20.01.2011 గురువారం
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
ఈ రోజు మనము ఊదీ మహిమ గురించి తెలుసుకుందాము. ఈ లీల ని సాయి లీల పత్రికనుండి గ్రహించడమయినది.
బాబా ఊదీ మహిమ (1974) బ్య్ : శ్రీ మహేష్ చంద్ర శ్రీవాత్సవ
అక్టోబర్ 1973 నుంచి ఈయన బాబావారి దీవెనలు అందుకుంటూ వుండేవారు.
ఒకరోజు బుథవారం "కోజగిరి పూర్ణిమ" ముందు రోజు రాత్రి షిరిడీకి ప్రయాణం పెట్టుకున్నారు. ఉదయం 10.30 కి, ఆయనకి షిరిడీలో బాబా బొమ్మ వున్న సిల్వర్ ఉంగరం కొనుక్కోవాలనిఒక ఆలోచన వచ్చింది. ఆరోజు మధ్యాహ్నం 1.30 కి తన స్నేహితుడి ఇంటికి వెళ్ళారు. అతను వజ్రాల వ్యాపారి కూడా. స్నేహితుడితో, తను షిరిడీ వెడుతున్నానని, మరల 2 రోజుల వరకూ కలవడం కుదరదని చెప్పడానికి, అతనితో కలిసి భోజనం చేయడానికి, వెళ్ళాడు. ఆ రోజు మధ్యాహ్నం, భోజనం అవగానే ఆ స్నేహితుడు తనంతతానుగా ప్లాటినం ఉంగరం ఇచ్చాడు. అది చాలా విలువైన, అద్భుతమైన ఉంగరం. అటువంటిక్ విలువైన ఉంగరాన్ని తను చేయించుకోలేడు. ఆ ఉంగరం మీద బాబా బొమ్మ బంగారంతో చెక్కబడివుంది. అది పంచలోహాలతో చేయబడినది.
మరునాడు గురువారం "కోజగిరి పూర్ణిమ" నాడు తను షిరిడీ లో ఉంటాడు. ఈ అద్భుతం ఆయన జీవితంలో గొప్ప మార్పుని తెచ్చింది. మదిలో చెరగని ముద్ర వేసింది. బాబా గారు చూపించే లీలలన్నీ కూడా మరలా మరలా గుర్తు చేసుకునే విథంగా ఉంటాయి.
ఫిబ్రవరి 23, 1974, ఉదయం కొంతమంది స్నేహితులతో కలిసి షిరిడీ లో అడుగు పెట్టారు. అందరూ కలిసి ఒకేచోట ఉందామనుకున్నారు. కాని, షిరిడీ వెళ్ళగానే శ్రీ వాత్సవ గారు విడిగా వెరేచోట ఉందామనుకుని అల్లాగే వెరేచోట బస చేశారు. ప్రొద్దున్న అన్ని కార్యక్రమాలూ పూర్తి చేసుకుని మహాసమాథి మందిరానికి అభిషేకం చూడ్డానికి వెళ్ళదామని చెప్పడానికి స్నేహితులవద్దకు వెళ్ళారు. అప్పటికి వాళ్ళింకా తయరవలేదు. అందుచేత తనని సమాథిమందిరంలో కలవమని, తను యెదురు చూస్తూ వుంటానని చెప్పారు.
బాబాగారికి పూలదండ కొంటున్నప్పుడు బాబాగారు సూచన ఇస్తున్నట్లుగా ఒక విథమయిన ఆలోచనా తరంగం ఆయన మనసులోకి వచ్చింది. మొదట ద్వారకా మాయి కి వెళ్ళు, తరువాత చావడి, తరువాత సమాథి మందిరం. నేనింకా జీవించే ఊన్నాను. అని ఈవిథంగా ఆయనకి అనిపించింది.
ద్వారకామాయిలో ఆయన చరణాలకు సాగిలపడి నమస్కరించి అక్కడ ఫోటోకి, చావడిలో ఫొటోకి దండలు వేసి, సమాథిమందిరంలొకీ వెళ్ళాడు. అభిషేకం తరువాత మథ్యాహ్న హారతి కూడా చూద్దామని వెళ్ళాడు. మథ్యాహ్న హారతి అవగానే తన బసకి వెళ్ళిపోయాడు. మెల్లిగా సాయంత్రం 4, 4.30 కి లేచి మరలా ద్వారకామాయిలో ఆయన పాదాల వద్ద కూచుని పుస్తకాలు చదువుకుందామని పడుకున్నాడు. కాని యేదో తెలియని శక్తి 3 గంటలకు లేపింది. తయారయి ద్వారకామాయికి వెళ్ళమని చెప్పినట్లయింది. అప్పటికి సమయం 3.30 అయింది. ద్వారకామాయి చేరుకునేటప్పటికి, అక్కడున్న పనివాడు, ఈయనని బాబాగారి ఫోటోలు, పాదుకలు తుడిచి శుభ్రం చేయమని చెప్పాడు. ఆ సమయంలో ఇటువంటిది ఉంటుందని యెప్పుడు అనుకోలేదు. ఈయన ఆనందానికి అవథులు లేవు. ఎంత చక్కటి అవకాసాన్ని బాబాగారు ఇచ్చారు? ఇదంతా ఆయన తనమీద కురిపించిన కటాక్షం. ద్వారకామాయిలో ఈ సేవ చేసి ఆయనకి నమస్కరించి, సాయి చాలీసా, దుర్గా చాలీసా, హనుమాన్ చాలీసా, సచ్చరిత్ర చదవడం మొదలుపెట్టారు. ఇంతలో అనుకోకుండా చావడి మందిరాన్ని పర్యవేక్షించే ఆయన యెక్కడినించి వచ్చాడో ఈయన వద్ద వున్న "ఆస్ బోర్న్ వ్రాసిన ఇంక్రెడిబుల్ సాయిబాబా" అనే పుస్తకం చూసి, దగ్గిర కూర్చుని బాబాగారిలీలలుమహిమల గురించీ చర్చించడం మొదలు పెట్టారు. ఆ పుస్తకంలో వివరించినవన్ని మాట్లాడారు.
ఈవిథంగా చర్చించుకుంటుండగా తనలో అనుకున్నారు, "బాబాగారు లేరని యెవరన్నారు, ఆయన ప్రతిచోటా వున్నారు. ఈ ప్రపంచమంతా నిండి వున్నారు. ఈ షిరిడీ ఆయన తిరిగిన పవిత్రప్రదేశం. ఈ షిరిడీ తన భక్తులకి యెప్పుడూ కూడా ఆయన లీలలని గురించి జ్ణప్తి చేస్తూ వుంటుంది. ఇలా ఆలోచిస్టుండగా ఆయన దృష్టి బాబా పాదుకలపై పడింది. పాదుకలంతా కూడా ఊదీతో చల్లినట్లుగా ఉంది. అపుడే అక్కడికి వచ్చిన ఇద్దరు భక్తులు కూడా వారిలో వారు మాట్లాడుకోవడం కనిపించింది. వారు మరాఠీలో మట్లాడుకున్నారు. వారు మాట్లాడిన మాటలు ఈ పర్వ్యవేక్షకుడు అనువదించి చెప్పాడు. వారు అన్న మాటలు, "చూడు, బాబా పాదుకల మీద ఊదీ యెంత అందంగా చల్లబడి వుందో". వారు వెళ్ళగానే 10, 15 నిమిషములవరకూ యెవ్వరూ రాలేదు. బహుశా ఇదంతా బాబావారి కృప. ఆ పవిత్రమైన ఊదీ ఈయన కోసం యెర్పరిచారు. యెప్పుడూ భక్తులు వచ్చే సమయంలో కూడా యెవరూ రాలేదంటే అదంతా బాబాగారు యెర్పరచినదే.
ఇక 4.55 కి లేచి, చావడికి వెళ్ళి కాసేపు కూచుందామని పర్యవేక్షకుడితో చెప్పారు.అపుడు అతను ఇంతకుముందు తను యే బాబాగారి పాదాలనయితే శుభ్రం చేశాడొ అక్కడ యేర్పడిన ఊదీ వంక చూపించాడు. చూడగానే ఆ ఊదీ చాలా యెక్కువగా ఉన్నట్లనిపించింది. కాని, చావడిలో పని చేసే పర్యవేక్షకుడు అంతా ప్రోగుచేసి ఇచ్చేటప్పటికి ఒక చిటికెడు ఊదీ వచ్చింది. అది బ్రౌన్ కలర్లో ఉంది వజ్రంలా మెరుస్తోందిట.
ఆయన నమ్మకానికి బాబాగారు ఆవిథంగా అనుగ్రహించారు.
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు
0 comments:
Post a Comment