Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Sunday, July 15, 2012

బాబా నీప్రేమ అమోఘం

Posted by tyagaraju on 8:22 AM






15.07.2012  ఆదివారము


ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు


కాంప్:  బంగళూరు


బాబా నీప్రేమ అమోఘం

ఈ రోజు భార్గవి గారి బాబా గారి గురించి తెలిపిన అనుభూతులను తెలుసుకుందాము.

నాపేరు భార్గవి.  మొదటగా  నేను గురువారమునాడు నాఈ అనుభూతులను రాస్తున్నాను. సాయి భక్తులందరితోను నా 
అనుభవాలను  పంచుకునే  అవకాసాన్నిచ్చినందుకు బాబాగారికి 
లక్షల  ధన్యవాదాలనర్పించుకుంటున్నాను. నేను తిరుపతిలో  పుట్టి పెరిగాను. నాకు మొదటినుంచీ నారాయణుడు (వెంకటేశ్వరస్వామి) అంటే ఎంతో నమ్మకం. అందుచేత నాకు ఈ బాబాలంటే నమ్మకం లేదు. నేను స్కూల్లో చదువుకునే రోజుల్లో, స్కూలికి దగ్గరగా ఉన్న బాబా  గుడికి వారు పెట్టే ప్రసాదం కోసం మాత్రమే వెళ్ళేదానిని. రోజులు గడుస్తుండగా నేను కళాశాల స్థాయికి  వచ్చాను.  బాబా గురించి  పూర్తిగా మర్చిపోయాను. అప్పుడు నాకు బాబా అంటే  అసలు నమ్మకంలేదు. కాని నాజీవితంలో బాబా నన్నెపుడూ మర్చిపోలేదని తరువాత అర్ధమయింది.

నేను డిగ్రీ చదివే  రోజులలో నాకు బాబా అనుభూతులు కలగడం మొదలయాయి. నాస్నేహితులలో ఒకామె నన్ను దగ్గరలో ఉన్న బాబా గుడికి తీసుకుని వెడుతూ ఉండేది. అప్పుడు కూడా నేను శ్రీ నారాయణుని ప్రార్ధించినంతగా  బాబాని ప్రార్ధించేదానిని కాదు. నేను ఎం.బీ.ఏ. లో ఉండగా కింగ్ ఫిషర్ లో  ప్రాజెక్ట్ కోసం హైదరాబాదు వెళ్ళాను (నేను తిరుపతిని, మా తల్లితండ్రులని వదలి వెళ్ళడం అదే మొదటిసారి).  కాని కొన్ని కారణాలవల్ల హెచ్.ఆర్. నాకు ప్రాజెక్ట్ చేయడానికి అనుమతివ్వలేదు. మేము ప్రాజెక్ట్ రెండు నెలల్లో పూర్తి చెయాలి,  కాని 7 రోజులు వ్యర్ధంగా  ఏ ప్రాజెక్టూ లేకుండా గడిచిపోయాయి.  నాకు సహాయం చేయమని వెంకటేశ్వరస్వామిని ప్రార్ధిస్తూ హాస్టల్ రూములో ఏడుస్తూ కూర్చున్నాను. ఒకరోజున  నేను గదిలో ఒక్కదానినే ఉన్నాను.  నాతో గదిలో ఉన్న నారూం మేట్ బాబా భక్తురాలు.  తను సాయి సత్చరిత్ర గదిలోనే  వదిలి వెళ్ళింది. గదిలో నాకు ఒక్కదానికీ ఏమిచేయడానికి తోచక మామూలుగా సాయి సత్చరిత్ర చదివాను. రెండురోజులలో చరిత్ర చదివేశాను.ఆశ్చర్యకరంగా మరుసటిరోజే నాకు హైదరాబాదు స్టాక్ ఎక్స్చేంజీ లో ప్రాజెక్ట్ వచ్చింది. నేను విజయవంతంగా ప్రాజెక్ట్ పూర్తిచేశాను.  నాకు బాబామీద  నమ్మకమేర్పడింది.

రోజులు గడుస్తున్నాయి.  నాజీవితంలో చిన్నచిన్న  సంఘటనలు జరగసాగాయి ( అవే నాకు చాలా పెద్ద సంఘటనలు). అవేనాకు బాబామీద నానమ్మకాన్ని బలపరిచాయి. నేను ఎం.బీ.ఏ.లో ఉండగా ఒక అద్భుతం జరిగింది. నేను  ప్రాజెక్ట్ చేస్తున్న కంపనీ ఎప్పుడయినా  మూసివేయచ్చనె విషయం తెలిసింది. ప్రాజెక్ట్ పూర్తిచేసినట్లుగా సర్టిఫికెట్ వచ్చేలాచేయమని బాబాని ప్రార్ధించాను.  అప్పుడు హెచ్.ఆర్. నన్ను హైదరాబాదుకు పిలిపించి ప్రాజెక్ట్ పూర్తిచేసినట్లు సర్టిఫికెట్  ఇచ్చారు. మరుసటివారమే ఆకంపనీ మూతపడింది. ఈ  సంఘటనలన్నీ చూసినతరువాత వెంకటేశ్వరస్వామిని నమ్మినట్లే  బాబాని  కూడా నమ్మడం ప్రారంభించాను. కాని నామనసులో ఒక సంశయం  ఉండిపోయింది, అదేమిటంటే వెంకటేశ్వరస్వామి నమ్ముకున్నదాన్ని బాబాని ఎట్లాపూజించగలను అని. సాయి ఆ సంశయాన్ని కూడా తీర్చేశారు. 

ఒకరోజున నేను హైదరాబాదులో ఉన్న సాయిబాబా గుడికి వెళ్ళాను. బాబాని నాసంశయాన్ని తీర్చమని అడిగాను. వెంకటేశ్వరస్వామి,  నువ్వు ఒకరే అయితే కనక నాకు నిదర్శనం చూపమని బాబాని అడిగాను.  నాపూజ పూర్తయిన తరువాత బాబా విగ్రహం వెనక పెద్ద సైజు సత్యనారాయణమూర్తి పటాన్ని చూశాను. నాకళ్ళంబట  కన్నీరు కారింది.  బాబా సర్వదేవతాస్వరూపుడని, అందరు దేవుళ్ళు బాబాలోనే ఉన్నారని నూటికి నూరుశాతం అర్ధమయింది. 
ఈ సంఘటన నాకు రెండుసార్లు జరిగింది. తరువాత నేను సాయి సత్చరిత్రను కొని శ్రధ్ధతోను, నమ్మకంతోను చదవడం  మొదలుపెట్టాను. ఒకరోజు సాయంత్రం నా హాస్టల్ రూములో ఉన్న మతం మార్పిడి చేసుకున్న క్రిస్టియన్ అమ్మాయి మన హిందూ దేవతలను అనరాని మాటలతో దూషించడంతో నా మనసుకి చాలా బాధకలిగింది. నేను ఎంతో ఏడిచాను. ఆఖరికి నేను బాబాతో, నన్ను ఈ బాధనుండి తప్పించకపోతే నీతో ఇక మాట్లడను అని చెప్పాను. ఒకరోజు తరువాత ఆమె అంటే  ఇంతకుముందు హిందూ దేవతలను దూషించినామె      శివుడు గురించిన గాధలు (శివపురాణం) శివరాత్రినాడు చెప్పడం ప్రారంభించింది. 

ఏనోటితో అయితే హిందూ దేవతలను దూషించిందో అదే  నోటితో తన కంఠంలో ఎంతో సంతోషం ఉట్టిపడుతూ చెప్పసాగింది. బాబా నన్ను నిరాశ పరచలెదు. బాబా  నన్నీ బాధనుండి  తప్పించినందుకు ఎనలేని కృతజ్ఞతలు.

నాకు హైదరాబాదులో ఉద్యోగం  వచ్చాక నాతల్లితండ్రులను చూడటానికి తిరుపతి వచ్చాను. నేనెప్పుడు గుడికివెళ్ళినా బాబాకు రెండు రూపాయలు దక్షిణ  వేస్తానని (శ్రధ్ధ, సబూరి) బాబాకు మాటిచ్చాను. ఒకరోజున దక్షిణ ఇవ్వడం మర్చిపోయి గుడినుంచి  బయటకు వచ్చాను. ఒక వ్యక్తి నావెనకాలే వచ్చాడు , నేను వెనక్కి తిరిగేటప్పటికి చిరునవ్వుతో నాముందు చేయి చాచి నిలుచున్నాడు. నాకప్పుడు  గుర్తుకు వచ్చి సంతోషంతో అతనికి రెండురూపాయలిచ్చాను.

బాబా నన్నే కాదు మా  అమ్మగారిని కూడా సశరీరంగా అనుగ్రహించారు. మా అమ్మగారు ప్రతీ ఆదివారం అన్నమాచార్య పాటలు నేర్చుకోవడానికి క్లాసులకు వెడుతూ దారిలో ఉన్న బాబాగుడికి వెడుతూ ఉండేవారు. ఒక రోజున మా అమ్మగారు ప్రతీ ఆదివారము నీ గుడికి వస్తున్నా నన్నెం దుకు  అనుగ్రహించటం లేదు అని  బాబాని కన్నిటితో ప్రార్ధించింది. ఆమె ప్రసాదం తీసుకుని బయటకు వచ్చినపుడు, ఒకముసలి వ్యక్తి  ఆమె వద్దకువచ్చి, కోపంతో ఇలా అన్నాడు, "అమ్మా, విను, నువ్వు క్లాసులకు వెడుతూ దారిలో ఉందికదా అని నువ్వు నా గుడికి వస్తున్నాను. నువ్వు నాకోసమే రా. మరే ఇతరకారణం లేకుండా నన్ను ప్రార్ధించడానికి మాత్రమే నువ్వు రా. అప్పుడు నేను నిన్ననుగ్రహిస్తాను."  జరిగిన  ఈ సంఘటనని నేను, మా అమ్మగారు చర్చించుకుని ఆవచ్చిన  ముసలి వ్యక్తి బాబాఏ అని నిర్ధారణకు వచ్చాము. 


అప్పటినుంచీ మా అమ్మగారు ప్రత్యేకంగా బాబాకోసమే ప్రతీ గురువారమునాడు గుడికి వెళ్ళడం ప్రారంభించారు. తొందరలోనే బాబా వారి అనుగ్రహాన్ని కూడా చవిచూశారు. మాకున్న ఎన్నో సమస్యలని పరిష్కరించారు. ముఖ్యంగా మా అమ్మగారి ముక్ష్యమైన సమస్య నా సోదరుడి ఉద్యోగం. ఆమె ప్రతీగురువారము బాబా గుడికి వెళ్ళడం ప్రారంభించిన  తరువాత నా సోదరుడికి మంచి ఉద్యోగం వచ్చింది.  తను ఉద్యోగం చేయబోయే ఆఫీసు భవనమ్   పేరు "బాబా టవర్స్" అది విచిత్రం కాదూ!


ఏది చెపాలో, ఏది చెప్పకూడదో నాకు సరిగా తెలీదు, కారణం  బాబా  తన అనుగ్రహపు జల్లులను ఎన్నిటినో నామీద కురిపిస్తున్నారు.  ఇంకా సంతోషకరమైన  విషయమేమంటే నాభర్తకు కూడా  బాబా అంటే ఎంతో భక్తి.   4 సంవత్సరాలుగా నేను ద్వారకామాయి ని  దర్శిద్దామనుకుంటున్నాను. 



కాని సాయిబాబానించి నాకు ఇంకా పిలుపు రాలేదు. ఆయన పిలుపు కోసం నేనెంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాను. ఆయన తన భక్తులనిలా పరీక్షిస్తున్నారు. నేను ఏ గుడికి వెళ్ళినా అందులోని ప్రధానమైన దేవుడిని/దేవతని చూసినా నామనసు  అప్రయత్నంగా " ఓం సాయిరాం"  అంటుంది.  నిజమైన గురువు మాత్రమే నిజమైన భగవంతుడిని చూపిస్తారు. 


ముగించేముందు నేనొక మాట చెపుతాను. ఎటువంటి అనుమానం లేకుండా బాబాని నమ్మితే ఆయన మనలనెపుడు నిరాశపరచరు. ఓం శ్రీ గురు సాయిరాం.


సర్వం శ్రీసాయినాధార్పణమస్తు


Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List