20.04.2012 శుక్రవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈరోజు నెల్లూర్ నుంచి సుకన్య గారు పంపిన మరొక బాబా లీలను చదువుకుందాము. అజ్ఞాత భక్తురాలు చెప్పిన బాబా లీల.
బాబాయే నా సర్వస్వం
నేను సాయిబాబాకి సామాన్యమైన భక్తురాలిని మాత్రమే. 2006 వ.సంవత్సరం నించి నాకు బాబా గురించి తెలుసు. బాబా నాకు నాజీవితంలో ఎన్నో లీలలను చూపించారు. మీకందరకూ కొన్ని లీలలను చెపుతాను. ఆయన అనుగ్రహంతో నాకు సాఫ్ట్ వేర్ లో ఉద్యోగం వచ్చింది. తరువాత కొన్ని సమస్యల వల్ల తరచూ నేను బాబాని ప్రార్ధిస్తూ ఉండేదానిని. నేనాయనని ప్రార్ధించడం మరచిపోవడం, క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఒకసారి నాకు వివాహ ప్రయత్నాలు మొదలుపెట్టారు. నా తల్లిదండ్రులు చాలా తీవ్రంగా నాకు సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. జాతకాలు కుదరని కారణంగా, వివాహం కావడం ఆలస్యమవుతూ వచ్చింది. మా అమ్మగారు నాకింకా వివాహం అవటల్లేదని నా స్నేహితులవద్ద వాపోతూ ఉండేది. ఆసమయంలోనే నాకు నామీదనే చాలా బాధవేసింది. ఒకరోజున మా పూజా గదిలో సాయి వ్రతం పుస్తకం చూశాను. ఆపుస్తకాన్ని ఎవరో నా స్నేహితురాలి కోసమిచ్చారు. ఆపుస్తకాన్ని చదివిన తరువాత నాకు నమ్మకం ఏర్పడి, 9 గురువారముల వ్రతం మొదలుపెట్టాను. ఈ సమయంలో నాకు రెండు సంబంధాలు వచ్చాయి. నాకు రెండవ సంబంధం నచ్చింది. అబ్బాయి తరఫువారికి కూడా నేనంటే ఇష్టపడ్డారు. కాని అబ్బాయి, అంటే ప్రస్తుతం నాభర్త , నిర్ణయం చెప్పడానికి కొంత సమయం కావాలని చెప్పాడు. ఇది మాకందరికీ కొంత ఆందోళనకు గురి చేసింది. నేను సమస్యలన్నిటినీ సాయి చరణాల ముందు పెట్టి
9 గురువారముల వ్రతాన్ని పూర్తి చేశాను. మరునాడు ఉదయం అబ్బాయి నేను తనకి నచ్చినట్లుగా ఫోన్ చేశాడు. నాకు నోట మాటరాలేదు. అతనికి నా అంగీకారాన్ని తెలియచేశాను. ఏదో రూపంలో నా నిశ్చితార్ధానికి, నా వివాహానికి రమ్మని బాబాని ప్రార్ధించాను. ఆయన నా ఆహ్వానాన్ని మన్నించారు.
1) నిశ్చితార్ధమునాడు, నా కాబోయే అత్తగారు ఇది నీకే అని చెప్పి నాకు ఉంగరాన్ని ఇచ్చారు. అది చూడగానే నా మనసు ఆనందంతో నాట్యం చేసింది. ఉంగరం మీద బాబా బొమ్మ ముంద్రించబడి ఉంది. బాబా నా నిశ్చితార్ధానికి ఉంగరం రూపంలో వచ్చారు.
2) బాబాని నేను కోరుకున్న విధంగా నా వివాహం గురువారమునాడు జరిగింది. ఆరోజున నేను బాబా వస్తారని ఎదురు చూస్తున్నాను. కొన్ని గంటల తరవాత నేనా విషయం మరిచిపోయాను. హటాత్తుగా నాభర్త మేనత్తగారు "వెండి బాబా విగ్రహంతో మండపం మీదకు వచ్చారు. అదిచూసిన ఆక్షణంలో నాకెంతో ఆనందంవేసి కళ్ళల్లోంచి ఆనంద భాష్పాలు జాలువారాయి. నావంటి సామాన్య భక్తురాలి కోరికను తీర్చినందుకు బాబాకి కృతజ్ఞతలు తెలుపుకొన్నాను.
కొద్దినెలలక్రితం నేను మరొక కంపెనీకి మారదామనుకొన్నాను. కారణం ప్రస్తుతం నేను పని చేస్తున్న కంపనీలో జీతం తక్కువ, నాకు ప్రొమోషన్ కూడా రాలేదు. నాకు చాలా ఆందోళనగా ఉండి బాబాని ప్రార్ధించాను. యింటర్వ్యూలకు వెళ్ళడం ప్రారంచించాను. ఒక ప్రముఖ మల్టి నేషన్ల్ కంపనీలో నేను ఎంపిక కాబడ్డాను. నాకు కావలసిన జీతం పాకేజీ గురించి నామనసులో ఒక సంఖ్య ఉంది. దానినే నేను బాబాకి చెప్పుకుని కోరుకున్నాను. కంపెనీ హెచ్.ఆర్. నేను సెలెక్ట్ అయినట్లుగా చెప్పారు. కాని వారు నేను అడిగిన పాకేజ్ కాకుండా తక్కువ ఇస్తామని చెప్పారు. బాబా నాకు అంతే ప్రసాదించారేమోనని తలచి నేను దానికి అంగీకరించాను. హెచ్.ఆర్. 10 రోజులలో ఆఫర్ లెటర్ పంపుతానని చెప్పారు. 15 రోజులదాకా ఎదురు చూశాను. తరువాత నేను వారిని సంప్రదించగా, నన్ను సెలెక్ట్ చేయలేదని చెప్పారు. అన్ని రౌండ్స్ అయ్యి, పాకేజ్ కూడా ఖరారు చేసి మరలా ఇలా ఎందుకని మాట్లాడాడొ నాకు వింతగా ఉంది. నేనీ విషయాన్ని బాబాకే వదిలేశాను, ఏమో ఎవరికి తెలుసు, బాబా ఆలోచనలు మరొక విధంగా ఉన్నాయేమో. తరువాత నేను మరొక కంపెనీలో యింటర్వ్యూకి వెళ్ళాను. కంపనీ హెచ్.ఆర్. నాతో సెలెక్ట్ అయ్యానని చెప్పి పాకేజ్ గురించి మాట్లాడటం మొదలుపెట్టాడు. కాని ఈసారి నేను యింతకుముందు కంపినీలో అడిగినదానికన్న కొంచెం తక్కువ అడిగాను. వారు తమ నిర్ణయం తరివాత తెలుపుతామని చెప్పారు. నేనింకేమీ ఆశలు పెట్టుకోలేదు. ఒక గంటరతువాత నన్నతను పిలిచి ఇలా చెప్పాడు, "యింతకుముందు నువ్వు పనిచేసిన ఆర్గనైజేషన్, యింకా నీ అనుభవాన్ని బట్టి నీకు యింత పాకేజ్ యిస్తున్నాము" అని చెప్పాడు. నేను నిశ్చేస్టురాలినయ్యాను. కారణం యింతకుముందు వారు ఇస్తానన్న పాకేజ్ తక్కువ, ఇప్పుడు ఇస్తానంటున్న పాకేజ్ సరిగా నామనసులో ఎంతాయితే అనుకున్నానో సరిగా అంతే పాకేజ్ ఇస్తాననని చెప్పారు. ఆసమయంలో నాకు బాబాకు నా మనసులోని భావాలన్ని తెలుసుననిపించింది. తరువాత నేను ఓపికగా మైల్ ద్వారా ఆఫర్ లెటర్ కోసం ఎదురు చూశాను. మరునాడు బాబా రోజైన గురువారము సాయంత్రం బాబాకు ప్రసాదం తయారు చేస్తున్నాను. అదే హెచ్.ఆర్. నాకు ఫోన్ చేసి ఆఫర్ లెటర్ పంపించాము,వెంటనే మైల్ చూసుకోమని చెప్పాడు. నేను మైల్ చూసుకున్నాను. ఆఫర్ లెటర్ లో నేననుకున్న పేకేజ్ ఉంది. నాకు ఆనందంతో నోట మాట రాలేదు. బాబా విగ్రహం ముందు ఆనంద భాష్పాలు రాల్చాను. ప్రతి క్షణం ఆయన నాగురించి జాగ్రత్తలు తీసుకుంటు ఉంటారనిపించింది నాకు. అందుచేత మీరందరూ కూడా, శ్రధ్ధ, సహనంతో ఉండండి. మన న్యాయ సమ్మతమైన కోరికలన్నీ ఆమోదింపబడతాయి.
ఓంసాయి నమోనమహ
జై జై సాయి నమోనమహ
సద్గురు సాయి నమోనమహ
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు
0 comments:
Post a Comment