Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Sunday, December 9, 2012

బాబాయే నా ఆత్మబలం

Posted by tyagaraju on 6:56 AM

                             
 

09.12.2012 ఆదివారము
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఈ రోజు యూ.ఎస్.యే.లో నివసిస్తున్న సాయి బంధువు సన్యోగిత గారి బాబా అనుభూతిని తెలుసుకుందాము.  ఎన్ని కష్టాలెదురయినా బాబా నే నమ్ముకున్నవాళ్ళకు కష్టాలనేవి ఒక్కొక్కటిగా తొలగిపోతాయని అర్ధమవుతుంది.  కావలసినదల్లా శ్రధ్ధ , సహనం.  ఆయనకు సర్వశ్య శరణాగతి చేయడం.
                                   

ముందుగా శ్రీవిష్ణుసహస్రనామం 16వ. శ్లోకం, తాత్పర్యం

శ్లోకం:  భ్రాజిష్ణు ర్భోజనం భోక్తా సహిష్ణు ర్జగదాదిజః 

         అనఘో విజయోజేతా విశ్వయోనిః పునర్వసుః  || 

భగవంతుని దీప్తివంతునిగను, జీవుల ఆహారము తానేయైనవానిగను, జీవుల ద్వారా అహారము స్వీకరించువానిగను, సహనమే తన రూపమైనవానిగను, ప్రపంచమునకు మొట్టమొదట పుట్టినవానిగను, జయించిన వానిగను, విశ్వమునకు పుట్టుక  తానేయైనవానిగను, ధ్యానము చేయుము.     


   

సాయిబాబా నా జీవితపు తోడు నీడ-సాయి భక్తురాలు సన్యోగిత:

   ఈ రోజు మనము సాయి వ్రతం చేయడం వల్ల ఒక సాయి భక్తురాలి జీవితం ఎలా మలుపు తిరిగిందో తెలుసుకుందాము.

అమెరికా నుండి సాయి భక్తురాలు  సన్యోగిత బాబా తో  తన అనుభవాలు చెప్తున్నది.  ఒక్కొక్కరి అనుభవాలు చదువుతుంటే ఎక్కడ లేని ఆత్మవిశ్వాసం,నమ్మకం, దైర్యం కలుగుతుంది. ఎప్పుడైతే మనము ఆధ్యాత్మిక మార్గము నుండి తప్పుదోవ పట్టుతున్నామనిపిస్తుందో ఈ భక్తుల అనుభవాలు మళ్ళీ మనల్ని సరియైన మర్గంలోకి నడిపించేలా చేస్తాయి. సాయిబాబా అందరికి శాంతి,ఆరోగ్యం ,ఆనందం ప్రసాదించు గాక.

    బాబా ఈ బ్లాగ్ లో నీ మీద నా ప్రేమ గురించి చెప్పే శక్తి నివ్వు. నేను ఒక సాంప్రదాయక కుటుంబం నుండి వచ్చినప్పటికి , కొన్ని నెలల క్రితం వరకు నాకు బాబా గురించి అంతగా తెలియదు. గుడికి వెళ్ళినపుడు ఒక గౌరవ భావంతో సాయికి మ్రొక్కేదాన్ని తప్ప ఆయన మహిమల గురించి తెలుసుకోలేకపోయాను.

  నా స్వంత మనుషులే నన్నెంతో బాధలు పెట్టారు. నా స్వంతం అనుకునేవాళ్ళు ఎవరో కాదు నా తల్లి తండ్రులు , నా భర్త, నా అత్తమామలు . మీరు ఎవరైన అడగవచ్చు,  కన్న తల్లితండ్రులు నీకేమి హాని తలపెడతారు అని. వాళ్ళు కావాలని నాకు హాని తలపెట్టలేదు. ప్రతి విషయంలో జోక్యం చెసుకొనేది , స్వతంత్రం లేకుండా చేసి నా జీవితాన్ని కట్టుదిట్టం చేసి బ్రతుకంటే దుర్బరం చేసారు. ఇలాంటివి  ఎన్నో ఉన్నాయి చెప్పాలంటే.  ఉదాహరణకు మా అమ్మనాన్న ఏదైన విషయంలో ఎవరైన    క్రొత్త వ్యక్తి ఉంటే వాళ్ళకి సపోర్ట్ గా వెళ్తారు. నన్ను అస్సలు పట్టించుకోరు. ఎప్పుడు తప్పు నాదే అన్నట్లు నీతులు చెప్తూ ఉంటారు.
       
