25.11.2022 శుక్రవారమ్
ఓమ్
సాయి శ్రీ సాయి జయజయ సాయి
శ్రీ మాత్రే నమః
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ
సాయి దయా సాగరమ్ 47 వ, భాగమ్
అధ్యాయమ్
– 46
మరాఠీ
మూలగ్రంధ రచయిత్రి --- శ్రీమతి ఉజ్వలా బోర్కర్, విలేపార్లే - ముంబాయి
ఆంగ్లానువాదమ్
--- శ్రీ ఉదయ్ అంబాదాస్ బక్షి
తెలుగు
అనువాదమ్ --- ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట,
హైదరాబాద్
9440375411 & 81436267
శ్రీ
సాయి సత్ చరిత్ర 16 వ.అధ్యాయమ్
బాబా
సమాధినుండి వచ్చారు
అది
ఆగస్టు నెల (శ్రావణమాసం) 2001 వ.సంవత్సరం.
ఆ రోజుల్లో మిరేన్ గారు సామూహిక సాయి సత్ చరిత్ర పారాయణ మహోత్సవాలను నిర్వహిస్తూ
ఉండేవారు. మిరేన్ గారితొ నాకు మంచి సంబంధబాంధవ్యాలు
ఉండేవి.
నేను
ప్రతిసంవత్సరం షిరిడీలో సాయిబాబా ముందు కూర్చుని భజనపాటలు పాడుతూ ఉండేవాడిని. ఈ సంవత్సరం కూడా నేనొక పాట పాడాను. మరునాడు నేను మిరేన్ గారిని కలుసుకోవడానికి వెళ్ళాను. ఆయన నన్ను కీర్తనలు పాడమని అడిగారు. ఇది వినగానే నేను ఒక్కసారిగా అదిరిపడ్డాను. కారణమేమిటంటే నేనింతవరకు ఎపుడూ కీర్తనలు పాడలేదు. కాని షిరిడీలో కీర్తనలు పాడటానికే నిర్ణయించుకున్నాను. నన్ను ఆవిధంగా ప్రోత్సహించమని బాబాను ప్రార్ధించుకున్నాను. దానికి తగ్గట్లు ఏర్పాట్లు చేసుకోవడం మొదలుపెట్టాను. కీర్తనల గురించి తెలుసుకోవడానికి ఎన్నో పుస్తకాలను
చదివాను. నా అంశం శ్రధ్ధ, సబూరి. కీర్తనలు పాడే సమయంలో నేను ఎటువంటి కాగితాలను ఉపయోగించదలచుకోలేదు. అందుచేత కీర్తనలు ఏవిధంగా పాడాలన్నదాని మీద బాగా
శ్రమించాను.
ఆఖరికి కీర్తనలు పాడేరోజు వచ్చింది. కీర్తనలు పాడటానికి వేదికమీద కూర్చున్నాను. ముందుగా సాయిని ప్రార్ధించుకున్నాను. అపుడు సమయం సాయత్రం గం.6.30 ని. అయింది. నేను బాబాకు శిరసువంచి నమస్కరించుకుని, “బాబా నువ్వే నన్ను కీర్తనలు పాడటానికి ఇక్కడకు తీసుకువచ్చావు. నువ్వు శ్రోతలమధ్యలోకి వచ్చి కూర్చోవాలి. నేను పాడే కీర్తనలు వినాలి. నువ్వు తప్పకుండా రావాలి” అని ప్రార్ధించాను. కొద్ది నిమిషాలలోనే శ్రోతలమధ్యలో భుజాలమీదుగా ఆకుపచ్చరంగు శాలువా కప్పుకుని నావైపే చూస్తున్న బాబా కనిపించారు.
నేను ‘గురుబ్రహ్మ గురుర్విష్ణుః’ శ్లోకంతో ప్రారంభించాను.
అప్పటినుండి రెండుగంటలపాటు పూర్తిగా లీనమైపోయి కీర్తనలు పాడాను. కార్యక్రమం పూర్తవగానే శ్రోతలందరూ నాచుట్టూ గుమిగూడి
నన్ను, నేనిచ్చిన ప్రదర్శనని ఎంతగానో పొగడుతూ ఉంటే నేను మాత్రం ఆగుంపులో సాయిని చూస్తున్నాను. ఆయన అదృశ్యమయ్యి తిరిగి సమాధిలోకి వెళ్ళారు.
మనఃస్ఫూర్తిగా
మనం సాయిని వేడుకుంటే ఆయన మనలను అనుగ్రహించి తను ఉన్నాననే విషయాన్ని ధృఢపరుస్తారు.
అల్కా
రిస్వద్ కర్
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment