09.03.2011 బుథవారము / 10.03.2011 గురువారము
కంప్యూటర్ ప్రాబ్లం వల్ల బాబా ఫోటో, మరియు గులాబీ అప్లోడ్ చేయలేకపొతున్నాను.
బాబా -- గొప్ప వైద్య నిపుణుడు
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంథువులందరికి బాబా గారి శుభాశీస్సులు. గత కొన్ని రోజులుగా బాబా లీలలను యేమీ అందివ్వలేకపోయాను. సుకన్య గారు పంపిన సాయి ప్రేరణ మొత్తము 13 అథ్యాయాలు ఒక్కసారిగా ఇవ్వాలనే ప్రయత్నంలో కొంచెం వెనక పడ్డాను. రోజుకు 3 లేక 4 అథ్యాయములు ఇద్దామనుకున్నాను గాని, మొత్తం అన్నీ ఒక్కసారిగా ఇస్తే బాగుంటుందనే ఉద్దేశ్యంతో చాలా ఆలశ్యం జరుగుతోంది. కాని బాబా లీల యేదో ఒకటి ఇవ్వలేకపోయాననే బాథ మనసులో ఉంది. అందుచేత ఈ రోజు చిన్న బాబా లీల సాయిలీల సంచికలో ప్రచురించినది మీముందు ఉంచుతున్నాను. సాయి ప్రేరణ త్వరలోనే అందిస్తాను.
నేను ప్రస్తుతం బెంగళూరులో ఉన్నాను. కరంటు కొరత వల్ల, ఇక్కడ మా మనవడు చిన్న బాబు, వాడిని చూసుకోవడంతో బాబా లీలలను ప్రతీరోజు అందివ్వలేకపోతున్నాను. ఈ రోజు ఇస్తున్న బాబా లీల సాయి లీల సంచికలో మే 1984 లో ప్రచురింపబడింది. జె.ఆర్. లారోయీ, నోయిడా నించి వ్రాసినది.
****************************************
షిరిడిలో యెవరయితే కాలు మోపుతారో వారి బాథలన్ని పటాపంచలవుతాయి. ఇది మాకు ఈమథ్యనే అనుభవంలోకి వచ్చింది.
పాఠకులారా, నా భార్య చాలా సంవత్సరాలనుండి, గొంతుకు సంబంధించిన వ్యాథితో బాథ పడుతోంది. అది మామూలుగా దగ్గు, జలుబుతో మొదలై, యెన్ని మందులు వాడినా నయం కాకపోగా రోజు రోజుకీ యెక్కువ కాసాగింది. నేను యిండొర్ లో ని సెంట్రల్ ఎక్సిజ్ ఆఫీస్ లో పే & ఎక్కౌంట్స్ ఆఫీసర్ గా పని చేస్తున్న కాలంలో చాల్ మంది వైద్యులను సంప్రదించడం జరిగింది. కాని యేమీ లాభం లేకపోయింది.
ఆ సమయంలో ఆమె సరిగా యేమీ తినడం తాగడం చేయలేకపోయేది.
అనేక మంది వైద్యులు ఇచ్చిన మందులు వాడుతూ చాలా పదార్థాలు తినడం తగ్గించింది.
ఈమథ్యనే షిరిడీలో ప్రతిసంవత్సరం జరిగే రచయితల సభకి ఆహ్వానం అందింది. ఆమె ఆరొగ్య పరిస్తితి వల్ల మేము వెళ్ళడమా, మానడమా అని సందేహంలో పడ్డాము. బాబా గారు సందేశం ఇచ్చారా అన్నట్లుగా, నా భార్య తనకు అంత గొంతు బాథ ఉన్నప్పటికి షిరిడి వెడదామని పట్టు పట్టింది. మేము షిరిడి చేరుకోగానే బాబా ని దర్శించుకుని ఆయన చరణ కమలాలముందు నిలబడి తనకు యెంతో కాలమునుండి వున్న వ్యాథిని తొలగించమని ప్రార్థించింది.
పాఠకులారా, రచయితల సమ్మేళనం అవగానే మేము షిరిడీ వదలి వెళ్ళేముందు నాభార్యకి గొంతులో యేవిథమైన నొప్పి లేదు. ఇది అప్పుడు కొంత సేపు తాత్కాలిక ఉపశమనం అనే ఉద్దేశ్యంతో యెవరికి ఈ విషయం చెప్పలేదు. ఇప్పుడు చాలా రోజులు గడచిన తరువాత చెపుతున్నాము ఆమె గొంతు బాథ పూర్తిగా నయమయింది. అంతే కాదు, గొంతు నొప్పి వల్ల ఏ పదార్థాలయితే వదలి వేసిందొ అవన్ని కూడా మరలా తీసుకోవడం మొదలు పెట్టింది.
ఇదంతా కూడా బాబా గారు చేసిన వైద్యం కాక మరేమిటి.
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు
Sai Reunite You With Your Loved Ones - Experience By Sister Saba Khan
-
[image: shirdisaideva.com]
Sairam to all readers ,
When we develop our own spiritual health with our reflection the things
around us will also change an...
6 years ago
0 comments:
Post a Comment