14.01.2011 శుక్రవారం
-------------------------------------------------------------------------------------------------
బాబా బొమ్మ శ్రీమతి ప్రియాంకాగారి అమ్మాయి వేసినది
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
బాబాతో దివ్యానుభూతి
మనం బాబాగారిని ఆర్తితో పిలిస్తే తప్పకుండా పలుకుతారు. చిన్న పిల్లవాడు ఉన్నడనుకోండి. ముందర బొమ్మలు పడేస్తే కాసేపు ఆడుకుంటాడు. తరువాత తల్లికోసం యేడుస్తాదు. మరి యిక ఏబొమ్మలు ఇచ్చినా పిల్లవాడు ఏదుపు మానడు. వాడికి వాళ్ళ అమ్మే కావాలి. భక్తుదయినవాడు అల్లా ఆర్తితో భగవంతుని గూర్చి ఏడవాలి. దేవా నువ్వుతప్ప నాకేమీ వద్దు అని కనక ప్రార్థిస్తే తప్పక మన మొర ఆలకిస్తాదు. అటువంటి అనుభూతిని మనం ఈరోజు తెలుసుకుందాము.
************************************************************************************
ఈరోజు శ్రీమతి ప్రియాంకా రౌతేలాగారి అమ్మాయి చి.సాయినా యొక్క దివ్యానుభూతి గురించి, శ్రీమతి ప్రియాంకా రౌతెలా గారి మాటలలోనే తెలుసుకుందాము
ఓం సాయి శ్రీసాయి జయ జయ సాయి
ఈరోజు నేను మీకు వళ్ళుగగుర్పొడిచే బాబా అనుభవాన్ని చెపుతాను. సాయంత్రం నేను, మా అమ్మాయి "సాయినా" బాబాగారికి పూజ చేస్తున్నాము. నిజానికి నేను, మా అమ్మాయికి ప్రతీరోజు పూజ చేయడం అలవాటు చేశాను. యెందుకంటేచిన్నప్పటినుంచే పిల్లలకి మనం ఆథ్యాత్మిక భావాలని నేర్పాలి, అప్ప్దుడే వారిలొథై ర్యము నమ్మకము బలపడతాయి. ఇక విషయం చెప్పేముందు మా అమ్మాయి, క్రితం సం.మార్చి లొ వేసిన బాబా ఫొతో ఇక్కడ ఇస్తున్నాను. ఈఫొటో చిత్రించిన బాబా లీలను మీకు తరువాత రోజులలో చెపుతాను. ఈ ఫొటో మా అమ్మాయి తో బాబా అనుభవం చుట్టూ తిరుగుతోంది.మా అమ్మాయికి 7సం..వయస్సు. 3 సం.నుంచి తను బాబా ఆరతి పాటలు మరాఠీ లో పాడుతూఉంటుంది. మా అమ్మాయి సాయిపూజ ఎలాచేస్తుందో నమ్మాలంటే మాఇంటిలో ఉండి చూడాలిసిందే. నిజానికి షిరిడిలో ఆరతి మధ్యలో ఒకామె మా అమ్మాయిని వి.వి.ఐ.పి. లు ఉండేచోట నిలబెడతానని మమ్ములను అడిగి తీసుకునివెళ్ళింది.తరువాత ఆమె, అంత చిన్నపిల్ల అంత స్పష్టంగా, భక్తితో బాబా ఆరతి మరాఠీలొ పాడటం యెప్పుడూ చూడలేదు, అందుచేతనే ఆమెని బాబా సమాథి ప్రక్కనే నిలబెట్టానని చెప్పింది. మా అమ్మయి సాయినాని డా.బాబాగారే రక్షించారు. దానికి సంబంధించిన కథని నా బ్లాగులో చదవగలరు.
ఇక అసలు విషయానికి వస్తే ఈ రోజు సాయంత్రం (12.01.2011) నేను, మా అమ్మాయి సాయిన సాయంత్రం పూజ చేస్టున్నప్పుడు జరిగిన సంఘటన. ఆరతి పాడుతుండగా మా అమ్మాయి భావోద్వేగానికి లోనవడం గమనించాను. అప్పుడప్పుడు తను అలా భావోద్వేగానికి లోనవ్వడం జరుగుతూ ఉంటుంది కాబట్టి నేను పట్టించుకోలేదు. కాని ఈ రోజు బాగా మార్పు ఉంది, ఆరతి అవగానే తను చాలా బిగ్గరగా యేడవడం మొదలుపెట్టింది. "సాయిన, యేమయింది? అని అడిగాను. సాయిన, అమ్మా, బాబాగారిని చూడాలని ఉంది, ఆయన నిజంగా వచ్చి నాతో యెందుకు మాట్లాడరు? రోజూ కలలోకి వచ్చి, వస్తాను వస్తాను అంటారు బాబాగారు. నువ్వెప్పుడు నేను బాబాగారి కూతురినని చెపుతావు, బాబాగారివల్ల నే నేను బతికానని చెపుతావు, మరయితే నేను బాబాగారిని యెందుకు చూడలేకపోతున్నాను? అని అడిగింది.
ఆ క్షణంలో నిస్సహారాయులిని కనక నేను కుడా ఏడవడం మొదలుపెట్టాను. యేవిథంగానయినా సరే బాబా గారిని చూడాలని ఇంకా బిగ్గరగా యేడవడం మొదలుపెట్టింది. ఈ సంఘటనతో నాకు నోట మాట రాలేదు. బాబాగారు భవుతికంగా యెందుకు రాలేకపోతున్నారో ఇంత అమాయకంగా అడుగుతున్న చిన్నపిల్లకి నేనేమని సమాథానం చెప్పను. బాబాగారు రాకపోవడం మా అమ్మాయిని మానసికంగా బలహీనురాలిని చేస్తోంది.
సాయినా బాబాగారిని రమ్మని బాగా యేడుస్తూ ప్రార్థిస్తోంది. హటాత్తుగ తన చుట్టూ ప్రసాంతమయిన గాలి తనను చుట్టుముట్లినట్టు అయింది. బాబాగారు యెదురుగా ఉండి గట్టిగా తన హృదయానికి హత్తుకున్నత్లుగా అనిపించింది. సాయినా, అమ్మా, బాబాగారు నన్ను కౌగలించుకుంటున్నారు, నాకు తెలుస్తోంది, ఇక్కడ నుంచున్నారు, అని గట్టిగా అరిచింది. జరిగినదంతా తెలియకపోయినా, సాయినా మాత్రం 5,6 నిమిషాలవరకూ బాబాగారి స్పర్శని అనుభవించింది. బాబాగారి అదృస్య హస్తాలలో యెంతో రక్షణని అనుభవించింది. ఇప్పుడామె యేదోఒకరోజు బాబాగారిని ముఖా ముఖీగా కలుసుకుంటామన్న నమ్మకంతో ఉంది. బాబాయందు ఉన్న అచంచలమయిన భక్తికి విస్వాసానికి ఇది గొప్ప అనుభవం. 7 సం.వయస్సున్న చిన్నపిల్లకి యెంతో అద్భుతమయిన అనుభవాన్ని ఇచ్చారు. మమ్ములని సరయిన దారిలో, మంచి మార్గంలో నడిపించి మాకు మార్గదర్శకులుగా ఉండమని బాబాగారికి శిరసు వంచి మొక్కుతున్నాను.
బాబాగారు యెల్లప్పుడు తనభక్తుల కోర్కెలు తీర్చడానికి, కామధేనువు మరియు కల్పవృక్షము వంటివారు. ఈరోజు మా అమ్మాయికి ఇంకా భక్తిభావం పెరిగింది, బాబాకు నేను యెంతో కృతజ్ణురాలిని.
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు
0 comments:
Post a Comment