Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Thursday, March 3, 2011

సత్సంగానికి ఆహ్వానము

Posted by tyagaraju on 7:52 PM




04.03.2011 శుక్రవారము

ఈ రోజు అందరూ సత్సంగానికి రండి. ఇది చదువుతున్నంత సేపూ మీరంతా సంత్సంగంలో ఉన్నట్లుగా ఊహించుకోండి.

ఈ రోజు మన సాయి బంథువులందరము కలిసి సత్సంగము చేసుకుందాము. మన సాయి బంథువులందరూ కూడా యెవరయితే సత్సంగము పెట్టించుకుంటున్నారో వారి యింటిలో కూర్చున్నాము. యెదురుగా తూరుపు దిక్కున పెద్ద బల్ల మీద పీఠం యేర్పాటు చేసి దానిమీద పెద్ద బాబా ఫోటో,చిన్నబాబా విగ్రహము, పక్కన విఘ్నేశ్వరుడి చిన్న విగ్రహము, ఇంక మిగతా దేవుళ్ళ ఫోటోలు అమర్చి ఉన్నాయి. అన్నిటినీ పూలతో అలంకరించారు. బాబా విగ్రహానికి మిగిలిన ఫోటో లకి మల్లెపూల దండలు వేశారు. బాబా ఫోటో కి గులాబీల దండ వేశారు.

సాయి బంథువులందరూ చక్కగా ఒక వరుసలో కూర్చున్నారు. సంత్సంగము యెవరియితే పెట్టించుకుంటున్నారో ఆ యింటి దంపతులు, వారి పిల్లలు బాబా ఫోటొ ముందు కుర్చున్నారు.

సత్సంగము ప్రారంభానికి ముందు అందరూ కూడా ముక్త కంఠముతో "సచ్చిదానంద సద్గురు సాయి నాథ్ మహరాజ్ కీ జై " అన్నారు. దంపతులిద్దరూ బాబాకి అష్టోత్తరం చదువుతూ ఒక్కొక్క నామానికి ఒక్కక్క పువ్వు వేస్తూ పూజ చేస్తున్నారు. మిగత వారందరూ సాయి చాలిసా చదువుతున్నారు.

బాబాకి పూజ పూర్తవగానే, తయారు చేసిన పులిహోర, అరటిపళ్ళు, సాయి బంథువులు తెచ్చిన పాలకోవా, కొబ్బరికాయలు మొదలైనవన్నీ బాబాకి నైవేద్యము పెట్టారు.

ఇప్పుడు అందరూ "ఓం సాయీ నమోనమహ షిరిడీసాయి నమోనమహ జయజయ సాయి నమోనమహ సద్గురు సాయీ నమోనమహ" అని 3 సార్లు నామాన్ని జపించారు. తరువాత అందరూ కళ్ళు మూసుకుని అరచేతులు రెండు ఒకదానిలో ఒకటి ఉంచి " ఓం శ్రీ సాయి నాథాయనమహ" అని 108 సారులు నామ జపం చేశారు. 108 పూర్తి అవగానే అందరు రెండు చేతులూ కళ్ళమీద పెట్టుకుని కళ్ళు మూస్తూ తెరుస్తూ మూడు సార్లు అరచేతులలోకి చూసి తరువాత బాబా ఫోటో వైపు చూశారు.



తరువాత బాబా సచ్చరిత్రలోని (శ్రీ పత్తి నారాయణరావు గారు వ్రాసిన) ఒక అథ్యాయము సాయి బంథువులలోని ఒకరు చదువుతుండగా మిగిలినవారందరూ శ్రథ్థతో ఆలకించారు. (సత్సంగములో సచ్చరిత్రలోని 33 అథ్యాయము చదివినారనుకొందాము) అథ్యాయము పూర్తి అవగానే ఒకరుదానికి వ్యాఖ్యానము చెపుతున్నారు శ్రథ్థగా వినండి.

" ఈ రోజు మనము 33 వ అథ్యాయము చదివాము. ఈ అథ్యాయములో ఊదీ మహిమ గురించి చెప్పబడింది. గత అథ్యాయములో అనగా 32 లో గురువు మహిమ గురించి చెప్పబడింది. బాబా వారికి ఒక్కసారి భక్తితో ప్రణమిల్లుదాము. బాబా కరుణా కటాక్క్షములు పడితే కొండంత పాపములు కూడా నశిస్తాయి. మనలో ని దుర్గుణాలు పోగొడతాయి. మన మనస్సులో ఇది నాది, అది నీది అనే భేద భావములు ప్రవేశించవు.

బాబా వారు అందరి దగ్గిరనించి దక్షిణ తీసుకుంటూ ఉండేవారు. అందులో యెక్కువ భాగము దానం చేసి మిగతా దానితో కట్టెలను కొని థునిలో వేస్తూ ఉండేవారు. అది యిప్పటికి అల్లాగే మండుతూ ఉంది. ఆ థునిలో ని ఊదీనే బాబా గారు భక్తులకి ఇస్తూ ఉండేవారు. ఈ మానవ శరీరము కూడా ఆఖరికి బూడిదగా మారవలసిందే.

ఊదీ వల్ల బాబా యేమి చెప్పదలచుకున్నారు? ప్రపంచములో కనిపించేవన్నీ బూడిదవలె అశాశ్వతములు.



ఈ ఊదీ అరోగ్యాన్ని, ఐశ్వర్యమును కలుగచేస్తుంది. బాబా ఊదీ అంటే అది సర్వరోగ నివారిణి. మనము దానిని అచంచలమైన విస్వాసంతో నమ్మకంతో థరించాలి. ఊదీ అంటే యెముందండీ, వట్టి బూదిడే కదా అని మనం భావించకోడదు. యేమంటారు, అవునా కాదా? ఇక్కడ మనం ఒక చిన్న కథ చెప్పుకుందాము

ఒక ఊరిలో ఒక గురువుగారు ఉన్నారు. ఆయనకి నీటిమీద నడిచే విద్య తెలుసు. ఆయన వద్ద ఒక శిష్యుడు ఉన్నాడు. ఆ శిష్యుడు గురువుగారిని తనకు కూడా నీటిమీదనడిచే విద్య చెప్పమని అడుగుతూ వుండేవాడు. ఒక రోజు గురువుగారు శిష్యుడికి చిన్న కాగితం మడతలు పెట్టి ఇచ్చి దానిని చేతుల మథ్య పెట్టుకుని నదిమీద నడిచి వెళ్ళమన్నాడు. కాని మథ్యలో కాగితం మాత్రం తెరిచి చూడవద్దని హెచ్చరించారు. శిష్యుడు అలాగే అని కాగితం మడత అరచేతుల మథ్య పెట్టుకుని నది మీద నడవడం మొదలు పెట్టాడు. నది మథ్యకి వచ్చేటప్పటికి కాగితంలో యేముందో చూద్దామని విపరీతమైన కోరిక కలిగింది. కాగితం విప్పి చూసాడు. అందులో "శ్రీ రామ" అని రాసి ఉంది. శిష్యుడు అది చదివి "ఓస్ ఇంతేనా" అనుకున్నాడు. అంతే బుడుంగున నీటిలో మునిగిపోయాడు. అంటే కాగితం తెరవనంత వరకు అందులో యేదో పవిత్రమైన మంత్ర రహశ్యం యేదో ఉందనుకున్నాడు. శ్రీ రామ అందరు అనుకునే మాటే, అందుకు ఓస్ ఇంతేనా అనుకొగానె అతని నమ్మకం కాస్తా సడలి పోయింది. తేలిక భావం యేర్పడింది. కాని, ఓస్ ఇంతేనా అనుకోకుండా "ఆహా యేమి ఈ రామ నామ మహిమ అని యెంతో నమ్మకంతో ఉంటే ఆ పరిస్థితి వేరుగా ఉండేది. "

అందుచేత మనము కూడా ఊదీ అంటే బూడిదే కదా ఇది అన్ని రోగాలని తగ్గిస్తుందా అని భావించకుండా దానిని పరమ పవిత్రమైన బాబా ఇచ్చిన ఊదీ అనే భావంతో థరించాలి.

మరి ఈ విషయాలన్ని మనకి పూర్తిగ గ్రహింపుకు యెలా వస్తాయి? ఊరికే సచ్చరిత్ర వారం రోజులు పారాయణ చేసి,ఆఖరున బాబాకి పాలకోవా నైవేద్యం పెట్టి, హమ్మయ్యా, పారాయణ పూర్తి ఐపోయింది. అనుకుంటే సరిపోదు. వారం రోజులు పారాయణ పూర్తి కాగానే పుస్తకం బీరువాలో పెట్టి చేతులు దులుపుకుంటే సరిపోదు. వీలు చూసుకుని ప్రతిరోజు చరిత్రలోని కొంత భాగాన్ని అయినా చదవాలి. అందుకోసం కొంత సమయం మనకి మనమె కేటాయించాలి. ఏ? మనం రోజూ టీ.వీ. చూడటానికి యెంత సమయం కేటాయిస్తున్నాము. దాని వల్ల మనకి యేమన్న లాభం చేకూరుతోందా? చూస్తున్న సీరియల్స్ అన్నీ కూడా చెత్త అని తెలుసు. అందులొ కొంత సమయం బాబా చరిత్ర చదవడానికి కేటాయిద్దాము. చదవడమే కాదు అందులో ఆయన చెప్పిన విషయాలన్నిటినీ పూర్తిగా జీర్ణించుకోవాలి. ఆచరణలో పెట్టాలి. చరిత్రలొని ప్రతీ పేజీ, ప్రతీ మాటా, ప్రతి పదం ఒక ఆణి ముత్యం. అందుచేత మన సాయి భక్తులందరు తప్పనిసరిగా ప్రతివారం జరిగే
ఈ సత్సంగానికి రండి. బాబా చరిత్ర వినండి, లీలలు వినండి, చెప్పండి." సర్వ శ్రీ సాయినాథార్పణమస్తు అని ముగించారు.

తరువాత సంత్సంగ సభ్యులలొ ఒకరు మిగతా వారిని ఉద్దేశ్యించి, ఇంకా యెవరన్న యేమన్న చెపుతారా అని అడిగారు.
అప్పుడు ఇంకొక ఆయన చెప్పడం మొదలు పెట్టారు.

"ఈ రోజు మనం ఈ సత్సంగంలో పాల్గొన్నామంటే అంతా బాబా గారి దీవెన. మనం సాయి భక్తులమా కాదా అన్నది మనం కాదు నిర్ణయించవలసింది. మనం సాయి భక్తులం అవునా కాదా అని బాబాగారు చెప్పాలి. ఇలా యెందుకంటున్నానంటే మనం కనక బాబా గారు చెప్పినట్లు ప్రతి మాట తూ చా తప్పకుండా అచరణలో పెట్టాలి. మనలో శాంత స్వభావం నిండి ఉండాలి. అప్పుడే మనము సాయి భక్తులము అనిపించుకుంటాము.

సత్సంగంలో ప్రతీ సాయి బంథువు సమానమే. ఒకరు తక్కువ ఒకరు యెక్కువ కాదు. సత్సంగానికి ముందు వచ్చినవారు ముందు తరువాత వచ్చినవారు తరువాత కూర్చోవాలి. వారు సమాజంలో యెంత గొప్పవారైనా సరే బాబా ముందు మనమందరమూ సమానమే. ఉదాహరణకి మన సత్సంగంలో ఒకరు టీచరు గారు ఉండవచ్చు. సత్సంగము జరుగుతుండగా మథ్యలో వారు వచ్చారనుకోండి. వెంటనే మనము లేచి, "రండి, రండి, అని మనము లేచి వారికి మొదటి స్థానం చూపించి కూర్చోపెట్టకూడదు. అంటే వారికి నేను మర్యాద చేసి కూర్చోపెట్టానంటే నాలొ స్వార్థం ఉందేమో? మా పిల్లవాడికి కాని, అమ్మాయికి గాని, ఉచితంగా ప్రైవేటు చెపుతారేమొ? ఇటువంటి ఆలోచనలకి తావివ్వకుండా అందరూ సమానమే అని, భావించుకోవాలి. కుల మతాల ప్రవస్తావన కూడా ఉండకూడదు. మన సాయి బంథువులలొ యెవరికి యేకష్టము వచ్చినా మన ఈ సత్సంగములో బాబా గారిని ప్రార్థించి వేడుకుందాము. ఒక్కరు చేసె ప్రార్థనకన్నా పదిమంది చేసే ప్రార్థన యెక్కువ ఫలితాన్ని అందిస్తుంది. సత్సంగము చేసే ప్రతిచోటా బాబా గారు వచ్చి కూర్చుంటారు. ప్రత్యేకంగా హారతి ఇచ్చే సమయంలో బాబా గారు వస్తారు.

మంచి మనసుతో చేసే ప్రార్థన అమోఘమైన ఫలితాన్నిస్తుంది. అటువంటప్పుడు ఈ సత్సంగ సమయంలో అందరూ కలిసి చేసే ప్రార్థన యెంతో మంచి ఫలితాన్నిస్తుంది.

మనకందరికీ తెలుసు మన చిన్నప్పుడు మనం విన్న సామెత "శుభం పలకరా మంకెన్నా, తథాస్తు దేవతలుంటారు" అని. ఈ సమయంలో నా చిన్నప్పుడు చందమామలో చదివిన కథను చెపుతాను.

"దంపతులిద్దరు తమ బాబుకి బారసాల మహోత్సవం చేస్తున్నారు. పిలిచినవారందరు వచ్చారు. తల్లి ఒడిలో పిల్లవాడు ఉన్నాడు. అందరు బారసాల ఆనందంగా తిలకిస్తున్నారు.కొంత సేపటికి తల్లికి అనుమానం వచ్చింది. పిల్లవాడిలో కదలిక లేదు. ఊపిరి ఆడటల్లేదు. తల్లి ఖిన్నురాలయింది. మనసు ఉగ్గపట్టుకుని కూర్చుంది. పైకి యెవరికీ చెప్పలేదు. ఆలోచించింది. ఇక్కడ ఇంతమంది పెద్ద మనుషులు ఉన్నారు, పండితులు ఉన్నారు. ఆఖరుగా అందరూ పిల్లవాడిని దీవిస్తారు. యేఒక్కరి దీవెనయినా ఫలించకపోతుందా అని అనుకుంది. లోపల లోపలే దుహ్ కాన్ని దిగమింగుకుని కూర్చుంది. బారసాల అయిపొయింది. అందరూ కూడా "చిరంజీవ, చిరంజీవ, దీర్ఘాయుష్మాన్ భవ" అని అక్షతలు వేసి దీవించారు. పిల్లవాడిలో కదలిక వచ్చింది. తల్లి ఆనందానికి మేర లేదు."
ఇది కథే కావచ్చు. కాని మనం తెలుసుకోవలసింది యేమిటంటే మంచి వ్యక్తి నొటివెంట వచ్చిన వాక్కు బ్రహ్మ వాక్కు అవుతుంది. ఇతరులు మనకి అపకారం తలపెట్టినా కూడా మనం వారికి ఉపకారమే చేయాలి. ఒకవేళ చేయలేకపోయినా అపకారము మాత్రం తలపెట్టకూడదు. అప్పుడే మనకి జీవితంలో మంచి జరుగుతుంది. ఈ రోజు ఈ సత్సంగం లో ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు బాబా గారికి కృతజ్ణతలు తెలుపుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను" సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.


ఇప్పుడు మనం బాబా మీద కొన్ని పాటలు పాడుకుందాము. సత్సంగంలోని వారంతా బాబా మీద 3 పాటలు పాడారు.

సత్సంగంలో ఒకరు లేచి సత్సంగ ప్రార్థన చేశారు.

సత్సంగ ప్రార్థన " ఓ సర్వాంతర్యామీ, సాయి సద్గురూ, దయామయీ, ఈ రోజు ఈ సత్సంగానికి వచ్చినవారంతా నీ అనుగ్రహంతోనే వచ్చారు. మమ్మలని అందరిని చల్లగా చూసి కాపాడు తండ్రీ" మేము అంతా మీ బిడ్డలము. ఈ సత్సంగం పెట్టించుకున్న వారిని యెల్లప్పుడు నీ శుభాశీస్సులు అందించి కాపాడు తండ్రి." ఈ సత్సంగము పెట్టించుకున్నవారికి నేను చెప్పేదేమంటే, మీకు ఇచ్చిన ఈ బాబా ఫోటోని మీ పూజా మందిరంలో పెట్టి రోజూ పూజించండి.మీరు యేది తిన్న ముందర బాబాకి పెట్టి అప్పుడు మీరు తినండి." అని ముగించారు.

సత్సంగం అయిపోయింది. ఇప్పుడు హారతికి సమయం అయింది. అందరూ సాయంత్రం హారతి పాడి బాబాకి హారతి ఇచ్చారు. మంత్ర పుష్పంలొ యెవరికి తోచినంత వారు దక్షిణ వేశారు.
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు

అందరూ కూడా బాబా ఫోటో ముందు సాష్టాంగ నమస్కారం చేసి, ప్రసాదాలు తీసుకుని వెళ్ళారు.

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు

Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List