Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Sunday, February 6, 2011

బాబా గారు తన దుస్తులు తానే యెన్నుకొనుట

Posted by tyagaraju on 8:03 PM



07.02.2011 మంగళవారము


ఈ రోజు శ్రీమతి ప్రియాంకా గారి పొస్ట్ కి తెలుగు అనువాదము మీకు అందచేస్తున్నాను




లీల ని పోస్ట్ చేస్తున్నప్పుడు నేను నా మొదటి షిరిడి యాత్ర గుర్తుకు తెచ్చుకుంటున్నాను. బాబా గారు నేను తెచ్చిన దుస్తులు స్వీకరించారు, తరువాత యెన్నో లీలలను చూపించారు, తలుచుకుంటే నాకు మాటలు రావడంలేదు.

బాబా గారు చెప్పిన మాటలెప్పుడు అసత్యాలు కావు అన్నది సత్యం. బాబా గారు మనకి అన్ని విషయాలు కూడా సూచనలద్వారా తెలియపరుస్టారు, వాటిని మనం అర్థం చేసుకోవాలి. ఒకోసారి వాటిని మనం మిస్స్ అవుతూ ఉంటాము.

కొన్ని రోజుల క్రితం నాకు విద్యా వద్దనుంచి మెయిల్ వచ్చింది. అందులో ఆమె తను బాబాగారికి బట్టలు ఇద్దామనుకొంటున్నట్లు, వాటిని యెక్కడ ఇవ్వాలో తెలియచేమని అడిగింది. నేను, బాబా గారికి బట్టలు యెక్కడ యిచ్చానో, మరియు బాబాగారికి, వాటిని ఆరోజే థరింపచేసిన వైనం గురించి చెప్పాను. తరువాత ఆమె షిరిడి వెళిపోయింది, ఒక వారం తరువాత ఆమెనుంచి, షిరిడీలో తనకు బాబా గారు చూపింక చమత్కారం గురించి మెయిల్ చేసింది. ఆమె యిచ్చిన మెయిల్ ని యిక్కడ ఇస్తున్నాను, బాబా గారు తన పిల్లలపై కురిపించే ప్రేమ యెలా ఉంటుందో లీలా చదివితే అర్థం అవుతుంది.



" సాయిరాం, ప్రియాంకా అక్కా, నేను షిరిడి వెళ్ళేముందుబాబా గారికి బట్టలు యెక్కడ ఇవ్వాలి, యెలా సమర్పించాలి చెప్పమని నీకు మెయిల్ ఇచ్చాను, గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు నాకు కలిగిన అనుభవం గురించి నీకు చెపుతున్నాను. నేను షిరిడి వెళ్ళేటప్పటికి రాత్రి 9.30 అయింది. వెంటనే భక్త నివాస్ కి యెప్పుడూ వెళ్ళేలాగే వెళ్ళాను. నేను అక్కడికి వెళ్ళేటప్పటికి 390 మంది గదుల కోసం నిరీక్షిస్తూ ఉన్నారు. నా నంబరు 359. మాకు క్రితంసారి దొరికినట్టే ఈసారి కూడా గది దొరుకుతుందనుకున్నాను, కాని ఈసారి అంత అదృష్టం లేదనిపించింది. మొదటగా మేము శేజ్ ఆరతి కి వెళ్ళాము. నేను వరుసలో నుంచున్నప్పుడు, అందరూ నన్ను తోసేస్తుంటే బాబా గారిని చూడలేకపొయాను. నేను చాలా పొడవుగా ఉన్నానని, తాము బాబాని చూడలేకపోతున్నామని నావెనక ఉన్న ఆడవాళ్ళు నన్ను వెనకకి వెళ్ళమన్నారు. నేను వెనకకు రాగా యింకా కొంతమంది యేదో అనగా మరలా వెనక్కి వెనక్కి వచ్చాను. నాకు కోపం వచ్చి, యేడుపు వచ్చింది. ఇప్పుడు నేను నుంచున్న చోటునుంచి, నేను బాబా గారిని చాలా చక్కగా పూర్తిగా చూడగలిగాను. బాబా గారిని అంత చక్కగా చూసేలా ఉన్న చోటులో ఉన్నందుకు నేను చాలా సంతోషించాను. నేను భక్తినివాస్ కి వచ్చేటప్పటికి, ఒక వ్యక్తి వచ్చి "మీరు యెక్కడినుంచి వస్తున్నారు, మీ టొకెన్ నుంబెర్ చూపించండి" అని అడిగాడు. అతను వెళ్ళిపోగానే మరొక వ్యక్తి వచ్చి, నాకు గది ఇచ్చాడు. నేనెప్పుడు షిరిడి వచ్చినా బాబాగారే ఒక తండ్రిలాగా నాకు అన్ని సౌకర్యాలూ యేర్పాటు చేస్తారనిపించింది.