 వాళ్ళు ఎప్పుడు నన్ను చిన్నపిల్ల గా అనుకుని, నాకు మాట్లాడడం రాదని, నిర్ణయాలు తీసుకోవడం రాదని ఎప్పుడు తక్కువ అంచనా వేసేవారు. ఇలా చెప్పాలంటే పేజీ సరిపోదు. ఇక్కడ నా తల్లితండ్రుల గురించి చెప్పడం నా ఉద్దెశ్యం కాదు. నా జీవితంలోకి బాబా ఎలా వచ్చారో, నన్ను ఎలా కాపాడాడో చెప్పాలని అనుకుంటున్నాను.

 నా జీవితం చాల గందరగోళంగా ఉండేది.నా జీవితంలో ఏ ఒక్కటీ కూడా మంచిగా జరగలేదు. నేను ఎప్పుడు నా భర్తతో, మా అమ్మనాన్నతో పోట్లాడేదాన్ని. నా మాస్టర్ డిగ్రీ పూర్తి చెయ్యడానికి ఎన్నో పాట్లు పడ్డాను.నాకు ఉద్యోగం లేకపోవడం వల్ల నావద్ద డబ్బుకూడా ఉండేది కాదు. దీని ప్రభావం నా ఆరోగ్యం మీద పడింది. నేను చాలా లావు అయ్యాను. నా ఆరోగ్యం చెడిపోయింది. నేను ఒంటరిదానినయిపోయాను. ఎవ్వరితోనూ నా బాధలు చెప్పుకునేదాన్ని కాదు. ఎప్పుడైన మా అమ్మకు నా సమస్య  గురించి చెప్పుకున్నా, నా అనుకున్న నావాళ్ళే ఎంతో పెద్ద ఉపన్యాసం మొదలుపెట్టేవారు,దానినితో నేను ఇతరులనుండి దూరంగా ఉండేలాగా మౌనగా ఉండేలాగ తయారయేది నాపరిస్థితి. ఎవరికైనా సమస్యలొస్తే తల్లితో చెప్పుకుంటారు. నాకు ఆ అదృష్టం కూడా లేదు. రోజు బాగా ఏడ్చేదాన్ని. నా సమస్యలను ఎక్కడినుండి సరిచేసుకోవాలో అర్థమయ్యేది కాదు.
       
 అప్పుడు బాబా నా జీవితంలోకి ప్రవేశించారు. మా ప్రక్కింటి ఆవిడ ఒక రోజు తాను నవగురువార వ్రతం చేశానని, తన ఉద్యాపన రోజున నాకు ఒక పుస్తకం ఇచ్చింది. నేను వ్రతం చేయడం మొదలు పెట్టాను. నేను ప్రత్యేకంగా ఒక కోరిక అంటూ కోరలేదు. ఎందుకంటే నా కోరికలు చాలా ఉన్నాయి చెప్పాలంటే . అందులో ఏమని కోరేది. అందుకే బాబా ని ఒక్కటి మాత్రం అడిగాను. ప్రస్తుతం దుర్భరంగా  ఉండే జీవితాన్ని చక్కబెట్టి నాకు మన మనఃశ్శాంతి నివ్వు అని. ఈ జీవితం ను భరించడం నా వల్ల కాదు అని.

  అప్పుడు నా జీవితంలో బాబా మహిమలు ప్రారంభమయాయి.  ఎన్నో ఇబ్బందులు, చిక్కు ముడులతో కూడుకున్న నా జీవితాన్ని ఒక   దాని తర్వాత ఒకటి మెల్లగ విడదీయడం మొదలు పెట్టారు. నేను రెండు సార్లు నవగురువార వ్రతం చేసాక నా జీవితంలోచెప్పుకోదగ్గ మార్పులు రావడం గమనించాను.

  ఆశ్చర్యకరంగా నేను చాలా బరువు తగ్గాను. నా ఆరోగ్య సమస్యలన్నీ అంతరించాయి. నాలుగు యేండ్లుగా బరువు తగ్గాలని , ఎంతో కష్టపడి విఫలమయ్యాను. కాని అనుకోకుండ బాబా దయ వల్ల చాల మార్పులు జరిగాయి.

