Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Wednesday, August 22, 2012

శిఖరాలు - లోయలలో శ్రీ సాయి (రెండవభాగము) - 10

Posted by tyagaraju on 4:37 AM


22.08.2012  బుధవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు



            
                                  

శిఖరాలు - లోయలలో శ్రీ సాయి (రెండవభాగము) - 10

86.  మనము ఎక్కడ నివాసము ఏర్పరుచుకుంటే అదే మనఊరు. అక్కడివాళ్ళే మనవాళ్ళు. మనం వాళ్ళతో కలసిపోయి జీవితములో ఒడిదుడుకులు లేకుండ చూసుకోవాలి.

     - 04.07.93



87.  చదువు చేప్పే గురువుని నేనే

     నేర్చుకొనే శిష్యుడుని నేనే

     దానము ఇచ్చే దాతను నేనే

     దానము స్వీకరించే గ్రహీతను నేనే.

     - 11.07.93

88.  నీతల్లిదండ్రుల ఋణము ఎలాగూ తీర్చుకోలేదుకనీసము వాళ్ళ దశదిన కర్మలునాడు అన్నదానము చేసి వాళ్ళ ఋణము తీర్చుకో

     - 11.07.93

89.  నీగురువు పాదాలను గట్టిగా పట్టుకోపట్టు వదలరాదు.  
అపుడు నీలో జ్ఞాన దీపాలు వెలిగి చీకటి తొలగిపోతుంది.

     - 15.07.93

90.  నీబరువు బాధ్యతలు తీరిపోయిన - కర్మలను ఆచరించటానికి సంపాదన అవసరమునీలో ఆరోగ్యము ఉన్నంత వరకు సంపాదన చేయటము కూడా నీవు ఆచరించవలసిన కర్మలలో ఒక భాగమే.

     - 15.07.93

91.  నీతోడపుట్టినవాడు నీకంటే ఎక్కువ ధనము సంపాదించినాడని అసూయనీకంటే తక్కువ హోదాలో యున్న వ్యక్తి నీసహపంక్తిలో భోజనము చేసినాడు అనే ద్వేషము - ఉన్నంతకాలము నానుండి ప్రేమను పొందలేవు

     - 16.07.93

92.  పాలలో నీరు పోసిన రోజున ఆపాలు పలచన అవుతాయిశ్రీసాయి అనేపాలలో భక్తి అనే నీరుపోసిన ఆపాలు చిక్కబడుతాయిశ్రీసాయి అనే సూర్యుని కిరణాలు నీయింట వికసించనీ,  జ్ఞానపుష్పాలుపై పడగానే అవి వికసించుతాయి.

     - 17.07.93

93.  స్నేహితుల దగ్గర, బంధువుల దగ్గర అప్పు చేయవద్దునీవు చేసిన అప్పులు ఆఖరికి నీశవపేటికకు వాడే మేకులు కొనడానికి మాత్రమే పనికి వస్తాయి -   జాగ్రత్త.


     - 19.07.93

94.  నీవు భోజనము చేస్తున్నపుడు నీప్రక్కవాడికి భోజనము పెట్టడము ధర్మమువాడు నిరాకరించినాడు అని బాధపడటము నీ అవివేకమువాడు భోజనము చేసిన తర్వాత నీకు కృతజ్ఞత చెప్పలేదు అని తలంచటము నీమూర్ఖత్వము.

     - 22.07.93

95.  నీవు ఎంత గొప్ప పదవిలో యున్నా నిరాడంబర జీవితానికి గుర్తుగా నీతోటివానితో కలసి భగవంతుని ప్రార్ధించునీతోటివానితో కలసి సహపంక్తి భోజనము చేయిఏకాంతముగా యున్నపుడు కటిక నేలమీద నిద్రించు

     - 24.07.93

96.  ఈద్వారకామాయిలో పూజల కోసము, నమాజు చేసుకోవటానికి వచ్చే భక్తులను వారివారి గమ్య స్థానాలకు చేరవేసే బస్సు డ్రైవరును నేనే.


     - 27.07.93

97.  నీవు ఆధ్యాత్మిక రంగములో ఒకేసారి అన్ని మెట్లు ఎక్కగలను అనే అహంకారముతో పరిగెత్తి మెట్లు ఎక్కితే జారిపడిపోగలవు జాగ్రత్త.

     - 26.07.93

98.  నీకు పిల్లలు జన్మించలేదని బాధపడవద్దు అనాధశరణాలయములోని పిల్లలు నాపిల్లలేనీవు వారితో కలసిమెలసి పిల్లలు లేని లోటు తీర్చుకో.

     - 27.07.93

99.  నీతోటివారికి ఆకలి వేసినపుడు నన్ను తలచుకొని వానికి అన్నముపెట్టు.  
అది నాకే చెందుతుంది.  నీతోటివానిపై అసూయ, ద్వేషాలు పెంచుకొన్న అవి నిన్నే దహించి వేస్తాయి.

     - 28.07.93


100. "సబ్ కా మాలిక్ ఏక్ హై" - అల్లా మాలిక్ హై " అని ఆనాడు మీకు చెప్పినాను.  
                                                       
ఈనాడు మీకు చెప్పేది వినండి. "హం సబ్ కా ఖూన్ ఏక్ హై - సాయి ఉస్ ఖూన్ కా తాకత్ హై".

    - 10.08.97

(యింకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు




Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List