Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Tuesday, July 19, 2011

బాబా నాకు బహుమతిగా ప్రసాదించిన దండ - గణేష్ అనుభవం

Posted by tyagaraju on 4:01 AM


19.07.2011 మంగళవారము క్యాంప్: బెంగళూరు

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంథువులకు బాబా వారి శుభాశీస్సులు

బాబా నాకు బహుమతిగా ప్రసాదించిన దండ - గణేష్ అనుభవం


ఈ రోజు శ్రీమతి ప్రియాంకాగారి ఆంగ్ల బ్లాగులో 16 తేదీన ప్రచురింపబడిన బాబా లీలను తెలుగులోనికి అనువదించి ప్రచురిస్తున్నాను.

ప్రపంచంలో మనం చూసేదంతా మాయ (భ్రమ). మనం చూసేవన్ని సత్యాలు కావు. నిజంగా ఉన్నదేమిటనటే పరిశుధ్ధమైనది అదే మనకి జ్ఞానాన్ని కలిగించి నేత్రాలని తెరిపించే సద్గురువు, ఉన్నది ఉన్నట్లుగా కాకుండా వాటి నిజస్థితిని తెలియచెప్పి మన కన్నులను తెరిపిస్తుంది. అందుచేత మనకు నిజమైన అంతర్దృష్టినివ్వమని బాబాను ప్రార్థించాలి.

నేనీరోజు ఒక చక్కటి బాబా లీలను మీకు అందిస్తున్నాను. మనం ఆర్తితో బాబాని రూపంలోనైనా సరే (స్వప్నము, ఫోటో, విగ్రహం, వగైరా) చూడాలనుకున్నప్పుడు ఆయన మనకోరిక తీరుస్తాడు. అది భక్తునియొక్క కోరికని బట్టి దానికి అనుగుణంగా జరుగుతుంది. బాబా ఆరతిలో కూడా దీనిని గురించి ఉంది.

అందుచేత సోదరుడు గణేష్ బాబా అనుభూతిని చదవండి. బాబాకి మనకోరికలన్నీ తెలుసని, మన స్వచ్చమైన కోరికలను ఆయన మరుక్షణమే తీరుస్తారని, మనకు కావలసినదల్లా ఆయనయొక్క అనంతమైన శక్తులపై నమ్మకం ఉండటమె అని లీల ఋజువు చేస్తుంది. గణేష్ గారూ, మా అందరితో కలిసి మీ అనుభవాన్ని పంచుకుంటున్నందుకు నా హృదయ పూర్వక థన్యవాదములు.

ఇవన్నీ కూడా చాలా చిన్న చిన్న విషయాలు, ఇవన్నీ మనలనందరినీ ఒకటిగా చేసి జీవితంలో ముందుకు వెళ్ళడానికి థైర్యాన్నిస్తుంది, మనకు దారిలో యెన్ని కష్టాలు వచ్చినా సరే వాటితో సంబంథం లేదు, మనం ఆయన బిడ్డలం అందుచేత మన అంతిమ గమ్యం తప్ప మిగతావాటి గురించి పట్టించుకోనవసరం లేదు.

ఓం సాయి !

సోదరి సాయిప్రియాజీ

మీరు మీ వెబ్ సైట్ ద్వారా యెంతో సేవ చేస్తున్నారు.

అందులోనున్న లీలలను చదివినప్పుడు నాకదీపారమైన సంతోషాన్ని, విశ్వాసాన్ని కలుగచేస్తోంది.

ప్రస్తుతం నా ఉద్యోగం పోయినందువల్ల నేను చాలా క్లిష్ట పరిస్తితుల్లో ఉన్నాను, మరో ఉద్యోగాన్ని వెతుక్కుంటున్నాను. బాబా ఆశీర్వాదములతో నాకు త్వరలోనే స్థిరమైన ఉద్యోగం వస్తుందని నాకు ఖచ్చితంగా తెలుసు.

సాయి నన్ను దండతో అనుగ్రహించిన లీలని మీకందరకూ ఇప్పుడు చెపుతాను. (ఇది జూన్ 30 తేదీన జరిగింది).

నా ఉద్యోగం పోయింది (ఖర్చులు తగ్గించుకునే కారణంగా) ప్రస్తుతం ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాను. సాథారణంగా నేను మా యింటికి 6 కి.మీ. దూరంలో 'గౌరివాక్కం" లో ఉన్న సాయి గుడికి వెడుతూ ఉంటాను. నేను ఈ గుడికి శనివారం/ఆదివారం వెడుతూ ఉంటాను.

మాయింటికి 15 కి.మీ. దూరంలో "గిండీ" అనే ప్రదేశంలో మరొక సాయి గుడి ఉంది. ఇక్కడ గుడిలో సాయి విగ్రహం అద్వితీయంగా నలుపు రంగులో ఉంటుంది
సాథారణంగా సాయి విగ్రహాలన్నీ తెలుపు రంగులో ఉంటాయి. నాకు తెలిసున్న మట్టుకు ఈ గుడిలో మాత్రమే సాయి విగ్రహం నలుపు రంగులో ఉంది. ఈ మందిరం నేను ఆఫీసుకు వెళ్ళే దారిలో ఉంది. నేను ఉద్యోగానికి రాజీనామా చేసేముందు (మూడు వారాల క్రితం) ఈ గుడికి వెళ్ళి నాకు తొందరలోనే సరియైన ఉద్యోగం రావాలని సాయిని ప్రార్థించాను. ఈ మందిరాన్ని దర్శించిన తరువాత నాకు యింతో ప్రశాంతత లభించింది.
.

నేను ఒక గురువారమునాడు ఈ గుడికి వెడదామనుకున్నాను. (రెండు వారాల క్రితం). అంచేత నేను నా భార్యతో కూడా రైల్వే స్టేషన్ కి వెళ్ళి దిగి అక్కడినించి ఈ గుడికి వెడదామనుకున్నాను. నా భార్య, మనం యెప్పుడూ గౌరివాక్కాం గుడికే వెడుతున్నాముగా అంచేత ఆ గుడికే వెళ్ళండి అంది.

అందుచేత నేను యెప్పుడూ వెళ్ళే గౌరివాక్కం సాయి గుడికే వెళ్ళి నాకు తొందరలోనే ఉద్యోగం ఇమ్మని సాయిని ప్రార్థించాను. గిండీలో ఉన్న నలుపు రంగులో ఉన్న సాయివిగ్రహం ఉన్న గుడికి వెళ్ళలేకపోయినందుకు నాకు కొంచెం నిరాశ కలిగింది.

కిందటి గురువారం మేము పుట్టినరోజు పార్టీకి వెళ్ళి యింటికి తిరిగి వస్తున్నాము. దారిలో మా కారుకి కొంచెం ట్రబుల్ రావడం వల్ల కారు ఆపవలసివచ్చింది. పొగ కూడా రావడం వల్ల, మరలా డ్రైవింగ్ చేయడానికి అరగంట పడుతుందని డ్రైవర్ చెప్పాడు. నేను బయటకు చూసేటప్పటికి, గిండీ లో ఉన్న సాయి మందిరానికి వెళ్ళే సందు వద్దే సరిగ్గ మాకారు ఆగిపోవడంతో నాకు ఆశ్చర్యం వేసింది. నేను నా భార్యతో కనీసం యిప్పుడైనా ఆ మందిరానికి వెళ్ళి వస్తానని చెప్పి గుడివైపు నడవటం మొదలు పెట్టాను. అప్పుడు రాత్రి 8.45 అవుటుండటంతో గుడి కూడా మూసే ప్రయత్నంలో ఉన్నారు.

రెండు నిమిషాలలో నేనక్కడకు చేరుకుని సాయిని నా కర్మలన్నిటినీ తొలగించి తొందరలోనే నాకు ఉద్యోగం ఇచ్చి అనుగ్రహించమని ప్రార్థించాను. వెంటనే పూజారి గులాబీల దండ ఇచ్చారు, నాకు నోట మాట రాలేదు, యెంతో అనుభూతి చెందాను. దండ బహూకరించినందుకు నేను సాయికి థన్యవాదములు తెలుపుకున్నాను (గురువారమునాడు వచ్చిన బాబా ప్రసాదం అది) , బాబా త్వరలోనే నా కోరిక తీరుస్తారని గట్టి నమ్మకం యేర్పడింది.

ఈ గుడికి వెడదామని ముందర మేము అనుకోలేదు. పుట్టినరోజు పార్టీకి వెళ్ళి తిన్నగా యింటికి వచ్చేద్దామనుకున్నాము. కాని బాబా నిర్ణయం, నేను ఈ మందిరాన్ని దర్శించాలని, అందుచేతనే కారు ఆగిపోయింది. బాబా మాయందు చూపిస్తున్న ప్రేమకి మాకు చాలా సంతోషం వేసింది. నేను 5 నిమిషాలు తరువాత కనక వెళ్ళి ఉంటే గుడి మూసేసి ఉండేవారు.

సాయి యెప్పుడు మనతోనే ఉంటారని చెప్పడం కోసమే నేను ఈ అనుభవాన్ని మీకు చెపుతున్నాను, ఆయన మన సమస్యల నించి రక్షిస్తూ ఉంటారు, అనుకూలంగా సంజ్ఞలతోనూ, భంగిమలతోనూ తెలియ చేస్తూ ఉంటారు.

అందరికీ కూడా ఆరోగ్యాన్ని, శాంతిని ప్రసాదించమని బాబాని ప్రార్థిస్తున్నాను.

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు


Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List