12.11.2012 సోమవారము
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
మరియు
దీపావళి శుభాకాంక్షలు
సాయి బా ని స చెప్పిన కృఇష్ణునిగా శ్రీసాయి 9వ. భాగము వినండి.
కృష్ణునిగా శ్రీసాయి 9వ. భాగము
కృష్ణునికి 12 సంవత్సరాల వయసప్పుడు మరొక సంఘటన జరిగింది. ఇంద్రుడికి
యాదవుల మీద క్రోధం కలిగింది. వారిపై సుడిగాలు, ఉరుములు మెరుపులతో పెద్ద కుంభవృష్టిని కురిపించాడు. గోపికలు,
ఇంకా వృధ్ధులందరూ కూడా కష్ణుని వద్దకు వచ్చి
తమను ఆ ప్రకృతి వైపరీత్యాన్నుండి రక్షించమని వేడుకొన్నారు.
కృష్ణుడు గోవర్ధన
పర్వతాన్ని ఎత్తి తన చిటికెనవేలి మీద నిలబెట్టివారందరికీ దానికింద
రక్షణకల్పించాడు.
మరి సాయికృష్ణులవారు
ఏమిచేశారు? శ్రీ సాయి సత్చరిత్రలోని 11వ. అధ్యాయాన్ని సమీక్షిద్దాము. ఒకరోజు సాయంత్రం షిరిడీలో
పెద్ద గాలివానతో తుఫాను సంభవించింది.
భక్తులందరూ ద్వారకామాయిలోకి వచ్చి తమను రక్షించమని బాబాను వేడుకొన్నారు. బాబా నల్లని
మబ్బులతో కమ్ముకొని ఉన్న ఆకాశం వైపు చూసి "ఆగు, నీప్రతాపాన్ని తగ్గించు. నెమ్మదించు" అని తీవ్రస్వరంతో
గర్జించారు.
వర్షం తగ్గి అంతటా
ప్రశాంత వాతావరణం నెలకొనగానే భక్తులందరూ బాబాకు కృతజ్ఞతలు తెలుపుకొని తమ తమ
యిండ్లకు వెళ్ళారు. కృష్ణుడు తన భక్తులను ఏవిధంగా రక్షించాడొ, అదేవిధంగా బాబా షిరిడీలోని తనభక్తులను రక్షించారు.
ఇప్పుడు మనం కుచేలుని
కధను తెలుసుకొందాము. కుచేలుడు రాగానే కృష్ణుడు అతనిని ఆలింగనం చేసుకొని సాదరంగా
ఆహ్వానించి తన సిం హాసనము మీద
కూర్చుండబెట్టాడు.
బంగారు కలశంలోని నీటితో అతని పాదాలను కడిగి, చందనం అద్ది, కుచేలునిపై తనకున్న ప్రేమను
వ్యక్తీకరించాడు.
శ్రీసాయి సత్ చరిత్ర 27వ. అధ్యాయములో కాపర్దే భార్య బాబాకి భోజనానికి సాంజా,పూరీ, అన్నం, మధ్యాహ్న్నము వేళ పట్టుకొని వచ్చింది. బాబా ప్రేమతో ఆమె తెచ్చినవాటిని కడుపారా
భుజించారు. ఆమె బాబా పాదాలను వత్తుతుంటే, బాబా ఆమె చేతులను ఒత్తసాగారు. అది భగవంతునికి భక్తునికి మధ్య భేదం లేదు అన్నది
తెలపటానికే.
తనకు బహుమతిగా అది ఎంత
చిన్నదైనా సరే ఏమి తీసుకొని వచ్చావని కృష్ణుడు కుచేలుణ్ణి పరిహాసంగా అడిగాడు. మూటలో కట్టుకొని వచ్చిన అటుకులను ఇవ్వడానికి
కుచేలుడు మొదట సందేహించాడు. తరువాత కృష్ణునికి అవి సమర్పించాడు. దానినే పరమాన్నంగా
భావిస్తానని కృష్ణుడు దానిని స్వీకరించాడు.
1914 వ.సంవత్సరములో
శ్రీరామనవమి రోజున ఒక వృధ్ధురాలు, తాను చేసుకొని వచ్చిన
మూడు రొట్టెలను బాబాకు సమర్పించడానికి ద్వారకామాయికి వచ్చి తనవంతు కోసం ఆతృతగా
నిరీక్షిస్తూ నిలబడి ఉంది. ఆమె ఎంతో
ఓర్పుతో ఎదురుచూసినా బాబా వద్దకు వెళ్ళలేకపోయింది. ఆఖరికి వాటిని తానే ఆరగిద్దామని
నిశ్చయించుకొని సగం తినేసింది. బయట జరిగేదంతా బాబాకు తెలుసు. ఆ వృధ్ధురాలు నాకోసం ఏదయితే తీసుకొని వచ్చిందో
దానిని నేను తింటాను అని బాబా శ్యామాతో చెప్పి
ఆమెను తీసుకొని రమ్మని పంపించారు.
కుచేలుడు తెచ్చిన దానిని తినడానికి శ్రీకృష్ణుడు ఎలాగయిటే ఆతృతగా చూశాడొ,
బాబా కూడా అదేవిదంగా ఆతృతగా వేచిచూశారు. ఆమె
తెచ్చినదానిలో ఆమె తినగా మిగిలినదానిని బాబా ఆరగించారు.
(యింకా మరికొన్ని పోలికలు.....)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు
0 comments:
Post a Comment