17.11.2012 శనివారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు అమెరికా నుండి ఒక సాయి భక్తురాలి కి బాబావారు చూపిన లీల, జరగబోయే పెద్ద ప్రమాదం నుండి ఎలా సూచనప్రాయంగా తెలిపి రక్షించారో చదవండి. బాబాను పూర్తిగా నమ్మడమే మనం చేయవలసినది. మిగతాది ఆయనే చూసుకుంటారు, కంటికి రెప్పలా కాపాడతారు. బాబా "ప్రశ్నలు జవాబులు" పుస్తకంలో కూడా అందులో మీసమస్యకు వచ్చిన సమాధానం ప్రకారం చేయండి. నేను కూడా ఒక సమస్యకు అందులో వచ్చిన విధంగానే చేయడం జరిగింది. రెండుసార్లు నేను ఒకటే నంబరు అనుకోకుండా (వేరు వేరు రోజులలో) తలచుకోవడం అదే సమాధానం రావడంతో అందులో వచ్చిన విధంగానే చేయడం జరిగింది. బాబా నాకు గుండె ఆపరేషన్ జరిపించి గుండెకు ఎటువంటి ప్రమాదం రాకుండా కాపాడారు. ఇది నేను బ్లాగులో కూడా పోస్ట్ చేశాను.
"మీ అమ్మగారిని తలచుకొని అన్నదానం చేయి. నీకు వెంటనే ఫలితం కనపడుతుంది. నీపిల్లలకు లాభం చేకూరుతుంది." అని వచ్చింది. అందులో వచ్చిన విధంగానే బాబా గుడిలో అన్నదానానికి కొంత బియ్యము, కూరలు రెండు సార్లు ఇచ్చాను. ఆతరవాత నాకు హార్ట్ లో ప్రోబ్లెం ఉన్నదనే సూచనలు కూడా ఏమీలేకపోవడం, అనుకోకుండా డాక్టర్ వద్దకు వెళ్ళినప్పుడు హార్ట్ లో కొంత ట్రబుల్ ఉందని చెప్పడం జరిగింది. ఎకో లోను, ఈ.సీ.జీ.లోను గుండెలో అసలు ప్రాబ్లెం ఏదీ కనపడలేదు. యాంజియో గ్రాములో ప్రమాదకరమైన 4 బ్లాకులు బయటపడి ఆపరేషన్ జరిగింది. ఈవిధంగా బాబా నన్ను కంటికి రెప్పలా కాపాడారు.
ఇక చదవండి.
బాబా మరణాన్ని కూడా తప్పించగలరు
అమెరికా లో మెమోరియల్ డే కి లాంగ్ వీకెండ్ ( అంటే వరుసగా మూడు రోజులు సెలవు) ఉంటుంది. ఆ లాంగ్ వీకెండ్ కు మేము పొకొనోస్ ను (పొకొనోస్ పర్వతాలను) దర్శించాలనుకున్నాము.
వీకెండ్ కి ముందు నేను సాయిబాబా గుడికి వెళ్ళాను. నా జాబ్ కెరీర్ , నా వ్యక్తిగత జీవితం ఎన్నో సమస్యలతో నిండి ఉంది. ఏ సమస్యకు కూడ కొన్ని కారణాల వలన ఒక పరిష్కారం అంటూ దొరకకుండా సమస్య అలాగే సాగుతూ ఉంది. ఆ ప్రతికూల పరిస్థితుల నుండి బయట పడేందుకు నేను బాబా గారిని వారి ఆశీర్వాదం కోసం చాల రోజుల నుండి వేడుకొంటు న్నాను. ఆ గుడిలో పెద్ద సాయిబాబా విగ్రహం యింకా ఇతర దేవతల విగ్రహాలు ఉన్నాయి. ఆ గుడిలో స్వరూప సాంప్రదాయ కూడా ఉంది.( స్వరూప సంప్రదాయ వర్గం వారు అద్వైత వేదాంతాన్ని అనుసరిస్తారు. అంటే ఆత్మ ను దర్శించుటయందు మొగ్గు చూపుతారు). నేను స్వరూప సాంప్రదాయ దగ్గర నిలబడి ప్రార్థిస్థుండగ , ఎక్కడి నుండో ఒక పువ్వు క్రింద పడింది. ఆ పువ్వు ఎక్కడి నుండి పడిందో అని చూస్తూ, ఆ పువ్వును భగవంతుడు ఇచ్చిన ఆశీర్వాదంగా తీసుకున్నాను. తర్వాత నేను దాని గురించి మర్చిపోయాను. మేము మా వీకెండ్స్ ప్లాన్ ప్రకారం అంతా సిద్దం చేసుకుంటున్నాము. బయలుదేరే ముందు నాకు ఒక అసాధారణమైన భావన కలిగింది. అందువలన నేను ప్రయాణపు పనులు అన్నీ ఆపివేసి బాబా ముందర రెండు చేతులు జోడించి నిలబడ్డాను. అయినా ఇంకా ఆ భావన పోలేదు. పూజా మందిరం నుండి చిన్న బాబా ఫోటో తీసుకొని నా పర్సులో పెట్టుకున్నాను. నేను వంటగదిలోకి వెళ్ళగానే గ్యాస్ వాసన వచ్చింది. ప్రొద్దున్నే వంటగది లోకి ఎవ్వరు అడుగు పెట్టలేదు. మరి స్టౌవ్ ఎలా ఆన్ అయిందో (నాబ్ ఎలా తిరిగి ఉందో ) అర్థం కాలేదు. స్టవ్ ఆపివేసి, బయలుదేరేముందు మమ్మల్ని కాపాడినందుకు బాబాకి మరలా ఒకసారి ప్రార్ధించాను. మేము జాగ్రత్తగా గమ్యానికి చేరుకున్నాము. కాని వాతావరణం బాగాలేకపోవటం చేత రోజంతా కష్టంగా గడిచింది. నాలో ఇంకా ఆ అసాధారణమైన భావన పోలేదు. రాత్రి నేను నిద్రపోవడానికి ప్రయత్నిస్తుండగా ఒక స్వప్నదృశ్యం నా కళ్ళకు కనపడి అదృశ్యమయింది. ఒక పెద్ద ట్రక్ ( సాధారణంగా అమెరికా లో ఉండే పెద్ద కంటేనర్లు ఉండే ట్రక్ లు ) మేము వెళ్ళే దారిలో మా వైపుకు వస్తూ ఉంది. ఈ దృశ్యం నా కళ్ళ ముందుకు వచ్చి వెళ్ళింది. బాగా అలిసి పోవడం వల్ల బాబాను తలుచుకుంటూ నిద్రపోయాను. మరుసటి రోజు బోటింగ్ కి (పడవలో విహారానికి) వెడదామనుకున్నాము. మా ఆయన , అమ్మాయి ఇద్దరూ బోట్ లో కూర్చున్నారు. నేను ఆ బోట్ ను నడపాలని ప్రయత్నిస్తుండగా , ఆ బోట్ తలక్రిందులైంది. నది రెండు అడుగుల లోతు మాత్రమే ఉండటం వల్ల అదృష్ట వశాత్తు మా అమ్మాయి నీళ్ళలో పడి పోలేదు. తనకి ఫ్యాంటు మాత్రమే కొద్దిగ తడిసింది. మా వస్తువులన్ని నీళ్ళలో పడిపోయాయి. కాని దీన్ని బట్టి ఒకటి అర్ధమైనది ఏమిటంటే మాకు ఇంకా ఏదో చాలా పెద్ద ప్రమాదం జరగబోయేదే , కాని బాబా గుడిలో పుష్పాన్ని ప్రసాదంగా ఇచ్చి మా అందరిని ఆశీర్వదించి , పెద్ద ప్రమాదం జరగకుండ రక్షించారు.
ఈ సంఘటన జరిగిన కొన్ని వారాలకు దీన్ని గురించి పూర్తిగా మర్చిపోయాము. గత ఆదివారము నేను ఉద్యోగాల గురించి చూడాలని కంప్యూటర్ ఆన్ చేస్తుండగ, నా మనసుకు "బాబా ప్రశ్నలు జవాబులు" వెబ్ సైట్ ఓపన్ చేయాలనిపించింది. ఆ వెబ్ సైట్ ఓపన్ చేస్తుండగ నా మనసుకు 311 సంఖ్య స్పురించింది. ఎందుకో నాకు 311 సంఖ్య చూడాలనిపించింది. నా దృష్టికి మొదట3...1...1 అలా అస్పష్టంగ కనిపించింది. నేను "బాబా ప్రశ్నలు జవాబులు" వెబ్ సైట్ ఓపన్ చేసి 311సంఖ్య చూడగ దానికి జవాబుగ "మరణము తప్పింది, సాయిబాబా ను గుర్తుంచుకో" అని వచ్చింది. నాకు కొంచెం భయంవేసింది,కాని వెంటనే బాబా వుండగ నాకు భయమేల . నేను బాబాను పూర్తిగా నమ్ముకొని ఉన్నాను అనుకొని ప్రశాంతం గా ఉన్నాను. ఆ రోజు రాత్రి నిద్రపోతుండగ, మరలా ఇంతకు ముందు వచ్చిన దృశ్యం (పెద్ద కార్గో ట్రక్) నా ముందరికి వస్తున్న దృశ్యం అలా వచ్చి వెళ్ళింది. బాబా ని తలచుకుంటూ నిద్రపోయాను.
మరుసటి రోజు మా ఆయన ఆఫీస్ పని మీద కెనడా కి వెళ్ళాల్సి ఉంది. నేను ఆఫీస్ కి బయల్దేరాలి. ఆ రోజంతా బాగా గడిచింది. మనసుకు చాల ప్రశాంతంగ ఉంది. కాకపోతే మా ఆయన కెనడాకి వెళ్తున్నారని బాధపడ్డాను. బాబాకి పూజ చేసి నా పనిలో పడ్డాను. మా ఆయన కెనడాకి చేరాక తాను చేరుకున్నట్లుగా మెసేజ్ పంపారు. నాకు ఊరట కలిగింది. ఇక దాని గురించి మర్చిపోయి పనిలో పడ్డాను. సాయంత్రం ఆఫీస్ అయ్యాక ఇంటికి వెళ్ళడానికి కారు తీసి బయల్దేరాను. రెడ్ సిగ్నల్ పడింది. అక్కడ ఆగాను. మనసులో బాబా ను తలచుకుంటూ, ఆఫీస్ లో ఇప్పుడు ఉన్న ఒడిదుడుకుల నుండి కాపాడమని బాబాని అభ్యర్థిస్తున్నాను. మ్యూజిక్ సిస్టం లో బాబా భజన వస్తుంటే వింటున్నాను. అప్పుడే మా పాప గురించి ఆలోచిస్తు పాపను డే కేర్ నుండి తీసుకొనిరావాలని అలోచిస్తుండగ తిరిగి మనసు బాబా భజన మీదికి మళ్ళింది. భజన వింటుండగ హఠాత్తుగ నా వెనకల నుండి ఎవరో నా కారును గుద్దారు. రెండు సార్లు పెద్ద అదుర్లు వచ్చాయి. దాని ఫలితంగ నేను నా ముందర కారును గుద్దాను. ఓరి భగవంతుడా నా కారు కి యాక్సిడెంట్ అయింది అనుకొని కారులో నుండి దిగాను. దాని ప్రభావం ఎంతగా పడిదంటే నా కారు ముందర, వెనుకల రెండు వైపుల డామేజ్ అయింది. కారు ఎక్కడెక్కడ డామేజ్అయిందో అని నేను పరిశీలించాను. రెండు వైపుల చిన్నచిన్న గీతలు పడ్డాయి కాని, ఎక్కువ డ్యామేజ్ కాలేదు ( రిపేర్ కి దాదాపు 500 డాలర్లు అవుతుందని అంచన). నా వెనకాల ఉన్నతను రెడ్ లైట్ చూసుకోలేదు. అతను గంటకు 40 మైళ్ళ వేగంతో డ్రైవ్ చేస్తూ రెడ్ లైట్ చూసుకోకుండ వచ్చి నా కారును గుద్దాడు. పోలీస్ తప్పు చేసిన అతన్ని అన్ని విషయాలు అడుగుతూ విచారిస్తున్నాడు. నన్ను ఏమి అడగట్లేదు. నేను మనసులోపల బాబాకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నేను పోలీస్ ను రిపోర్ట్ అడిగాను. పోలీస్ నా వైపు ప్రశ్నార్థకంగా చూసాడు. అసలు డ్యామేజ్ ఏమి కాలేదు కదా, ఎందుకు ఈవిడ రిపోర్ట్ పదే పదే అడుగుతుంది అన్నట్టు తన మొహం ప్రశ్నార్థకంగ పెట్టుకొని నావైపు చూశాడు. ఓ బాబా నాకు అగుపడిన దృశ్యానికి అర్థం ఇదేనా. బాబా నన్ను రక్షించినందుకు మీకు ధన్యవాదాలు. ఈ యాక్సిడెంట్ వల్ల ఒక్క నష్టం మాత్రం జరిగింది. మా అమ్మాయి డే కేర్ కి 30 నిమిషాలు ఆలస్యంగా వెళ్ళాను. దానికి ఫలితంగా 100 డాలర్లు లేట్ ఫీజ్ చెల్లించాల్సివచ్చింది.
,ఆ రోజు నాకు ఇంకా పెద్ద యాక్సిడెంట్ జరగబోయేదని నాకు బాగా గట్టి నమ్మకం. నా కారు మొత్తం డ్యామేజ్ అయ్యుంటే నా పరిస్థితి ఏమిటి? అసలే మా ఆయన కూడా ఊరిలో లేరు. బాబా దయ, ప్రేమ నాపై చూపకుంటే నష్టం ఇంకా ఎక్కువ జరిగేది. యాక్సిడెంట్ జరిగే సమయానికి మా పాప నాతో ఉండకుండ చూశారు బాబా. ఇంకా ఏమి చెప్పను? మా ఆయన కూడా అసలు దేశంలో నే లేరు. ఈ సంఘటన జరిగినపుడు బాబా నే నా దగ్గర లేకుంటే ఇంకా ఏమి జరిగిఉండేదో ఊహించుకోలేను.
నాకు సంబందించి ఈ మధ్య కాలంలో ఏమి సవ్యంగా జరగట్లేదు. పరిస్థితులు ఏమి బాగా లేవు. పని ఒత్తిడి , వ్యక్తిగత జీవితం కొన్ని ప్రతికూల పరిస్థితులతో సతమతమవుతుండగ, దానికి తోడు గత రెండు నెలలుగా రెండు సార్లు ప్రాణాంతకమైన యాక్సిడెంట్ల నుండి తప్పించుకోవడం కొంచెం ఆందోళన కలిగించే విషయం ఆయన దయకు,ప్రేమకు ఒక్క ధన్యవాదాలు మాత్రంసరిపోవు. ఆయనకు ఎంతో ఋణపడ్డాను. మీరు నమ్మగలిగితే "బాబా ప్రశ్నలు జవాబులు" పుస్తకం ద్వారా బాబా మీతో మట్లాడతారు. అందులో ఏమి జవాబు వచ్చినా దాన్ని మనఃస్పూర్తిగా నమ్మి అందులో ఏమి చేయమని వస్తే అది చెయ్యండి. దానితో ఆటలాడవద్దు. కాని బాబా అందులో ఏమి చెప్తారో అది నమ్మి చేయండి. బాబా మా అందరిని అశీర్వదించి, జీవితపు ఎగుడు దిగుడుల నుండి తట్టుకునే శక్తి, ధైర్యం ఇవ్వండి బాబా.
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు
...
0 comments:
Post a Comment