07.11.2020 శనివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్యామ్ రావ్ జయకర్ – బాబా అనుభవాలు
ఈ రోజు మరొక అధ్బుతమయిన బాబా లీలను ప్రచురిస్తున్నాను.
శ్రీ
సాయి లీల ద్వైమాసపత్రిక సెప్టెంబర్ – అక్టోబర్, 2014 వ.సంవత్సరంలో ప్రచురింపబడింది.
శ్రీసాయిబాబా
వారి తైల వర్ణచిత్రాన్ని చిత్రించిన శ్రీ శ్యామరావ్ జయకర్ గారు బాబాతో తనకు కలిగిన అనుభవాన్ని స్వయంగా బాబా సాహెబ్ గారికి, శ్రీ ఆర్. ఎ. తర్ఖడ్ గారికి వివరించారు.
ఆయన
స్వయంగా చెప్పిన ఈ అనుభవాన్ని చదివి మనం కూడా ఆనందిద్దాము.
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపెట, హైదరాబాద్
ఫోన్. 9440375411 & 8143626744
ఈ రోజు సాయంకాలం నేను (ఈ వ్యాసరచయిత) నా స్నేహితునితో కలిసి పని ఉండి శ్రీ శ్యామ రావ్ రామచంద్ర వినాయక్ జయకర్ గారి ఇంటికి వెళ్లాను.
ఆయన
పార్లేలో శ్రీ తిలక్ మందిర్ రోడ్ లో నివాసం ఉంటున్నారు.
సాయిమాత బాలగోపాలురతో (చిన్నపిల్లలతో) ఆటలాడుతూ ఉండేవారు.
ఆ
బాలగోపాలురలో
శ్రీ శ్యామ్ రావ్ జయకర్ ఎంతో ప్రేమ అంకితభావం ఉన్నవాడు.
ఆయన మంచి పేరుపొందిన చిత్రకారుడు.
ద్వారకామాయిలో శ్రీసాయిబాబా
వారి తైలవర్ణ
చిత్రం (ఆయిల్ పెయింటింగ్) వేసినది ఆయనే.
అదేవిధంగా
ఆర్.బి.మోరేశ్వర్ ప్రధాన్ గారి ఇంటిలో ఉన్న పూజాగదిలో కూడా శ్యామ్ రావ్ జయకర్ గారే చిత్రించిన (ఆయిల్ పెయింట్ వేసిన) బాబా చిత్రపటం ఉంది.
ఈ చిత్రకారుడు బాబా చరణాలవద్ద రెండు సంవత్సరాలు ఉన్నాడు.
అతనికి చిత్రకళలో మంచి ప్రావీణ్యం ఉంది. ఆయనకు తైలవర్ణ చిత్రాలను చిత్రించడంలోని మెలకువలన్నీ తన చిన్ననాటినుంచే స్వయంగానె పెంపొందించుకున్నాడు.
చిత్రకళలోని
సూక్ష్మమయిన
మెలకులవలన్నిటినీ
జీర్ణించుకున్నవాడు. అతను
చిత్రించిన సాయిబాబావారి తైలవర్ణ చిత్రం చూపరులను మంత్రముగ్ధులను చేస్తుంది.
అతను
బాబా వద్దనే రెండు సంవత్సరాలు ఉన్న కారణంగా శ్రీసాయిబాబావారి ప్రతి కదలిక, ఆయన కూర్చునే విధానం, ఆయన నిలుచుని ఉండే తీరు ఆయన ప్రజలతో పరస్పరం సంభాషించే పధ్ధతి ఇవన్నీ శ్యామ్ రావ్ జయకర్ మనసులో అచ్చుగుద్దినట్లుగా ముద్ర వేసుకున్నాయి.
సాయిబాబా బాలగోపాలురందరితో కనబరిచే ప్రేమ, ఎంతో ఉత్సాహంతో ఆయన వదనంలో కనిపించే చిరునవ్వు ఇవన్నీ మరలా శ్రీశ్యామ్ రావ్ జయకర్ తను చిత్రంచిన శ్రీసాయిబాబావారి తైలవర్ణచిత్రంలో ఉన్నది ఉన్నట్లు బంధించారు. సాయిబాబావారి చిరునవ్వు ఇవన్నీ ఆయన వేసిన చిత్రాలలో మళ్ళీ మళ్ళీ ప్రతిఫలిస్తూ ఉండేవి. సాయిబాబాలో కనిపించే కరుణ, ఆయన మోముపై చిరునవ్వు ఏవిధంగా ఉండేవో శ్యామ్ రావ్ జయకర్ గారు వేసిన చిత్రాలే మనకు సాక్ష్యం.
జయకర్ శ్రీ సాయిబాబావారి అధ్బుతమయిన లీలలను గురించి చెప్పే సమయంలో జయకర్ తో పాటుగా అక్కడ ఉన్న శ్రోతలందరికి కళ్లనుండి ఆనందభాష్పాలు కారుతూ ఉండేవి.
సాయిబాబాతొ
తనకు కలిగిన అనుభవాలను నాకు వ్రాసి పంపిస్తానని చెప్పారు.
ఈ
అనుభవాలన్నీ
శ్రీసాయిలీల
పత్రికలో ప్రచురింపబడతాయి.
శ్రావణమాసంలో వెలువడిన పత్రికలో నాలుగవ పేజీలో ఆయనకు కలిగిన అనుభవం ఒకటి ప్రచురింపబడింది. దానిని గుర్తుకు తెచ్చుకొని ఆయనే స్వయంగా చెప్పిన మాటలే మరలా ఇక్కడ ప్రచురింపబడింది.
“మేము షిరిడీలో ఉన్న సమయంలో ముంబాయి నివాసి అయిన వర్దేకి శ్రీసాయిబాబా పాదాలచెంత సత్యనారాయణ వ్రతం చేద్దామనే ఆలోచన కలిగింది.
తనకు
వచ్చిన ఆలోచన గురించి శ్రీసాయిబాబాకు వివరించాడు.
అపుడు
బాబా “నాకు సత్యనారాయణ గాని లేక మరే ఇతర పూజలు ఏమీ అక్కరలేదు.
అనవసరంగా
ఎందుకు ఇటువంటి తాపత్రయాలలో చిక్కుకుంటావు?” అన్నారు.
“బాబా నేను మొక్కుకొన్నాను.
నీకు
అంతా తెలుసు, దయచేసి ఈ దీనుడిని అనుగ్రహించి వ్రతపూజ చేయడానికి అంగీకరించండి” అని వేడుకొన్నాడు.
బాబా కొంత శాంతించి అతని కోరికకు సరే అని గాని, లేక వద్దు అని గాని చెప్పకుండా, చివరికి ఒక్కసారికి మాత్రమే సుమా అని ఒప్పుకొన్నారు. ఇక సంతోషంతో వర్దే పూజకి కావాల్సిన ఏర్పాటులన్నీ చేసుకోవడం ప్రారంభించాడు.
పూజకోసం కావలసిన వస్తువులు, సరుకులు అన్నీ కొనేటప్పటికి వర్దే దగ్గర ఉన్న డబ్బు మొత్తం ఖర్చయిపోయింది.
ఇక
ప్రసాదానికి
కావలసిన పదార్ధాలు కొనడానికి రెండున్నర అణాలు తక్కువయ్యాయి.
అతను బాబా దగ్గరకు వెళ్ళి, “బాబా ప్రసాదానికి కావలసిన సరుకులు కొందామంటే రెండున్నర అణాలు తక్కువయ్యాయి.
ఇపుడు
నేనేమి చేయాలి?” అని వేడుకొన్నాడు.
ఆ సమయంలో
ద్వారకామాయిలో
అతనికి సహాయపడగల శక్తి ఉన్నవాళ్ళు కొందరు సాయిబాబావద్ద కూర్చుని ఉన్నారు.
నేను
ద్వారకామాయికి
బయట చివర దూరంగా కూర్చుని ఉన్నాను.
ఆ సమయంలో
బాబా నావైపు చూపిస్తూ, “వెళ్ళు, అతని వద్ద రెండున్నర అణాలు ఉన్నాయి.
అతనిని
అడిగి తీసుకో” అని వర్దేకి చెప్పారు.
ఆసమయంలో నా జేబులో రెండున్నర అణాలు మాత్రమే ఉన్నాయన్న విషయం నాకొక్కడికే తెలుసు.
నాకు
బొంబాయినుండి
ఇంకా డబ్బు రావడానికి కొంత సమయం పడుతుంది.
అందుచేత
ఆ డబ్బు వచ్చేంతవరకు నేను నాదగ్గరున్న రెండున్నర అణాలని చాలా జాగ్రత్తగా ఖర్చుపెట్టుకోవాలి.
వర్దే నాదగ్గరకు వచ్చి అడిగిన వెంటనే నాదగ్గరున్న డబ్బు ఇచ్చేశాను.
ఆ తరువాత వర్దే నాలుగు అరటిచెట్లను తీసుకువచ్చాడు.
బాబా
వాటిని చూసి, “ఇవి దేనికి?” అన్నారు.
“మీ
చుట్టూ వీటిని పెట్టి మండపం కడదామనుకుంటున్నాము” అని వర్దే జవాబిచ్చాడు.
బాబా కోపంతో, “నాకివేమీ అవసరం లేదు” అన్నారు.
“బాబా
మీరెందుకని ఇలా అంటున్నారు? ఈ దీనుడిని కనికరించి నామొక్కును తీర్చుకోనివ్వండి” అని వేడుకొన్నాడు.
కాని బాబా కనికరించలేదు.
వర్దే
కళ్లనీళ్ళు పెట్టుకున్నాడు.
సరే
అని ఈ ఒక్కసారికి మాత్రమే ఒప్పుకొంటాను అన్నారు బాబా.
ఆతరువాత
ఏమయింది? చెప్పడానికేముంది?
అక్కడున్నవారందరూ కలిసి
ఎంతో ఉత్సాహంతో శ్రీసాయిబాబా వారి చుట్టూ నాలుగువైపులా అరటిమొక్కలను నిలబెట్టి అధ్భుతమయిన మండపాన్ని తయారుచేసారు.
బాబా సాహెబ్ అప్పుడు జరిగిన సందర్భం, మండపాన్ని అలంకరించిన దృశ్యం గుర్తుకు తెచ్చుకోగానే అలవిగాని ఆనందంలో మునిగిపోయాడు. అపుడు జరిగిన ఆ ఉత్సవాన్ని తిలకించిన ఈ నాకన్నులు నిజంగా ఎంతో పుణ్యం చేసుకొన్నాయి అనుకున్నాడు.
ఆతరువాత పోతీ చదవడం ప్రారంభమయింది.
పోతీని
ద్వారకామాయిలో
అందరూ సమావేశమయిన చోటకాకుండా క్రింద ఆవరణలో చదువుతున్నారు.
ఆ సమయంలో అందరితోపాటుగా నేను ద్వారకామాయిలోనే కూర్చొని శ్రీసాయిబాబావారికి పాదసంవాహన చేస్తున్నాను.
వెంటనే నామనసులోకి ఒక ఆలోచన వచ్చింది.
పోతీ
చదివేసమయంలో
నియమం ప్రకారం పోతీని చదువుతున్న చోటనే కూర్చోవాలి కదా?
ఆ తరువాత
వెంటనే మరొక ఆలోచన కలిగింది.
“మనమిప్పుడు
శ్రీసాయిబాబావారికి
చరణ సేవ చేస్తున్నాము కదా? అటువంటప్పుడు క్రిందకి వెళ్ళి కూర్చోవడం కుదరదు కదా” మరలా మనసులో సందేహం.
“పోతీ
చదువుతున్న సమయంలో దానిని చదువుతున్న చోటనే కూర్చోవాలనే నియమం ఉంది కదా?
మరి
దాని సంగతేమిటి?
నియమాన్ని
తప్పినట్లు కాదా?”
ఇది వ్రాయడానికి, చెప్పడానికి చాలా సమయం తీసుకుంది.
కాని
కోతిలాగ చంచలంగా ఉన్న నామనసులో ఈ భావాలన్నీ ఒక్క సెకనులోపే కలిగాయి.
నా
చంచల మన్సులోని భావాలని గ్రహించిన బాబా, “లే, లేచి కిందకి వెళ్ళు.
పోతీ
దగ్గర కూర్చో” అన్నారు.
అక్కడున్నవారిలో ఎవరినీ ఆవిధంగా ఆదేశించకుండా బాబా నన్నొక్కడినే వెళ్లి కూర్చోమని చెప్పడంతో ప్రతివారూ చాలా ఆశ్చర్యపోయారు.
బాబా వారి సర్వజ్ఞత మళ్ళీ నాకు అనుభవంలోకి రావడంతో నాకళ్ళలో ఆనందభాష్పాలు కారాయి.
ఆనందంతో
మెట్లుదిగి క్రిందకి వెళ్ళి పోతీని వినసాగాను.
బాబాసాహెబ్!, శ్రీసాయిబాబావారి లీలలను, ఎన్నని చెప్పను?
ఎవరికి తెలుసు? నీనుంచి ఈ లీలలను వింటానని. వీటిని రాసినందువల్ల నీద్వారా ఎంతోమంది బాలగోపాలురకు శ్రీసాయిబాబావారి మహిమ, గొప్పదనం ఎటువంటిదో అర్ధం చేసుకునే భాగ్యాన్ని కలిగించావు.
అందరి
జీవితాలను ధన్యం చేసావు.
కాకతాళీయంగా
ఈ సంఘటన ఈరోజు
జరగడానికి కారకులు
సాయిబాబా కాదా?
సాయిబాబా
లీలలన్నీ అగాధమయినవి.
మనం
అర్ధం చేసుకోలేనివిగా అగోచరంగా ఉంటాయి.
ఆవిధంగా
చెప్పిన తరువాత “సాయిబాబాతో నాకు కలిగిన అనుభవాలను రాసి పంపిస్తాను” అని శ్రీ శ్యామ్ రావ్ జయకర్ గారినుంచి మాట తీసుకుని మేమిద్దరం ఇంటికి తిరిగి వచ్చాము.
ఆర్. ఎ.
తార్ఖడ్, ఎడిటర్
శ్రీ గోకులాష్టమి, బాంద్రా
24.08.1932
మారాఠీనుండి ఆంగ్లానువాదం, విశ్వనాధ్ నాయర్
(త్వరలో తలచిన వెంటనే తక్షణ సహాయం అందించిన బాబా )
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment