Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Friday, March 2, 2012

సాయి.బా.ని.స. డైరీ - 1995 (05)

Posted by tyagaraju on 9:21 PM
03.03.2012 శనివారము
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయిసాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈరోజు సాయి.బా.ని.స. డైరీ - 1995 5వ.భాగాన్ని చదువుకుందాము
సాయి.బా.ని.స. డైరీ - 1995 (05)
26.02.1995

జన్మలలోకెల్ల మానవ జన్మ ఉత్తమమైనది. రాత్రి నిద్రకుముందు శ్రీసాయికి నమస్కరించి మానవ జన్మలో చేయవలసిన మంచి పనులు చూపించు తండ్రీ అని వేడుకొన్నాను. శ్రీసాయి చూపిన దృశ్యాల వివరాలు.

1) జీవితము అనే బాటలో ప్రయాణము చేస్తున్నపుడు రత్నాలు, వజ్రాలు, దొరుకుతూ ఉంటాయి. వాటిని జాగ్రత్తగా ఏరుకోవాలి.







(జీవితములో మంచివారితో స్నేహము లబించుతుంది. ఆస్నేహాన్ని నిలుపుకోవాలి.)

2)జీవితములో కొన్ని సమయాలలో అహంకారముతో తప్పులు చేస్తాము. ఆ అహంకారముతొలగిపోయినపుడు మనము చేసిన తప్పులును మనము గుర్తించుతాము. అటువంటి సమయములో మనలో కలిగిన పరివర్తనను జీవితాంతమువరకు నిలుపుకోవాలి.

3) జీవితములో వివాహము స్త్రీ పురుషుల సంతోషమునకు పవిత్ర వేదిక. ఆపవిత్ర వేదికను అగ్నిజ్వాలలకు ఆహుతి చేయరాదు.
4) జీవితములో సంతోషము అనే ఫలాలు సంపాదించాలి అనే తపనతో గురువును నమ్ముకొన్నావు. నీగురువునుండి సంతోషఫలాలు అందుకొన్న తరువాత గురువును మర్చిపోవడము అంటే నమ్మకము అనే మానసిక శక్తిని నమ్మక ద్రోహము చేసినట్లే.

5) జీవితములో సుఖముగా జీవించాలి అంటే ఆకలిబాధ తీర్చుకోవాలి. ఆకలి బాధ తీర్చుకోవాలి అంటే అన్నము తినాలి. నీవు అన్నము తినేటప్పుడు నీప్రక్కవాడికి కూడా ఆకలి బాధ ఉంటుంది, వాడికి సహాయము చేయాలి అనే ఆలోచన కలిగినప్పుడు దానిని ఆచరణలో పెట్టాలి.

01.03.1995

నినంటిరోజున కుటుంబ వ్యవహారాలు, స్నేహితులతో గొడవలు, నామనసుకు చాలా చికాకు కలిగించినవి. శ్రీసాయికి నమస్కరించి సన్యాస ఆశ్రమము స్వీకరించటానికి అనుమతిని ప్రసాదించమని వేడుకొన్నాను. శ్రీ సాయి రాత్రి కలలో ఒక అజ్ఞాతవ్యక్తి రూపములో దర్శనము యిచ్చి అన్న మాటలు. "దేనికైన సమయము సందర్భము రావాలి. అంతవరకు ఓపిక పట్టాలి. నీజీవితము ఫుట్ బాల్ ఆటవంటిది. గోలు చేయటానికి నీప్రయత్నాలు నీవు చేయి. సరయిన సమయము వచ్చినపుడే నీవు గోలు చేయగలవు.అంతవరకు నీవు ఆట ఆడుతూనే యుండాలి." నిద్రనుండి మేల్కొని శ్రీసాయికి నమస్కరించినాను.

02.03.1995

రాత్రి నిద్రకు ముందు శ్రీసాయికి నమస్కరించి "సాయినాధ - నాకుటుంబ సభ్యులు అందరు మంచి మార్గములో నడవగలిగేలాగ ఆశీర్వదించు తండ్రి" అని వేడుకొన్నాను. శ్రీ సాయి అదృశ్యరూపములో యుండి అన్న మాటలు. "ఏసంసారములోనైనను సుఖశాంతులు కావాలంటే ఆయింటి యజమానురాలి నడవడిక మంచిగా యుండాలి. అపుడు ఆయింటి సభ్యులు అందరు మంచి మార్గములో నడుస్తారు.

06.03.1995

సమాజములో కొందరు వ్యక్తులు అక్రమ మార్గములో ధనసంపాదన, హోదా సంపాదన చేస్తున్నారు. అటువంటివారిని చూసినప్పుడు నామనసు చికాకుతో నిండిపోయి సాయిమార్గమునుండి తప్పుకొని వారిలాగా జీవించాలి అనే కోరిక కలుగుతున్నది. రాత్రి నిద్రకు ముందు శ్రీ సాయికి నామానసిక పరిస్థితి విన్నవించుకొని నిద్రపోయినాను. శ్రీసాయి అజ్ఞాతవ్యక్తి రూపములో దర్శనము యిచ్చి సాయింబంధువులను ఉద్దేశించి అన్న మాటలు "నీవు నిజమైన సాయి మార్గములో నడుస్తున్నపుడు నీనిజాయితీ నీకు పెద్ద పరీక్షలాగ కనబడుతుంది. అటువంటి సమయములో నీవు నడుస్తున్న మార్గము సక్రమమైనది కాదా ! అనే ప్రశ్న ఎదురవుతుంది. ఈపరీక్షలు ప్రశ్నలు దాటినవాడే నిజమైన సాయిభక్తుడు.

(యింకా ఉంది)సర్వం శ్రీసాఇనాధార్పణమస్తు


Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List