08.11.2021 సోమవారమ్
ఓమ్
సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబా వారి శుభాశీస్సులు
బాబా నాప్రక్కనే ఉన్నారా?
ఈ
రోజు మరొక అధ్భుతమయిన బాబా లీలను ప్రచురిస్తున్నాను. వాట్సాప్ లో వచ్చిన ఈ లీలను తెలుగులోకి అనువాదం
చేసి ప్రచురిస్తున్నాను. ఇందులో భక్తురాలి
పేరు ఎక్కడా వ్రాయబడలేదు.
--------------------------------------------
సాయిబాబా నాకు ప్రసాదించిన అత్యధ్బుతమయిన అనుభవాన్ని
నేనిపుడు మీతో పంచుకుంటాను. ఆయన నాకు కలిగిన
సమస్యనుండి బయట పడవేయటమే కాదు ఆయన ప్రత్యక్షంగా వచ్చారని తెలిసాక నా ఆనందానుభూతిని
వర్ణించడానికి మాటలు చాలవు.
నేను
25వ.తారీకున న్యూఢిల్లీ నుండి దుబాయికి ప్రయాణించడానికి విమానాశ్రయానికి చేరుకున్నాను. కాని నేను ప్రయాణించడానికి కావలసిన పత్రాలలో దిద్దుబాటు
చేయడానికి కూడా వీలులేని తీవ్రమయిన సమస్య వచ్చింది. అందువల్ల నేను దుబాయికి ప్రయాణించడానికి అనుమతి
లభించలేదు. చెక్ ఇన్ కౌంటర్ కూడా మూసేసారు. అక్కడే ఉన్న అధికారులతో ఎంతగా వాదించినా లాభం లేకపోయింది. అక్కడ తెల్లటి చొక్కా ధరించిన వ్యక్తి ఒకడు ఉన్నాడు. అతనికి నావిషయంలోఎటువంటి సంబంధం లేకపోయినా తనంతతానుగా
పై అధికారులతో మాట్లాడాడు. అతను వారిని ఏవిధంగా
ఒప్పించగలిగాడో తెలియదు గాని 20 నిమిషాల క్రితమే కౌంటర్ మూసేసినా గాని, నా ప్రయాణానికి అనుమతి
లభించేలా చేసాడు. దుబాయికి చేరుకున్న తరువాత మా మేనేజరు చెప్పిన విషయం. మా మేనేజర్ సిక్కు మతస్థుడు. ఆయనకి నేను విమానాశ్రయంలో తెల్లటి కుర్తా ధరించి
ఉన్నట్లుగా దృశ్యం కనపడిందని (ఆరోజు నేను నిజంగానే తెల్లటి కుర్తా ధరించాను. ఈ విషయం ఆయనకి ఎలా తెలిసిందో నాకు అర్ధం కాలేదు)
నా ప్రక్కనే కాషాయరంగు దుస్తులు ధరించి సాయిబాబా నుంచుని ఉన్నారని చెప్పారు. నా ప్రక్కన ఉన్న సాయిబాబా “ఏమీ ఆందోళన చెందకు ,
నేను నీతోనే ఉన్నాను. ఈ రోజే నిన్ను తీసుకువెడతాను”
అని నాతో అన్నారట.
సాయిబాబాయే
తెల్లటి చొక్కా ధరించిన వ్యక్తిగా వచ్చి విమానాశ్రయంలో పై అధికారులతో మాటలాడి నాకు సహాయం చేసారని అప్పుడు నాకర్ధమయింది. ఆయన నాకు ప్రసాదించిన ఈ అధ్భుతమయిన అనుభూతిని ఆయన
అనుగ్రహాన్ని నేనెలా వర్ణించగలను? బాబా విగ్రహం
ముందు కళ్ళంబట కన్నీరు కారుతుండగా వెక్కి వెక్కి ఏడిచాను. ఆయన నాకింత అనుగ్రహాన్ని నామీద కురిపించినందుకు
నా ఒడలంతా పులకరించింది. ఇంతకు ముందు కూడా
నాకిటువంటి అనుభవాలే కలిగాయి. బాబా నిరంతరం
నాతోనే ఉన్నారని నా ప్రగాఢ విశ్వాసం. నేను
బాబాచే దీవించబడ్డ ఆయన బిడ్దను. నాకింకేమి
కావాలి. ఆయన తోడుంటే చాలు.
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment