12.06.2016 ఆదివారం
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయి బానిసగారికి బాబా వారు ప్రసాదించిన ఆధ్యాత్మిక సందేశాలు మరికొన్ని.
సంకలనం: ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట్, హైదరాబాద్
శ్రీసాయి పుష్పగిరి - ఆధ్యాత్మికం - 19వ.భాగం
12.10.2011
181. సమాజంలో మానవత్వం అనేది ఉన్నపుడు నీవు నీ ప్రక్కింటి పిల్లవానిని చేరదీయి. వాడు నీ వృధ్ధాప్యంలో నీకు తోడుగా నిలుస్తాడు. నీకు పిల్లలు లేరనే బాధ తొలగిస్తాడు.
12.10.2011
182. నీ బంధుమిత్రులతో కలిసి గుళ్ళు గోపురాలలో పూజలు చేసేకన్నా, నీ
ఇంట నీ
వాళ్ళతో భగవంతుని ప్రశాంతంగ పూజించడం ఉత్తమము.
05.11.2011
183. జీవితం ఆఖరిలో నీతో వచ్చేది ఏమీలేదు. ఆఖరికి ఐదు నయాపైసలు (పంచప్రాణాలు) కూడా వదలి బయట పడాలి.
11.11.2011
184. జీవితంలో సుఖశాంతులు కావాలంటే ముందుగా నీలోని అహంకారాన్ని తొలగించుకో.
17.11.2011
185. సుఖనిద్రకు మంచిపరుపు అవసరం. అంతేగాని పదిరిపట్టె మంచం మాత్రం కాదు. అలాగె చదుకోవాలనే తపన ఉన్నవాడికి దీపం ముఖ్యం.
అంతేగాని, అది కిరసనాయిలు దీపమా, కరంటు దీపమా అని ఆలోచించకు.
26.11.2011
186. జీవితమనే రైలుప్రయాణంలో బాధ్యత అనే టిక్కెట్టు తీసుకుని రైలు ఎక్కు. నీవు నీ బాధ్యతలను సరిగా నిర్వహించకుండా ప్రయాణము కొనసాగించినా నీ ప్రయాణము ఒక నరకంలా మారుతుంది. ఈ జీవిత ప్రయాణంలో మనము బాధ్యతా రహితంగా ఉన్నపుడు మనం చేసే తప్పులకు మన తోటి బంధువులు, స్నేహితులు కూడా శిక్షను అనుభవిస్తారు. అందుచేత నీవు నీ గమ్యస్థానం చేరేవరకు నీ బాధ్యత అనే టిక్కెట్టును జాగ్రత్తగా పదిలపరచుకో.
04.12.2011
187. జూదము ద్వారా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని తహతహలాడేవారు ఉన్నారు. కాని జూదానికి దూరంగా ఉంటూ ప్రశాంతంగా జీవిస్తున్నవారిని అదృష్టదేవత వరించడం చూశాను. అదృష్టం అనేది భగవంతుని అనుగ్రహం వల్ల సిధ్ధిస్తుంది. అంతేగాని జూదమువల్ల కాదని గ్రహించు.
17.12.2011
188. సమాజం నీకు పదిరూపాయలు ఇచ్చింది. తిరిగి నీవు పదిరెట్లు సమాజానికి ఇవ్వవలసిన బాధ్యత నీకు ఉంది.
18.12.2011
189. చెడు సహవాసాలతో మనిషి జీవనం భయంకరమయిన మరణంతో ముగుస్తుంది. అదే మంచివారితో స్నేహం ప్రశాంత మరణంతో ముగుస్తుంది. ఈ రెండింటిలో ఏది కావాలో నీవే ఆలోచించి నీ జీవిత ప్రయాణాన్ని కొనసాగించు.
18.12.2011
190. జీవితంలో ధన సంపాదన, ఆస్తి సంపాదన, ముఖ్యమని భావించే
వారితో స్నేహము నీకు నీ యవ్వనంలో మంచిగానే అనిపిస్తుంది. వారి వల్ల కలిగే తలనొప్పులు నీకు నీ వృధ్ధాప్యంలో తెలుస్తుంది.
(మరికొన్ని సందేశాలు ముందు ముందు)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment