Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Monday, June 13, 2016

భక్తుని తన చెంతకు రప్పించుకొన్న సాయి :

Posted by tyagaraju on 6:17 AM
Image result for images of shirdi sai baba mandir srikakulam
Image result for images of rose hd


13.06.2016 సోమవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీకాకుళంనుండి సాయిబంధు శ్రీ సాయి సురేష్ గారు తమ అనుభవాలు పంపించారు.  వాటినన్నిటినీ క్రమానుసారంగా ప్రచురిస్తాను.  బాబా తన భక్తులను ఏ విధంగా అనుగ్రహిస్తూ ఉంటారో ఆయన అనుభవాల ద్వారా మనం గ్రహించుకోవచ్చు.
-------------------------------------------------------------------------------------------------------------------------

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
నా పేరు సాయి సురేష్, నేను శ్రీకాకుళంలో ఉంటాను. సాయి నాకు ఇచ్చిన అనుభవాలను సాయి బంధువులందరితో పంచుకొనే అవకాశం కల్పించినందుకు సాయి కి నా కృతజ్ఞతాభివందనములు.

భక్తుని తన చెంతకు రప్పించుకొన్న సాయి :

నా మనుష్యుడు ఎంత దూరమున ఉన్నప్పటికీ, వేయి క్రోసుల దూరములో ఉన్నప్పటికీ పిచ్చుక కాళ్ళకి దారముకట్టి ఈడ్చునట్లు అతనిని షిరిడి కి లాగెదనుఅని బాబా చెప్పారు కదా! అదేవిధముగా నన్ను బాబా తన చెంత చేర్చుకున్నారు:


నేను డిగ్రీ  2 సంవత్సరం చదువుతున్నప్పుడు  నా స్నేహితుడు సుజీత్ ఒకరోజు నన్ను బాబా మందిరానికి రమ్మని పిలిచాడు. నాకు బాబా గురించి అసలు ఏమి తెలియదు. సమయంలో సత్యసాయి గురించి కొన్ని వదంతులు వినడము వలన నాకు బాబాలను నమ్మకూడదు అనే అభిప్రాయం ఉండటము వలన నేను రాను అని చెప్పాను. అతడు బలవంతపెట్టాడు రమ్మని.  అటువంటి బాబాలను నమ్మను నేను రాను అన్నాను. అతడు కేవలం నా కోసం రా అంటే స్నేహితుని బాధ పెట్టడం ఇష్టం లేక సరే అని తనతో పాటు వెళ్ళాను
          Image result for images of shirdi sai baba mandir srikakulam

అదే నా మొదటి బాబా దర్శనం. ఏమి జరిగిందో చెప్పలేను గాని చాలా సంతోషమనిపించింది. బాబా ఏమి మాయ చేసారో నాకు తెలియదు కానీ,  అప్పటినుండి నేను ఎవరి తోడు లేకపోయినా బాబా గుడికి వెళ్ళటము అలవాటైపోయింది.  రోజూ సంధ్య హరతికి వెళ్ళటం, వీలైనప్పుడు మధ్యాహ్న హరతికి, శేజ హరతికి వెళ్తూ ఉండేవాడిని. గురువారం సంధ్య హారతి నుండి భజన, శేజ హారతి వరకు ఉండేవాడిని. అంతలా బాబా నన్ను మొదటి దర్శనముతోనే తన వైపు లాగుకున్నారు. ఒకసారి భజనలో **నువులేక అనాధలం పాట ఎవరో పాడుతువుంటే నాలో నాకేమి జరుగుతుందో తెలియనంత తన్మయత్వము కలిగింది.