   నా గురించి ఎప్పుడు ఏవో ఫిర్యాదులు చేసే మా అత్త మామలని కూడా బాబా మార్చారు. వాళ్ళు ఇప్పుడు ఏ ఫిర్యాదులు చేయట్లేదు. వాళ్ళను ఇంతకు ముందు సంతోషపెట్టాలని ఏమి చేసిన వాళ్ళకు సంతృప్తి ఉండేది కాదు. చివరకు వాళ్ళు శాంతంగా ఉన్నారు. వారానికొకసారి వాళ్ళ అబ్బాయి  ఫోన్ చేస్తారు . నేను ఫోన్ చేసిన, చేయక పోయిన ఇప్పుడు నా మీద కోపం కాని, ఎటువంటి ఫిర్యాదు కాని వాళ్ళకు ఇప్పుడు లేదు. బాబా మా అమ్మనాన్నలను కూడా మార్చారు. వాళ్ళు తమ తప్పును తెలుసుకున్నారు. నాకు అవసరమైనప్పుడు వాళ్ళ ఓదార్పు , సహాయం నాకు అందలేదని తెలుసుకున్నారు. బాబా నా భర్త కి ఎంతో ఓర్పు నిచ్చారు ఇప్పుడు. తన తప్పులను తెలుసోకగలిగారు. నాకు చాల మర్యాద ఇస్తున్నారు. బాగ చూసుకుంటున్నారు. నా మీద అస్సలు చేయి చేసుకోవడంలేదు.

   బాబా మాకు క్రొత్త యిల్లు వెదకడంలో సహాయం చేశారు. మంచి ప్రదేశంలో మాకొక ఇల్లు దొరికింది. నేను బాబాని ఇల్లు కావాలని ఎప్పుడు అడగలేదు. నేను చాలా కష్టాలు పడుతున్నప్పుడు  నా స్నేహితులు అపార్ట్ మెంట్  కొనుక్కోవడం చూసి మేమెప్పుడయినా ఇల్లు కొనుక్కుటామా అనుకునేదాన్ని. నాజీవితమంతా ఈ చిన్న అపార్ట్ మెంట్ లోనే గడచిపోవాలా?. నా భర్తను ఇంటి గురించి అడిగే ధైర్యం కూడా లేకపోయింది. తను కూడ ఇంటి గురించి ఎప్పుడూ అలోచించలేదు.
 
నేను నా మాష్టర్  డిగ్రీ ఎంతో కష్టంతో పూర్తి చేయగలిగాను. నేను ఎంతో కష్టపడి పనిచేసిన నా ప్రొఫెసర్ కి నచ్చేదికాదు. కాని బాబా దయ వలన ఎలాగో డిగ్రీ  పూర్తి చేయగలిగాను.నేను కష్టాలలో ఉన్నపుడు నన్నెవరూ ఆదుకోలేదు, బాబా యే నెనున్నానటు నాకు రక్షణగా వచ్చారు.
         
 నేను బాబాకు సర్వస్యశరణాగతి చేశాను. ఇప్పుడు నేను అనుభవిస్తున్న ఈ జీవితం బాబానే ప్రసాదించారు. దానికి బాబాకి ఎంతో ఋపడ్డాను. ఇప్పుడు ప్రతి రోజు చాలా సంతోషంగా ఉన్నాను. బాబాకి మాత్రమే తెలుసు నాకేది మంచిదో. నాకేది మంచిదో అది బాబా చేస్తారు. ఇప్పుడు పరిస్థితులన్ని  నేను ఎదురు చూడని రీతిలో చక్కబడ్డాయి. మీరు కూడ బాబాకు ఎప్పుడైతే దగ్గర అవుతారో బాబా దగ్గరుండి అంతా చక్కబెడుతూ, మన కోరికలను తీరుస్తారు. కావాలిసినదల్లా  అంతులేని నమ్మకం. అలా అయితే నీవు ఊహించని రీతిలో ఎన్నో అద్బుతాలు జరుగుతాయి. ఆ అద్భుతాలు చిన్నవి కావచ్చు లేదా పెద్దవి కావచ్చు ఏదైన మనము బాబాను పూర్తిగా నమ్మి ఆయనకు దగ్గర అయిన క్షణంలో అన్నీ వాటంతకు అవే జరుగుతాయి. బాబా తన బిడ్డలందరిని ప్రేమిస్తాడు. మన ప్రతి ఆలోచన బాబాకి ఎరుకే. మనకు ఏది మంచిదో ,ఎప్పుడు ఎలా చెయ్యాలో అది చేస్తూ మనల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారని తెలుసుకున్న క్షణాన ఆయన లీలలును వర్ణించడానికి మనకు నోట మాట రాదు.
  సాయి ఆశీస్సులు అందరికి ఉండుగాక .ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి.

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు) 


Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List