09.11.2020 సోమవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
బాబా దర్శనమ్ - అనుగ్రహమ్
ఈ రోజు మరొక అధ్బుతమయిన బాబా వారి మహిమ గురించి ప్రచురిస్తున్నాను.
బాబా
వారు మహాసమాధి చెందిన తరువాత కూడా తన భక్తులను ఏవిధంగా ఆదుకుంటారొ, అనుగ్రహిస్తారో, దీనిని చదివిన తరువాత మనకు అర్ధమవుతుంది.
శ్రీ
సాయిలీల ద్వైమాసపత్రిక సెప్టెంబరు – అక్టోబర్, 2014 వ.సంవత్సరంలో ప్రచురింపబడింది.
ఆంగ్లమూలం
శ్రీ జ్యోతిరంజన్ రవుత్,
ఆంగ్లంనుండి
హిందిలోకి అనువాదమ్ శ్రీ మదన్ గోపాల్ గోయల్…
హిందీనుండి తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
41) శ్రీనవీన్
భగవాన్ దేశాయి, జలాల్పూర్, గుజరాత్ వారికి బాబా దర్శనమిచ్చి అనుగ్రహించుట….
నా తల్లిదండ్రులు,
నేను,
నా భార్య, నా పిల్లలు మాకుటుంబమంతా 1967వ.సంవత్సరంలో సాయిభక్తులమయ్యాము.
నేను
సంపూర్ణంగా సాయిబాబా వారి దివ్య చరణాలకు సర్వశ్య శరణాగతి చేసాను.
ఆయనే
నాకు మార్గదర్శి, నన్ను ఉద్ధరించే భగవంతుడు.
బాబా నాకు స్వప్న దర్శనం మాయింటిలోనే ఇచ్చారు.
“బాబా
నన్ను షిరిడికి వచ్చి తన సమాధి వద్దకు రమ్మని నాకు ఆదేశమిచ్చారు.
ఆయన
ఆదేశం ప్రకారం నేను షిరిడీ వెళ్లాను.
ఆయన
నా నుదుటిమీద బొట్టుపెట్టి, ఒక తువ్వాలును పరిచారు.
దానిమీద
రూ.301/- వెండిరూపాయ నాణాలను పోసి, మూటకట్టి నాకు ఇచ్చిన తరువాత వెళ్లమని అనుమతిచ్చారు.
నేను
ఆయన సమాధినుండి క్రిందకు దిగిన వెంటనే తిరిగి నన్ను సమాధిపైకి రమ్మని పిలిచారు.
నేను
ఆయన సమాధిపైకి వెళ్లాను.
ఆయన
ఒక చిన్నపాత్రనుండి కొంత బెల్లం తీసి నా నోటిలో పెట్టారు. ఆతరువాత వెళ్ళడానికి నాకు అనుజ్ఞ ఇచ్చారు.
నేను
మా ఇంటికి తిరిగి వచ్చాను.”
ఈ స్వప్నదృశ్యాన్ని బట్టి నేను షిరిడీ వెళ్లడానికి ఇది శుభ శకునమని భావించాను.
1967వ.సంవత్సరంలో మేము మొట్టమొదటిసారిగా షిరిడీ వెళ్లాము.
అక్కడ
గురుస్థాన్ భవన్ లో గది అద్దెకు తీసుకున్నాను.
బాబా
నువ్వు నాకు దర్శనమివ్వు అని ప్రార్ధించుకున్నాను.
నాకు
కనక నువ్వు దర్శనమిస్తే నన్ను నీభక్తునిగా నువ్వు స్వీకరించావనడానికి అదే సాక్ష్యంగా
నిర్ధారణ
చేసుకుంటాను. ఈ
విధంగా మనసులోనే ప్రార్ధించుకున్నాను.
నా
ప్రార్ధనను మన్నించి బాబా సమాధిమందిరం వెనుకనున్న మొక్కలకు నీళ్ళు పెడుతున్నట్లుగా దర్శనమిచ్చారు.
ఆ తరువాత నేను, నెలకు రూ.1,800/- జీతం వచ్చే నాఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తిగా బాబా భక్తిలోనే లీనమయిపోయాను.
నా
భార్య అధ్యాపకురాలిగా ఉద్యోగం చేస్తోంది.
అనుకోకుండా
ఆమెకు మతిచలించింది.
