07.05.2016
శనివారమ్
ఓమ్
సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
బాబా
వారు సాయిబానిస గారికి ప్రసాదించిన ఆధ్యాత్మిక జీవితం పై మరికొన్ని సందేశాలు.
శ్రీసాయి
పుష్పగిరి - ఆధ్యాత్మిక జీవితం – 8 వ.భాగం
21.10.2006
71. ప్రేమ
అనుబంధాలు లేకుండా ఏ మనిషి నీదగ్గిరకు రాడు. అదే
ఋణానుబంధము. ఆ
వచ్చిన వ్యక్తిని ఆదరించి వాని ఋణము తీర్చుకో. లేకపోతే
మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తి
వాని ఋణము తీర్చుకోవలసి ఉంటుందని
గ్రహించు.
10.11.2006
72. అరవై
సంవత్సరములు నిండిన సందర్భంలో షష్టి పూర్తి పేరిట తిరిగి పెళ్ళి
కార్యక్రమాలు చేసుకున్న దంపతులలో నీకు తెలిసినవారిలో ఎంతమంది
ఇంకా జీవించి ఉన్నారో ఆలోచించు. రోజూ
నీతో కలిసి ఆఫీసుకు వెళ్ళి
నేడు పదవీ విరమణ అయినవారిలో
ఎంతమంది మరణించలేదు. ఆలోచించు. జీవించడం
శాశ్వతం కాదు. మరణాన్ని
తప్పించుకోలేము. మరి
తప్పించుకోలేని దాని గురించి ఆలోచించడం మాని భగవంతుడిని స్మరించుకో.
26.12.2006
73. శ్రీసాయి
నీలోను నాలోను మనందరిలోను ఉన్నారు. అంటే
ఈ శరీరము మనది కాదు సాయిది
అని భావించు. మన
గురువు శరీరము మన దగ్గిర ఉన్నపుడు ఆ శరీరాన్ని చక్కగా
కాపాడుకోవాలి. ఆరోగ్యంగా ఉంచుకోవాలి. శరీరం
ఆరోగ్యంగా ఉన్నపుడే ప్రాపంచిక రంగములోను ఆధ్యాత్మిక రంగములోను మనము ముందుకు పయనించగలము.
--- సాయిబానిస
31.12.2006
74. నీకు
అన్యాయం జరుగుతున్న సమయంలో నీ బంధువులు తమాషా చూస్తూ నీకు
ఉపకారం చేయడంపోయి నీకు మరికొన్ని చికాకులు
తెచ్చిపెడతారు. అందువలన
అపాయాలు రాకుండా ఉపాయంగా జీవిస్తూ జీవితాన్ని ముందుకు నడిపించు.
31.12.2066
75. కొందరు
మొండివాళ్ళు తమ బలముతో ఇతరుల
ఇళ్ళలోకి వెళ్ళి ఆయింటివాళ్ళను
ఇబ్బంది పెడతారు. తమ
ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. అటువంటివారిని
మన ఇంటిలోనికి రాకుండా జాగ్రత్తపడవలసిన అవసరం మనకు ఉంది.
06.01.2007
76. గతానికి
నీవు సాక్షీ భూతుడిగా నిలిచిపో. వర్తమానంలో
ప్రశాంతంగా జీవించు.
11.01.2007
77. ఈనాడు
న్యాయస్థానాల్లో ఒకరికి న్యాయం వందల మందికి అన్యాయం
జరుగుతున్నదని తెలిసినా ఎవరూ పట్టించుకోవటంలేదు. న్యాయదేవత
న్యాయస్థానంలో బందీగా ఉన్నంతకాలము ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉండాలి.
12.01.2007
78. జీవిత
ప్రయాణంలో మనం వద్దనుకున్నా ఇతరులతో
స్నేహం చేయవలసివస్తుంది. వారితో
మాట్లాడటం తప్పుకాదు. ఆ
మాత్రం పరిచయానికే
అది గొప్ప స్నేహ బంధంగా భావించి
జీవించటం తలనొప్పికి మూలమవుతుంది.
79. ఋణానుబంధము
వలననే మన కుటుంబ సభ్యులందరూ
ఒకరికొకరం కలుసుకుంటాము. మరి
అటువంటప్పుడు క్రిందటి జన్మ వివరాలు తెలుసుకోవడం
అవసరం లేదు కదా. ఒకవేళ తెలుసుకుంటే అది
ఈ జన్మలో మన ప్రశాంత జీవితాన్ని
భంగపరుస్తుంది. అందువలన
గత జన్మ విషయాలు తెలిసికోకుండానే ఈ జీవితాన్ని ముందుకు
కొనసాగించు.
80. మంచిమనసుతో
తోటివారికి సుఖసంతోషాలు పంచేవారే మానవులమధ్య ఉన్న దేవతలు. అదే కష్టాలను ప్రసాదించేవారు
మానవుల మధ్య ఉన్న రాక్షసులు
అని గుర్తించు.
(మరికొన్ని
సందేశాలు తరువాతి సంచికలో)
(సర్వం
శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment