా.ని.స. డైరీ - 1998 (10)
15.07.1998
నిన్నరాత్రి శ్రీసాయి ఒక ఫకీరు రూపములో దర్శనము ఇచ్చి అన్న మాటలు.
1) సముద్రములో పడవలో ప్రయాణము చేస్తున్నపుడు సముద్రపు అలలలకు పడవకూడ ఊగుతూ ఉంటుంది.
అటువంటి పరిస్థితిలో ఆందోళన చెదటములో అర్ధము లేదు. నీవు పడవయొక్క తెరచాపను సరిదిద్దుకొని, చుక్కానిని సరిగా పట్టుకొని ప్రయాణములో ముందుకు సాగిపోవాలి.
2) నీకు కావలసినవారు అనారోగ్యముతో బాధ పడుతు ఉంటే నీవు వారి బాధను చూడలేవు. ఒకవేళ చూసిన ఏమి చేయలేవు. అందుచేత అటువంటి పరిస్థితులకు రాజీపడి జీవించటము ఉత్తమము.
3) నీవు నేలమీద ప్రయాణము చేస్తున్న, నీటిపైన ప్రయాణము చేస్తున్న, గాలిలో ప్రయాణము చేస్తున్న, నేను సదా నీవెంటనే యుండి నీకు ధైర్యాన్ని ప్రసాదించుతాను.
4) భగవంతుని అనుగ్రహము అనే మిఠాయిని నీకు ఇవ్వడానికి నాదుకాణము సదా తెరచి యుంటుంది. నీవు వచ్చి ఆమిఠాయిని తీసుకొని వెళ్ళు.
16.07.1998
నిన్నరాత్రి శ్రీసాయి ఒక సన్యాసి రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు.
1) ఈనాడు కొందరు భగవంతునికన్న మానవుడు రచించిన శాస్త్రాలు, విజ్ఞాన రంగములోని నూతన ఆవిష్కరణలు గొప్పవి అని చెబుతు భగవంతుని ఉనికిని కించపరుచుతున్నారు.
నీవు అటువంటివారినుండి దూరముగా జీవించు.
2) ఆధ్యాత్మిక రంగములో ఇద్దరి ఆలోచనలు ఎప్పుడు కలవవు. ఆధ్యాత్మికము అనేది ప్రతి వ్యక్తి అతని నమ్మకముతో అభివృధ్ధి చేసుకోవాలి. అంతేగాని తోటివారితో పోల్చుకోరాదు.
3) హిమాలయ పర్వతాలలోని మంచుకు వాతావరణములోని వేడి తగిలిన ఆమంచు నీరుగా మారిపోతుంది.
అలాగే ఎంతటి గొప్పవ్యక్తికి అయిన అహంకారము రాగానే అతనికి పతనము ప్రారంభము అగుతుంది.
4) గంగానది పవిత్రమైనది. ఆనదిలో పడవ ప్రయాణము చేసి ఆఖరికి సాగరములో కలసిపో.
నీప్రయాణము ప్రశాంతముగా సాగిపోవాలి అంటే నీలోని అరిషడ్ వర్గాలను వదిలించుకో.
20.07.1998
నిన్నరాత్రి శ్రీసాయి ఒక ఫకీరు రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు.
1) నేటి రోజున నీవు చేసే మంచి పనులుగాని చెడుపనులు గాని భవిష్యత్ లో గుర్తులుగా మిగిలిపోతాయి. అందుచేత మంచి భవిష్యత్ కోసము ఈరోజున మంచిపనులు చేయి.
2) నీలో పశ్చాత్తాపము కలగగానే నీవు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తము జరిగిపోతుంది. అపుడు ఆపాపము నిన్ను ఏమీ చేయలేదు. కాని, ఆపాపపు చిహ్నాలు సదా అటువంటి పాపాలను చేయవద్దు అని హెచ్చరించుతు ఉంటాయి.
3) మానసికముగాను , శారీరకముగాను నాసేవ చేసుకొనేవారికి నేను దాసుడిని. నేను ఎల్లపుడు వారితోనే యుంటాను.
4) నాతత్వప్రచారము చేస్తు నీవు నీఆఖరి శ్వాస తీసుకొంటావు. నేను నీశరీరాన్ని పంచభూతాలలో కలపడానికి కావలసిన ఎండు కట్టెలు సమకూర్చుతాను.
(ఇంకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు
0 comments:
Post a Comment