పిచ్చిగా
మాట్లాడసాగింది. ఆమె
వైద్యంకోసం మందులకి దాదాపు పదివేల రూపాయల దాకా ఖర్చుపెట్టాను.
కాని
వైద్యుడు ఇక వైద్యం కోసం డబ్బు ఖర్చుచేయడం అనవసరమని, లాభంలేదని చెప్పాడు.
ఇక
దేవుడిని సహాయం చేయమని ప్రార్ధించడం తప్ప చేయగలిగిందేమీ లేదని చెప్పాడు.
ఒకరోజు రాత్రి గం.2.30కి నాభార్య నన్ను లేపి తాను దాచుకున్న డబ్బులోనుండి రూ.40,000/- నాకు ఇచ్చానని చెప్పింది.
ఇపుడు
ఆడబ్బు విడాకులతోపాటుగా ఇమ్మంది.
నేను
చాలా కంగారుగా
లేచి కూర్చుని ఆబాధతో బాబాని ఇలా ప్రార్ధించాను, “బాబా 24 గంటలలో నువ్వు ఆమె పరిస్థితిని మెరుగుపరచలేకపోయినట్లయితే, నువ్వు
సర్వశక్తిమంతుడవు అని నీమీద నాకున్న విశ్వాసం
సడలిపోతుంది.”
ప్రతిరోజు ఉదయం 5 గంటలకు ఒక భిక్షువు పాటలు పాడుకుంటూ మా ఇంటిముంగిట ముందుకు వస్తూ ఉంటాడు.
రెండవరోజున
నా భార్య అతనికి భిక్ష వేసినపుడు,
ఆమెతో
నువ్వు పిచ్చిదానివి
కాదు అన్నాడు.
ఆమె
చాలా త్వరగానే మామూలు మనిషవుతుంది. కాని ఏదో ఒక దుష్టాత్మ ఆమెను ఆవహించిందని చెప్పాడు.
ఆ
భిక్షువు చెప్పిన మాటలు నేను కూడా విన్నాను.
అతని
రూపంలో బాబానే ఈ విధంగా చెప్పారని భావించాను.
నేను
నాభార్యను ప్రక్క ఊరిలోనే ఉన్న మారుతీ మందిరానికి తీసుకొని వెళ్ళాను.
అక్కడ
ఇటువంటి దుష్టాత్మలు ఆవహించినవారికి నయమవుతుంది.
శ్రీసాయిబాబా
కృపవల్ల అతితక్కువగా రూపాయిన్నర ఖర్చుతోనే ఆమెకు నయమయింది.
ఇక
ఆమె నాకన్నా ఎక్కువగా సాయిబాబాకు చిత్తశుధ్ధి కలిగిన భక్తిపరురాలయింది.
1967
వ.సంవత్సరంలో మరలా నేను నాకుటుంబంతో షిరిడీ వెళ్ళాను.
అక్కడ
గురుస్థానం హోటల్ పై అంతస్థులో మాకు గది దొరికింది.
నేను
కొన్ని సరుకులు కొనడానికి దుకాణానికి వెడుతుండగా బాగా బలిష్టంగా లావుగా ఉన్న కుక్క ఒకటి నాముందే నడుస్తూ ఒక దుకాణం వద్దకు వెళ్ళి నిలబడింది.
అక్కడ
నాకు అత్యవసరంగా కావాల్సిన వస్తువులను కొన్నాను.
ఆతరువాత
మళ్ళీ ఆకుక్క నాకు దారి చూపిస్తూ నన్ను నాలుగయిదు దుకాణాల దగ్గరకు తీసుకుని వెళ్ళింది.
నాకు
అవసరమయినవన్నీ
కొనడం పూర్తయిన వెంటనే ఆకుక్క నన్ను తిన్నగా గురుస్థానం వద్దకు తీసుకువచ్చింది.
అది
నాతోకూడా నా గదిలోకి వచ్చి నా కుర్చీలో కూర్చుంది.
మా
అమ్మగారు మాకు భోజనం వడ్డించినపుడు
ఆకుక్క అన్నిరకాల పదార్ధాలలోను కాస్త కాస్త తీసుకుని తిరిగి నా కుర్చీలో కూర్చుంది.
భోజనాలు
అయిన తరువాత మేమిక గది ఖాళీ చేయాలి.
11 గంటల
బస్సుకి మేమందరం
సూరత్ కి బయలుదేరాలి.
అప్పటికే
10.30 అయింది. నేను
మనసులోనే ఆకుక్కవైపు చుస్తూ, “బాబా, మీరు నాకు మార్గం చూపించి సహాయం చేసినందుకు చాలా సంతుష్టిడినయ్యాను.
ఇపుడు
నేను ఈ గదిని ఖాళీ చేసి సూరత్ కి బయలుదేరాలి.
దయచేసి
గదిని ఖాళీ చేసే అవకాశాన్నివ్వండి” అని ప్రార్ధించాను.
నేను ఈ విధంగా అనుకున్న వెంటనే అప్పటికప్పుడే ఆకుక్క లేచి నుంచుని బయటకు వెళ్ళిపోయింది.
అపుడు
మేము సూరత్ కు బయలుదేరాము.
నా సోదరుడు చదువుకోలేదు.
అందుచేత
అతనికి వివాహం చేయడం కూడా కష్టమే.
చదువు
లేనివాడికి పిల్లనెవడిస్తాడు?
అందుకనే
ఏసంబంధమూ రాలేదు.
ప్రక్క
గ్రామంలోనే ఉంటున్న నామిత్రుడు తన కుమారుడికి మా ఊరిలోనే ఉన్న అమ్మాయితో వివాహ సంబంధం కుదుర్చుకున్నాడు.
కాబోయే
దంపతులకి నిశ్చితార్ధం మాయింటిలో నిర్వహించుకోవడానికి మా ఇంటికి వచ్చారు.
నాకు
నాసోదరుడి గురించే చాలా బాధగా ఉంది.
నేను
బాబా పటంముందు నిలబడి నాసోదరుడి వివాహం గురించి బాబాను ప్రార్ధించుకొన్నాను.
వారందరూ మాయింటిలో కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని వెళ్ళిపోయిన వారం రోజులకు ఒక వయసుమళ్ళిన వ్యక్తి
ఒకాయన మాయింటికి వచ్చారు. ఆయన అంతకుముందు నిశ్చితార్ధానికి వచ్చిన
వారితోపాటుగా అతిధిగా మాయింటికి వచ్చారు. నాసోదరుడిని, మా ఇంటినీ, మా పధ్ధతులను మా స్థితి అన్నీ చూసి సంతృప్తి చెందడం వల్ల తన కుమార్తెను నా సోదరునికిచ్చి వివాహం చేయాలనే సంకల్పంతో వచ్చారు.
బాబా నాప్రార్ధనను మన్నించారు.
నా
సోదరునికి సంబంధం కుదిర్చారు.
నేను
షిరిడీ వెళ్ళాను.
బాబా
గారి అన్ని మందిర పూజా స్థానాలలోను వివాహ
ఆహ్వాన
పత్రికలను భక్తితో సమర్పించాను.
“బాబా
మీరు
వధూవరులను
ఆశీర్వదించడానికి
నా సోదరుని వివాహానికి తప్పకుండా రావాలి” అని హృదయపూర్వకంగా బాబాను ఆహ్వానించాను.
వివాహం చాలా వైభవంగా జరిగింది.
గ్రామస్థులందరు మన గ్రామంలో ఇంతకుముందెప్పుడూ
ఇంత వైభవంగా జరిగిన వివాహాన్ని చూడలేదని చెప్పుకున్నారు.
దాదాపు
మధ్యాహ్నం 12 గంటలు అవుతుండగా అపరిచితుడయిన ఒక ఫకీరు చాలా వేగంగా వచ్చాడు.
అతను
నేరుగా నావద్దకు వచ్చి, భోజనం చేయడానికి వచ్చినట్లుగా చెప్పాడు.
నేను
ఆయనని సగౌరవంగా ఆహ్వానించి భోజనం పెట్టాను.
ఆయన
భోజనం చేసిన తరువాత నా జేబులో ఉన్న రూ.21 /- దక్షిణగా
సమర్పించాను. బాబా
నా ఆహ్వానాన్ని మన్నించి స్వయంగా వచ్చారని, ఆయన తను ఉన్నాననే అనుభూతిని మనకు కలిగించారని నేను ఎంతగానో సంతోషించాను.
(సర్వం
శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment