Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, January 7, 2012

మన ప్రశ్న - చీటీ ద్వారా బాబా జవాబు

Posted by tyagaraju on 5:32 PM


08.01.2012 ఆదివారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

మన ప్రశ్న - చీటీ ద్వారా బాబా జవాబు

ఈ రోజు నెల్లూరునించి సుకన్యగారు పంపిన ఒక సాయి భక్తురాలి బాబా అనుభూతిని, సాయి బా ని స. డైరీ - 1994 రెండవ భాగాన్ని అందిస్తున్నాను. అమెరికానుంచి ఒక భక్తురాలు పంపిన బాబా అనుభూతి ఆమె మాటలలోనే.

నేను డిగ్రీ చదువుతున్న రోజులలో నాకు బాబా వారి గురించి తెలిసింది. స్నానం చేసినతరువాత ప్రతీ రోజు సాయిబాబా సచ్చరిత్రలో ఒక పేజీ చదవడం ప్రారంభించాను. నిర్ణయాలను తీసుకోలేని పరిస్థితులలో నేను బాబాముందు చీటీలను వేసి సమాధానం కోసం ప్రయత్నిస్తూ ఉండేదానిని. (ఆ పరిస్థితులలో సమస్యతీరడానికి తగిన కారణాలను అన్నిటినీ చీటీలమీద రాసేదానిని). బాబా నామాన్ని ఉచ్చరిస్తూ చీటీలను తీసేదానిని. చీటీ తీసినప్పుడు ఏది వస్తే దానిని బాబా సమాధానంగా అనుసరించేదానిని.

ప్రముఖ కాలేజీలో అప్పుడు కొన్ని యింటర్వ్యూ లు జరుగుతున్నాయి. ఆ కాలేజీ మా యింటివద్దనిముచి రెండుగంటల ప్రయాణం దూరంలో ఉంది. నా స్నేహితులందరూ ఆ కాలేజీకి దగ్గరలోనే ఉన్నారు. మా యిల్లు ఒక్కటే చాలా దూరంలో ఉంది. ఇక యింటర్వ్యూ కి ఒకరోజు ఉందనగా ప్రభుత్వంవారు బందు ప్రకటించారు. ఆరోజున బస్సులు ఏవీ తిరగడంలేదు. ఆరోజున బస్సులు లేని కారణంగా మా నాన్నగారు యింటర్వ్యూ కి వెళ్ళవద్దని చెప్పారు. నా స్నేహితులందరూ వెడుతున్న కారణంగా నేను కూడా వెళ్ళి తీరాలసిందేనని నిర్ణయించుకున్నాను. నేను మా నాన్నగారితో బాగా వాదించాను. కాని మానాన్నగారు ఒప్పుకోలేదు. ఆఖరికి చీటీలమీద యింటర్వ్యూకి హాజరవడానికి తగిన కారణాలన్నిటినీ రాసి ఏది వస్తే దానినే అనుసరిస్తానని చెప్పాను. మానాన్నగారు దానికి ఒప్పుకున్నారు.

చీటీలలో నేను రాసినవి ఇవి:

1) యింటర్వ్యూకి వెళ్ళు నువ్వు సెలెక్ట్ అవుతావు

2) నువ్వు యింటర్వ్యూకి వెళ్ళినా లాభం లేదు

3) వెళ్ళు, అనుభవం వస్తుంది

4 ) వెళ్ళవద్దు

ఇవే నేను చీటీలలో రాసినవి.

సాయిబాబా నామస్మరణ చేస్తూ ఒక చీటీ తీసాను. అందులో నువ్వు యింటర్వ్యూకి వెళ్ళినా లాభం లేదు అని వచ్చింది. అందుచేత నేను యింటర్వ్యూ కి వెళ్ళడం మానుకొన్నాను. రెండు రోజుల తరువాత యింటర్వ్యూ ఫలితాలు వచ్చ్చాయి. నా స్నేహితులందరూ సెలెక్ట్ అయ్యారు. నేను యింటర్వ్యూ కి వెళ్ళనందుకు చాలా బాధ పడ్డాను. కొన్ని రోజుల తరువాత అది ఒక మోసపూరిత కంపెనీ అని తెలిసింది. చెసిన సెలెక్షన్ ప్రోసెస్ అంతా కూడా కాన్సిల్ చేసారని తెలిసింది.

నాకొక చెల్లెలు ఉంది. ఆమె నాకన్నా రెండేళ్ళు చిన్నది. ఈ సంఘటన తరువాత తను కూడా ఏదైనా సమస్య వచ్చినపుడు చీటీలను వేసి నన్ను సాయిబాబా పేరు ఉచ్చరిస్తూ తీయమని అడిగేది. . ఇప్పటివరకు బాబా పేరు ఉచ్చరిస్తూ నేనేచీటీ తీసినా అదే నా చెల్లెలి భవిష్యత్తుగా ఉండేది. (తన ఎంసెట్ రాంక్, కాలేజీ లో డిగ్రీ చదువు, అన్నీ కూడా బాబా చీటీ లలో వచ్చిన ప్రకారమే జరిగింది.

అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి అయేముందు నేను మొదటిసారిగా షిరిడీ వెళ్ళాను. నా అండర్ గ్రాడ్యుయేషన్ తరువాత మాస్టర్స్ డిగ్రీ కోసం నేను అమెరికా వచ్చాను. ఇక్కడ మాస్టర్స్ డిగ్రీలో నేను కొంతమంది ప్రముఖులని కలుసుకున్నాను. ఇక్కడ ప్రతీ క్షణం ఒక అద్భుతమైన క్షణం. ప్రతీ రోజు కూడా మంచి రోజు. నేనిక్కడ ప్రతీ క్షణం ఎంతో ఆనందాన్ననుభవించాను. కాని అది ఒక సంవత్సరం మాత్రమే. నా మాస్టర్స్ డిగ్రీలో 3, మరియు 4 సెమిస్టర్ లు చాలా కష్టంగా గడిచాయి. ఆ సమయం లో నేను సాయిబాబా సచ్చరిత్ర ఒక వారం పారాయణ చేశాను. 3 వ సెమిస్టర్ తరువాత నేను యిండియాకి వెళ్ళాను. రెండవసారి షిరిడీ వెళ్ళాను. నేను షిరిడీకి వెళ్ళిన రోజు బాబా రోజు, గురువారము. నాకు సాయంత్రం ఆరతి చూడాలని కోరికగా ఉంది. బాబాని నాకోరిక నెరవేర్చమని ప్రార్థించాను. సెక్యూరిటీ గార్డ్ మా కుటుంబాన్నాంతటినీ ముందుకు వెళ్ళమని చెప్పాడు. మేము ముందుకు జరుగుతే కనక సెక్యూరిటీ గార్డ్ మా వెనకనున్నవారిని ఆరతి చూడటానికి ఆపేస్తాడు. నేను ముందుకు జరగకుండా ఆగిపోదామనుకున్నాను. కాని సెక్యూరిటీ గార్డ్ ముందుకు నడవమని అరిచాడు. నేను కొంతసేపు బాబా నామస్మరణ చేసి, సెక్యూరిటీ గార్డ్ తో నాకు సాయంత్రం ఆరతి చూడాలని ఉందని చెప్పాను. అప్పుడతను నవ్వి మమ్మలిని వెనుకకు రమ్మన్నాడు. మాకు సాయి బాబా దర్శనం బాగా జరిగింది. ఆరోజు గురువారము కనక పల్లకీ ఉత్సవం కూడా ఉంది. కొంతమంది పూజారులు సమాధి మందిరం లోకి పల్లకీని తీసుకుని వచ్చారు. భక్తులందరూ కూడా ఆపల్లకీని ముట్టుకుందామనే ప్రయత్నం లో ఉన్నారు. నేను కూడా పల్లకీని ముట్టుకుందామనుకున్నాను కాని నాకు పల్లకీ కి మధ్యన చాలామంది జనం ఉన్నారు. హటాత్తుగా పల్లకీని మోస్తున్న పూజారి ఆగి నావైపు చూసి చిరునవ్వు నవ్వాడు. నేను కూడా ఆయనవైపు చూసి నవ్వి పల్లకీని ముట్టుకున్నాను. దర్శనం తరువాత నేను వేప చెట్టు దగ్గరికి వెళ్ళాను. అక్కడ ఉన్న భక్తులందరూ కిందకు చూస్తున్నారు. వారందరూ కిందకి ఎందుకు చూస్తున్నారో నాకర్ధం కాలేదు. వారంతా వేపాకులకోసం చూస్తున్నారని కొంతసేపటికి నాకర్ధమయింది. నాకు కూడా కొన్ని వేపాకులనిమ్మని బాబాని ప్రార్ధించాను. నేనప్పుడు వేప చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేస్తున్నాను. ప్రదక్షిణ చేస్తుండగా నేను 6, 7 ఆకులదాకా సేకరించాను. నా షిరిడీ యాత్ర యింత అద్భుతంగా జరిగినందుకు నేను బాబాకి ఎంతో కృతజ్ఞురాలిని.

యిండియానుంచి తిరిగి వచ్చిన తరువాత బాబా దయ వల్ల నా మాస్టర్స్ డిగ్రీని విజయవంతంగా పూర్తి చేశాను. ఉద్యోగం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తూ ఒక కన్సల్టెన్సీ లో చేరాను. మాస్టర్స్ డిగ్రీ చేయడానికి మా చెల్లెలు వచ్చింది. మా చెల్లెలిని కూడా నేనే చూసుకోవాలి కనక నాకు ఉద్యోగం చాలా అవసరం. మా చెల్లెలు నా ఉద్యోగం కోసం, యింకా తనకి కాలేజీ ప్రాగణంలో జరిగే ఆన్ కాంపస్ లో ఉద్యోగం రావడానికి సాయి సచ్చరిత్రను చదవడం ప్రారంభించింది. నేను 9 గురువారముల వ్రతం మొదలుపెట్టాను. 9 గురువారముల వ్రతము చదివిన మొట్టమొదటి గురువారమునాడు మాయిద్దరికీ ఉద్యోగాలు వచ్చాయి.


నాకు ఉద్యోగము వచ్చిన తరువాత రెండవసారి సాయి సచ్చరిత్ర పారాయణ చేశాను. పారాయణ చేసినప్పుడెల్లా ప్రతీరోజూ నా కళ్ళనుండి కన్నిరు వస్తూ ఉండేది. అక్టోబరు 17 వ.తారీకున నేను చదువుతున్న అధ్యాయములో, అక్టోబరు 15 వ తారీకున బాబావారు సమాధి అయారనీ, భక్తులందరూ ఆయన శరీరాన్ని అక్టోబరు 17 వ తారీకున బూటీవాడాకు తీసుకుని వెళ్ళారనీ ఉంది. నేను ఆ అధ్యాయము చదువుతున్న రోజు, బాబా వారి శరీరాన్ని బూటీవాడాకు తీసుకునివెళ్ళిన రోజు రెండూ కూడా సరిపోలాయి. కాకతాళీయంగా జరిగిన ఈ సంఘటనకి నాకు చాలా ఆనందం వేసింది.


నా జీవితాశయం ఒకటి ఉంది. దానినిగురించి బాబావారిని మూడు సంవత్సరాలనుంచి అడుగుతున్నాను. ఈ విషయం గురించి నేను చీటీలు కూడా వేసాను. జవాబు నాకు అనుకూలంగా వచ్చింది. అది అసాధారణమైన విషయం, బాబా అనుగ్రహంతో తప్ప అది సాధ్యంకాదు. బాబా నాయందే ఉన్నారు కనక అది జరుగుతుంది. అది జరిగిన వెంటనే నాకు కలిగిన అనుభవాన్ని మీకు తెలియచేస్తాను.

సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు



Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List