09.04.2013 మంగళవారము
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీవిష్ణుసహస్ర నామం 61వ.శ్లోకం, తాత్పర్యం
శ్లోక సుధన్వా ఖణ్డపరశుర్దారుణో ద్రవిణ ప్రదః |
దువస్సృక్సర్వ దృగ్వ్యాసో వాచస్పతి రయోనిజః ||
తాత్పర్యం: గొప్ప విలుకాడు, విరిగిన గొడ్డలిని ధరించి భయంకరముగా నున్ననూ, సంపద లిచ్చువాడుగా నున్నాడు. ఆయన రూపము ఆకాశమంతయూ వ్యాపించి సమస్తము చూచుచున్నది. వేదవ్యాసుడు వాక్కునకు, భాషకు అధిపతియై భగవంతుని అవతారమగుటచే స్త్రీ గర్భమందు పుట్టనివాడై యున్నాడు.
పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి -
28వ. అధ్యాయము
ప్రియమైన చక్రపాణి,
ఈ ఉత్తరములో నీకు 28వ. అధ్యాయముపై వివరణ యిస్తాను. శ్రీసాయి ఏవిధముగా తన భక్తులను శిరిడీకి పిలిపించుకొన్నది వివరించుతారు శ్రీహేమద్రిపంతు. ముఖ్యముగా శ్రీలాలా లక్ష్మీ చందును, బరహంపూర్ లొని ఒక భక్తురాలిని శిరిడీకి రప్పించుకొన్న వైనము పరిశీలిస్తే చాలా ఆశ్చర్యము కలుగుతుంది. శ్రీసాయిని గురించి తెలియని వ్యక్తులకు శ్రీసాయి స్వప్న దర్శనము ఇచ్చి వారిని శిరిడీకి రప్పించుకొన్నారు. దీనిని బట్టి మనము తెలుసుకోవలసిన విషయము ఏమిటి? ఆలోచించు. నీవే శ్రీసాయి భక్తుడువి కాకాపోయిన వెనుకటి జన్మలో నీకు శ్రీసాయికి సంబంధము ఉంటే చాలు, శ్రీసాయి ఈ జన్మలో నీకు స్వప్నములో కనిపించి నిన్ను శిరిడీకి రప్పించుకొంటారు. దీనిని శ్రీసాయి ప్రత్యేకత లేదా గొప్పతనము అని కూడా అనవచ్చును. శ్రీసాయి సత్ చరిత్రలో శ్రీసాయియొక్క అభిప్రాయమును శ్రీహేమాద్రిపంతు ఈ విధముగా తెలియపర్చుతారు. "పండుగదినము గడుపుటకుగాని, తీర్ధయాత్రకు పోవుటకు గాని అప్పు చేయరాదు అనేది బాబా అభిప్రాయము". ఇది మనబోటి సామాన్య కుటుంబీకులకు చాలా ముఖ్య విషయము. అప్పుచేసి పూజ పునస్కారాలు, దానాలు ధర్మాలు చేయరాదు. నాసంపాదనలో కొంత శాతము వీటి నిమిత్తము విడిగా పెట్టి ఆ డబ్బుతోనే ధార్మిక కార్యక్రమాలు నిర్వహించినాను. నీవు కూడా ఈవిధానాన్ని పాటించిననాడు నీకు చికాకులు ఉండవు. శ్రీసాయి తన ప్రియ భక్తులను పిచ్చుకతో పోల్చేవారు. వారు తమ భక్తులను పిచ్చుక కాలికి దారముకట్టి లాగినట్లుగా శిరిడీకి రప్పించుకుందును అని చెప్పినారు.
శ్రీసాయికి ఉన్నప్రియ భక్తులలో ముఖ్యుడు మేఘశ్యాముడు. అతని గురించి హేమాద్రిపంతు శ్రీసాయి సత్ చరిత్రలో వివరించినాడు. ఆనాడు నేను మేఘశ్యాముడిని చూడలేదు. కాని మేఘుని గురించి చదువుతుంటే నేనుకూడా మేఘశ్యాముడులాగ శ్రీసాయికి ప్రియభక్తుడిని కాగలనా లేదా అనే ఆలోచనలలో మునిగిపోతు ఉంటాను. నిజమైనసాయి భక్తుడు కోరుకొనే కోరిక ఒక్కటే అది, శ్రీసాయి పాదాలమీద ఆఖరి శ్వాస తీసుకొని, శ్రీసాయి చేతుల మీదుగా పంచ భూతాలలో కలసిపోవాలి. ఈఅదృష్టము మేఘశ్యామునికి లభించినది. అటువంటి అదృష్టము కొరకు మనము కూడా ప్రయత్నము చేయాలి.
శ్రీసాయి సేవలో
నీతండ్రి.
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
ద్వారకామాయి గీత్ మాలాలో ఆనాటి మధురగీతాలను చూడండి..
http://www.facebook.com/dwarakamai?ref=hl
షిరిడీ సాయి దర్బార్...
http://www.facebook.com/ShirdiSaidarbar1?ref=hl
0 comments:
Post a Comment