09.02.2011 బుథవారము
నా కలలో - షిరిడీ షిరిడీ షిరిడీ
ఈ రోజు శ్రీమతి ప్రియాంకాగారి షిరిడిఈ యాత్ర దానికి సంబంధించిన లీలలను తెలుసుకుందాము. ఈ లీలలు 2008 సంవత్సరము నవంబరు నెలలో జరిగినవి. ఆంగ్ల బ్లాగు నుండి తెలుగులో అనువాదము యిప్పుడు మీరు చదువుతున్నారు.
ఈ లీలలను చదివుతున్నప్పుడు బాబాగారు తన బిడ్డలపై యెంతటి అనుగ్రహాన్ని కురిపిస్తారో మనకి అర్థమవుతుండి. నా భక్తులని పిచ్చుకకి దారము కట్టి లాగునట్లు, నేనే నావద్దకి రప్పించుకుంటాను అన్న మాటలు అక్షర సత్యాలని మనకి గ్రహింపుకొస్తుంది.
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
ఈ రోజు నేను పోస్ట్ చేయబోయే లీలా శ్రీమతి ప్రియాంకా రౌతేలాగరి లీల, 2008 లో బ్లాగులో ప్రచురితమయినది. ఈ లీల ఆమె మాటలలోనే తెలుసుకుందాము.
------ నేను మాకుటుంబము నవంబరు 7 తారికున షిరిడీ ప్రయాణము పెట్టుకున్నాము. 9 తారీకున మేము షిరిడీ లో ఉంటాము. దీనితోపాటుగా మీఅందరితో మూడు సాయి లీలలను పంచుకుంటాను.
లీల నం.1 : జూలై నెలలో నేను బాబాగారికి సాయంత్రము ఆరతి యిస్తుండగా శాలువామీద 108 బాబా నామాలతో ఉన్నట్లుగా నా దృష్టికి గోచరించింది. ఈ దృశ్యం దేనిని సూచిస్తోందో నాకు అర్థము కాలేదు. క్షణంలోనే బాబాగారు, 108 నామాలతో శాలువాని సమర్పించమని సూచిస్తున్నట్లుగా నాకర్థమయింది. 108 నామాలతో శాలువాని సమర్పించడమంటే చాలా కొత్తగాఉంది, ఆ దృశ్యం చూడడంకూడా యెంతో వింతగా ఉండి, నాకు చాలా సంతోషం వేసింది. నా గుండె చాలా వేగంగా కొట్టుకుంది. బాబాగారు మమ్మలని షిరిడీ రమ్మని ఆహ్వానిస్తున్నారు. మరునాడు గురు పూర్ణిమ గురువారమునాడు, నెను, మాత్తగారు బజారుకి వెళ్ళి 108 నామాలతో బాబాగారికి శాలువా తయారు చేయడానికి గుడ్డ కొనడానికి వెళ్ళాము. మేము షిరిడీ యెప్పుడు వెడతాము అని ఆలోచిస్తున్నాను. ఒకవేళ వచ్చే నెలలో వెడితే కనక, ఈశాలువా యెప్పటికి తయారు అవుతుంది, కాని అంతా బాబాగారే చూసుకుంటారు, పూర్తికావడానికి తగిన సమయం కూడా ఆయనే ఇచ్చారు. శాలువా పూర్తాయింది, మేము షిరిడీ వెళ్ళడానికి రోజులు లెక్కపెట్టుకుంటున్నాము. నేను తయారు చేసిన 108 బాబానామాలతో ఉన్న శాలువా ఫోటో కూడా యిస్తున్నాను.
లీలా నం. 2 : ఇప్పుడు ఈ కలకి మా షిరిడీ యాత్రకు సంబంథం ఉంది. మూడు వారాల క్రితం మా భర్తగారు మా అమ్మాయి టి.వీ. చూస్తున్నారు. మా ఆయనకి సెలవు దొరకలేదు, బాబాగారి ఫోటొ ముందు నిలబడి మమ్మలని షిరిడీ తీసుకెడుతున్నావా లేదా అని అడిగారు. మమ్ములని షిరిడీ రప్పించదలిస్తే మీ అంగీకారము యేదయిన సూచనతో తెలియచేయమని అడిగారు. ఫోటో లో బాబాగారు నవ్వుతున్నట్లుగా చూశారు, మా అమ్మాయి కూడా ఆయన నవ్వడం చూసింది. అప్పుడే, నేను వేరే గదిలో కంప్యూటర్ మీద పని చేసుకుంటుండగా, సెల్ ఫోను మోగింది. నేను ఫోను తీసేటప్పటికి అది రాంగ్ కాల్. మా ఆయన , ఫోను యెవరుచేశారు అని అడగ్గా, నేను రాంగ్ నంబర్ అని చెప్పాను. ఇది వినగానే మా ఆయన 5 నిమిషాల క్రితం తను బాబాగారిని మనలని షిరిడీ రప్పిస్తుంటే కనక యేదయినా సూచన చేయమని చెప్పాను, అప్ప్దుడే నీ సెల్ ఫోను మోగింది అని చెప్పారు.
అందులో వచ్చిన రింగ్ టోన్ :
షిరిడీవాలే సాయిబాబా ఆయా హై తేరే ఘర్ పే సవాలీ...
ఈ రింగ్ టొన్ రావడంతో బాబాగారు తమ అంగీకారాన్ని ఈవిథంగా తెలియచేశారు. బాబాగారు మా ఆయనవంక చూస్తూ నవ్విన ఫోటోని కుడా జత చేస్తున్నాను.
లీల నం.3 : క్రితం వారము నుంచి నాకు ఒక విథమయిన కలరావడం మొదలుపెట్టింది. ఆ కలలో నాకు యేమీ కనపడలేదు, కాని రాత్రంతా ఒకటేమాట వినపడింది, అది షిరిడీ, షిరిడీ, షిరిడీ. నిన్న మటుకు నేను బాబాగారిని యింకేమి ప్రశ్నించకముందే నాకు ఈకల రాలేదు. నిన్న గురువారమునాడు మా షిరిడీకి టిక్కట్ రిజర్వేషన్ కన్ ఫర్మ్ అయింది.
ఈ మూడు లీలలన్నిటిని తలుచుకుంటే నాకు రోమాలు నిక్కపొడుచుకుంటున్నాయి.
నాకు ఈరోజు చాలా అనందంగా ఉంది, బాబాగారు మమ్ములను షిరిడీ రప్పించుకుంటున్నారు.
నేనెప్పుడు సాయి లీలలను వ్రాసినా బాబాగారు నాపక్కనే ఉన్నట్లుగా ఉంటుంది నాకు.
అల్లామాలిక్
ఈ లీలలతరువాత షిరిడీలో శ్రీమతి ప్రియాంకాగారికి అనుభవమైన బాబా లీలలను మరునాడు తెలుసుకుందాము.
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.
0 comments:
Post a Comment