Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Tuesday, November 30, 2021

ఓమ్ శ్రీ సాయి కృపాకటాక్షమ్

Posted by tyagaraju on 7:20 AM

 




30.11.2021  మంగళవారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఈ రోజు మరొక అధ్బుతమయిన సంఘటన గురించి ప్రచురిస్తున్నాను.  బాబాకు తన భక్తుల మనోభావాలు అన్నీ అవగతమే అన్న విషయం శ్రీ సాయి సత్ చరిత్ర పారాయణ చేసినవారందరికీ తెలుసు. తన భక్తుల ఆరాటాన్ని, కోరికలను గమనించి దానికనుగుణంగా తన భక్తులను అనుగ్రహిస్తూ ఉంటారు.  దీనికి సంబంధించిన లీల శ్రీ సాయిలీల మాసపత్రిక ఫిబ్రవరి, 1972 వ.సంచికలో ప్రచురింపబడింది.

తెలుగు అనువాదమ్  : ఆత్రేయపురపు త్యాగరాజు

నిజాంపేట, హైదరాబాద్

ఓమ్ శ్రీ సాయి కృపాకటాక్షమ్

శ్రీ సాయిబాబా తన భక్తులయొక్క ఆరాటాన్ని అర్ధం చేసుకుని వారి కోరికలని తీర్చి సంతృపులను చేసిన లీలలు తెలుసుకోవడం సాయి భక్తులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. 


బాబా తన భక్తుని ఆరాటాన్ని తన లీల ద్వారా ఏవిధంగా తొలగించారో తెలిపే సంఘటన గురించి వివరిస్తాను.

మా అమ్మగారి వయస్సు 73 సంవత్సరాలు, నాభార్య వయస్సు 50 సంవత్సరాలు.  ప్రతిసంవత్సరం వెళ్ళేటట్లుగానే రెండు సంవత్సరాల క్రితం మేమందరం సాయినాధుని దర్శనానికి షిరిడీకి బయలుదేరాము.  షిరిడీలో మూడు రోజులున్నతరువాత షిరిడీ నుంచి మద్రాసుకు బయలుదేరాము. 

మేము మద్రాసునుండి బయలుదేరి షిరిడీకి వచ్చి అక్కడినుండి తిరిగి మద్రాసుకు చేరుకునే రోజు 9వ.రోజు అవుతుంది.  అంటే షిరిడినుండి బయలుదేరే రొజు 8 వ.రోజు.  అవుతుంది.  ఆకారణం వల్ల అయిష్టంగానే బయలుదేరవలసివచ్చింది. 

మా అమ్మగారికి నా భార్యకు మూఢనమ్మకం ఒకటి ఉంది.  ఇంటినుంచి బయలుదేరి తిరిగి ఇంటికి 9వ.రోజుకు రాకూడదు.  అది శుభకరం కూడా కాదని ఒక నమ్మకం.  పదవరోజు వినాయక చవితి అయింది.  అందుచేత ఇక మద్రాసుకు ఎట్టి పరిస్థితులలోను చేరుకోవలసిందే.  అందువల్ల కోపర్ గావ్ నుండి ధోండ్ జంక్షన్ కు చేరుకుని అక్కడ మద్రాసు జనతా రైలులో మద్రాసుకు 9 వ.రోజుకు చేరుకొని మరునాడు వినాయక వ్రతం చేసుకోవచ్చనే ఉద్దేశ్యంతో మా  తిరుగు ప్రయాణాన్ని ప్రారంభించాము.

తొమ్మిదవరోజుకు చేరుకోకూడదనే చింతని మామనసులోనుండి దూరం చేయడానికే అన్నట్లు బాబా తన లీలను చూపించారు.

మేము రైలులో కొండాపురం స్టేషన్ చేరుకునేటప్పటికి 9 వ.రోజు ఉదయం 6 గంటలయింది.  మామూలుగా అయితే అ సమయానికి రైలు రేణిగుంటకు చేరుకోవాలి.  అక్కడినుండి మద్రాసుకు ప్రయాణ సమయం 5 గంటలు.

మేము నిద్రనుండి లేచి చూసేసరికి జనతా రైలు ఆ సమయానికి కొండాపురం స్టేషన్ లో నిలిచి ఉంది.  ఇంకా ఇక్కడే ఉండటమేమిటని మాకు చాలా ఆశ్ఛర్యం వేసింది.  తరువాత తెలిసిన విషయం ఏమిటంటే ముందు స్టేషన్ లో (మంగపట్నం) గూడ్లు రైలుకు ప్రమాదం జరగడం వల్ల మేమెక్కిన రైలు తిరిగి బయలుదేర్అడానికి కొన్ని గంటలు పట్టవచ్చు.  6 గంటలపాటు మేము కొండాపురంలోనే ఉండిపోయాము.

ఆఖరికి మా రైలు కదిలింది. కాని ముందు స్టేన్ ఔటర్ సిగ్నల్ దగ్గరే ఆగిపోయింది.  పట్టాలు తప్పిన గూడ్సు రైలు వల్ల మారైలు వెళ్ళేమార్గంలో అడ్డంకులు ఉన్నందున ముందుకు వెళ్ళలేని పరిస్థితి అయింది.  రైలులో ఉన్న ప్రయాణీకులందరినీ వేరే విధంగా తరలించాల్సి ఉంటుంది.  అక్కడ ఏ ఒక్క కూలీ గాని, ఇతర ప్రయాణసాధనాలు గాని లేవు.  ఇక అదరాబాదరాగా మాసామానులన్నిటినీ మోసుకుంటూ మండుటెండలో మద్రాసు వెళ్ళే మార్గంలో ఔటర్ సిగ్నల్ కు అరమైలు దూరం నడచుకుంటూ వెళ్లాము.  అక్కడ బొంబాయి వెళ్ళే మైల్ ఆగి ఉంది.  అందులోకి అతి కష్టంమీద ఒక బోగీలోకి ఎక్కాము.  అన్ని బోగీలు ప్రయాణీకులతో కిటకిటలాడుతూ ఉన్నాయి.  మేము బోగీ తలుపు దగ్గర నిలబడ్దాము.  బొంబాయి వెళ్ళే మైల్ ను మద్రాసు జనతా రైలుగా మార్చి, మద్రాసు జనతా – బొంబాయి మైల్ గా మార్చారు.

ఇక్కడ మేము దాదాపు మూడు నాలుగు గంటలపాటు ఉండిపోయాము.  సాయంత్రం 6 గంటలకు కడప చేరుకున్నాము.  అప్పటికి కూర్చోవడానికి కాస్త స్థలం దొరికింది.  మధ్యాహ్నం ఆర్కోణం జంక్షన్ కి చేరుకోవాల్సిన రైలు అర్ధరాత్రికి చేరుకుంది.  ఆవిధంగా పదమూడు గంటలు ఆలస్యమయింది.

అంత రాత్రివేళ (2 గంటలకు) మద్రాసు వెళ్లడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదని భావించి, ఆర్కోణంలో దిగి అక్కడే మద్రాసుకు వెళ్ళే లోకల్ రైలులోకి ఎక్కి పడుకున్నాము.  ఆ రైలు తెల్లవారుజాము మూడు గంటలకు బయలుదేరి ఉదయం 6 గంటలకు మద్రాసుకు చేరుకుంటుంది.

మేము ఆరైలులోనే పడుకుని ఉదయ 6 గంటలకు మేలుకున్నాము.  అప్పటికి రైలు మద్రాసు చేరుకుంది. ఆరోజు పదవరోజు, వినాయకచవితి.  ఆవిధంగా మేము అనుకున్నట్లే పదవరోజుకి మద్రాసు చేరుకొని అదేరోజు వినాయక చవితిని ఆనందంగా జరుపుకొన్నాము.  ఎంతటి అధ్బుతమయిన లీల! ఈ సంఘటన అనుభవం ద్వారా బాబా తన భక్తుల మదిలోని ఆలోచనలను గ్రహించి దానికనుగుణంగా వారి కోరికలను ఏవిధంగా తీరుస్తారో మనం గ్రహించుకోవచ్చు.

ఈ సంఘటన భక్తులు సాయికి సర్వశ్య శరణాగతి చేసుకోమని చెప్పినట్లే కదా! ఆయన మన యోగక్షేమాలను కనిపెట్టుకుని మనలని అనుగ్రహిస్తారు.  నేనుండ భయమేల?


సాయికి శిరసువంచి నమస్కారం చేసుకుంటున్నాను.

సర్వేజనా సుఖినోభవంతు.

బి.ఆర్. ఆర్

సాయిదాస్

(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)

 


Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List