Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Monday, July 13, 2020

సాయిబాబాకు వారసులు గాని శిష్యులు గాని లేరు – 4 వ.భాగమ్

Posted by tyagaraju on 7:38 AM
     HOW AND WHY MAZAAR(TOMB) OF A MUSLIM FAQIR PIR SHIRDI SAIBABA WAS ...
           Rose Png Tumblr Images Baptism Pinterest Pink Roses, - Hd Pink ...
13.07.2020  సోమవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు.
  బాబా ఎవరినీ తన శిష్యులుగా చేసుకోలేదుఆయనకు వారసులు కూడా లేరు సమాచారమ్ shirdisaisevatrust.org చెన్నై వారినుండి గ్రహింపబడినది.
(సాయిలీల పత్రిక నవంబరు, డిసెంబరు 1983 సంచికలో పునర్ముద్రితం.)
తెలుగు అనువాదం --  ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేటహైదరాబాద్
ఫోన్.  9440375411 , 8143626744

సాయిబాబాకు వారసులు గాని శిష్యులు గాని లేరు – 4 .భాగమ్
(రచయిత కీ.శే. డి. శంకరయ్య)
వ్యాసాన్ని shirdisaisevatrust.org  నుండి యధాతధంగా అనువాదం చేసి ప్రచురిస్తున్నానుఅందువల్ల ఇందులో తెలియపరచబడిన అభిప్రాయాలన్నీ శ్రీ శంకరయ్యగారివేనని గ్రహించవలెను.)

బాబా ఎప్పుడు పుట్టారో తెలియదు అందువల్ల బాబా జన్మదినం రోజున ఆయన భక్తులు గురుదక్షిణ సమర్పించే సందర్భమే రాదుఆయన జన్మతేదీయే కనక తెలుసుంటే కొంతమంది బాబాలకు వచ్చినట్లుగానే ఆయనకు కూడా లక్షలాది రూపాయలు గురుదక్షిణగా వచ్చి ఉండేవి



బాబాలందరూ గురుదక్షిణకు వచ్చిన సొమ్ముని ఒక మంచి కార్యానికి ఉపయోగిస్తామని చెబుతారు గాని, ప్రతిమానవుడిలోను అంతర్గతంగా ఉన్న శక్తిని మేల్కొలపడంకన్న మంచి కార్యం ఇంకేమన్నా ఉంటుందావారంతా తమ శక్తిని భక్తులలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించడానికి ఉపయోగించాలిఒక ఆధ్యాత్మిక గురువు ఉన్నాడంటే అతను తన భక్తులలో ఆధ్యాత్మిక ప్రభావాన్ని కలిగించాలిబాబా తన భక్తులనుండి ఆశ్రమాలు గాని మఠాలుగాని, భవనాలను గాను కట్టుకోవాలని ఎప్పుడూ ఆశించలేదుఆయన పాడుబడిన మసీదులోనే నివసించారుకాని, మసీదుకు కొన్ని మరమ్మత్తులు జరిగాయిబాబా ప్రకృతి మీదనే ఆధారపడ్డారుఇపుడు బాబాలకు ఉన్నట్లుగా ఆయనకు .సి. లు గాని, ఫానులు గాని లేవుభగవంతుడు సూచించిన కొంతమంది భక్తులనుండి మాత్రమే ఆయన దక్షిణ అడిగిపుచ్చుకొనేవారుఅందులో ఎటువంటి సందేహం లేదుఆయన ఎపుడూ బ్యాంకులో ఖాతా తెరచి డబ్బు దాచుకోలేదుబాబా తన భక్తులలో వివేకము, వైరాగ్యము గురించి బోధించడానికే దక్షిణ అడగటంలోని ముఖ్యోద్దేశంరోజులో వచ్చిన దక్షిణనంతా సాయంత్రమయేసరికి పంచిపెట్టేసేవారుచివరికి ఆయన మహాసమాధి చెందేనాటికి ఏడు రూపాయలు మాత్రమే మిగిలాయివాటిని బాబా అంత్యక్రియల నిమిత్తం ఖర్చు చేసారు.

విధంగా బాబా నిశ్చింతగా 60 సంవత్సరాలు షిరిడీలో నివశించారుమహాసమాధి చెందిన తరువాత కూడా బాబా లీలలను ఎవరయినా తెలుసుకోదలిస్తే సాయిబాబా సంస్థానము వారు ప్రచురించిన శ్రీ సాయిలీల అనే పుస్తకం చదివి తెలుసుకోవచ్చుఇతరులు చెప్పిన అనుభవాలను విని ఆనందపడేకన్నా, మీ మీ అహంకారాలను ప్రక్కన పెట్టి ఆయనకు శరణాగతి చేసినట్లయితే మీకు కూడా ఆయన అనుభవాలనిస్తారు.

మఠాలు/ఆశ్రమాలు ఉన్నాయంటే సాంప్రదాయం ప్రకారం వాటి అధిపతులు తమ తదనంతరం తమ వారసులు ఎవరో ముందే నిర్ణయిస్తూ ఉంటారుమన సాయిబాబా ఏభక్తుడిని  కూడా తన తదనంతరం వారసుని గాని, తన శిష్యుడని గాని ప్రకటించలేదు.

సాయిబాబా తరువాత తామే అవతారాలమని చెప్పుకునే గురువులు/బాబాలు/స్వామీజీలు విషయాలను గురించి తీవ్రంగా ఆలోచించి తమతమ మాయాజాల శక్తులన్నిటినీ ద్వారకామాయిలోని ధునిలో దహింపచేయాలని, క్రొత్తగా ఆధ్యాత్మిక జీవనాన్ని ప్రారంభించి సాయి తత్త్వాన్ని ప్రజలకు అందించాలని సలహా ఇస్తున్నాను.

బాబా తరువాత తమదే అధికారమని, వారసులమని, శిష్యులమని, అవతారాలమనే ప్రామాణికం లేని వాదనలవల్లనే బహుశ సాయి సంస్థానంవారుసాయికి ఎవరూ వారసులు గాని, శిష్యులు గాని లేరుఅనే ప్రకటనని తమ కార్యాలయంలో ఏర్పాటు చేసి ఉండవచ్చు.

డి. శంకరయ్య

(సమాప్తమ్)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)

Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List