మరునాడు ప్రొద్దున్న 7 గంటలకి నేను బాబా గారికి తయారు చేసిన దుస్తులు తీసుకుని సమాథి మందిరానికి వెళ్ళాను. డొనేషన్ కవుంటర్ లో దుస్తులిచ్చి, అక్కడ కవుంటర్లో కూర్చున్న వ్యక్తిని బాబాగారికి దుస్తులు యెప్పుడు వేస్తారు అని అడిగాను. 4 రోజులు వెయిట్ లిస్ట్ లో ఉన్నానని చెప్పాడు. అంటే నాలుగు రోజుల తరువాత గాని నేచ్చిన దుస్తులు బాబాగారికి వేయడం కుదరదన్న మాట. నేను అతనితో, "బాబాగారికి నేను తెచ్చిన దుస్తులు రోజే వేయండి, బాబాగార్ని నేనిచ్చిన దుస్తులలో చూసి వెడదామని ఉంది" అని అర్థించాను. అతను, ప్రొద్దున్న 10.30 కి నమ్మకంగా చెపుతానన్నాడు. సమయానికి నేను సమాథి మందిరానికి వెళ్ళి బాబా గారిని దర్శించుకుని, అక్కడున్న పూజారిగారితో నేను బాబాగారికి ఇచ్చిన దుస్తుల గురించి చెప్పాను. అప్పుడా పూజారిగారు, బాబా గారు కనక నేను తెచ్చిన దుస్తులు స్వీకరించేటట్లయిటే స్వయంగా ఆయనే పిలిచి, దుస్తులు థరిస్తారని చెప్పాడు. 10.30 కి నేను మరల డొనషన్ కవుంటర్ వద్దకు వెళ్ళి అడగ్గా, కవుంటరులో ఉన్న వ్యక్తి, "మేడం, ఇంకా 2 రోజుల నిరీక్షణ జాబితా ఉంది, రోజుకు కుదరదు" అని చెప్పాడు. నేను "సరే" అని మెల్లగా నడుచుకుంటూ గురుస్థానానికి వెళ్ళాను. నా కళ్ళంబట కన్నీరు వస్తోంది, నాకు చాలా విచారంగా ఉంది.

.........(నిజానికి కొన్ని రోజుల ముందు నేను వెబ్ సైట్లో బాబాగారి ప్రత్యక్ష ప్రసారం చూస్తున్నాను. అందులో చాలా మంది బాబాగారికి దుస్తులు ఇవ్వడం, అక్కడి పూజారి దుస్తులను బాబాగారికి తాకించి తిరిగి భక్తులకి యిచ్చివేయడం చూశాను. నేను మా అమ్మగారితో మనం కూడా బాబా గారికి దుస్తులు ఇద్దామని చెప్పాను. అప్పుడు మా అమ్మగారు" బాబాగారికి తాకించి మరలా మనకి ఇచ్చేస్తారు అని చెప్పారు. అప్పుడు నేను బాబాగారికి నేనంటే ఇష్టమయితే దుస్తులను బాబా గారు ఉంచుకుంటారు అని చెప్పాను. సాయంత్రము హటాత్తుగా నేను భక్తుల అనుభవాలు పుస్తకము తెరిచినప్పుడు ఒక పేజీలో ఒక భక్తుని అనుభవం నా కంటబడింది. అందులో, ఒక భక్తుడు బాబాగారికి యివ్వడానికి దుస్తులు తీసుకెడతాడు. అవి బాబాగారికి తాకించి మరలా తిరిగి ఇచ్చివేస్తారని తెలుసు. అందుచేత అతను బాబా బండి వద్దకు అందులోకి వెళ్ళి, అతని పాదాలని ముట్టుకుని మెల్లగా దుస్తులని అతని పాదాల క్రిందకు తోశాడు. కొంతసేపయిన తరువాత బాబా లేచి నుంచుని గట్టిగా, నా బండి కిందనున్న వీటినన్నిటినీ తీసి వేయండి అని అరిచాడు. అప్పుడు అతను ఒక ముస్లిన్ క్లాత్ చేతిలోకి తీసుకుని తన శరీరం మీద వేసుకుని, దీనిని నేను అసలు యివ్వను అని అన్నాడు. )

పేజీ చదువుతున్నప్పుడు బాబా గారు నేనిచ్చే దుస్తులు తీసుకుంటానని సూచన చేస్తున్నట్లుగా నాకనిపించింది. గురుస్థాన్ వద్ద దుఖిస్తూ విషయాలన్నీ గుర్తుచేసుకుంటూ, బాబా నువ్వే కనక నన్ను నిజంగా ప్రేమిస్తుంటే నువ్వు నేనిచ్చిన దుస్తులు వేసుకోవార్లి. నీమాటలెప్పుడూ అసత్యాలు కావు" అని మనసులో అనుకున్నాను. నేను మా అమ్మగారివయిపు చూస్తూ యేడుస్తున్నాను. మా అమ్మగారు నాలుగు రోజుల తరువాత వేస్తారుకద, యేమయింది అని అన్నారు.

నేనికా గట్టిగా యేడవడం మొదలుపెట్టాను. హటాత్తుగా ఒక గంట తరువాత వాచ్ మన్ నన్ను చూసి పిలిచాడు. అతను యెవరినో పిలుస్తున్నాడనుకున్నాను, కాని అతను నన్నే చూసి పిలిచాడు. అతను నాను ఆఫీస్ లో కి తీసుకెళ్ళడు. అంతకుముందు, కవుంటలో, రెండు రోజుల దాక ఆగమన్న వ్యక్తి ఇప్పుడు ఇలా చెప్పాడు, " ఇప్పుడే నేను మందిరంలో మీరిచ్చిన దుస్తులు ఇచ్చి వస్తున్నాను. యివాళ 12 గంటలకి మథ్యాహ్న హారతికి బాబాగారికి దుస్తులు వేస్తారు, కాకపోతే సాయంత్రము థూప్ హారతికి వేస్తారు అని చెప్పాడు. నాకు ఇది వినగానే చాలా సంతోషం వేసింది, అనందాశ్రువులు రాలాయి. సాయంత్రము థూప్ హారతికి బాబా గారికి నేనిచ్చిన దుస్తులు వేశారు. బాబా గారు దుస్తులలో చాలా అందంగా కనిపించారు. నేను మా అమ్మగారు ఒక ళ్ళ కొకళ్ళం కౌగలించుకుని యేడ్చేశాము.


సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు


Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List