31.01.2011 సోమవారము
బాబా ఊదీ ఘనతఏదయినా మన నమ్మకాన్ని బట్టి ఉంటుంది. బాబా ఊదీ మీద పరిపూర్ణమయిన విశ్వాసంతో ఉండి థరిస్తే, దానికి తిరుగు ఉండదు.
పూజ్యశ్రీ బాపట్ల వేంకట పార్థసారథిగారు ఊదీ ఘనతను రెండు మాటల్లో యెంతో చక్కగా యిలా వివరించారు.
అఖిల రోగముల హరించు ఔషథంబు
అరయ గ్రహదోషముల మాపు ఆయుథంబు
ద్వారకామాయి థుని సముపార్జితంబు
సరవి నొసట దాల్చుడుథి నుషస్సువేళ
పూజ్యశ్రీ శివనేశన్ స్వామి ఈ థుని మహాత్యాన్ని వివరించే ఒక సంఘటన తెలియ చేశారు. 1974 లో రష్యా దేశానికి చెందిన వాతావరణ శాస్త్రజ్ఞులు కొందరు థుని వెదజల్లుతున్న పొగవలన వాతావరణం కాలుష్యమౌతున్నదని తలచి పొగను పరీక్షించారు. యే విథమైన కాలుష్యం లేదు. వారు అనుమానం తీరక థునికి సమర్పించే పదార్థాల్ని మండించి ఆ పొగను పరీక్షించారు. అందులో కాలుష్యం నమోదయింది. అప్పుడు యిదంతా థుని మహాత్మ్యమని వారు విశ్వసించి థునికి భక్తితో ప్రణమిల్లారు.
మరో విశేషం. థునికి అమర్చిన యినుప తలుపు థుని వేడికి అప్పుడప్పుడు వ్యాకోచించింది. కాని యెదురుగా కొద్ది దూరంలో గోడకున్న రెందు కఱ్ఱ స్తంభాలు యేనాడూ వంకరలు తిరగకపోవడమే ఆశ్చ్యర్యం.
"ఈ థుని యెందుకు నిర్వహిస్తున్నారు? అని ఒక భక్తుడు బాబానడిగాడు. "అందరి పాపాలు దహించడానికే" అని బాబాగారి సమాథానం. కష్టాలు తీర్చమనో, కోరికలు నెరవేర్చమనో లేకపోతే బాబాగారి అనుగ్రహం కావాలనో మనసులోనే సంకల్పం చెప్పుకుని, మనతో తీసుకువెళ్ళిన మేడిపుల్లలు, తులసి పుల్లలు, గంథపు చెక్క, నవథాన్యాలు, ఆవునెయ్యి వగైరాలు థునికి అమర్చిన చిన్నగొట్టం ద్వారా థునిలో సమర్పించాలి. స్వీకరించి అనుగ్రహించమని సాయిని వేడుకోవాలి. పీచుగల కొబ్బరికాయలు అక్కడే ప్రక్కనుండే (గోతంలో) డబ్బాలో ఉంచితే, సంస్థాన్ వారు వాటిని నిర్ణీత సమయంలో థునిలో వేస్తారు. తర్వాత హుండీలో దక్షిణ సమర్పించాలి.
********************************************************************************
ఇప్పుడు మనము సాయిలీల పుస్తకంలో పి. యు. జయశ్రీ , బెంగళూరు వారు వ్రాసినది. సెప్టెంబరు 1986, లో ప్రచురింపబడిన ఊదీ ఘనతను గూర్చి చెప్పుకుందాము.
బాబాగారు చెప్పిన మాటలు: నన్ను నమ్మండి. నేను లేనని ఆందోళణ చెందవద్దు. నా సమాథినుండి నా యెముకలు మాట్లాడతాయి. నా సమాథి మీకు, నమ్మకాన్ని, ఆశను యిస్తుంది.
బాబా గారి చరణాలకు నమస్కరిస్తూ ఈ అనుభవాన్ని మీకు చెపుతున్నాను.
ఈ సంఘటన 1974 లో జరిగింది. అప్పుడు నా తమ్ముడు సాయినాథ్ వయసు ఒక సంవత్సరము. మేము అందరము మథ్యాహ్నము భోజనాలు చేసిన తరువాత విశ్రాంతి తీసుకుంటున్నాము. చిన్న పిల్లవాడయిన సాయినాథ్, ఒక బకెట్లో నిండుగాఉన్న నీటితో ఆడుకుంటున్నాడు. కొంతసేపయిన తరువాత మా అమ్మగారు వాడి కోసం వెళ్ళి చూసేటప్పటికి బకెట్లో పడిపోయి ఉన్నాడు. వాడి కాళ్ళు మాత్రమే పైకి కనబడుతున్నాయి. శరీరం లోపలికి మొత్తం నీరు వెళ్ళిపోయింది. మేము అన్నివిథాలుగా కృత్రిమ శ్వాశ కల్పించాము. కాని యేమి ఫలితం యివ్వలేదు. మేమంతా ఆశ వదులుకున్నాము.
అప్పుడు, మా తాతగారు, అమ్మమ్మగారు వాడిని బాబా ఫోటో ముందు పడుకోబెట్టి, నోటిలో కొంచెం ఊదీ వేసి, వళ్ళంతా ఊదీ పూసారు. వెంటనే వాడు యేడవడం మొదలుపెట్టాడు. అప్పుడు మేమంతా యెంత సంతొషించామో మీరే ఊహించుకోండి.
ఇప్పుడు సాయినాథ్ ఆరవ స్టాండర్డ్ చదువుతున్నాడు. మేమంతా 1980 లో షిరిడీ వెళ్ళాము.
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు
1 comments:
each and every experiences are great baba bless me give your darshan in dreams i have desire to see yosu in my dreams
Post a Comment