01.01.2022 శనివారం
ఓం
సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు మరియు నూతన సంవత్సర శుభా కాంక్షలు
ఈ
రోజు మరొక అధ్బుతమయిన సాయిలీలను తెలుసుకుందాము.
సాయి
విచార్ లో నుండి గ్రహింపబడిన ఈ సాయి లీల శ్రీమతి సునీత మద్నాని గారి అనుభవం
తెలుగు
అనువాదం - ఆత్రేయపురపు త్యాగరాజు,
నిజాంపేట,
హైదరాబాద్
అల్లా
మాలిక్
సాయి భక్తులారా! సాయితో నాకు కలిగిన అనుభవాన్ని మీ అందరితో పంచుకోదలిచాను. ఈ గురుపూర్ణిమనాడు సాయిబాబా నన్ననుగ్రహించారు. మధ్యాహ్నం గం.3.30 ని. కు మాయింటి బెల్లు మోగింది. ఆ వెంటనే తలుపు తట్టిన శబ్ధం. ఎవరు వచ్చారా అని చూడటానికి తలుపు తీసాను. బయట వయసు మళ్ళిన ఒక వ్యక్తి కనిపించాడు.
అతను సాయిబాబా లాగా తెల్లని కఫనీ
ధరించి ఉన్నాడు. తలకి తెల్లటి గుడ్డను కూడా
చుట్టుకుని ఉన్నాడు. చూడగానే అతను సాయిలాగా
కన్పించాడు. నన్ను చూడగానే అతను నా చేతిలో
రెండు పటాలు పెట్టాడు. ఆ పటాలలో పవిత్ర ఖురాన్
లోని వాక్యాలున్నాయి. చూడగానే నా మదిలో “సాయి
వచ్చారు” అని అనిపించింది. అతను నాతో 55/-
దిరామ్స్ ఇవ్వమ్మా నీ పేరుతో మసీదులో ఖురాన్ చదువుతాను, ఇద్దరి పేరుతోనయితే 110/- దిరామ్స్
ఇవ్వమ్మా, మీ ఇష్టం అన్నాడు. మా ఇద్దరి సంభాషణ
వినపడి ఏమి జరుగుతోందోనని చూడటానికి మా అబ్బాయి లోపలినుండి వచ్చాడు. మా అబ్బాయి 25/-దిరామ్స్ ఇవ్వమన్నాడు. డబ్బు తీసుకువద్దామని నేను లోపలికి వెళ్ళినపుడు
నామనసులో వచ్చిన ఆలోచన “వచ్చిన వ్యక్తే బాబా
అయితే అతను తినడానికి గాని, త్రాగడానికి గాని ఏమయిన అడగాలి”
నేను లోపలికి వెళ్ళి 25/- దిరామ్స్ ఇచ్చాను. అతను డబ్బు లెక్కపెట్టుకుని “ఇంతేనా” అన్నాడు. “మీకు తోచినది ఇవ్వమని మీరే అన్నారుగా అందుకనే 25/- దిరామ్స్ ఇచ్చాను” అన్నాను. అపుడావ్యక్తి కనీసం ఒక్క ఖురాను చదవటానికయినా 55/- దిరామ్స్ ఇవ్వమ్మా అన్నాడు. మా అబ్బాయి కూడా మిగతా డబ్బు ఇవ్వమని అన్నాడు. అపుడా వ్యక్తి త్రాగడానికి కాసిని మంచినీళ్ళిస్తారా?” అని అడిగాడు. ఆమాటలు వినగానే నాకెంతో ఆనందం కలిగింది. వచ్చిన వ్యక్తి సాయే అని. అతను 55/- దిరామ్స్ అడిగినపుడు “నేను ముస్లింని కాదు, నాకు ఖురాన్ గురించి ఏమీ తెలీదు, నేను హిందువుని” అన్నాను. దానికి సమాధానంగా ఆవ్యక్తి “అయితే ఏమిటీ? అందరూ సమానమే, క్రైస్తవులు కూడా ఖురాన్ కి డబ్బు ఇస్తున్నారు” అన్నాడు. నేను అతనికి బిస్కెట్లు, మంచినీళ్ళు ఇచ్చాను. అతను బిస్కెట్లను జేబులో వేసుకుని ప్రేమపూర్వకమయిన చిరునవ్వు నవ్వి, మంచినీళ్ళు త్రాగాడు. (ఆ చిరునవ్వు నాకింకా గుర్తుంది) ఇంకా మంచినీళ్ళు కావాలా అని అడిగాను. అతను వద్దన్నాడు. మేము అతనికి 55/- దిరామ్స్ ఇచ్చాము అతను “అల్లా మాలిక్” అని వెళ్ళిపోయాడు. సాయిబాబాయే ఆరూపంలో వచ్చి అమ్మ్మల్ని అనుగ్రహించారు. యాహూలో ఉన్న సబ్ కా కాలిక్ గ్రూపులో నేను సభ్యురాలిని.
అందులో చేరిన తరువాత నాకు సాయిబాబా మీద ప్రేమ, నమ్మకం
ఎంతగానో పెరిగాయి. సబ్ కా మాలిక్ కుటుంబానికి
బాబా దీవెనలు లభించాయి. నిరాకారంగా ఉండి ఆయన
తన భక్తులతో నిరంతరం కలిసి ఉంటూనే ఉంటారు.
ఆరోజు ఉదయం నేను సాయి సత్ చరిత్రలోని 16 & 17 అధ్యాయాలు పారాయణ చేసాను. 55 సంఖ్యకు సంబంధించిన ప్రాముఖ్యత గురించి ఆలోచిస్తూ
ఉన్నాను. అపుడు నాకు అర్ధమయింది. 16 & 17 అధ్యాయాలలో బ్రహ్మజ్ఞానాన్ని కోరిన
వ్యక్తికి సాయిబాబా చేసిన బోధ. “బ్రహ్మమును చూడడానికి అయిదు వస్తువులు సమర్పించాలి. అవి 1. పంచప్రాణములు, 2. పంచేంద్రియములు, 3. మనస్సు, 4. బుధ్ధి, 5. అహంకారము. తెలుసుకోవాలంటే గూడార్ధం
ఇంకా ఉంటుంది. కాని నేను ఒక సామాన్య భక్తురాలిని
మాత్రమే. మనకేది కావాలో సాయికే తెలుసు. ఆవ్యక్తి రూపంలో దర్శన భాగ్యం కలిగించారు.
సాయినాధ్
మహరాజ్ కి జై, ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
(సర్వం
శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment