05.05.2012 శనివారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
నెట్ కన్నెక్షన్ సమస్య వల్ల పరచుర్ణకు అంతరయాం కలుగుతోంది.
ఈ రోజు సాయి.బా.ని.స. డైరీ - 1996 2వ. భావాన్ని చదువుకుందాము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
నెట్ కన్నెక్షన్ సమస్య వల్ల పరచుర్ణకు అంతరయాం కలుగుతోంది.
ఈ రోజు సాయి.బా.ని.స. డైరీ - 1996 2వ. భావాన్ని చదువుకుందాము
సాయి.బా.ని.స. డైరీ
- 1996
(02)
30.05.1996
శ్రీ సాయి రాత్రి
కలలో ఒక
అజ్ఞత వ్యక్తిగా
దర్శనము యిచ్చి
మాట్లాడిన మాట్లు.
1) నీ భవిష్యత్ జీవితములో
నీకు స్వదేశము,
విదేశములలో సాయి బంధువులతో పరిచయాలు ఏర్పడుతాయి. ఆపరిచయాలను
పరిమితముగానే యుంచుకొని జీవించు.
2) నేడు దేశములోని రాజకీయాలలో
నీతి నిజాయతి
లేవు.
నీవు రాజకీయాలకు దూరంగా జీవించు.
3) నీ పిల్లలు నీకు
సేవ చేయలేదు
అని భావించకు,
వారిని సుఖ
సంతోషాలతో జీవించని.
01.06.1996
నిన్న రాత్రి శ్రీసాయి
అజ్ఞాత వ్యక్తి
రూపములో దర్శనము
యిచ్చి - ప్రశాంతముగ జీవించు అని ఆశీర్వదించి
ఈ సలహాలను
యిచ్చినారు.
1) విందులకు వినోదాలకు దూరంగా
జీవించు.
2) ఎదుటివానిని పాముకంటితో చూడవద్దు.
3) కోరికలు అనే ఎలుగుబంటి
మీద స్వారి
చేస్తే ఊరిలోని
కుక్కలు ఎలుగుబంటిని
తరిమి కొట్టి
నీజీవితాన్ని తలక్రిందు చేస్తాయి.
4) నీ ఆఫీసు జీవితము
పరవళ్ళు తొక్కుతున్న
నదిలాగ యున్నది. ఆనది
గుండా నీ
జీపును నేను
జాగ్రత్తగా నడుపుతాను, నిన్ను తిరిగి రోడ్డు
మీదకు తెస్తాను.
5) నీ అనారోగ్యము విషయములో
డాక్టర్స్ యింకా కొన్ని పరీక్షలు చేయాలి. అంత వరకు ఓరిమితో
ఉండు.
6) దైనందిక జీవితములో నీ
భార్యతో గొడవలు
పడవద్దు.
03.06.1996
రాత్రి కలలో శ్రీసాయి
ఒక ఫకీరు
రూపములో దర్శనము
యిచ్చి అన్న
మాటలు.
1) నీవు గొప్పవారితో స్నేహము
చేసిన తప్పులేదు. కాని
వారినుండి ఏమీ ఆశించకు.
2) జీవిత పోరాటములో మహాభారతములోని
అభిమన్య కుమారుడిని
ఆదర్శముగా తీసుకొని పోరాటము సాగించు, అపుడు
నీకు మరణము
అంటే భయము
ఉండదు.
3) పిల్లలను పెంచి పెద్ద
చేసినావు. మరి వారిని వారి జీవితములో
ప్రశాంతముగా జీవించని. వారు నీనుండి దూరముగా
యున్న బాధ
పడకు.
4) నీ ఆరోగ్యము కోసము,
ప్రశాంత జీవితము
కోసము నీవు
నానుండి నాలుగు
అరటిపళ్ళు స్వీకరించినావు. మరి నాకు
రూ.6/- దక్షిణగా
సమర్పించుకో (అరిషడ్వర్గాలు వదలించుకో)
5. నీవు త్వరలో "సబ్
కా మాలిక్
ఏక్ దే"
అనే ఉద్యమము
ప్రారంభించుతావు. నేను
నీవెనుకనే ఉంటాను.
11.06.1996
శ్రీసాయి రాత్రికలలో డాక్ట్
ర్ రూపములో
దర్శనము యిచ్చి
అన్న మాటలు.
1) 17.05.1996 అమావాస్యనాడు
నీకు తిరిగి
పునర్ జన్మ
లభించినది. ఆనాటినుండి
నీజీవిత ఆఖరి
రైలు ప్రయాణము
ప్రారంభము. నీకు
తోడుగాసాయి బంధువులు ఉన్నారు. ఎవరి
స్టేషన్ రాగానె
వారు దిగిపోవాలి.
2) డాక్టర్ నీగుండెకు
ఆపరేషన్ చేసారు. లోపలి
పుండు యింకా
మానలేదు. బరువులు
ఎత్తవద్దు. మందులు
జాగ్రత్తగా వాడుతూ ఆరోగ్యము కాపాడుకో.
15.06.1996
శ్రీసాయి రాత్రి కలలో
ఓ సన్యాసి
రూపములో దర్శనము
యిచ్చి అన్న
మాటలు.
1) సంసార జీవితము సాయి
సేవకు ఆటంకము
కాదు.
మహల్సాపతి సంసారము చేస్తు
శ్రీసాయి సేవను చేసినాడే. నీవు
కూడ సంసారము
సాగించుతు నా సేవ చేసుకో.
2) శ్రీసాయి సేవలో
నీదగ్గరకు వచ్చే సాయి భక్తుల కొబ్బరి
కాయలు కుళ్ళిఫొయి
ఉంటాయి.
అటువంటివారితో వ్యవహారాలులో జాగ్రత్తగా యుండు.
3) శ్రీ సాయి సేవలో
ధన వ్యామోహము
విడనాడు. లేకపోతే
పోలీసులు ఆధనాన్ని అవహరించి నిన్ను నానాబాధలు
పెడతారు. జాగ్రత్త.
(యింకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు
0 comments:
Post a Comment