05.09.2012 బుధవారము
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
షిరిడీ యాత్రలో అడుగడుగునా బాబా అనుగ్రహం మూడవ మరియు ఆఖరిభాగం ఈ రోజు ప్రచురిస్తున్నాను.
సద్గురు శ్రీ సాయినాధ్ మహరాజ్ కీ జై
షిరిడీ యాత్రలో అడుగడుగునా బాబా అనుగ్రహం - 3 వ.భాగం
గీతాంజలి
ఈలోపులో స్వామిగారి
భార్యకు కూడా ఒక లీల జరిగింది. ఆమె నావద్దకు వచ్చి తనకు కూడా ద్వారకామాయిని శుభ్రం
చేద్దామని ఉందని చెప్పారు. శుభ్రం చేస్తున్న భక్తులనెవరినైనా చీపురు అడగమని
చెప్పాను.
ప్రతీవారు ఇక్కడ షిరిడీలొ సేవ చేయడానికి వస్తారు,అటువంటప్పుడు పనిచేస్తున్నవారిని ఆపి నేను చేస్తానని వారితో నేనెలా చెప్పగలను, అని సంధేహిస్తూ ఉండిపోయింది. సరే ఆవిషయం మర్చిపోదాము, మరొకసారి నాకు అవకాశం రావచ్చు అని అంది. ఇక అక్కడినించి లేచి వెళ్ళిపోదామనుకున్నాము. ఇక లేద్దామనుకున్న ఆలోచన వచ్చిన వెంటనే నా వడిలో ఉన్న పిల్లి ఒక్క గెంతుతో తిరిగి మసీదులోకి వెళ్ళిపోయింది. నేను, స్వామిగారి భార్య లేచి వెళ్ళబోతుండగా, అక్కడ శుభ్రం చేస్తున్న భాక్తులలో ఒకరు తనంత తానుగా వచ్చి, స్వామిగారి భార్యకు చీపురు ఇచ్చి, శుభ్రం చేయమని చెప్పారు. ఆమెకు ఆనందంతో కన్నీరు వచ్చింది. తను కూడా మిగతావారితోపాటుగా శుభ్రం చేసారు. బాబా చూపిన ఈ లీలకు కృతజ్ఞతలు చెప్పుకొని, మేమందరం ద్వారావతికి బయలుదేరాము.
ప్రతీవారు ఇక్కడ షిరిడీలొ సేవ చేయడానికి వస్తారు,అటువంటప్పుడు పనిచేస్తున్నవారిని ఆపి నేను చేస్తానని వారితో నేనెలా చెప్పగలను, అని సంధేహిస్తూ ఉండిపోయింది. సరే ఆవిషయం మర్చిపోదాము, మరొకసారి నాకు అవకాశం రావచ్చు అని అంది. ఇక అక్కడినించి లేచి వెళ్ళిపోదామనుకున్నాము. ఇక లేద్దామనుకున్న ఆలోచన వచ్చిన వెంటనే నా వడిలో ఉన్న పిల్లి ఒక్క గెంతుతో తిరిగి మసీదులోకి వెళ్ళిపోయింది. నేను, స్వామిగారి భార్య లేచి వెళ్ళబోతుండగా, అక్కడ శుభ్రం చేస్తున్న భాక్తులలో ఒకరు తనంత తానుగా వచ్చి, స్వామిగారి భార్యకు చీపురు ఇచ్చి, శుభ్రం చేయమని చెప్పారు. ఆమెకు ఆనందంతో కన్నీరు వచ్చింది. తను కూడా మిగతావారితోపాటుగా శుభ్రం చేసారు. బాబా చూపిన ఈ లీలకు కృతజ్ఞతలు చెప్పుకొని, మేమందరం ద్వారావతికి బయలుదేరాము.
ఉదయం 9 గంటల దర్శనానికి మాకు పాసులు ఉన్నాయి. మాకు నిర్ణయించిన
టైము ప్రకారం శని గేట్ వద్దకు వెళ్ళి పాసులు చూపించి దర్శనానికి వెళ్ళాము. బాగా రద్దీగా ఉన్నా కూడా, శనివారము నాడు మేము చక్కగా దర్శనం చేసుకోగలిగాము.
షిరిడీనుండి బయలుదేరేముందు ఇదే మా ఆఖరి దర్శనం. తిరిగి వెళ్ళడానికి అనుమతినిమ్మనీ,
తిరుగుప్రయాణం ఎటువంటి అడ్డంకులు లేకుండా
జరిపించమనీ బాబాని అనుమతి అడిగాను. మందిరంలో కావలసినంత సేపు ఉండి దర్శనం చేసుకొనే
భాగ్యం కలిగింది. స్వామిగారు, ఆయన భార్య,
నేను అందరం బయటకి వచ్చాము. నాభర్త 1 , 2 నిమిషాలలో తనూ వస్తానని చెప్పారు. 10 నిమిషాలు గడిచినా, ఆయన మందిరంలోనించి బయటకి రాలేదు. మేము బయటకు వస్తున్నప్పుడు ఆయన లోపలే
ఉన్నారని ఖచ్చితంగా తెలుసు . కానీ సందేహంతో
ద్వారకామాయిలోకి, చావడిలోకి వెళ్ళి
చూశాము. కానీ కనపడలేదు. అక్కడ ఆవరణలో ఉన్న
ఇతర మందిరాలకు, గురుస్థాన్ దగ్గిర, మ్యూ జియం దగ్గిర అంతా వెతికాము కాని ఎక్కడా
కనపడలేదు. నాకు చాలా ఆందోళనగా ఉంది, కానీ నామనసెందుకో ఆయన సమాధి మందిరంలోనే ఉన్నారని చెపుతోంది. ఆయన బయటకు రాలేదు. యనౌన్స్ మెంట్ సెంటర్ నించి కూడా యనౌన్స్ మెంట్ ఇప్పించినా ఏమీ తెలీలేదు. మేము శని
గేట్ వద్ద (మేము మా చెప్పులను ఉంచినచోట) కూర్చుని ఆయనకోసం ఎదురు చూద్దామని
నిర్ణయించుకొన్నాము. 40 నిమిషాలతరువాత
సమాధిమందిరంలోనించి బయటకు వచ్చారు. నేను నమ్మలేకపోయాను, కారణం సాధారణంగా దర్శనం అయినవెంటనే గార్డు అందరినీ బయటకు
తోసేస్తూ ఉంటాడు. ఆయనకి 40 నిమిషాలపాటు దర్శనం కలగడమేకాదు, పూజారిగారు తనంతతానుగా, ప్రసాదం
కొబ్బరికాయ ఇచ్చారు.
ఆయన బయటకు వచ్చాక నాకు అసూయ కలిగింది. నన్నెందుకు తొందరగా
బయటకు పంపించేశావు అని బాబాకి ఫిర్యాదు చేశాను. కాని నాభర్తను అంతలా
అనుగ్రహించినందుకు బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను.
ఆఖరుసారిగా ద్వారకామాయిని,
చావడిని దర్శించుకుని, షిరిడీనించి బాబాకు వీడ్కోలు చెప్పాము. మమ్మల్ని షిరిడీ
తీసుకు వచ్చిన ఆటో డ్రైవరునే పిలిచి కోపర్గావ్ లో ఉన్న చవన్ బాబా ఆశ్రమానికి
తీసుకునివెళ్ళమని చెప్పాము. మేము ద్వారావతి నుండి మధ్యాహ్న్నం 3 గంటలకు బయలుదేరి ఆశ్రమానికి 3.30 కి చేరుకున్నాము. అక్కడికి చేరుకున్నాక మొదట బాబాని
దర్శించుకుని, అక్కడి పూజారిగారిని చవన్
బాబాగారు ఉన్నారా అని వాకబు చేశాము. నేనింతకుముందు నా తల్లిడండ్రులతో వచ్చినపుడు
ఆశ్రమానికి వచ్చాను. కాని అప్పుడు చవన్ బాబాగారిని కలుసుకోలేకపోయాను. ఆయన గురించి
చాలా విన్నాను. కాని నామనసు కొంచెం చంచలంగా ఉండి నాలో కొంచెం వణుకు వచ్చింది. మేము
ఆశ్రమంలోకి వెళ్ళినపుడు ఆయన అప్పటికే అక్కడ వున్న నలుగురితో మాట్లాడుతున్నారు. మా
వంతుకోసం నిరీక్షిస్తూ మేమొక మూల నిలబడ్డాము. హటాత్తుగా ఆయన నావైపుకు తిరిగి
ముందుకు రమ్మన్నారు.
(ధోండీరాం బాబా చవన్ బాబా)
"గోలీ ఖా కే ఆయీ హై. జబ్ భీ దేఖో పైన్ కే లీయే గోలీ
ఖాతీహై, ఆజ్ సే గోలీ బంద్"
అన్నారు. (అర్ధం : టాబ్లెట్ వేసుకుని
నువ్వు ఇక్కడకు వచ్చావు. ప్రతీదానికి నువ్వు టాబ్లెట్లు అవీ వేసుకుంటావు.
ఈరోజునుంచీ ఏ టాబ్లెట్లు, డాక్టర్ అవసరం
లేదు) నాకు చాలా ఆశ్చర్యమనిపించింది, అంతకుముందే షిరిడీ నించి బయలుదేరేటప్పుడు తలనొప్పిగా ఉంటే టాబ్లెట్
వేసుకున్నాను. మా అందరితోనూ ఆయన అలా మాట్లాడుతూనే ఉన్నారు. ఆయన నన్ను, స్వామిగారి భార్యని సంతాన ప్రాప్తిరస్తు అని దీవించి శలవు
ఇచ్చారు. వెళ్ళబోయేముందు ఆయన నాతో, ఆపరేషన్ అవసరం
లేదు. బాబా ఊదీని నీటిలో కలిపి తీసుకో. అంతా సరి అవుతుంది. అని చెప్పారు. గాళ్ బ్లాడర్ సర్జరీ చేయించుకోవడమా, మానడమా అన్న
ప్రశ్నకి నాకు సమాధానం లభించినట్లయింది.
ఆయన మాభర్తలకు ** "పుఖ్ రాజ్ " రాళ్ళను ఇచ్చి వాటిని ధరించమని
చెప్పారు. మేము ఆయన పాదాలకు నమస్కరించి ఇంటికి వెళ్ళడానికి అనుమతి కోరాము. ఆయన మమ్మలిని
దీవించారు. మేము సరైన సమయానికి స్టేషనుకి
చేరుకుని క్షేమంగా బెంగళూరు చేరుకొన్నాము.
నా ఈ అనుభవాన్ని పూర్తి
చేస్తున్న సమయములో, నేను మళ్ళీ షిరిడీకి
వెళ్ళినంతగా అనుభూతి చెందుతున్నాను. జన్మ జన్మలకూ ఆయన పాదాలవద్దే నాకు
ఆశ్రయమిమ్మనమని ఆయన పాదాల మీద ప్రణమిల్లుతున్నాను. ఈ అనుభవాన్ని చదివిన సాయి
బంధువులందరికీ బాబా వారు తన ఆశీర్వాదములనిమ్మని, మన జీవితాలలో వెలుగును నింపమని ఆయనను వేడుకుంటున్నాను.
ఇంత
సుదీర్ఘంగా ఈ నా అనుభవాన్ని మీకు తెలిపినందుకు నన్ను మన్నించమని మిమ్మల్ని
వేడుకుంటున్నాను. కాని నాకు ఏది వదలి వేయాలో ఏది రాయాలో తెలీదు. నా ఆరోగ్యం
గురించి కూడా ప్రార్ధించమని మిమ్మల్ని కోరుతున్నాను.
డాక్టర్స్ అందరూ కూడా
గాల్ బ్లాడర్ తీసివేయడం తప్ప మరో మార్గం లేదు అని చెప్పారు. కాని ఆపరేషన్ కి నా
మనసెందుకనో ప్రస్తుతానికి అంగీకరించటంలేదు. ప్రస్తుతం నేను హోమియోపతీ మందులు
వాడుతున్నాను. మీఅందరి ప్రార్ధనలు, ఆశీర్వాదములు
ఫలించి నాకు నయమవుతుందనే నమ్మకం నాకుంది.
అందరికీ బాబా
ఆశీర్వాదములు లభించాలని బాబాకు ప్రణమిల్లుతున్నాను.
శ్రీ సచ్చిదానంద సద్గురు
సాయినాధ్ మహరాజ్ కీ జై
** పుఖ్ రాజ్ స్టోన్: దీనికి అర్ధం తెలీక, తెలుసుకుని మీకందరికీ చెప్పాలని గూగుల్ లో వెతికాను. దానికి సంబంధించిన లింక్ కూడా ఇస్తున్నాను. చదవండి.
దానిని ధరించడం వల్ల ప్రమాదకరమైన వ్యాధుల నివారణ: కామెర్లు, కాళ్ళకు నీరుపట్టుట,వ్రణాలు,లివర్ ప్రోబ్లెంస్ వగైరా. వివరంగా లింక్ ఓపెన్ చేసి చూడండి.
www.aaateleshoping.in/Gems/Pukhraj/
(అయిపోయింది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు
0 comments:
Post a Comment