23.09.2015 బుధవారం
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి
సాయిబంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీషిరిడీ సాయి వైభవం - వ్యసనాలనుండి తప్పించుట
తన భక్తులు చెడు వ్యసనాలకు బానిసయినప్పుడు బాబా వారిని తనదయిన పధ్ధతిలో దారిలోకి తీసుకొని వస్తారు. బాబా కి అన్ని తెలుసు. బాబా తనంత తానుగా వ్యసనాల జోలికి పోవద్దు అని చెప్పకుండానే, తన భక్తులు వాటికి బానిసలు కాకుండా ఉండేలాగ చేయగలరు. దానికి ఉదాహరణగా ఈ రోజు ది గ్లోరీ ఆఫ్ షిరిడీసాయి 19.09.2015 19వ.సంచికలోని బాబా లీల ఒకటి తెలుసుకుందాము.
నాయక్, శాంతారం ఇద్దరూ మంచి స్నేహితులు. ఇద్దరూ కలిసి బాబాను దర్శించుకోవడానికి షిరిడీ వెళ్ళారు. శాంతారాం పచ్చి త్రాగుబోతు.
ఒక్కరోజయినా త్రాగకుండా ఉండలేడు. బాబా అతనిని షిరిడీలో ఆరురోజులు ఉండమని చెప్పారు. ఆ ఆరురోజులలో త్రాగుడికి దూరంగా ఉండి నిగ్రహంతో ఉన్నాడు. ఆతరువాతనుంచి అతను జీవితంలో ఇక త్రాగుడు జోలికి పోలేదు. నాయక్ కి సోనార్ అని మరొక స్నేహితుడు ఉన్నాడు. సోనార్ కొడుకు త్రాగుడికి బానిసయి జీవితాన్ని నాశనం చేసుకోసాగాడు. దాని వల్ల సోనార్ కి మనశ్శాంతి లేకుండా పోయింది. డాక్టర్ అనినిని త్రాగవద్దని తరచుగా సలహా ఇస్తూ ఉండేవాడు. కాని అతను త్రాగకుండా ఉండలేనని చెప్పేవాడు. కొడుకుని తీసుకొని షిరిడీ వెళ్ళమని నాయక్ సోనార్ కి సలహా యిచ్చాడు. సోనార్ కొడుకుని తీసుకొని షిరిడీ బయలుదేరాడు. సోనార్ కొడుకు మన్మాడ్ నుంచి షిరిడీ వెళ్ళేంతవరకు దారంతా వాంతులు చేసుకుంటూనే ఉన్నాడు. షిరిడీలో అడుగుపెట్టగానే వాంతులు ఆగిపోయాయి. ద్వారకామాయికి వెళ్ళి బాబా దర్శనం చేసుకొన్నారు. బాబా సోనార్ కొడుకుని దీవించి షిరిడీలో నాలుగు రోజులు ఉండమని చెప్పారు. ఈనాలుగు రోజులలో అతనికి త్రాగుడంటే విరక్తి కలిగింది.
భాద్రపదమాసంలో గౌరీపూజ జరుపుకొన్నారు. పూజ ఆఖరిరోజున అందరూ ఆనందంగా త్రాగుడు మొదలుపెట్టారు. అతనిని, స్నేహితులు త్రాగమని బలవంత పెట్టారు. కాని అతను అందుకు నిరాకరించాడు. అప్పుడు వారు అతని చేతిలో మందు గ్లాసు బలవంతంతా పెట్టారు. తనకి గ్లాసులో బాబా కనపడుతున్నారనీ, అందుచేత తాను త్రాగలేనని చెప్పి క్షమించమన్నాడు. అయినప్పటికి వారంతా అతని చేత బలవంతంగా తాగించారు. ఆఖరికి త్రాగిన తరువాత, స్పృహలేకుండా పడిపోయాడు.
ఆసమయంలో అతని శరీరమంతా మంటలమీద ఉన్నట్లయి, కడుపులో ఉన్న ఆల్కహాల్ మండిపోసాగింది. ఈ అనుభవమయాక జీవితంలో యిక త్రాగుడు జోలికి పోలేదు.
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment