28.05.2020 గురువారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి సత్ చరిత్రలో నాకు కలిగిన
సందేహాలు –
బాబా
సమాధానాలు – 9 (1)
ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట, హైదరాబాద్
ఫోన్. 9440375411 & 8143626744
మైల్ ఐ.డి.
tyagaraju.a@gmail.com
ఎవరయినా తమ స్వంత బ్లాగులో కాని, ఫేస్ బుక్ లో గాని కాపీ, పేస్ట్ చేయదలచుకున్నచో ముందుగా నాకు తెలియచేయవలెను.
10.05.2020 నుండి బాబాను నాకు కలిగిన ఒక సందేహాన్ని అడుగుతూనే ఉన్నాను. 27.05.2020 న బాబా ఇచ్చిన సమాధానమును ఈ రోజు ప్రచురిస్తున్నాను.
10.05.2020 నుండి బాబాను నాకు కలిగిన ఒక సందేహాన్ని అడుగుతూనే ఉన్నాను. 27.05.2020 న బాబా ఇచ్చిన సమాధానమును ఈ రోజు ప్రచురిస్తున్నాను.
“భక్తుడెంత మనోనిశ్చయముతో పట్టుదలతో నుండునో, బాబా యంత త్వరగా వానికి సహాయపడును. ఒక్కొక్కప్పుడు బాబా భక్తులను కఠిన పరీక్ష చేసిన పిమ్మట వారికి ఉపదేశమునిచ్చును. (ఇచట ఉపదేశమనగా నిర్దేశము)
(శ్రీ సాయి సత్ చరిత్ర అ. 18 -19 )
బాబాను అడిగిన సందేహమ్ – బాబా నీగురువు నిన్ను కాళ్ళు, చేతులు కట్టి నూతిలో వ్రేలాదదీయడానికి గల కారణమేమిటి?
దానిలోని
ఆంతర్యం ఏమిటి?
బాబా చూపించిన సమాధానం – బాబా నిగూఢంగా చిన్న దృశ్యాన్ని ఒక్క సెకను పాటు చూపించారు బాబా.
అది కుండలిని
శక్తి గురించేనని
అర్ధం చేసుకున్నాను. బాబా ఒక్కొక్కసారి సమాధానాలను సూటిగా చెప్పరు.
దానిని
విశ్లేషించుకుని
మనమే అర్ధం చేసుకునేలా మనలని తయారుచేస్తారు.
ఇపుడు శ్రీ సాయి సత్ చరిత్ర అద్యాయం 32
ఒకసారి
గమనిద్దాము.
“నా గురువు నన్నొక బావి వద్దకు తీసుకొనిపోయిరి.
నాకాళ్ళను
తాడుతో కట్టి నన్ను తలక్రిందులుగా ఒక చెట్టుకు కట్టి బావిలో నీళ్ళకు మూడడుగుల మీదుగా నన్ను వ్రేలాడదీసిరి.
నా
చేతులతో గాని, నోటితో గాని, నీళ్ళను అందుకోలేకుంటిని.
నన్ను
ఈ విధముగా వ్రేలాడగట్టి వారు ఎచ్చటికో పోయిరి.
4, 5 గంటల తరువాత వారు మరల వచ్చి, నన్ను బావిలోనుండి బయటకు దీసి యెట్లుంటివని అడిగిరి”
ఆనందములో
మునిగియుంటిని, నేను పొందిన యానందమును నావంటి మూర్ఖుడెట్లు వర్ణించగలడు?” అని జవాబిచ్చితిని.
దీనిని
విని గురువుగారు మిక్కిలి సంతుష్టి చెందిరి.
నన్ను
దగ్గరకు చేరదీసి నావీపును తమ చేతులతో తట్టి నన్ను వారివద్దనుంచుకొనిరి.
నన్ను
తమ బడిలో చేర్చుకొనిరి.
అది
చాలా అందమయిన బడి.
అక్కడ
నేను నాతల్లిడండ్రులను మరచితిని.
నాయభిమానమంతయు తొలగెను. నాకు
సులభముగా విమోచనము కలిగెను.
ఇతర పాఠశాలలలో పూర్తిగా మరొక విధమయిన దృశ్యములు కానవచ్చును.
భక్తులు
జ్ఞానము సంపాదించుటకు పోయి ద్రవ్యమును, కాలమును, కష్టమును వ్యయము చేసెదరు.
తుట్టతుదకు
పశ్చాత్తాప పడెదరు.
అక్కడున్న
గురువు తనకు గల రహస్య శక్తిని గురించి, తన ఋజువర్తనము గూర్చి పొగడుకొనుచు, తన పావిత్ర్యమును, (పవిత్రత) ప్రదర్శించునేకాని, హృదయము మృదువుగా నుండదు.
అతడనేక విషయముల గురించి మాట్లాడును.
తన
మహిమను తానే పొగడుకొనును.
కాని
యతని మాటలు భక్తుల హృదయమందు నాటవు.
వారిని
ఒప్పింపజేయవు. ఆత్మసాక్షాత్కారమతనికి తెలియనే తెలియదు.
అటువంటి
బడులు శిష్యులకేమి మేలు చేయును?
వారికేమి
లాభము? పైన
పేర్కొన్న గురువు మరొక రకము వారు.
వారి
కటాక్షముచే ఎట్టిశ్రమ లేకయే యాత్మజ్ఞానము దానిమట్టుకది నాయందు ప్రకాశించెను.
నేను
కోరుటకేమియు
లేకుండెను. సర్వము
దానిమట్టుకది
నాయందు ప్రకాశించెను. సర్వము దానిమట్టుకదియే పగటి ప్రకాశమువలె బోధపడెను.
తలక్రిందుగను,
కాళ్ళు మీదుగను నుంచుట వలన గలుగు
ఆనందము
గురువుకే తెలియును.
గురువు తనను నీటితో
నిండుగా ఉన్న బావిలో తలక్రిందులుగా వ్రేలాడదీసినా దానిని ఆయన ఏమాత్రం పట్టించుకోకుండా
బ్రహ్మానందాన్ననుభవించారు. తన
గురువుపై ఆయనకెంత భక్తో కదా. అటువంటి శిష్యులను ఎటువంటి ఆలస్యం లేకుండా తమ స్వంతస్థాయికి చేరుకునేలా వారి
గురువులే చేర్చుతారని సంత్ తుకారామ్ చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు.
Who has desire
of spiritual path must exert and study with full concentration. There is need to show courage and adventure
--- Sri Sai Satcharitra chapter 32 O V 150)
(పరమార్ధాన్ని
సాధించదలచినవారు శ్రమకోర్చి, ధృఢమయిన అభ్యాసం చేయాలి. కొంత సాహసం కూడా ఉండాలి)
కాని, అసాధ్యాలను కూడా సుసాధ్యం చేసే శక్తి మనమాశ్రయించిన గురువుకే ఉంది. ఆనమ్మకంతోనే నాగురువు నాయందు ఉన్నాడనే
గట్టి విశ్వాసంతోనే ఈ మాటలు అనగలుగుతున్నాను. (75)
జ్ఞానేశ్వరి – అధ్యాయమ్ – 1
(జ్ఞానేశ్వరి
– అర్జున విషాదయోగంలో జ్ఞానేశ్వర్ వ్రాసిన ముందుమాటలలోనివి)
సద్గురువు యొక్క
కృపాకటాక్షణాలు లేకుండా, ఆయన సహాయం లేకుండా బ్రహ్మం గురించి గాని,
ఈ విశాల విశ్వంయొక్క స్వభావాన్ని గాని తెలుసుకోవడం సాధ్యంకాదు.
(7)
కళ్ళు ఎటువంటిలోపం
లేకుండా సుందరంగా ఉండి అన్నీ స్పష్టంగా చూడగలిగిన శక్తి ఉన్నప్పటికీ, సూర్యుడు లేనిదే అంతా చీకటి.
(8) ఏకనాధభాగవతం
(అ.10)
(కుండలినీ
శక్తి జాగృతం చేసుకోవాలంటే గురువు ద్వారానే సాధ్యపడుతుంది. అంతే కాదు దానికి ఎంతో సాధన అవసరం. కాని బాబా విషయంలో ఆయన గురువు అసాధ్యయినదానిని
సాధ్యం చేసి కేవలం 4 , 5 గంటలలోనే ఆయనలో కుండలినీ శక్తిని జాగృతం
చేసారని మనం భావించవచ్చు. ఆయనలో కుండలినీ శక్తి మూలాధార చక్రంనుండి వెన్నుపాము ద్వారా సహస్రార చక్రంలోనికి
చేరుకున్న తరువాత ఆయన గురువు ఆయన వీపుమీద తట్టారని, దానివల్ల
బాబాలో ఆశక్తి నిరంతరం ప్రవహిస్తూనే ఉందని నేను భావిస్తున్నాను. గురువు యొక్క కృపా కటాక్షణాలు ఉండబట్టె
కుండలినీ శక్తి జాగృతమవడం ద్వారా బాబా తాను బ్రహ్మానందాన్ననుభవించానని చెప్పారు. ... త్యాగరాజు)
(బాబా
ఎల్లప్పుడు ఆత్మానుసంధానమందే మునిగియుండెడివారు –
శ్రీ సాయి సత్
చరిత్ర అ. 10)
(మనలో ఎటువంటి లోపం
లేకుండా పుస్తక జ్ఞానం ఉన్నప్పటికీ గురువు సహాయం లేనిదే అంతా నిష్ప్రయోజనం.)
(మిగిలిన భాగం రేపు...కుండలినీ శక్తి గురించి కాస్త వివరణ)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
1 comments:
Chala manchi vivarana echaru..
Post a Comment