03.01.2016 ఆదివారం
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయ్ బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు శ్రీ జీ.ఎస్.ఖపర్డే గారి డైరీలోని మరికొన్ని విషయాలు తెలుసుకుందాము.
30.12.1911 శనివారమ్
షిరిడీ
ఉదయం ప్రార్ధన
చేసుకున్న తరువాత నేను రెండు నెలల వరకు రాకపోవచ్చని రెండు ఉత్తరాలు ఒకటి మా అబ్బాయి
బాబాకి ఇంకొకటి భావు దుర్రానీకి వ్రాశాను.
నటేకర్ రాధాకృష్ణమాయి ఇంటికి వెళ్ళాడు.
ఆమె ఇంటిలో లేనట్లుగా ఉంది.
అతడు అక్కడే కూర్చుని ప్రశాంతంగా రోజంతా అక్కడే గడిపాడు. ఉదయం నేను రామాయణం చదువుకుని మధాహ్నం భాగవతం విన్నాను. ఇక సుర్యాస్తమయానికి కాస్త ముందుగా సాయి మహరాజ్ దగ్గరకు వెళ్ళాను. ఆయన నన్నెంతో సాదరంగా పేరుపెట్టి పిలిచారు. ఆయన ఓర్పు యొక్క గొప్పతనం దాని ప్రభావం గురించి చిన్న కధ చెప్పారు.
అతడు అక్కడే కూర్చుని ప్రశాంతంగా రోజంతా అక్కడే గడిపాడు. ఉదయం నేను రామాయణం చదువుకుని మధాహ్నం భాగవతం విన్నాను. ఇక సుర్యాస్తమయానికి కాస్త ముందుగా సాయి మహరాజ్ దగ్గరకు వెళ్ళాను. ఆయన నన్నెంతో సాదరంగా పేరుపెట్టి పిలిచారు. ఆయన ఓర్పు యొక్క గొప్పతనం దాని ప్రభావం గురించి చిన్న కధ చెప్పారు.
ఒకసారి ఆయన సంచారం చేస్తూ ఔరంగాబాద్ వెళ్ళారట. అక్కడ మసీదులో
ఒక ఫకీరు కూర్చుని ఉన్నాడట. మసీదుకు దగ్గరలో
బాగా పొడవయిన చింత చెట్టు ఉన్నదట. ఆ ఫకీరు
ముందర తనను మసీదులోకి అడుగు పెట్టనివ్వలేదని, తరువాత అక్కడ ఉండటానికి సమ్మతించాడని
చెప్పారు. ఆ ఫకీరుకు ప్రతిరోజు మధ్యాహ్నం ఒక
ముదుసలి స్త్రీ ఇచ్చే రొట్టి ముక్కే ఆధారం.
సాయిమహరాజ్ తమంత
తాముగా భిక్షాటన చేసి ఆ ఫకీరుకు సరిపడా ఆహారం తెచ్చి 12 సంవత్సరాలు పోషించిన తరువాత అక్కడినుండి
వెళ్ళిపోదామనుకున్నారట. అపుడా వృధ్ధ ఫకీరు
కన్నీరు కారుస్తూ ఉంటే, మృదువయిన మాటలతో ఓదార్చవలసి వచ్చిందట. నాలుగు సంవత్సరాల తరువాత సాయి మహరాజ్ మళ్ళీ ఆయనను
చూడటానికి వెడితే బాగానే ఉన్నాడట. ఆ ఫకీరు
కొద్ది సంవత్సరాల తరువాత ఇక్కడికి వచ్చి చావడిలో ఉన్నాడట. మోతా-బాబా ఫకీర్ ఆయన బాగోగులు చూసుకున్నాడట. ఆయన చెప్పినదానిని బట్టి నేను గ్రహించుకున్నదేమిటంటే
– సాయి మహరాజ్ 12 సంవత్సరాలపాటు ఉండి ఔరంగాబాద్ ఫకీరును ఆధ్యాత్మిక స్థాయిలో పరిపూర్ణుడిని
చేశారని. రాత్రి భీష్మ భజన, దీక్షిత్ రామాయణం
కార్యక్రమాలు జరిగాయి. అప్పుడే వచ్ఛిన నటేకర్
తను కూడా ఒక అధ్యాయం చదివాడు.
31.12.1911 ఆదివారమ్
షిరిడీ
ఉదయం పెందరాడే
నిద్రలేచాను. ప్రార్ధన చేసుకుని వరండాలో తిరుగుతూ
ఉండగా హంస క్రిందకి దిగి వచ్చాడు. తనకు రాత్రి
నిద్ర పట్టకపోవడంతో, బయటకు వచ్చి తిరుగుతూ ఖండోబా ఆలయానికి వెళ్ళి, తరువాత రాధాకృష్ణ మాయి ఇంటిలో నుండి ఆమె చేసే ప్రార్ధనలు విందామని వెళ్ళినట్లు చెప్పాడు. కాని ఇంటిలో ఎవరూ ఉన్న జాడ లేదని చెప్పాడు. అందుచేత గ్రామ సరిహద్దు వరకూ వెళ్ళి, తరువాత మరలా
రాధాకృష్ణ మాయి ఇంటికి వెళ్ళానని చెప్పాడు.
ఆమె దయతో అతనికి సహాయం చేసింది. అతను
స్నానం చేసి, ప్రార్ధన చేసుకున్న తరువాత సాయి మహరాజ్ ఆమెకు పంపించిన ప్రసాదంలో కొంత తిన్నాడట. నేనతినితో మాట్లాడుతూ నుంచున్నాను. వెళ్ళొస్తానని చెప్పడానికి మరలా రాధాకృష్ణ మాయి
ఇంటికి వెళ్ళినపుడు ఆమె అతనికి ఒక ధోవతి, చొక్కా ప్రసాదంగా ఇచ్చిందట.
అతను తనతో ఉన్న
ముగ్గురు యువకులతో బొంబాయికి తిరిగి వెళ్ళాడు.
వారిలో ఒకతని పేరు రేగే. వీటి వల్ల
నాకు ప్రతీ పని ఆలస్యమయింది. ఆ తరువాత క్షురకుని
వల్ల మరింత ఆలస్యమయింది. సాయిబాబా బయటకు వెడుతుండగా
చూశాను గాని, ఆయన తన వద్దకు ఎవ్వరినీ రానివ్వలేదు.
దగ్గరగా వచ్చి నమస్కారం చేయనివ్వలేదు.
ఆ తరువాత నేను మధ్యాహ్న పూజ కోసం మసీదుకు వెళ్ళి కూర్చున్నాను. ఆరతి సమయంలో
మసీదంతా ఆడవారి కోసం వదలడంతో, మగవారంతా వేదిక క్రింద ఆరుబయట నిలబడవలసి వచ్చింది. ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయి. తిరిగి వచ్చిన తరువాత ఇక్కడకు వచ్చిన కోపర్ గావ్
మామలతదారు వస్తే అతనితో మాట్లాడుతూ కూర్చున్నాను.
తరువాత దహను మామలతదారు దేవ్ వచ్చాడు.
ఆరతికి ముందు నానాసాహెబ్ చందోర్కర్ వచ్చాడు. ఉదయం భోజనం యధాప్రకారంగా మధ్యాహ్నం రెండు గంటలకు
అయింది. ఆ తరువాత ఈ రోజు వచ్చిన వార్తా పత్రికలు
చదువుతూ కూర్చున్నాను. కాంగ్రెస్ కూటమి సంపూర్ణ
విజయం సాధించేలా కనపట్టల్లేదు. సాయంత్రం మసీదుకు
వెళ్ళాను. కాని సాయి మహరాజ్ వెంటనే ఊదీ ఇచ్చేశారు.
క్రొత్త భవనం పునాది మీద కూర్చుని గోవర్ధన్ దాస్ తో ఉన్న గుజరాతీ శాస్త్రితో మాట్లాడుతూ ఉన్నాను. సాయంత్రం ఎప్పటిలాగే వ్యాహ్యాళికి వెడుతున్న సాయిమహరాజ్ కు నమస్కరించాము. ఆ తరువాత శేజ్ ఆరతి సమయంలో కూడా దర్శించుకున్నాము. ఆ తరుఆత భీష్మ భజన, దీక్షిత్ రామాయణం జరిగాయి.
క్రొత్త భవనం పునాది మీద కూర్చుని గోవర్ధన్ దాస్ తో ఉన్న గుజరాతీ శాస్త్రితో మాట్లాడుతూ ఉన్నాను. సాయంత్రం ఎప్పటిలాగే వ్యాహ్యాళికి వెడుతున్న సాయిమహరాజ్ కు నమస్కరించాము. ఆ తరువాత శేజ్ ఆరతి సమయంలో కూడా దర్శించుకున్నాము. ఆ తరుఆత భీష్మ భజన, దీక్షిత్ రామాయణం జరిగాయి.
(తరువాతి విషయాలు తరువాతి సంచికలో)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment