Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Tuesday, December 14, 2021

దృష్టిని ప్రసాధించిన బాబా

Posted by tyagaraju on 5:15 AM

 


14.12.2021  మంగళవారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

గీతా జయంతి శుభాశీస్సులు

ఈ రోజు మరొక అధ్భుతమయిన బాబా లీలను చదివేముందుగా ఈ రోజు గీతా జయంతి సందర్భముగా 9వ ఆధ్యాయమ్ లోని 22 వ. శ్లోకాన్ని చదువుకుందాము.


అనన్యాశ్చింన్తయన్తో మాం యే జనాః పర్యుపాసతే

తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్

ఎవరు ఇతర భావములు లేనివారై నన్ను గూర్చి చింతించుచు ఎడతెగక ధ్యానించుచున్నారో, ఎల్లప్పుడు నాయందే నిష్టగల్గియుండు అట్టివారియొక్క యోగక్షేమములను నేను వహించుచున్నాను.

శ్రీ సాయిలీల మాసపత్రిక సెప్టెంబరు, 1986 లో ప్రచురింపబడిన దానికి తెలుగు అనువాదమ్ (ఆంగ్ల మూలం...Love Sai Live in Sai Waats app నుండి సేకరణ)

ఆత్రేయపురపు త్యాగరాజు,

నిజాంపేట, హైదరాబాద్

దృష్టిని ప్రసాధించిన బాబా

నా భార్యకు మెల్ల మెల్లగా చూపు పోసాగింది.  వైద్యులు నా భార్య కళ్ళను పరీక్షించిన తరువాత అన్న మాటలు “మీరు వెంటనే కర్నూలు వైద్య కళాశాల ఆస్పత్రికి వెళ్లండి, దాదాపు మీకు పూర్తిగా చూపు పోయింది.  ఇంతకాలం ఎందుకని అశ్రధ్ధ చేశారు?”


నా భార్య మధుమేహ వ్యాధి గ్రస్తురాలు. అందుచేత చూపు చాలా తొందరగానే బలహీనమవుతూ వస్తోంది.  దగ్గరగా ఉన్న వస్తువులను కూడా చూడలేకపోతూ ఉంది.  వైధ్యుని సలహా ప్రకారం మేము వెంటనే కర్నూలుకు బయలుదేరాము.  కర్నూలు వైద్య కళాశాల ఆస్పత్రిలోని కంటివైద్య నిపుణులు ఆమె కళ్ళను పరీక్షించి కళ్ళ సమస్య చాలా తీవ్రంగా ఉందన్నారు.  ఆరు నెలలపాటు మందులను వాడుతూ కళ్ళకి ఇంజక్షన్స్ చేయించుకోమన్నారు.  ఆ తరువాత అవసరమయితే శస్త్ర చికిత్స చేయాల్సి ఉంటుందని చెప్పారు.  నా భార్య మందులు వాడుతూ ఇంజక్షన్స్ కూడా చేయించుకోవడం ప్రారంభించింది.

మేము సాయిభక్తులం.  వైద్యులు చెప్పిన మాటలతో మాకు చాలా దుఃఖం కలిగింది.  మేము సాయిని ప్రార్ధించాము.  నంద్యాలలో ఉన్న శ్రీసాయి కరుణాలయంలోని మా గురూజీ అయిన శ్రీ శ్రీ శ్రీ శ్యామ చరణ్ బాబా గారి దీవెనలు లభించాయి.

కొన్ని రోజుల తరువాత అర్ధరాత్రి సమయంలో నా భార్య హటాత్తుగా మేలుకొని, “తలుపు తెరవండి, సాయి వస్తున్నారు” అంది. 


మేము వెంటనే లైట్లు వేసాము.  స్విచ్ బోర్డు మీద చిన్న సాయిబాబా ఫొటో నాభార్య పడుకున్న మంచంమీద తన ప్రక్కనే పడి ఉంది.

మూడు వారాలలో విచిత్రాతి విచిత్రంగా నా భార్య చూపులో కాస్త మెరుగుదల కన్పించింది.  వైద్యం కొనసాగుతూనే ఉంది.  ముఖ్య వైద్యాధికారి కూడా సాయిభక్తుడే.  తన పేషెంట్ కూడా సాయిభక్తురాలే అని తెలుసుకుని “ఇది నమ్మశక్యం కాకుండా ఉంది.  సాయిబాబాయే మీకు నయం చేస్తున్నారు.  మీ భార్య చూపు గురించి ఆశలే వదిలేసిన స్థితిలో తిరిగి చూపు రావడం అన్నది మేము చేస్తున్న వైద్యం వల్ల గాని మందుల వల్ల గాని కాదు” అన్నారు.

కొన్ని రోజుల తరువాత నా భార్యకి తన కళ్ళకి శస్త్ర చికిత్స జరిగినట్లుగా కల వచ్చింది.  నెలన్నర తరువాత కర్నూలులోని వైద్యులు నా భార్యతో “ఇక మీరు మందులు వాడడం ఆపేయచ్చు.  వైద్యం అవసరం లేదు.  మీకు పూర్తిగా నయమయింది.  అంతా బాబా దయ” అన్నారు.

ఆవైద్యులే మహానందిలో కంటివైద్య శిబిరం ఏర్పాటు చేసారు.  సాయిబాబా కరుణవల్ల కంటి చూపు నయమయిన నాభార్యని చూడటానికి వైద్యులు వచ్చారు.  సాయిబాబాకు కృతజ్ఞతాపూర్వకంగా వైద్యులు, మరియు శ్రీ శ్రీ శ్రీ శ్యామ చరణ్ బాబా గారి మార్గదర్శకత్వంలో నా భార్య వైద్య శిబిరంలో వాలంటీర్ గా పనిచేసింది.  ఇపుడు ఆమెకి మందులు వాడకపోయినా మధుమేహవ్యాధి సమస్య కూడా నివారణయింది. 

ఈ అనుభవం ద్వారా సాయినాధులవారు తన భక్తులను ఎల్లవేళలా కంటికి రెప్పలా వారికి ఎటువంటి కష్టం లేకుండా కాపాడుతూ ఉంటారనే విషయం మనకి అర్ధమవుతుంది.

జై బాబా శ్రీ సచ్చిదానంద సాయినాధ్ మహరాజ్ కి జై

శ్రీ గురుదేవదత్త సద్గురు.

ఎస్. శ్రీనాధ్, ఎమ్.ఐ.ఇ.

నంద్యాల

(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)


Kindly Bookmark and Share it:

1 comments:

sai on December 22, 2021 at 9:08 AM said...

Sai ne Karunatho na biddaki kuda antha manchi Cheyyi thandri 🙏🙏🙏

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List