10.04.2022 ఆదివారమ్
ఓమ్
సాయి శ్రీ సాయి జయజయ సాయి
శ్రీ
మాత్రే నమః
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీరామనవమి
శుభాకాంక్షలు
శ్రీ
సాయి దయా సాగరమ్ 8 వ, భాగమ్
అధ్యాయమ్
- 3
మరాఠీ
మూలగ్రంధ రచయిత్రి --- శ్రీమతి ఉజ్వలా బోర్కర్, విలేపార్లే - ముంబాయి
ఆంగ్లానువాదమ్
--- శ్రీ ఉదయ్ అంబాదాస్ బక్షి
తెలుగు
అనువాదమ్ --- ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట,
హైదరాబాద్
శ్రీ
సాయి విశ్వవిద్యాలయమ్ – 2
ఇంటిలో
ఊరికే కూర్చుని హాయిగా కాలం గడిపినంత మాత్రాన నువ్వు సాయికి నిజమయిన భక్తుడివి కాలేవు. బాబా నీకు సూచించిన ప్రకారం కష్టపడి పనిచేయాలి. మొట్టమొదటగా చేయవలసినది నీలో ఉన్న అహంకారాన్ని తొలగించుకోవాలి. ప్రతివారి ఎడల మర్యాదగాను, దయతోను ఏవిధంగా ప్రవర్తించాలో
నేర్చుకోవాలి.
ఈ విశ్వవిద్యాలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే 24 గంటలూ ఇది తెరిచే ఉంటుంది. విద్యార్ధులందరూ బాగా శ్రమించి 24 గంటలూ కష్టపడి చదవాలి. మీ ఇంటివద్ద కూడా చదువుకుంటూ పరీక్షకు తయారవవచ్చు. విద్యార్ధికి కావలసినది నిజాయితీ, నమ్మకం.; అదృష్టవంతుడయిన విద్యార్ధికి ఈ విశ్వవిద్యాలయంలో ప్రవేశం దొరుకుతుంది. విద్యార్ధి తనలో ఉన్న అహంకారాన్ని స్వార్ధాని, పొగరుమోతు తనాన్ని వదిలించుకోవాలి.
త్యాగం గురించి తెలిసున్నవారికే అర్ధత లభిస్తుంది. కాకాసాహెబ్ దీక్షిత్ పరీక్షకు తయారయి అందులో ఉతీర్ణుడయ్యాడు. బంగారాన్ని కూడా శుధ్ధి చేయాలంటే పుటం వేయాల్సిందే. కాకా సాహెబ్ బ్రాహ్మణుడయినప్పటికీ బాబా ఆజ్ఞాపించగానే మేకను కూడా నరకడానికి సిధ్ధమయ్యాడు..
గురువాజ్ఞను ఎవరయినా శిరసా వహించవలసిందే. నువ్వు కష్టపడి శ్రమిస్తేనే అపరిమితమయిన శక్తి నీకు లభిస్తుంది. నీ సామర్ధ్యాన్ని బట్టి నువ్వు విజయం సాధిస్తావు. నీ నేపధ్యం ఏమిటి? ఎక్కడినుండి వచ్చావన్నదాని గురించి ఇక్కడ అనవసరం. ఈ విశ్వవిద్యాలయంలో ప్రతివారికి ఆదరణ లభిస్ల్తుంది.
శ్రీ కృష్ణపరమాత్ములవారికి కూడా ఋషి గురువు. శ్రీ కృష్ణుడు కూడా తన గురువు గారి ఆశ్రమంలో సేవ చేసాడు. అడవికి వెళ్ళి తన గురువు కోసం కట్టెపుల్లలను సేకరించి తెచ్చేవాడు. నువ్వు ఒకరి కోసం పనిచేసినపుడు అంతర్గతంగా నీలో ఎంతో ఆనందం కలుగుతుంది.
అది
మాటలలో వివరించలేని విధంగా ఉంటుంది. లక్షలు
ఖర్చుపెట్టినా దొరకని ప్రశాంతత నీకు ఈ విశ్వవిద్యాలయంలో లభిస్తుంది. కులగురు (శ్రీసాయి) ఎంతో జ్ణానమూర్తి. ఆయన తన విద్యార్ధులను చక్కగా గుర్తించగలరు. బాబా ఏమంటారంటే “నేను షిరిడీలో ఉన్ననూ, మీరు సముద్రాలవతల
ఉన్నా సరే అక్కడ ఏమి జరుగుతున్నదో నాకంతా తెలుసును. సుఖదుఃఖాలనేవి గత జన్మలో చేసుకున్న పాపపుణ్యాల ఫలితంగానే
మానవుడు అనుభవిస్తాడు. దానినుండి ఎవరూ తప్పించుకోలేరు.” ఈ విశ్వవిద్యాలయంలో బాపూసాహెబ్ బూటీ కూడా ఒక విద్యార్ధే. మన సాయిబాబా నివసిస్తున్న వాడా, బూటీ తన స్వంత వాడాను
బాబాకు సమర్పించినదే. ఎవరయినా షిరిడీలోకి ప్రవేశించినంతనే
వారి సమస్యలన్నీ మటుమాయమయిపోవుననీ, తన సమాధిని దర్శించుకున్నంతనే దుఃఖపరిహారమయి వారి
జీవితము సుఖవంతమగునని బాబా చెప్పారు. జీవితంలో
విజయాన్ని సాధించాలనుకున్నవారు ఈ విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొందాలి. నావద్దకు వచ్చి తృప్తిపడకుండా వెళ్లని ఒక్క వ్యక్తిని
చూపించు అనేవారు బాబా. ఈ విశ్వవిద్యాలయాన్ని
స్థాపించిన ధబోల్కర్ కూడా మొట్టమొదట్లో బాబాని గురువుగా అంగీకరించలేదు. కారణం అతను ఉన్నత విద్యావంతుడు. ధబోల్కర్ సంతృప్తి చెందకపోతే ఆయన ఎవరినీ తన గురువుగా
అంగీకరించడు, నమ్మడు. దీక్షిత్, భాటే, చందోర్కర్
ఆయనను ఒప్పించడానికి ఎంతగానో ప్రయత్నించారు.
