19.11.2012 సోమవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ
సాయి
సాయి బంధువులకు బాబావారి
శుభాశీస్సులు
శ్రీవిష్ణు సహస్ర నామం
1. విశ్వం విష్ణు ర్వషట్కారో భూత భవ్య భవత్ప్రభుహుః
భూత కృ ద్భూత భృధ్వావో భూతాత్మా భూతభావనః
అర్ధము: ఈ సృష్టియంతయు విష్ణువుచే వ్యాప్తి చెందియున్నది. అతడు విశ్వమంతయు నిండి అందు నివసించి ఉన్నవాడు. అతడే జరిగినది, జరుగబోవునది మరియు జరుగుచున్నది అను కాలము. అతడు ఈ సృష్టికి పాలకుడు కనుక జీవులకు సృష్టికర్త. అతడు భూతములకు ఆత్మయైనవాడు. కనుక వానిని భరించి పోషించుచున్నాడు. తన ఉదరమందే జీవులను కల్పించుచున్నాడు. ------
ఇక శ్రీసాయితో మధుర క్షణాలు చదవండి.
శ్రీసాయితో మధుర క్షణాలు - 2
సాయి చీకటిలో వెలుతురును
నింపుట
శ్రీ టీఎల్.ఎస్.మణి
అయ్యర్ గారు బాబాకు గొప్ప అంకిత భక్తుడు.
ఆయన ఒక హోటల్ యజమాని. ఆయన తరచుగా
షిరిడీ వెడుతూ ఉండేవారు. యింటిలో ప్రతీరోజూ క్రమం తప్పకుండా సాయిని పూజిస్తూ
ఉండేవారు. శ్రీసాయినాధులవారు కూడా తన
భక్తునియొక్క భక్తికి అదేవిధంగా ఆయనను, ఆయన కుటుంబాన్ని కాపాడుతూ రక్షిస్తూ ఉండేవారు. డిసెంబరు 1944 వ. సంవత్సరములో ఒకసారి
ఆయన కుంభకోణంలో తన యింటినుంచి బయలుదేరారు.
అపుడు చాలా చీకటిగా ఉంది. వీధి
దీపాలు లేవు. ఆకాశంలో చంద్రుడు, నక్షత్రాలు కాంతి విహీనంగా ఉన్నాయి. ఆయన రెండు సంచులనిండా చిల్లర నాణాలు పోసుకొని
తన నడుముకు ఉన్న సంచిలో ఉంచుకొన్నారు. ఒక సంచిలో రూ.50/- లకు నికెల్ నాణాలు, యింకొక సంచిలో
రూ.50/- లకు సిల్వర్ నాణాలు సంచీలలో
నిండుగా ఉన్నాయి. హటాత్తుగా రెండు సంచులూ వదులయిపోయి సంచిలో ఉన్న నాణాలన్నీ రోడ్డుమీద చిందర వందరగా (చెల్ల చెదురుగా) పడిపోయాయు. చీకటిగా ఉండటంవల్ల ఆయనకు నాణాలు ఏమీ
కనిపించలేదు. లైటు తెచ్చుకొని వెదుకుదామన్నా, నాణాలను అక్కడే వదిలేసి వెళ్ళడం క్షేమం కాదు. కొంత సేపు
అక్కడే నిలుచున్నారు. హటాత్తుగా ఉదయం ఆరు
గంటలయిందా అన్నట్లుగా ప్రకాశవంతమయిన వెలుగు వచ్చింది. ఆయనకు ప్రతీనాణెం స్పష్టంగా
కనపడింది. మొత్తమన్నిటినీ ప్రోగుచేశారు.
చిల్లరనంతటినీ తీసుకొని తన కాఫీ హోటలుకు వెళ్ళారు. ఆయన తన నాణాలన్నిటినీ తీసుకోగానే ఆప్రకాశవంతమయిన
వెలుతురు మాయమయి తిరిగి ఎప్పటిలాగే చీకటి అలుముకుంది.
(మరికొన్ని మధుర క్షణాలకై ఎదురుచూడండి...)
సర్వం
శ్రీసాయినాధార్పణమస్తు
0 comments:
Post a Comment