(పాఠకులకు నా అనుభవాన్ని కూడా చెబుతాను.  బహుశ 2002 లో అనుకుంటాను.  నేను గుంటూరు జిల్లా తాడికొండలో ఉన్న బాబా ఆలయానికి ప్రప్రధమంగా వెళ్ళాను.  
Image result for images of tadikonda baba temple
        Image result for images of tadikonda baba temple
అప్పుడు ఆ గుడిలో కూడా ఇదే పాట వస్తూ ఉంది.  ఎందుకో తెలియదు. ఆ పాట వింటూ ఉంటే నాకళ్ళంబట నీరు ఆగలేదు.  ఏడుపు ఆపుకోలేనంటగా లోపలినుండి దుఃఖం  వస్తూ ఉంది.  దర్శనం చేసుకొని బయటకి వచ్చాక మళ్ళి మరొక్క సారి లోపలికి వెళ్ళాలనిపించి వెళ్ళాను.  కొంతసేపటి తరువాత మధ్యాహ్న ఆరతి ప్రారంభమయింది. అందరూ పాడుతూ ఉన్నారు.  నేను కూడా ప్రక్కనున్నతని పుస్తకంలోనుండి మెల్లగా పాడుతున్నాను.  అప్పుడు కూడా దుఃఖంతో నోటంబట మాట రాలేనంతగా అయింది. ఆవిధంగా తాడికొండలో ఉన్న బాబా గుడిలో బాబా తన అనుగ్రహాన్ని నామీద కురిపించారు.  త్యాగరాజు )       

సాయి కి శరణాగతి
నా ఎడ్యుకేషన్ పూర్తయి  5 సంవత్సరాలు గడిచినా ఉద్యోగం రాలేదు. ఒక ఉద్యోగం వచ్చి 3 నెలలు చేశాను. కానీ అక్కడకూడా సరైన పరిస్థితి లేక బాబా అనుమతితో  హైదరాబాద్ వచ్చాను. అక్కడ హాస్టల్ లో ఉంటూ సాఫ్ట్ వేర్ నేర్చుకొని ఉద్యోగ ప్రయత్నాలు చేశాను. కొన్ని ఇంటర్వ్యూలు జరిగి చివరి స్టేజిలో పోయాయి. దానితో నిరాశకు లోనయ్యాను. దేవుడుకు మొక్కిన లాభం లేకుండా పోయింది. శాంతి పూజ కూడా చేయించాము. అంతకు ముందు నేను ప్రతి గురువారం రాత్రి వరకు ఆహారం, నీళ్ళు తీసుకోకుండా ఉపవాసం ఉండేవాడిని, నా ఫ్రెండ్ బాబాకి ఉపవాసం ఉంటే నచ్చదని చెప్పినా కూడా,  బాబా గురించి తెలియక ఉపవాసం ఉండేవాడిని. పరిస్థితులలో ఉపవాసం ఉండటం మానేసానునా భక్తీ సన్నగిల్లుతూ ఉంది.  అటువంటి సమయములో  నేను   చేజారిపోకుండా బాబా నా చేయి గట్టిగా పట్టుకున్నారు.

ఒకరోజు రాత్రి కోచింగ్ ఇన్స్టి ట్యూట్  మూసేసాక  అందరు వెళ్ళిపోయారు. నేను,  చక్రి అనే అబ్బాయి మాట్లాడుకుంటున్నాము. అప్పటివరకు మా ఇద్దరి మధ్య  ఉన్నది కేవలము మామూలు పరిచయమే. మాటల సందర్బంలో నేను నా బాధలను చెప్పుకొన్నాను. అప్పుడు అతడుషిర్డీ సాయి అనుగ్రహ రహస్యంఅనే పుస్తకము చదవమని, చాలా బాగుంటుందని, ప్రశాంతత చేకూరుతుందని చెప్పాడు. మాటలు మంత్రంలా  పనిచేసి వెంటనే పుస్తకము కావాలని, చదువుతానని అన్నాను. మరుసటి రోజు ఇద్దరమూ వెళ్లి పుస్తకం కొని తెచ్చాము. మరుసటి గురువారం పారాయణ ప్రారంభించాను. నేను అంతకుముందు  బాబాకు సంబంధించిన సంక్షిప్త సాయి చరిత్ర ఒకటే చదివాను. అందువలన నాకు బాబా గురించి అంతగా తెలియలేదు. ఎందరో దేవుళ్ళ మద్య బాబా కూడా ఒక దైవం’ అంతే అని నా అభిప్రాయం.  పారాయణ ప్రారంభించినది మొదలు మనస్సుకు ఎంతో ప్రశాంతముగా ఉండేది. వారం రోజుల్లో పూర్తి చేశాను. అప్పుడు తెలిసింది అసలు సాయి అంటే ఏమిటో, సాయి ఎక్కడ ఉన్నాడో.

సాయి అంటే ఆత్మ స్వరూపమని, సాయి అంతటా నిండి ఉన్నాడని, అందరి హృదయాలలో కొలువుతీరి ఉన్నాడని, సాయి ఎందరో దేవుళ్లలో ఒకరు కాదని, సాయే సర్వ దేవతా  స్వరూపమని, సాయి లోనే సకల దేవతలు ఉన్నారని, సమాధి చెందినా సజీవముగా ఉన్న సద్గురువని, పిలిచిన వెంటనే పలికే పరమ ప్రేమ స్వరూపుడని అర్థమయింది. సాయి పై పూర్ణ విశ్వాసం కుదిరింది. ఉపవాసం ఉండి బాబాకి యెంత భాధ కలిగించానో అర్థమైంది. ఉద్యోగం లేక నేను భాధ పడుతు వుంటే, బాబా నాపై ప్రేమ లేక, కరుణలేక అలా మౌనంగా ఉండలేడని, పూర్వ కర్మ దృష్ట్యా నా శ్రేయస్సు కోసమే అలా చేస్తున్నారని ఆర్థం  చేసుకున్నాను. కష్టం వచ్చిన, నష్టం వచ్చిన సాయిని విడవరాదని, ఏదైనా సాయిని తప్ప ఇంకెవరిని అడుగరాదని నిర్ణయించుకున్నాను. ఒకే ఒక్క పారాయణతో బాబా అంత చక్కటి అవగాహననిచ్చారు. అప్పటినుంచి మొదలైంది నా ఆధ్యాత్మిక జీవితం. రోజూ సాయి కి సంబందించిన పుస్తకాలు చదవుతూ ఉండేవాడిని, చక్రి, నేను ఇన్స్టిట్యూట్ లో, బాబా గుడిలో, బస్సు స్టాప్ లో కూర్చొని బాబా లీలల గురించి చర్చించుకుంటూ ఉండే వాళ్ళం.  అలా బాబా మీదనే ఉండేది మనసంతా.  చక్రితో మూమూలు పరిచయం బెస్ట్ ఫ్రెండ్ షిప్ గా మారింది. బాబాయే సరైన సమయంలో చక్రి రూపంలో వచ్చి నన్ను దారి తప్పకుండ కాపాడారు. అలా సాయి నన్ను తన వాడిని చేసుకున్నందుకు సాయికి నా వందనాలని సమర్పించుకుంటున్నాను. నా సద్గురు సాయికి చేరువ చేసిన నా ఇద్దరు స్నేహితుల ఋణం జన్మజన్మలకి తీర్చుకోలేను. ఎందరో స్నేహితులు ఉంటారు గాని గురువుకు చేరువ చేసే స్నేహితులు ఉండటం చాలా గొప్ప విషయము. అటువంటి నా ఇద్దరి స్నేహితులకు హృదయపూర్వక  కృతఙ్ఞతలు మాత్రమే చెప్పుకోగలను.

 “సత్యానికి దూరమైన వాడు పరబ్రహ్మ స్వరూపానికి కూడా దూరమేఅని సాయి చెప్పారు. బాబాను సంపూర్ణంగా విశ్వసిస్తే అసత్యమెందుకు అవసరమవుతుంది. ఇంటర్వ్యూ కి వెళ్ళినా అందరు అనుభవమే అడుగుతారు.  అది అబద్ధపు పత్రాలతో సమర్పించిన అనుభవమైనా పర్వాలేదుసాఫ్ట్ వేర్ ఉద్యోగానికి మరీ ముఖ్యంగా అవసరం. అందుకే  నా ఉద్యోగ విషయం బాబాకే వదిలివేశాను. ఆయనకు తెలుసు నాకేది శ్రేయస్కరమో.
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)





Kindly Bookmark and Share it:

1 comments:

Unknown on June 14, 2016 at 2:10 AM said...

Sai Baba Sai Baba. Thank you suresh sai

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List