కాని ఆయన తను నమ్మిన సిధ్ధాంతానికే కట్టుబడి ఉన్నారు.
ఒకసారి
ధబోల్కర్ సాయిబాబా తిరగలి విసరుతూ ఉండటం చూసారు.
ఈ తిరగలి శ్రధ్ధ, సబూరి గురించి తెలియజేస్తుంది. తిరగలి పిడి ఒక సరియైన లక్ష్యాన్ని సూచిస్తుంది. అది ధబోల్కర్ కి ఒక సూచన. ఆయన చీకటిలో జ్యోతిని దర్శించారు.
ఒక్క
క్షణం తరువాత ధబోల్కర్ బాబాతో “బాబా మీరు అసలు సిసలయిన వజ్రం. ఆభరణాలతో వెలకట్టలేని విధంగా మీ చరిత్రను వ్రాయ
సంకల్పించాను. దయచేసి అనుమతిని ప్రసాదించండి”
అని ప్రార్ధించారు. బాబా తన హస్తాన్ని ధబోల్కర్
శిరసుపై ఉంచి, ఆశీర్వదించి తన చరిత్రను రచించడానికి అనుమతించారు.
సాయిబాబా
(కులగురు) ఆశీర్వాదాలతో ఉపాసనీ బాబా తన కార్యాన్ని
కొనసాగించాడు.
సాకోరీలో
ఉపాసనీ బాబా ఆశ్రమం ఉంది. ఆశ్రమంలోని స్త్రీలకు ఉపసనీ వేదాలను నేర్పించాడు.
జీవితంలో
ధన సంపాదనే ముఖ్యం కాదని నా స్వీయానుభవం. ఒకవేళ
అదే ముఖ్యమయినట్లయితే ఆవిధంగా సంపాదించిన ధనాన్ని ప్రజల సేవకోసం ఖర్చు చేయాలి.
ఒకసారి
నేను, నాభర్త బాలకృష్ణ బోర్కర్ ఇద్దరం కలిసి కజ్రత్ లో ఉన్న మా పొలానికి వెడుతున్నాము. దారిలో మేమిద్దరం మా భవిష్యత్తు గురించి మాట్లాడుకుంటు
వృధ్ధాప్యంలో అదుకునేందుకు కొంత ధనాన్ని నిలవ చేయడం అవసరమని భావించాము. మేము మా పొలానికి వెళ్లగానే అక్కడ మా ఇంటిలోకి వెళ్ళి
పాలు ఫ్రిజ్ లో పెడదామని ఫ్రిజ్ తెరిచాను.
తెరచిన వెంటనే నాకు కరెంటు షాక్ కొట్టింది. ఎంత గట్టిగా కొట్టిందంటే నేను చావు అంచుల దాకా వెళ్ళాను. నా భర్త రబ్బరు చెప్పులు వేసుకున్నందువల్ల నన్ను
దూరంగా నెట్టివేయడానికి ప్రయత్నించారు. ఆయన
నెట్టివేయడం వల్ల నేను దూరంగా వెళ్ళి పడ్డాను.
బాబా నాకు మరికొంతకాలంపాటు జీవితాన్ని ప్రసాదించారని ఆరోజున నేను గ్రహించుకున్నాను.
బాబా
నాకు నేర్పిన పాఠం ఏమిటంటే నువ్వు నా భక్తురాలివి. అందుచేత నువ్వు నీ భవిష్యత్తు గురించి ఎటువంటి ఆందోళన
చెందనవసరం లేదు. నీ యోగ్ల క్షేమాలు చూడటానికి
నేను ఉన్నాను.
నీ
విధిని నువ్వు నిర్వర్తించు. ఫలితాన్ని ఆశించకు. ఫలితాలు నే వెనుకనే వస్తాయి.
“కర్మణ్యేవాధి
కారస్తే మా ఫలేషు కదాచన
మా
కర్మ ఫలహేతుర్భూర్మాతే సంగోస్త్వ కర్మణీ”
ఇది
భగవద్గీతలో సుప్రసిధ్ధమయిన శ్లోకం
కులగురు
నాకు మార్గదర్శిగా ఉండి నాకు మార్గాన్ని చూపిస్తారు.
శ్రీమతి
ఉజ్వలా తాయి బోర్కర్
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment