08.11.2020 ఆదివారమ్
ఓమ్
సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
వైద్యానికి బాబా సహకారమ్
ఈ
రోజు మరొక అధ్బుతమయిన బాబా వారి మహిమను తెలియచేసే వృత్తాంతాన్ని వివరిస్తున్నాను. అంకిత భావంతో తమ వృత్తినే దైవంగా భావిస్తూ పనిమీదనే
శ్రధ్ధపెట్టె వైద్యులకు కూడా బాబా ఏవిధంగా సహాయపడతారో దీనిని చదివిన తరువాత మనం గ్రహించుకోవచ్చు.
సాయి భక్తురాలయిన ఒక లేడీ డాక్టర్ గారు వివరిస్తున్న బాబా మహిమ ఎటువంటిదో ఆమె తన వృత్తి ధర్మాన్ని ఏవిధంగా నిర్వహిస్తున్నదో ఇప్పుడు మీరు చదవబోయే దాని ద్వారా
అర్ధం చేసుకోవచ్చు.
శ్రీసాయిలీల
ద్వైమాసపత్రిక సెప్టెంబరు – అక్టోబర్, 2014 వ.సంవత్సరంలో ప్రచురింపబడింది.
తెలుగు
అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట,
హైదరాబాద్
వృత్తిరీత్యా
నేను గైనకాలజిస్టుని. నా చిన్నతనంనుండె నాకు
సాయిబాబా మీద నమ్మకం, భక్తి ఉన్నాయి. నా తల్లిదండ్రులునుండే
నాకు సాయిభక్తి అలవడింది. నా తల్లిదండ్రులు
నన్ను, నా సోదరుడిని మాచిన్నతనం నుండె ప్రతిసంవత్సరం షిరిడీకి తీసుకు వెడుతూ ఉండేవారు.
ఆ
సర్వాంతర్యామి అయిన బాబా మీద ప్రగాఢమయిన నమ్మకంతో ఆయనలో పరబ్రహ్మని దర్శిస్తూ ఉంటాను.
మా
వైద్య వృత్తిలో అడుగడుగునా మేము క్రొత్త క్రొత్త సవాళ్లను ఎదుర్కోవలసి వస్తూ ఉంటుంది. ప్రతిరోజు అనేకవిధాలుగా ప్రమాదకర పరిస్థితులలో ఉన్న
రోగులు వస్తూ ఉంటారు. అందరి రోగాలు ఒక్కటిగా
ఉండవు. బాబా అనుగ్రహంతో నేను చేసే వైద్యంతో
వారికి నయమవుతూ సంతోషంగా తిరిగి వెళ్ళిపోయే సమయంలో, బాబాపై నా నమ్మకం మరిమరీ బలపడుతూ
ఉంటుంది.
నేను
చేసే ప్రసవాలలో క్రొత్త శిశువు ఈ భూమిపైకి వచ్చిన ప్రతిసారి ఆ శిశువులో నేనెప్పుడూ
సాయిని చూస్తాను. ఆవిధంగా నేను బాబాతో అత్యంత సాన్నిహిత్యాన్ని ఏర్పరచుకొన్నాను.
నా
జీవితంలో సాయిబాబా నాకు ఎన్నో అనుభవాలను ప్రసాదించారు. అటువంటివాటిలో ఈ మధ్యనే జరిగిన ఒక అనుభవాన్ని వివరిస్తాను.
నా
మెటర్నటీ ఆస్పత్రి ధానేలో ఉంది. ఏడు సంవత్సరాల క్రితం ఒకామె ఇక్కడె పురుడు పోసుకుంది. ఆమె దహిసార్ లో నివసిస్తోంది. ఈ మధ్యకాలంలో ఆమె మళ్ళీ నన్ను కలవడం జరగలేదు.
ఒక
గురువారం నాడు అకస్మాత్తుగా ఆమె భర్త వద్దనుండి ఫోన్ వచ్చింది ఆతను చాలా కంగారుగా మాట్లాడుతున్నాడు. “నా భార్యకు విపరీతమయిన నొప్పివస్తుంటె దగ్గరలోనే
ఉన్న ఆస్పత్రిలో చేర్పించాము. ఓవరీస్ బాబా
వాచిపోయి పెద్దవిగా అయ్యాయని దానివల్ల చాలా సమస్యలు ఏర్పడ్డాయని వైద్యులు చెప్పారు. వెంటనే సర్జరీ చెయ్యకపోతే ఆమె ప్రాణానికే ప్రమాదమని
చెప్పారు. మీమీద మాకు ఎంతో నమ్మకం. మీరు మాత్రమే నాభార్యకు వైద్యం చేసి ప్రాణదానం చేయగలరు. మీరుమాత్రమే ఈ కష్టాన్నుండి గట్టెక్కించాలి. అందుకనే మేము మీదగ్గరకు వస్తున్నాము” అన్నాడు.
ఆరోజు
పని ఒత్తిడి చాలా ఉండటం వల్ల అప్పటికే బాగా అలసిపోయాను. కాని, అతని అభ్యర్ధనను కాదనలేకపోయాను. వారికోసం ఎదురుచూస్తూ కూర్చున్నాను.
వాళ్ళిద్దరూ
సాయంత్రం చాలా ఆలస్యంగా వచ్చారు. ఆమె విపరీతమయిన
నెప్పితో మెలికలు తిరిగిపోతోంది. వెంటనే ఆమెను
పరీక్షించాను. ఆమె శరీరంలో హెమోగ్లోబిన్ కౌంట్
5 గ్రాములే ఉంది. ఇది చాలా ప్రమాదకరమయిన పరిస్థితి
అని చెప్పి నాతో ఉన్న వైద్యురాలు తను ఈకేసులో నాకు సహాయం చేయలేనని చెప్పింది. అనస్థసిష్టు జనరల్ సర్జరీ చేయమని చెప్పాడు. నేను ఎండోస్కోపిక్ సర్జన్ ని అవడం వల్ల ఎండోస్కోపీ
ద్వారానె ఆమెకు ఉన్న సమస్యలన్నిటినీ నయంచేయవచ్చని నాకు తెలుసు.
నాలోని
అంతర్వాణి ఆవిధంగానే చేయమని చెపుతోంది. నాకు
నేను ధైర్యం తెచ్చుకోవడానికి మనఃస్ఫూర్తిగా బాబాను ప్రార్ధించుకున్నాను. 10 -15 నిమిషాలలో సర్జరీ పూర్తయింది. ఆమెకు రక్తం ఎక్కించి వైద్యం పూర్తి చేసిన తరువాత
మూడురోజులలోనే ఆమె సంతోషంగా ఇంటికి వెళ్ళింది.
మాదగ్గరకు వచ్చే రోగులకి వైద్యం చేసి నయం చేయడానికి మాశాయశక్తులా కృషి చేస్తాము. కాని అందులో విజయం సాధించాలంటె ఆకరుణామూర్తి, సర్వశక్తిమంతుడయిన
సద్గురువయిన శ్రీసాయిబాబావారి అనుగ్రహం ప్రధానం.
డా.
జ్యోతి సాయిన్ గోంకర్
(సర్వం
శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment