02.01.2022
ఆదివారమ్
ఓమ్
సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు
మరొక అధ్భుతమయిన సాయి లీలను అందిస్తున్నాను.
ఈ లీల సాయి విచార్ లో ప్రచురింపబడింది.
తెలుగు
అనువాదమ్ ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట,
హైదరాబాద్
ప్రాణదాత
బాబా సాక్షాత్తు భగవంతుని అవరారమే అన్నదానికి సాక్ష్యంగా మాకు కలిగిన అనుభవాన్ని మీకు వివరిస్తాను. రెండు సంవత్సరాల క్రితం మాకుటుంబం కొన్ని ఒడిదుడుకులలో ఉన్న సమయంలో నా భార్యకు తాను గర్భవతిని అయ్యానేమోననే అనుమానం కలిగింది. అది నిర్ధారించుకోవడానికి రెండు వారాల తరువాత వైద్యురాలి వద్దకు వెళ్ళాము.
వైద్యురాలు స్కాన్ చేయించుకోవడానికి
సమయం నిర్ణయించి రిపోర్ట్లు పట్టుకురమ్మని చెప్పింది. స్కాన్ చేయించిన తరువాత వైద్యురాలు ఏమి చెబుతుందోననే
ఆతృతతో వేచి చూస్తున్నాము. పదిహేను నిమిషాలపాటు
చర్చించిన తరువాత స్కాన్ రిపోర్టు చూసి ఫలితం చాలా ఆందోళనపరిచేదిగా ఉందని చెప్పింది. వైద్యురాలు చెప్పిన విషయం గర్భంలో ఉన్న పిండానికి
ఆరు వారాలనీ, రెండు వారాలనుంచి పిండం ఎదగటల్లేదని, అది గర్భస్రావం చేయవలసిన కేసని చెప్పింది. ఆమాట వినగానే మేము చాలా హతాశులమయ్యాము. అది నా భార్యకు మొట్టమొదటి గర్భం. ఆమాట వినగానే నా భార్యకు గుండె బ్రద్దలయినట్లుగా
అయింది. కళ్ళంబట కన్నీరుతో దుఃఖం ఆపుకోలేకపోయింది. మళ్ళీ మరొక్కసారి రిపోర్టు సరిగా చూడమని అభ్యర్ధించాను. ఆసుపత్రి/యూనివర్శిటీలో ఆమె ప్రముఖ వైద్యురాలు. ఎంతో అనుభవం ఉన్నామె. ఆవిడకు వయసు కూడా ఎక్కువే. మమ్మల్ని త్రుప్తి పరచడానికి మళ్ళీ స్కాన్ చేసింది. స్కాన్ లో పిండానికి నాడి కూడా అడటంలేదని, తేదీల
ప్రకారం లెక్క వేస్తే ఈ పాటికే పిండానికి నాడి ఆడుతూ పెరుగుదల కూడా ఉండాలని చెప్పింది. గర్భస్రావం చేయాల్సిందేననీ, అందుకు మాకు సమ్మతమయితే
ఒక వారం తరువాత రమ్మని చెప్పింది.
బరువెక్కిన
హ్రుదయాలతో ఇంటికి తిరిగి వచ్చాము. ఇంటికి
చేరుకునేంత వరకు నా భార్యను ఓదార్చడం నావల్ల కాలేదు. నేను ఏమీ చేయలేని పరిస్థితి. ఈ పరిస్థితిని తట్టుకోవడం తప్ప మరేమీ చేయలేని నిస్సహాయ
స్థితిలో భగవంతుడిని ప్రార్ధించుకున్నాను.
అంతకన్నా చేసేది ఏముంది?
అకస్మాత్తుగా
నాకొక ఆలోచన తట్టింది. ఇంకొక వైద్యురాలిని
కలిసి ఆమెయొక్క (సెకండ్ ఒపీనియన్) సలహాను ఎందుకు తీసుకోకూడదు అని అనిపించింది. ఒక వారం తరువాత మేము మరొక వైద్యురాలి వద్దకు వెళ్ళాము. ఆవిడ కూడా మంచి అనుభవం ఉన్నావిడ. ఆమె మరొక ఆస్పత్రిలో గైనకాలజీ డిపార్టుమెంటులో ముఖ్యాధికారిణి. ఆవిడకు మా పరిస్థితినంతా వివరించాము. రెండు రోజుల తరువాత స్కాన్ చేద్దామని చెప్పింది. ఆరోజు కోసం మేము ఎంతో ఆత్రుతగా ఎదురు చూసాము. స్కాన్ చేసే రోజు వచ్చింది. స్కాన్ చేసిన ఫలితం ఎలా ఉండబోతుందా అని ఎంతో భయపడుతూ
కూర్చున్నాము. వైద్యురాలు నన్ను ప్రక్కకు తీసుకెళ్ళి
మొట్టమొదటి వైద్యురాలు ఏమిచెప్పిందో అదే విషయం చెప్పింది. కాని ఆమె మాకు బాగా మానసిక ధైర్యాన్నిచ్చి, గర్భస్రావం
చేయడానికి ఒక వారం ఆగమని చెప్పింది, ఆవిడ చెప్పినట్లు
చేయడం తప్ప మాకింక వేరే గత్యంతరం లేదు. ఇక
ఇంటికి తిరిగి వెళ్ళిపోయాము. ఆరోజు రాత్రి
నాకు మనసులో చాలా ఆందోళనగా ఉంది. మేమిద్దరం
సాయిని “బాబా మాకేది మంచిదో అది నీకే తెలుసు. ఏమి చేస్తావో అంతా నీయిష్టం మీదనేఆధార
పడి ఉంది”. --అని ప్రార్ధించుకుని పడుకున్నాము. పడుకునేముందు నా భార్య తనపొట్టకి బాబా ఊదీని రాసుకుంది. ఈ విధంగా వారం రోజులపాటు క్రమం తప్పకుండా రాసుకుంది. వారం తరువాత వైద్యురాలు చెప్పిన ప్రకారం గర్భస్రావం
చేయించుకోవడానికి ఆస్పత్రికి వెళ్ళాము. చేయడానికి
ముందు ఎప్పటిలాగే మరొక్కసారి స్కానింగ్ చేస్తానని చెప్పింది.
ఇపుడు జరిగిన అద్భుతం. స్కానింగ్ లో పిండానికి నాడి ఆడుతోందని, ఎదుగుదల కూడా ఉందనే విషయం తెలిసింది. వైద్యురాలికి నమ్మబుద్ది కాక అయోమయంగా అయిపోయింది. తేదీలు లెక్క వేసింది. ఆమె తనలో తానే పదినిమిషాలపాటు మాట్లాడుకుంది.
--- ఇది అసంభవం , అసంభవం అని ఆమె రెండు మూడు సార్లు
మాట్లాడుకున్నదంతా మాకు విపించింది. -- ఆఖరికి
ఆమె చెప్పిన విషయం “భగవంతుడు శిశువుకి ప్రాణం పోశారు” అని మాకు శుభవార్త చెప్పింది. ఆమాట వినగానే మా ఒడలు జలదరించింది. నాభార్య సంతోషానికి అవధులు లేవు. బాబాకు ధన్యవాదాలు తెలుపుకుంటే సరిపోదు. ఎటువంటి కష్టం లేకుండా ప్రసవం అయింది. మా అబ్బాయికి ఇపుడు రెండు సంవత్సరాలు. మంచి చలాకీగా ఆరోగ్యంగా ఉన్నాడు.
బాబా
కరుణ అంతులేనిది, అనూహ్యమయినది.
(సర్వం
శ్రీ సాయినాధార్పణమస్తు)
1 comments:
Baba na biddaki antha manchi cheyyi thandri ... 🙏🙏🙏
Post a Comment