15.08.2012 బుధవారము
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు అమెరికా నుంచి మహలక్ష్మి గారు పంపిన బాబా లీలను తెలుసుకుందాము.
బాబా ఇచ్చిన ఉద్యోగం
నేను మీ అందరితో ఒక శుభవార్త పంచుకోవాలనుకుంటున్నాను. నాకు ఒక పెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీ లో ఇంటి నుండే పనిచేసేలాగ ఉద్యోగం దొరికింది. (వర్క్ ఫ్రం హోం) ఇది నిజంగా బాబా లీలే అని చెప్పవచ్చు. ఎందుకంటే నేను నిజానికి ఈ ఉద్యోగానికి అప్లై చేయలేదు. కొన్ని రోజుల క్రితం నేను నా రెజ్యూం ని (బయోడేటా) ను ఒక జాబ్ సైట్ లో పెట్టాను. ఆ సంఘటన జరిగిన వారం లో గురువారము నాడు ఉద్యోగం గురించి ఎన్నో సమస్యలతో దిగులుగ వున్నాను. అదికాక నా పిల్లలను చూసుకోవడం, ఇటువంటి బాధ్యతల వల్ల నేను చేసే ఉద్యోగంలో ఎన్నోఆటంకాలు వచ్చాయి. ప్రతీసారి నేను పెట్టిన అప్లికేషన్స్ కి ప్రత్గ్యుత్తరాలు వచ్చేవి, దానితో నాకెంతో ఆశ కలుగుతూ ఉండేది కాని అందులో ఉన్న కొన్ని సమస్యలవల్ల మళ్ళి అదికాస్తా అడియాశ అయిపోతూ ఉండేది.
ఇంటువంటి పరిస్థితులలో ఒక గురువారము నాడు నేను చాలా దిగులుగా ఉన్నాను. శుక్రవారం ఉదయం నా సెల్ కి ఒక కాల్ వచ్చింది. ఉదయం పిల్లల పనులతో పని వత్తిడిలో ఉండి నా సెల్ కి వచ్చిన కాల్ చూసుకోలేదు. తరవాత నేను మిస్డ్ కాల్ చూసుకున్నాను. ఆ కాల్ చేసింది ఎవరో తెలుసుకోవడం కోసం నేను మళ్ళి తిరిగి ఆ నంబర్ కి కాల్ చేసాను. కాల్ ఏమిటో కాదు, నన్ను ఇంటర్వ్యు చేయడానికి ఒక వ్యక్తి కాల్ చేసాడు. ఆయన వెంటనే ఇంటర్వ్యూ చేయాలని చెప్పడం తో 45నిమిషాలు ఇంటర్వ్యూ జరిగింది. నేను ఆ జాబ్ గురించి వివరాలు అడిగితే అతడు నీవు ఇంటి నుండే ఐదు రోజులు పనిచేయగలను అనుకుంటే (వర్క్ ఫ్రం హోం) అప్పుడు కంపెనీ పేరు ,లొకేషన్ చెప్పగలను అన్నాడు. (నేను విన్నది అసలు నమ్మలేకపోయాను). తర్వాత అదే రోజు అతని టెక్నికల్ లీడర్ నన్ను ఇంటర్వ్యూ చేయాలని చెప్పాడు. నాకు ఆ రోజు డాక్టర్ అపాయింట్ మెంట్ వుండడంతో తర్వాత నేనే వాళ్ళ నంబర్ కి కాల్ చేసాను. నన్ను వాళ్ళు ఇంటర్వ్యూ చేసారు. ఇంటర్వ్యూ అయ్యాక నా రెజ్యూం ని కస్టమర్ కంపెనీ కి పంపారు. నిజం చెప్పాలంటే నేను ఆ రెండు ఇంటర్వ్యూలకు ఏమి ప్రిపేర్ కాలేదు. ఒక వారం తర్వాత కస్టమర్ కంపెనీ నన్ను ఇంటర్వ్యూ చేసారు. ఎక్కువ కష్టం లేకుండ ఫార్మల్ గా జరిగింది. ఇంటర్వ్యూ అయ్యాక బ్యాక్ గ్రౌండ్ చెక్ చేసారు. ఇదంతా జరిగే సమయం లో నేను చాల టెన్షన్ పడ్డాను. కాని బాబా దయ వలన అంతా బాగా జరిగింది. నన్ను మొదట ట్రైనింగ్ కోసం 2 రోజులకు కస్టమర్ లొకేషన్ కి రమ్మని చెప్పారు. ఈ వెయిటింగ్ సమయమంతా నేను సాయినాథ స్తవనమంజరి చదువుతూ సాయి అమృతవాణి వింటుండేదాన్ని. ప్రతి నిమిషం కన్నీటి తో సాయి ని వేడుకున్నాను.
నా పిల్లలు చిన్న పిల్లలు అవడం వలన ట్రెయినింగ్ కోసం మా ఫ్యామిలి అంతా వెళ్ళాము. అది కార్పొరేట్ కంపెనీ అవడం వలన మేము వుండడానికి కార్పొరేట్ హోటల్ లో బస ఏర్పాటు చేశారు . హోటల్ వాతావరణం ఎంతో అద్భుతంగ వుంది (వరల్డ్ క్లాస్ హోటల్ వాతవరణం లాగ వుంది) . ఇంత అద్భుతమైన వసతులు మాకు దొరికాయంటే బాబా కృప వల్లనే గాక వేరేమి కాదు. ఇదంతా చాలా వేగంగా జరిగింది. మా ప్రయాణం అంతా బాగా జరిగింది. సోమవారం నుండి నేను ఇంటి నుండి పని మొదలు పెట్టచ్చు . ఈ లోపల ఇంట్లో పిల్లలను చూసుకోడానికి ఒక మంచి ఆయా దొరికింది. నేను గత రెండు నెలల నుండి జాబ్ చేస్తున్నాను. నాకు ఈ జాబ్ బాబా ఇచ్చిన ఒక వరం గా భావిస్తున్నాను.
నా పిల్లలను జాగ్రత్తగ చూడమని సాయి ని అభ్యర్థించాను. ఇంకా నా జాబ్ మీద ధ్యాస పెట్టి నా పని బాగ చేయగలగాలని , ఎందుకంటే నేను పని చేసే ప్రాజెక్ట్ చాల పెద్దది కాబట్టి ప్రతి విషయం లో సాయి నాకు సహాయంగా వుండి నాకు ఆత్మ విశ్వాసం పెరిగేల, నా పై ఆఫీసర్స్ నేను చేసే పని లో నమ్మకం,సంతోషం కలిగి నా జాబ్ కాంట్రాక్ట్ మంచి జీతం తో పొడిగించబడాలని సాయి ని కోరుకుంటున్నాను. ఈ జాబ్ రావడం తో నా కల నిజమైంది.ఎందుకంటే నేను మళ్ళి నా జాబ్ కెరీర్ మొదలుపెట్టాలనుకున్నాను. కాని మా పిల్లలకు దీని వల్ల ఏమి ఇబ్బందిలేకుండ అంతా సజావుగా జరగాలని కోరుకున్నాను. నన్ను నమ్మండి ఈ ఉద్యోగం కోసం నేనిక్కడికి చేసిన ప్రయాణం లో నేను ఎన్నో సార్లు భయం తో వణికాను ఏడ్చాను. ప్రతి క్షణం చాలా గండంగ గడిచింది. బాబా పై మన నమ్మకం మరియు బాబా పై మనం చేసిన శరణాగతి మనల్ని జీవితపు ఎగుడు దిగుడు లను తట్టుకొని ధైర్యంగా నిలబడే శక్తినిస్తుంది. అందరికి చెప్పేది ఒక్కటే మీరు జీవితం లో ఎన్ని ఒడిదుడుకులకు లోనవుతున్న బాబా ని ప్రార్థిస్తూవుండండి. కష్టాల్లో ఇంకా ఎక్కువ ప్రార్థిస్తూ మంచితనం తో సహనంగ వుండాలి. సాయి అంతా చూస్తూనే వుంటారు. మనము కార్చే ప్రతి కన్నీటి బొట్టు ను సాయి సాక్షిగా వుండి చూస్తూ వుంటారు. మన ప్రతి ఆలోచన,ఆవేదన సాయి కి ఎరుక. సాయి మన జీవితంలోని ఆటుపోట్ల నుండి క్రింద పడకుండా ,మన జీవితం అనే ఓడ ఎటో కొట్టుకొని పోకుండ క్రమంగా, జయప్రదంగా ఒడ్డుకు సాగేలా చూస్తారు.
ఓ సద్గురు సాయి నీ బిడ్డలమైన మాకు, మరియు అందరికి జీవితం లో ఎదురయ్యే ఒడిదుడుకుల నుండి తట్టుకొని మా గత జన్మ, ఈ జన్మ యొక్క పాప కర్మలను ధ్వంసం చేసి మాకు ఎప్పుడు తోడు నీడగ వుండమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. నిరంతరం బాబా నామస్మరణ,బాబా కీర్తనలు చేస్తూ వుండండి. బాబా మనల్ని సురక్షితంగ జీవిత గమ్యం చేరుస్తాడు. నేను కూడ బాబా ని ప్రశ్నించాను. బాబా తో పోట్లాడాను. నిన్ను పూజించనని సాయి తో చెప్పాను. కాని సాయినాథుని పూజించకుండ , సాయి నామ స్మరణ చేయకుంటే ఏదో పోగొట్టుకున్నట్టు చాల భాధగ వుండేది. బాబా తో పోట్లాడడం మానేసి ఆయనతో చెప్పాను. ఇప్పుడు నా పూర్వపు కర్మను అనుభవిస్తున్నాను. నా చెడ్డ కర్మ తోలగిపోని. నాకు నీవు తప్ప వేరెవరులేరు.నిన్నే పూజిస్తుంటాను. నాకు ఎప్పుడు మంచి చెయ్యాలనుకుంటే అప్పుడే చెయ్యి . నేను నీ పాదాలను విడవను. నిన్ను విడచి నేను వుండలేను. బాబా కూడా నన్ను విడచి వుండలేడు. అంతే కాదు ఆయన బిడ్డలైన మన అందరిని వదిలి వుండలేడు. బాబా పిచ్చుక కాలికి దారం కట్టి ఈడ్చినట్టు మన అందరిని తన దగ్గరికి లాక్కొని మన నమ్మకాన్ని మరింత గట్టి పరుస్తాడు. కావలసినదల్ల మనకు ఆయన మీద అచంచల విశ్వాసం. బాబా నే మన దయగల తల్లి,తండ్రి. తల్లి ఎప్పుడైన తన బిడ్డ పైన కోపించునా? అలాగే సాయి ఎప్పుడైన మనపై కోపించి ఎరుగునా? దయ చేసి సాయి పై నమ్మకం ఉంచండి. సాయి ప్రతి విషయం లో మనకు తోడుగ నిలుస్తాడు.
దయచేసి అందరు కలిసి ఒక్కసారి పలకండీ.
అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై.
--మహలక్ష్మి.
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment